చిత్రం: మళ్ళీరావా (2017) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ నటీనటులు: సుమంత్ , ఆకాంక్ష సింగ్ దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా విడుదల తేది: 08.12.2017
Songs List:
మళ్ళీ రావా పాట సాహిత్యం
చిత్రం: మళ్ళీరావా (2017) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: శ్రావణ్ భరద్వాజ్ ఏ కాలం ఏ దూరం దాచి ఉంచెయ్నా నిన్నే నిన్నే ఏ గాయం ఏ మౌనం మార్చే ఆపేయన నన్నే నన్నే మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీ మళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతే తరిమేస్తున్నా వదిలేస్తున్నా ఏ కోపాలలో కాల్చినా కూల్చినా ఈ బంధాలలో ఏ మందున్నదో ఈ ప్రేమే ఇలా ఓ ఎగసి ఎగసేనా మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీ మళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతే
చినుకు చినుకు పాట సాహిత్యం
చిత్రం: మళ్ళీరావా (2017) సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కార్తీక్ చినుకు చినుకు రాలగా తెగిన తార తీరుగా నడిచి వచ్చె నేరుగా తళుకు తళుకు దేవతా కాలం కదిలే... వేగం వదిలే... నేలంత వణికే... కాలి కిందగా !!! రెప్పలే రెక్కలై కన్నులే తేలెనే....! గుండెకే చక్కిలిగింతలా తోచేనే... హేహే మీసమైన రాని పెదవి మోయనంత సంతోషం క్షణముకొక్క కొత్త జన్మ ఎత్తుతున్న సందేహం... మాటలసలే బయటపడని మధురమైన ఓ భావం వేల వేల కవితలైన చాలనంత ఉల్లాసం....! కోటిరంగులే ఒక్కసారిగా నిన్నలన్ని ముంచుతున్న వెల్లువా చల్లగాలులే ఉక్కపోతలా ఉందిలే చూస్తే నువ్వలా ఎంత చెప్పినా తక్కువేనుగా చిన్ని గుండె తట్టుతున్న తూఫానిదే చుట్టుపక్కలా ఎవ్వరొద్దనే కొత్త కొత్త ఆశ రేపే తొలిప్రేమిదే
Welcome Back To Love పాట సాహిత్యం
చిత్రం: మళ్ళీరావా (2017) సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కార్తీక్ Welcome Back To Love
ఈనాడు పాట సాహిత్యం
చిత్రం: మళ్ళీరావా (2017) సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: సాయి కృష్ణ, లలిత కావ్య ఈనాడు
అడుగసలె పాట సాహిత్యం
చిత్రం: మళ్ళీరావా (2017) సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కార్తీక్ అడుగసలె నిలవదులె నా గుండె వదిలేసె అలవాటె అయినదిలె కన్నీరె రాలదులే నువు లేవని బరువె దిగదె ఇక రావని మనసె వినదె తప్పె నాదె ప్రేమె పోదే వచ్చీ పోయె వానల్లె నీవైనావే నేనేమొ నేలల్లె ఉన్నాలే చూస్తూనె మారేటీ కాలమె నీవే నేనేమొ ఆగున్నా నింగెలే నీ ప్రేమనె మించినా బాదేమిటె నా ప్రాణమె పంచనా నువ్ కోరితే నా గుండెనె చీల్చేన నీలొ మౌనమె మాటాదితె గాయమె మానేనే ఊపిరిలా ఉన్నావే నిస్వాసై పొతావె ఒంటరిగా నే లేనె నాతోనె ఉంటావె ఊహల్లొ కూడాను నువు లేకా నే లేనె ఒట్టెసీ అంటున్నా నువ్వె నేనే
చినుకు చినుకు (Reprise) పాట సాహిత్యం
చిత్రం: మళ్ళీరావా (2017) సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: లలితా కావ్య చినుకు చినుకు రాలగా Chinuku (Reprise)
మళ్ళి రావా (Reprise) పాట సాహిత్యం
చిత్రం: మళ్ళీరావా (2017) సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: సునీత Malli Raava (Reprise) ఈ కాలం ఈ దూరం దాచె ఉంచేన నిన్నె నిన్నె ఈ గాయం ఈ మౌనం మార్చె ఆపేన నన్నే నన్నే మళ్ళి రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికి మళ్ళి రావ లేవన్నవి రావ చెంతె వదిలి చింతె తరిమేస్తున్న వదిలేస్తున్న ఈ కోపాలలో కాల్చిన కూల్చిన ఈ బంధాలలో ఏ మందున్నదొ ఈ ప్రేమె ఇలా ఒహ్ ఎగసెగసేను మళ్ళి రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికి మళ్ళి రావ లేవన్నవి రావ చెంతె వదిలి చింతె
తెలిసి తెలిసి పాట సాహిత్యం
చిత్రం: మళ్ళీరావా (2017) సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: హరిణి ఇవటూరి తెలిసి తెలిసి వేకువా మనసు వెనక దాగెనా కనుల తెరిచె లోపలా రోజులెన్నొ గడిచెనా నాలో కదలే నీలో మెదిలే మేనెంత ఒనికే ఉన్నపాటుగా నమ్మనే లేదులె నా మది నిన్నిలా నన్నిల కమ్మెనె వెన్నెల ఇంతలా వెతికి వెతికి ప్రేమని తెలుపలేని వేదనే కలిసి తెలిసి నేడిలా ఉప్పెనంటి చేరువా
2017
,
Aakanksha Singh
,
Gowtam Tinnanuri
,
Malli Raava
,
Rahul Yadav Nakka
,
Shravan Bharadwaj
,
Sumanth
Malli Raava (2017)
Palli Balakrishna
Wednesday, December 6, 2017
