-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Mickey J. Meyer"



చిత్రం: HIT 3 (2025)
సంగీతం: మిక్కీ జె. మేయర్
నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, అడివి శేష్
దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
విడుదల తేది: 01.05.2025



Songs List:



ప్రేమ వెల్లువ పాట సాహిత్యం

 
చిత్రం: HIT 3 (2025)
సంగీతం: 	మిక్కీ జె. మేయర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: సిద్ శ్రీరామ్, నూతన మోహన్

దుకే నాపై ఇలావలే
ప్రేమ వెల్లువ

పగలే నా వైపుకి నడిచే కలవ
పడుతు ఎగిరే అలవా
మనసే నిన్ను చూడని ఒక్కటే గోడవ
కనులే ఇపుడే చదివా

వెంట వచ్చావే వెంబడించావే
ఊపిరల్లే మారావే నేడే నీవే
నమ్మి తీరలే కల కాదే
పేరుకే నేనున్నాలే ప్రాణం నీవే

ఎవరెవరిని వెతికినా
కనులకి తను దొరికేనా
మరిచానిక దేనినైనా నీ వలనా

తెలుసా తొలిసారిగా మనసే గెలిచా
ఎపుడూ ఎదుటే నిలిచా
కోపం మరిచానుగా ఇది నీ మహిమ
నిజమే నువు నా సాగమా

ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన
ప్రేమ సందడి
ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన
ప్రేమ సందడి

అటొ ఇటొ ఎటైనా
అడుగే జరిగే మెల మెల్లగా
మరింత ఒక్కటొక్కటిగా చేరెనా
మనలో మనమే కలిసే విధమ

గీతా గీసనే వేచి చూసనే
నిన్ను మించీ నాకు ఇంక
తొడంటు దోరుకునా

ఆపలేను అగలేనులే
చూపలేను చెప్పలేనులే
దాచలేను నేను ఇంక నా లో ప్రేమ

ఎవరెవరిని వెతికినా
కనులకి తను దొరికేనా
మరిచానిక దేనినైనా నీ వలనా

ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన
ప్రేమ సందడి
ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన
ప్రేమ సందడి




అబ్కీ బార్ అర్జున్ సర్కార్ పాట సాహిత్యం

 
చిత్రం: HIT 3 (2025)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అనురాగ్ కులకర్ణి, కోరస్: సాయి చరణ్, హైమత్, లోకేష్, రితేష్ జి రావు, అఖిల్ చంద్ర, హర్ష వర్ధన్, సాత్విక్ జి రావు

వేటు వేసినా వేట సాగేలే
గీత గీసినా కోత మారున నేడే
మాటు వేసిన ఆపదే ఇదే
యాద దాగిన ఆపలేరు లే హే హే

అలజడే ఏగసేనే
భయమాలా బిగిసేనే
అనకువే ఆపలేనిది వేగమే

সহనమే ఎరుగని గుణమే
సమరమే నిలువదే చూదే
నడుమనే మృత్యువొచ్చినా వ్యర్థమే

అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్
అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్ హే హే

శత్రు మోకాలే ఊ ఊ
మరువలేరు లే ఊ ఊ
గుర్తుకొచ్చులే ఊ ఊ
ప్రళయ రూపమే కలలొన

వరద తీరునే ఊ ఊ
పరుగు ఆగదే ఊ ఊ
మరణ శాసనం ఊ ఊ
వేటికి రాసినట్టే

రుధిరపు మరకలే చెరగని మేటికలే
అలసిన దాడి ఆగనె ఆగదే

నరనరం ఉరకలే నియమం
వదలని నైజమే చూదే
తప్పుకే శిక్ష ఇవ్వడం తద్యమే

అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్ ఎయ్య్ ఎయ్య్ ఎయ్య్
అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్ హేయ్ హేయ్

ఇతడి ఒరవడి చివరికి యముడికి భయమే
అంటారు తెలిసిన మనుషులు నరకము నాయకమే
ఎంతెంత అడిగినా మానసిక కరగని గుణమే
పట్టెనూ నిజముని బయటికి లాగగా క్షణమే

మనుషులలో కలవడే
మనసులనే గెలవడే
కలబడితే విడువడే
తోనకడే బెనకడే

ధర్మమునే వదలదే
వెనకడుగు వేయదే
కర్తవ్యం మరవదే
కఠినమేఈ అసురుడే

అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్
అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్ హే హే




థాను పాట సాహిత్యం

 
చిత్రం: HIT 3 (2025)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: రాఘవ్
గానం: అఅనిరుధ్ రవిచందర్

తన కోసమే నా పొగరే మరి అనిగేనా
తన కోసమే నా పరుగే ఇక ఆగేనా
తనతోనే లోకమా ఆహ్ అహ్
తనతోనే ప్రేమా

తనతోనేనా
తను నాదేనా
నిజమా తను నా నీడేనా

తనతోనేనా
తను నాదేనా
తన నవ్వే నా
మనసుకి తగునా

తనతోనేనా
మది తన పని తను మరీచే
తను నాదేనా
ఆది నిజమని తనువారిచే
తన నవ్వే నా
మనసుకి తగునా

తన కోసమే నా కనులే వేచుండేనా
తన కోసమే నా పెదవే పలుకాపేనా

తను నను తాకే ఆ తీరే
తపనను తీర్చేసె చూడే
తను నను చూస్తుంటే
తన చూపే మనసును తాకితే

మెచ్చాలె తననే
తనతోనే అడుగే
అణువణువు తనకే
తనవలనే ప్రతి క్షణమే హేయ్

తనతోనేనా
తను నాదేనా
నిజమా తను నా నీడేనా

తనతోనేనా
తను నాదేనా
తన నవ్వే నా
మనసుకి తగునా

తనతోనేనా
మది తన పని తను మరీచే
తను నాదేనా
ఆది నిజమని తనువారిచే
తన నవ్వే నా
మనసుకి తగునా


Palli Balakrishna Friday, May 1, 2026



చిత్రం: అనగనగా  ఒక రాజు (2026)
సంగీతం: మిక్కి జే మేయర్ 
నటీనటులు: నవీన్ పోలిశెట్టి , మీనాక్షి చౌదరి 
దర్శకత్వం: మారి 
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య 
విడుదల తేది: 14.01.2026



Songs List:



హే భీమవరం బాల్మా పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా  ఒక రాజు (2026)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: చంద్రబోసు
గానం: నూతన మోహన్, నవీన్ పోలిశెట్టి

చాట్ గిప్ట్ ఎవరే ఈ అందం
ఇంతాంతంగా ఉందేంటి హాయి
డ్రెస్-లు కోటి వెలకడితే కోటి
యే కిస్కీ బేటీ హై భాయ్

లాగ్ అంటూ లేని నీ స్వాగ్ కి
పడిపోయా ఏంటి ఆయ్
హే కార్ ఎమో బెంజ్ ప్యార్ ఎమో జెంజ్
కథ మొదలైతేతమా

హే భీమవరం బాల్మా
బాగా బీచ్ పోదామా
మీధ మీద పతనం మ
వైరల్ అవుడి రీల్ మా

హే భీమవరం బాల్మా
బాగా బీచ్ పోదామా
మీధ మీద పతనం మ
వైరల్ అవుడి రీల్ మా

హే భీమవరం బాల్మా
బాగా బీచ్ పోదామా
మీధ మీద పతనం మ
వైరల్ అవుడి రీల్ మా
గుండెలోనే నాన్నే తాకి చేయి మా
గుండెలోనే నాన్నే తాకి చేయి మా

చాట్ గిప్ట్ ఎ...



రాజుగారి పెళ్లిరో... పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా  ఒక రాజు (2026)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: చంద్రబోసు
గానం: అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ 

టాలీవుడ్ డీజే కొట్టు
బాలీవుడ్ బట్టలు పెట్టు
హాలీవుడ్ బడ్జెట్ పెట్టు
టు టు టు...

అంబరాన డ్రోన్లు చుట్టు
బంగారాన ప్లేట్లు పెట్టు
అంబానీ కుళ్లుకునేటు
టు టు టు…

సంగీత్ పాటలు
హల్దీలో ఆటలు
ఇన్‌స్టాల ఫోటోలు
పెట్టు పెట్టు పెట్టు...

ఎంతో ఘనంగా
ఇంత ధనంగా
అనగనగా హే...

రాజుగారి పెళ్లిరో
ఊరువాడ లొల్లిరో
రాదు ఇది మళ్లీరో
ఎంజాయ్ ఫుల్లీరో

రాజుగారి పెళ్లిరో
ఊరువాడ లొల్లిరో
రాదు ఇది మళ్లీరో
ఎంజాయ్ ఫుల్లీరో

టు టు టు తురు టు
టు టు టు తురు టు
టు టు టు తురు టు
తురు టు టు టు…

రాజుగారి పెళ్లిరో...

ధగ ధగ నగలు అంతా
నిగ న...




ఆంధ్ర టు తెలంగాణ పాట సాహిత్యం

 
చిత్రం: అనగనగా  ఒక రాజు (2026)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: చంద్రబోసు
గానం: ధనుంజయ్, సమీరా భరద్వాజ్ 

నాలోను సోకులున్నాయ్ సొంపులున్నాయ్ శానా
నీతాన సొమ్ములున్నాయ్ యెల్దామ్ ఎక్కడికైనా
ఆంధ్ర టు తెలంగాణ
నువ్వు రమ్మంటే నే రానా

నావంటి వన్నెలాడి లేదోయ్ జిల్లాలోన
నేనంటే కిందా మీదా పడతాడే ఎవరైనా
ఆంధ్ర టు తెలంగాణ
నువ్వు రమ్మంటే నే రానా

హే నాటు కోడి లాంటి ఘాటు ఘాటు ముచ్చట పెడదామా
తాటి కల్లు తాగి ఒళ్లు మరిచి అల్లరి చేద్దామా

చిత్రంగా చిందులే వెయ్యాలమ్మా
మొత్తంగా మోతక్కి పోవాలమ్మా
ఆంధ్ర టు తెలంగాణ
నువ్వు రమ్మంటే నే రానా

ఆంధ్ర టు తెలంగాణ
నువ్వు రమ్మంటే నే రానా ఏమంటావ్…

నీ కోసం ఊపు తెచ్చానే బంగరు షాపు తెచ్చానే
డబ్బుల మోపు తెచ్చానే జానే జానా
నేనొస్తే చిల్ మంటాదే హౌసు ఫ్లులుగుంటాదే
దద్దరిల్లిపోతాదే అన్నీ ఊర్లలోనా

ఉలికిలికి పడ్డానయ్యా ఉరికిరికి వచ్చానయ్యా
నీ చురుకే నచ్చిందయ్యా నువ్వు నాకే రాజావయ్యా
మహరాజుల తీరే మాది మర్యాదల జోరే వేరే
మా సరదా సందడి చూసి మళ్లీ మళ్లీ వచ్చేద్దారే

హే అత్తారింటికొచ్చే అల్లుడల్లే అల్లాడిస్తావా
ఐతే అంతులేని సంబరాలే పిల్లా చూస్తావా

పండక్కి దూకామా పందిల్లోన
రంగుల్తో దిగినామా రంగంలోన

ఆంధ్ర టు తెలంగాణ… పడి చస్తారే మనపైనా…
ఆంధ్ర టు తెలంగాణ… పడి చస్తారే మనపైనా…
ఆంధ్ర టు తెలంగాణ… పడి చస్తారే మనపైనా…

మై విలేజ్ స్టెప్పును వైరల్ చేసిన
రాజుగారికి ఒక ఓయ్ యేసుకోండో.


Palli Balakrishna Sunday, April 5, 2026



చిత్రం : ఛాంపియన్  (2025)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
నటీనటులు: రోషన్ మేక , అనశ్వర రాజన్ 
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం 
నిర్మాతలు: ప్రియాంక దత్, GK మోహన్, జెమిని కిరణ్ 
విడుదల తేది: 25.12.2025



Songs List:



గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే పాట సాహిత్యం

 
చిత్రం : ఛాంపియన్  (2025)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: కాసర్ల శ్యాం 
గానం: రామ్ మిర్యాల 

ఎర్రెర్ర బొట్టు దిద్ధి ఎండి మెఘం మెరిసిందే
పచ్చాని చీర కట్టి పంటసేనే మురిసిందే

పరదాలే తీసెద్దాం
ధిగి ధిగి తామ్ ధితం ధితం

ఏ మబ్బు ఎనకా
ఏ సినుకు ఉందో
ఏడ రాలునో

ఏ తొవ్వలోనా
ఏ మలుపు ఉందో
ఎడ ఆగునో సాగునో

ఏ ఎండలో దాగి ఏడు రంగుల్లో
ఆ హరివిల్లే పుట్టేను కదా
ముళ్లైనా పూలైనా
కొమ్మకు పూసే కదా

గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే
సర్ర సర్ర సర్ర బొంగరాలివే
జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే
అందాల భూమి సూర్యునిలా

గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే
తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే
చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే
రయ్యంటు రాయి ...




సల్లంగుండాలే పాట సాహిత్యం

 
చిత్రం : ఛాంపియన్  (2025)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: రితిష్ జి. రావు , మనీషా ఈరబత్తిని

సల్లంగుండాలే సల్లంగుండాలే హేయ్
పెళ్లి జేసుకొని నువ్వు పైలంగా ఉండాలే
సల్లంగుండాలే సల్లంగుండాలే హేయ్
పిల్ల పాపలతో నువ్వు పచ్చంగా ఉండాలే

ఓయ్ నవ్వుతూ నువ్వుంటే నిన్నిట్ఠా సూత్తాంటే
కట్టలల్లా కన్నీళ్లలా ఎంతో సంబురం
ఇస్తాం నీకై పానమే చేస్తాం నీకై యుద్ధమే
బతుకిక ఊరి కోసమే

ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ డొలే మోఘలే
గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ డొలే మోఘలే
గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా గోలే పెరగాలే

సల్లంగుండాలే సల్లంగుండాలే హేయ్
పెళ్లి జేసుకొని నువ్వు పైలంగా ఉం....



I Am A Champion పాట సాహిత్యం

 
చిత్రం : ఛాంపియన్  (2025)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: KK
గానం: పీ. జయరాం, రమ్యా బెహ్రా


Come come champion
Lets dance come champion
నాతో ఆడి పాడరా
ధూకవేరా తేనెకళ్ళ ఓ handsome
అందుకోరా welcome
పెంచుకోరా volume

జాము రాతిరేళ జాగు ఇంకా యేలా
జానతోటి జాయిగానే జావళీలు పాడరా

ఓ.. తారలీవేళ గంతులేసేలాగా
Rock and Role.. Rock and Role.. Rock and Role
తెల్ల దొరలు.. తెల్లబోయేలా
ఊరంతా నేడు మెచ్చేలా, నచ్చేలా
Fire-u repu flour midha chal chal chal chal
Majak karo.. Majak karo
Everybody
Kushiraho.. Kub Nacho

Hey Majak karo.. Majak karo
మల్లి టైము దొరకదురో…

Swing like Swing like ...




కలగా కథగా పాట సాహిత్యం

 
చిత్రం : ఛాంపియన్  (2025)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: వనమాలి
గానం: కృష్ణ తేజేస్వి, మనీషా ఈరబత్తిని 

కలగా కథగా 

Palli Balakrishna



చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
నటీనటులు: రవితేజా, భాగ్యశ్రీ బోర్సే, జగపతిబాబు 
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టి. జి. విశ్వప్రసాద్ 
విడుదల తేది: 15.08.2024



Songs List:



సితార్ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: సాహితి 
గానం: కొమండూరి సమీరా, శ్రీరామ్ భరద్వాజ్ 

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా

నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా
కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా

నువు చెప్పేలోగా రానే వచ్చేసా
హే హే

నిగనిగ పెదవుల్లో
మోహాలన్నీ తడిపెయ్‍నా
కసికసి ఒంపుల్లో
కాలాలన్నీ గడియ్‍నా

పరువపు సంద్రాల
లోతుల్లోనా మునకెయ్‍నా
పదనిస రాగాల
మేఘాలన్నీ తాకెయ్‍నా

ఆకుపోక చూపనా
ఆశ నీలో రేపనా

గాలే గోలే చేసే తీరానా
నీ కుచ్చిలి మార్చి
ముచ్చట తీర్చెయ్‍నా హే హే

సొగసరి దొంగల్లె
సాయంకాలం వచ్చెయ్‍నా
బిగుసరి పరువంతో
పిల్లో యుద్ధం చేసెయ్‍నా

వలపుల వేగంతో
వయ్యారాలే వాటెయ్‍నా
తలపుల తాపంతో
దాహాలన్నీ దాటెయ్‍నా

నీలాకాశం నీడన
విడిగా నన్నీ వేదన

నీలో నాలో రాగం పాడేనా
తొలి పులకింతిచ్చే పూచి నాదేగా హే హే




రెప్పల్ డప్పుల్ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ 

ఓ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఉస్కో అని అంటే చాలు
డిస్కోల మోతరే
తెల్లార్లు చల్లారని గాన కచేరే

తెలుగు తమిళ హిందీ
వలపు జుగల్‌ బందీ
తకిట తకిట తకిట తకిట
చెమట బొట్టు తాళమేస్తదే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఆ ఎర్రా ఎర్రా సెంపళ్ళల్లా
ఆ సిగ్గుమొగ్గలేసెనేందే శిలకా

నల్లా నల్లా సూపులల్లా
దాసిపెట్టినావు గనక సురక

ఆ నడుమొంపుల్లోన గిచ్చుతుంటే
వేళ్ళకొచ్చే సరిగమలేనా
సందమామ కింద
చాప దిండు దందా
ఝనక్ ఝనక్ ఝనక్ ఝనక్
పట్ట గొలుసు నట్టువాంగమే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఆ ఆ సీరాకొంగు అంచు సివర
నా పాణమట్ట మోసుకెల్తే ఎట్టా

సేతుల్లోనా సుట్టుకున్నా
ఈ లోకమంటే నాకు నువ్వేనంటా

ఆ నడి ఎండల్లోనా
వయసులున్న ఐస్ పుల్లై కరిగిపోనా

వేడి సల్లగుండా
మోయగా వరంగా
హత్తుకోని ఎత్తుకోవే
ఆశాభోస్లే మత్తు రాగమే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే ఏ ఏ ఏ



జిక్కి పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: వనమాలి 
గానం: కార్తీక్, రమ్యా బెహ్రా 

అల్లరిగా అల్లికగా
అల్లేసిందే నన్నే అలవోగ్గా
ఓ లలనా నీ వలనా
మోగిందమ్మో నాలో థిల్లానా

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

ఆ నా మనసే నీకే చిక్కి
దిగనందే మబ్బుల్నెక్కి
నీ బొమ్మే చెక్కి
రోజు నిన్నే పూజించానే జిక్కి ఆ ఆ

చెబుతున్న నేనే నొక్కి
పరిచయమే పట్టాలెక్కి
నీ ప్రేమే దక్కి జంటై పోతే
ఎవరున్నారే నీకన్నా లక్కీ

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

నా దడవును తెంపే నడుమొంపే
నిలువెల్లా చంపే
మధువులు నింపే
పెదవంపే ముంచిందే కొంపే

తలగడలెరుగని తలపుల సొదలకు
తలపడుతున్నా నిద్దురతో
తహ తహలెరిగిన తమకపు
తనువును తడిపెయ్ నువ్వే ముద్దులతో

వింటున్నా నీ గాత్రం
ఏంటంటా నీ ఆత్రం
చూస్తున ఈ చిత్రం
గోలేనా నీ గోత్రం

సాగేనా నీ తంత్రం
పారెనా నీ మంత్రం
కాదనకే నన్నింకేమాత్రం

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

నా వలపుల కుప్పా నువ్విప్ప
ముద్దిస్తే ముప్పా
అలకలు తప్పా ఎంగొప్ప
చనువిస్తే తప్పా

సరసకు చేరిన సరసపు సెగలకు
సతమతమవుతూ ఉన్నానే
గురుతులు చెరగని గడసరి మనసున
గుస గుసలెన్నో విన్నానే

నీ మనసే కావ్యంగా
నీ మాటే శ్రావ్యంగా
నీ తీరే నవ్యంగా
బాగుందోయ్ భవ్యంగా

నువ్వుంటే సవ్యంగా
అవునంటా దివ్యంగా
పెట్టొద్దే నన్నే దూరంగా దూరంగా

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే 

Palli Balakrishna Sunday, August 11, 2024



చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అర్మాన్ మాలిక్ 
నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్
దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ 
నిర్మాత: Sony Pictures International Productions & Sandeep Mudda
విడుదల తేది: 16.02.2024



Songs List:



వందేమాతరం పాట సాహిత్యం

 
చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కునాల్ కుండు 

చూడరా సంగ్రామ శూరుడు
మండెరా మధ్యాహ్న సూర్యుడు
చావునే చండాడు ధీరుడు
నిప్పులు కురిసాడు

రక్తాన వేడి లావాలు పొంగే
ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే
సాహో తలొంచి ఆ నీలి నింగే
ఇలపై ఒరిగే హో

వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం

ఎగసే ఎగసే
తూఫానై రేగుతున్నది వీరావేశం
కరిగే మంచై నీరళ్ళే
జారిపోయే శత్రువు ధైర్యం

గెలుపే గెలుపే ధ్యేయంగా
ఉద్యమించి కదిలే కర్తవ్యం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం, వందే

సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం
వందే వందే వందే వందే వందే

రక్తాన వేడి లావాలు పొంగే
ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే
సాహో తలొంచి ఆ నీలి నింగే
ఇలపై ఒరిగే హో

చూడరా సంగ్రామ శూరుడు
మండెరా మధ్యాహ్న సూర్యుడు
ఓటమే చవిచూడని
రణ విజేతరా ఇతడూ



గగనాల తేలాను పాట సాహిత్యం

 
చిత్రం: ఆపరెషన్ వేలంటైన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అర్మాన్ మాలిక్ 

గగనాల తేలాను నీ ప్రేమలోనా
దిగిరాను ఎన్నేసి జన్మలైనా
తెగిపోయే బంధాలు లోకాలతోనా
నువ్వేదురైన ఆనాటి తొలిచూపునా

వేళలేని వెన్నెలా
జాలువారింది నీ కన్నులా
దాహామే తీరనీ దారలా, ఓ ఓ…

దేవిలా… నువ్విలా, ఆ ఆ
చేరగా, ఆ ఆ
కోవెలాయే నా కలా

గగనాల తేలాను నీ ప్రేమలోనా
దిగిరాను ఎన్నేసి జన్మలైనా
తెగిపోయే బంధాలు లోకాలతోనా
నువ్వేదురైన ఆనాటి తొలిచూపునా

నీవే నలువైపులా
చూస్తునే ఉంటా నిన్ను కంటిపాపలా
ఏదో రాధా కృష్ణ లీలా
నిన్ను నన్నీవేళ వరించిందే బాలా

తరగని చీకటైపోనా
చెరగని కాటుకైపోనా
జగమున కాంతినంతా
నీదు కన్నుల కానుకే చేసి

రంగుల విల్లునైపోనా
నీ పెదవంచుపై రానా
ఋతువులు మారని
చిరునవ్వునే చిత్రాలుగా గీసి
చెరిసగమై నీ సగమై
పూర్తైపోయా నీవల్ల ప్రియురాలా

దేవిలా… నువ్విలా, ఆ ఆ
చేరగా, ఆ ఆ
కోవెలాయే నా కలా, ఆ ఆ
ఓ ఓ ఓ ఓ ఓ

Palli Balakrishna Saturday, March 30, 2024



చిత్రం: గాండీవదారి అర్జున (2023)
సంగీతం: మిక్కీ జె మేయర్ 
నటీనటులు: వరుణ్ తేజ్ , సాక్షి విద్యా 
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు 
నిర్మాత: BVSN ప్రసాద్ 
విడుదల తేది: 25.08.2023



Songs List:



నీ జతై సాగింది పాట సాహిత్యం

 
చిత్రం: గాండీవ దారి ఆర్జున (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: రహ్మాన్
గానం: Elvya, నకుల్ అభయంకర్ 

నీ జతై సాగింది పాదమే
ఆపినా ఆగునా లోలోని వేగమే
ఆ ఆ హా ఆ ఆ
ఆ ఆ హా ఆ ఆ

నీ జతై సాగింది పాదమే
ఆపినా ఆగునా లోలోని వేగమే

వెలుగుల దారుల్లో
విరిసిన రంగుల్లో
ప్రతిక్షణం ఒక్కో వరం
అయినది ఈ వేళ

తరిమిన ఊహల్లో
తరగని ఊసుల్లో
పెదవుల పైన నవ్వై ఎదురొస్తుంటే
ఎంతో అందం కనిపిస్తుంటే ఏదో బంధం

చిరు చిరు ఆశ… మధురమే
ఎగిసిన స్వాస… మధురమే
ప్రతి ఒక బాస మధురమే
పైపైనా వాలుతుంటే
ఆ మంచు పూల వాన

మనసుల పాట… మధురమే
వలపుల బాట… మధురమే
కలిసిన చోట… మధురమే
రమ్మంటు పాడుతున్న
ఆ స్వాగతాలలోనా

ఎదుట నువ్వు ఉంటే
ఎదకు రెక్కలొచ్చే
ప్రపంచాన్ని దాటుతు
నింగి మీటుతు అలా

నీలి మబ్బుల్లో తేలే గువ్వల్లా
రివ్వు రివ్వంటూ ఎగిరెల్దాం పదా

కాలంతో పందెం వేసేద్దాం
కలలన్నీ నిజమే చేసేద్దాం
సరదాల అంతే చూసేద్దాం
సంతోషం మనమే అయిపోదాం

ఎన్నెన్నో ఆశలు పోగేద్దాం
ఓ కొత్త లోకం కట్టేద్దాం
ఆ కోటి చుక్కలు అష్టదిక్కులు
ఒక్కటై ఇలా చుట్టు చేరగా

చిరు చిరు ఆశ… మధురమే
ఎగిసిన స్వాస… మధురమే
ప్రతి ఒక బాస మధురమే
పైపైనా వాలుతుంటే
ఆ మంచు పూల వాన

మనసుల పాట… మధురమే
వలపుల బాట… మధురమే
కలిసిన చోట… మధురమే
రమ్మంటు పాడుతున్న
ఆ స్వాగతాలలోనా




అర్జునా అర్జునా పాట సాహిత్యం

 
చిత్రం: గాండీవదారి అర్జున (2023)
సంగీతం: మిక్కీ జె మేయర్ 
సాహిత్యం: రెహ్మాన్ 
గానం: హరికా నారాయణ్ 

అర్జునా అర్జునా నీ నీడే రక్షణా
గాండీవధారీ నీ సాయం కోరీ
పిలిచే ధరిత్రీ రా రా

అర్జునా అర్జునా నీ రాకే గర్జనా
అర్జునా అర్జునా... నీ నీడే రక్షణా

నీ చూపు ఓ అస్త్రమై
చీకట్లనే చీల్చేయగా, హా
నీ అడుగు ఓ వ్యూహమై
ఆకాశమే తాకేనుగా

నిలబడే నిప్పు కెరటం
కలబడే యుద్ధ శకటం
కణకణం కాంతిపుంజం
కదలికే మెరుపు వేగం
నరనరం ఉరికే రక్తం
జగతికే రక్ష కవచం



ముగిసిపోయే వెలుగు పాట సాహిత్యం

 
చిత్రం: గాండీవదారి అర్జున (2023)
సంగీతం: మిక్కీ జె మేయర్ 
సాహిత్యం: రెహ్మాన్ 
గానం: అఖిల్ చంద్ర 

ముగిసిపోయే వెలుగు

Palli Balakrishna Sunday, October 8, 2023



చిత్రం: పెద్దకాపు (2023)
సంగీతం: మిక్కి జే మేయర్
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాత్సవ్
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిరియాల రవీంద్ర రెడ్డి 
విడుదల తేది: 29.09.2023



Songs List:



చనువుగా చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: పెద్ద కాపు (2023)
సంగీతం: మిక్కి జే మేయర్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: చైత్ర అంబలపూడి, అనురాగ్ కులకర్ణి 

హృదయములో
అలజడి వానా ఆ ఆ ఆ
కురిసెనే ఇలా నీ వలనా

అరెరే అరెరే తన వాటమే
అసలే పడదే మొహమాటమే
పలుచగ వేసిన పావడ గోడ దాటిన
జరపదు ఎందుకో తెలిసేనా ఆ ఆ

చనువుగా చూసినా, హా
చూపులతో తినేసిన
ఆకలి తీరునా
అరిగేనా, ఆ ఆ ఆ

వదులుగా వదలడమే
వయసుకొక మర్యాదా
ఆత్రపడి అడగాల
ఆ మాత్రము తెలియదా

మహా తప్పేమీ లేదన్న
నీకిలా అరె సిగ్గన్నా
తడబాటు కావాలా

మొదలని ఊరుకున్నా
లేక పోతే
ఇంకా ఉడికించెయ్ నా
చనువుగా చూసినా
చూపులతో తినేసిన
ఆకలి తీరునా
అరిగేనా… ఆ ఆ

అడుగుల నాడిలో, ఓ హో
పెరిగిన వేడి నీడలే
పడకలు చాపెనే పడమటనా
అరెరే అరెరే తన వాటమే



# పాట సాహిత్యం

 
చిత్రం: పెద్ద కాపు (2023)
సంగీతం: మిక్కి జే మేయర్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: అనురాగ్ కులకర్ణి 

డండక డుం డండక డుం
డండక డుం డుం డుం
డండక డుం డండక డుం
డండక డుండక డుం

దిట్టంగా దూకు దిష్టికే
ఉప్పొచ్చి నిప్పు తాకెనే
దుర్గమ్మ తల్లి కళ్ళకే వెలుగై


సమ్మెట్ల సాగు డప్పుకే
ఉగ్రాలు ఊరికొచ్చెనే
పెద్దమ్మ రంగమెక్కగా ఉడుకై

పసుపంటిన కత్తికి కూడా
పదునెప్పుడు చివరకు ఎరుపే
కల్లోలపు కాష్టం రగిలే
చితుకులు చింతలవేలేరా

పొలిమేరలు అడవికి ఉన్నా
వేటాడగ హద్దులు లేవే
పుట్టేందుకు యుద్ధము కారణమేదో
సేనకు తెలియదురా

రణ నీతినే రాసేందుకు
రక్తాన్ని వాడని తావుందా
ఒక గీతతో బలహీనత
ఆనాడు పోయిందా

రణ నీతినే రాసేందుకు
రక్తాన్ని వాడని తావుందా
ఒక గీతతో బలహీనత
ఓనాడు ఓడిందా

కడసాగని కాలం ప్రతిసారి
వెతికింది ఓ నెత్తుటి దారి
అవకాశపు ఆశల నీడలు
కమ్మిన కన్నుల చూపులు ఎరవేసి
తను వేసిన ఉచ్చులతో
పెను ఉత్సవమే
అను నిత్యం జత చేసి

డండక డుం డండక డుం
డండక డుం డుం డుం
డండక డుం డండక డుం
డండక డుండక డుం

ఒడ్డూ వరద కలుసుకొని
చెట్టా పట్టాలేసుకొని
నవ్వుతుంటె గోదారే
కళ్ళు చాలవే

నిద్దురలా తానున్నా
గుంబనంగ గోదారి
కట్టుతప్పి పోయిందా
అడ్డే వాడు కనరాడే

తడి అడుగుల ఈ నేల
తను ఎవరని అడిగిన ఓ వేళ
తలవాకిట తీరని తోడుగ
కాసిన కొరివికి కాడుకు వెరుపేలా

ఎనకటి కథ యేటికి నేర్పాలా
ఏడుపు వ్యధ గొంతుకు చెప్పాల
చనుబాలకు అంచున చేసిన
గాయపు రాతలు చరితను చదవాలా

పసుపంటిన కత్తికి కూడా
పదునెప్పుడు చివరకు ఎరుపే
కల్లోలపు కాష్టం రగిలే
చితుకులు చింతలవేలేరా

పొలిమేరలు అడవికి ఉన్నా
వేటాడగ హద్దులు లేవే
పుట్టేందుకు యుద్ధము కారణమేదో
సేనకు తెలియదురా

రణ నీతినే రాసేందుకు
రక్తాన్ని వాడని తావుందా
ఒక గీతతో బలహీనత
ఆనాడు పోయిందా

రణ నీతినే రాసేందుకు
రక్తాన్ని వాడని తావుందా
ఒక గీతతో బలహీనత
ఓనాడు ఓడిందా

కడసాగని కాలం ప్రతిసారి
వెతికింది ఓ నెత్తుటి దారి
అవకాశపు ఆశల నీడలు
కమ్మిన కన్నుల చూపులు ఎరవేసి
తను వేసిన ఉచ్చులతో
పెను ఉత్సవమే
అను నిత్యం జత చేసి

దిట్టంగా దూకు దిష్టికే, ఓయ్
ఉప్పొచ్చి నిప్పు తొక్కెనే
దుర్గమ్మ తల్లి కళ్ళకే వెలుగై

ఓ ఓ, సమ్మెట్ల సాగు డప్పుకే
ఉగ్రాలు ఊరికొచ్చెనే
పెద్దమ్మ రంగమెక్కగా ఉడుకై

డండక డుం డండక డుం
డండక డుం డుం డుం
డండక డుం డండక డుం
డండక డుండక డుం

Palli Balakrishna Friday, October 6, 2023

Most Recent

Default