-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Malli Modalaindi"



చిత్రం: మళ్ళీ మొదలైంది (2021)
సంగీతం:అనూప్ రూబెన్స్ 
నటినటులు: సుమంత్ , నయన గంగూలీ
దర్శకత్వం: టి.జి.కీర్తి కుమార్ 
నిర్మాత: కె.రాజశేఖర్ రెడ్డి 
విడుదల తేది: 17.11.2021



Songs List:



ఏంటో ఏమో జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ మొదలైంది (2021)
సంగీతం:అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: సాయి చరణ్ 

ఆ ఏంటో, ఆ ఏమో
ఆ ఏంటో ఏమో జీవితం
ఎందుకిలా చేస్తాదో జీవితం
అరె..! ఏంటో ఏమో జీవితం
ఎందుకిలా చేస్తాదో జీవితం

ఏ సూడబోతే తెల్లగున్న కాగితం
ఏ రాసుకున్న చెరిగిపోదు నీ గతం
ఏ నిన్ను చూసి నవ్వేస్తు… నీ సరద తీరుస్తూ
ఎవ్వడిని వదిలి పెట్టదూ
ఏ అటో ఇటో ఎటో ఎటో… సాగుతున్న జీవితం
సరాసరి సవాలుగా మారేనా
అరె..! చిన్న పెద్ద ఊరు వాడా… నవ్వనే నవ్వగా
పెళ్ళే పెటాకులై పోయే దేవుడా

ఏ చిక్కులో పడ్డావు… చిక్కు ముడివయ్యావు
వేగు చుక్కల నువ్వు… అట్ట ఎట్టా మిగిలావు
సీతలేని ఓ రామ… ఎందుకో ఈ డ్రామా
లంక తగలెట్టాక… ఏమైందో భామ
గ్లాసు బాసు దేవదాసు… సోలో లైఫే సూపర్ బాసు
చేతులు రెండూ కాలే దాకా… ఆకులు నువ్వే పట్టవయ్యో
సుడిగుండం దాటేదేట్టా, హా

ఏ అటో ఇటో ఎటో ఎటో… సాగుతున్న జీవితం
సరాసరి సవాలుగా మారేనా
అరె..! చిన్న పెద్ద ఊరు వాడా… నవ్వనే నవ్వగా
పెళ్ళే పెటాకులై పోయే దేవుడా

ఏ వంటలో నల భీమా… చెయ్యలేదా భీమా
పెళ్లి రుచి తెలిసిందా… చేదు కారం తగిలాయ
మంట ముందు పెట్టాకే… పెళ్లి చేస్తారయ్యా
మంట కింద పెట్టేదే… పెళ్లి పెళ్లాం ప్రేమ
మగువ తగువా కలిసొచ్చాక… సులువా విలువ పోయేదాకా
పిల్లే నిన్ను ఒగ్గేశాక… తట్టా బుట్టా సర్దేశాక
సొంతూరే ఎల్లకు బ్రదరూ
ఏ అటో ఇటో ఎటో ఎటో… సాగుతున్న జీవితం
సరాసరి సవాలుగా మారేనా
అరె..! చిన్న పెద్ద ఊరు వాడా… నవ్వనే నవ్వగా
పెళ్ళే పెటాకులై పోయే దేవుడా





అలోన్ అలోన్ పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ మొదలైంది (2021)
సంగీతం:అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: సిద్ శ్రీరాం , అనూప్ రూబెన్స్ 

కనులకు తెలియని ఓ కలలా… వెళిపోయావే నువ్వు ఎలా
మిగిలానే నే ఓ శిలలా, అలోన్

అలోన్ అలోన్… అలోన్ అలోన్
ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ
అలోన్ అలోన్… అలోన్ అలోన్
ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ, యాయి యే

కనులకు తెలియని ఓ కలలా
వెళిపోయావే నువ్వు ఎలా
మిగిలానే నే ఓ శిలలా, అలోన్
విడివిడి అడుగులు పడెను ఎలా
కలవని జంటల ఓ కధలా
ఒంటరి మనసులో ఓ వ్యధలా, అలోన్ ఓ

ఆ ఆ, వదిలెళ్ళిపోకే నన్నూ… వదులుకోలేనే నిన్నూ
మన గతములోనే ఉన్నాను… ఓ చెలీ ఓ చెలీ
అలోన్ అలోన్ (అలోన్)… అలోన్ అలోన్ (అలోన్)
అలోన్ అలోన్, ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ
తలచావా చెలి నువ్వు అలా
పొలమారిందే ఎందుకిలా
వేరెవరూ నాకేమి ఇలా, అలోన్
చిరునవ్వులకే సంకెళ్ళా
వెళిపోయావే ప్రియురాలా
గతమే నువ్వని మరవాలా, అలోన్

వదిలెళ్ళిపోకే నన్నూ… వదులుకోలేనే నిన్నూ
మన గతములోనే ఉన్నాను
ఓ చెలీ (ఓ చెలీ)… ఓ చెలీ (ఓ చెలీ)

వదిలెళ్ళిపోకే నన్నూ… వదులుకోలేనే నిన్నూ
మన గతములోనే ఉన్నాను
ఓ ఓ చెలీ (ఓ చెలీ)… ఓ చెలీ (ఓ చెలీ)
అలోన్ అలోన్

Palli Balakrishna Monday, November 1, 2021

Most Recent

Default