-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kalyan Krishna"



చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా
దర్శకత్వం: కె. కళ్యాణ్ కృష్ణ
నిర్మాతలు: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
విడుదల తేది: 14.01.2022



Songs List:



లడ్డుండ పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: నాగార్జున, ధనుంజయ్, మోహన భోగరాజు, నూతన మోహన్, హరిప్రియ

బాబు తబలా...
అబ్బాయ్ హార్మొనీ...
తానా న న న న
డాంటకు డ డ న

రాజు గారు
డాంటకు డ డ న అనగా ఏమి

హ హ హ హ హ
ఓరి బుడ్డోడ ఇంతకాలం తెలుసుకోకుండా ఏమి చేస్తున్నావురా? అడగాలి కదా!

డాంటకు డ డ న
బంగారు పాపలూ...

చెరుకు తోటలో చారెడు బియ్యం
వంగతోటలో మరదలి కయ్యం
లగెత్తి కొడితే  లడ్డుండ లడ్డుండ

మాటల్లోనే మల్లెల చెండు
చూపుల్లోనే కితకితలుండు
బంగార్రాజు కి జువ్విచ్చి జువ్విచ్చి

జువ్విచ్చి జువ్విచ్చి
జువ్విచ్చి జువ్విచ్చి

హో కంది సేనుకాడ డాంటకు డ డ న
కన్ను కలిపితే డాంటకు డ డ న
పంపు షెడ్డు కాడ డాంటకు డ డ న
పైట తగిలితే డాంటకు డ డ న
లడ్డుండ లడ్డుండ

జువ్విచ్చి జువ్విచ్చి
తిప్పమాకు మీసాలు వెయ్యమాకు వేషాలు
నీ నవ్వు అగరొత్తి నీ చూపు చురకత్తి
కొయ్యమాకు ఊచకోతలు
ఓ ఆయీ ఆయీ ఆయీ
రీలు రీలు రీలు రీలు
ఆహా ఇరగదీస్తున్నారు స్త్రీలు

మెరిసే బంగారు కళ్ళు
తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు

లడ్డుండ జువ్విచ్చు
లడ్డుండ జువ్విచ్చు

హే గడ్డి మేటకాడ డాంటకు డ డ న
అగ్గిరాసుకుంటే డాంటకు డ డ న
వంగ తోట కాడ డాంటకు డ డ న
దొంగచాటుగా డాంటకు డ డ న

కల్లని చూస్తే కలుపు పువ్వు
వలపులు చూస్తే పాపి కొండలు
పిల్లని చూస్తే లడ్డుండ ఇచ్చే లడ్డుండ

జువ్విచ్చి లడ్డుండ
జువ్విచ్చి లడ్డుండ
జువ్విచ్చి లడ్డుండ
జువ్విచ్చి ఇచ్చే లడ్డుండ





నా కోసం పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ
గానం: సిద్ శ్రీరామ్

కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలైందో
అంతగా నాకర్ధం కాలేదే
మెరుపులా నీ చూపేమందో
చినుకులా నాపై వాలిందో
మనసిలా నీవైపే తిరిగిందే
ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేశావు
మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావూ..

నాకోసం మారావా నువ్వూ...
లేక నన్నే మార్చేశావ నువ్వూ..

చరణం: 1
ఓ నవ్వులే చల్లావూ పంచుకో మన్నావూ
తొలకరి చిరుజల్లై నువ్వూ...
కళ్లకి దొరికావు రంగులా మెరిసావూ
నేలపై హరివిల్లా నువ్వూ..
నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా
నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా
మాటల్లోని మరాలన్ని మంచులాగ మార్చావో

నీకోసం మారానే నేనూ...
నిండు నూరేళ్ళు ఉండేలా నేనూ..

చరణం: 2
మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్నూ...
కన్నులే అడిగేలా చూపులే అలిసేలా
ఎదురుగా నిలిపావా నిన్నూ..
పైకే నవ్వేలా లోకం అంతా నువ్వేలే 
నాకే ఈవేళ నేనే నచ్చానే నీవల్ల
మోమాటాలే దూరం చేసే మాట నీకు చెప్పేలా...

నీ వెంటే ఉంటున్నా నేనూ..
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ..




వస్సివాడి తస్సాదియ్యా పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కళ్యాణ్ కృష్ణ
గానం: మోహన్ భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్ధన్ చావలి

నీకేమైంది బుజ్జీ
మూడు లేదు మాస్టారూ..
నీకేమైంది
ఏమైందంటే ఏం చెప్పమంటావ్

ఓయ్ బంగార్రాజు
నువ్వు పెల్లిచేసుకేల్లిపోతే బంగార్రాజు 
మా కింకెవ్వడు కొనిపెడతాడు కోక బ్లౌజు
నువ్వు శ్రీరాముడు వైపోతే  బంగార్రాజు
మా కింకెవ్వడు తీరుస్తాడు ముద్దు మోజు 
నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే బంగార్రాజు
మాకు కెట్టుకో బుద్దవ్వదు బొట్టు గాజు
నా చేతి గారి తిన్నప్పుడు బంగార్రాజు
పొగిడి పొగిడి చంపావు నువ్వారోజు
అరె కట్టిపూడి సంతలోన బంగార్రాజు 
నువ్వు తినిపించ మరచిపోను కొబ్బరి లౌజ్
రెండొకట్ల మూడంటావ్ బంగార్రాజు
నీ ఎక్కాలకి పడిపోయా నేనా రోజూ

వస్సివాడి వస్సివాడి 
వస్సివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా 

హా నువ్వొచ్చినప్పుడు ముద్దిచ్చి నప్పుడు
నా గుండె చప్పుడు హండ్రెడ్
నీ చీర కట్టుడు నీ నడుము తిప్పుడు
నా గుండె చడుగుడు వాట్ టు డూ

ఊరుకున్నడొక్కడు పెళ్లి అంట ఇప్పుడు
మేము ఎట్ట బతుకుడు డూ డూ డూ
పిల్ల పేరు గిల్లుడు ఇంటిపేరు దూకుడు
దీన్ని ఎట్ట ఆపుడు డూ డూ డూ

హోల హోలమ్మ హోల హోలమ్మ
ఈ పిల్లాడు నచ్చాడు మనసైన సోగ్గాడు
ముద్దొస్తు ఉన్నాడు


వస్సివాడి వస్సివాడి 
వస్సివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా


నువ్వుంటే సందడి నీ రాక గారడీ
నీ రాక కొసమే అల్లాడి
గారాల అమ్మడి నీ సోకు పుత్తడి
కల్లోకి వచ్చేస్తావు అల్లాడి

నువ్వు పెద్ద తుంటరి చూపుల్లోన పోకిరి
కల్లతోనే కాల్చుతావు తందూరి
తేనెపట్టు సోదరి పాలముంజ మాదిరి 
నిన్ను చూస్తే గుండెజారి రి రి రీ

ఈ పిల్లాడు నచ్చాడు మనసైన సోగ్గాడు
ముద్దొస్తు ఉన్నాడు

వస్సివాడి వస్సివాడి 
వస్సివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా

నువ్వు పెళ్లి చేసుకెల్లి పోయినా బంగార్రాజు
మా గుండెల్లో ఉండిపోతావ్ బంగార్రాజు
నువ్వు ఎక్కడుంటే అక్కడుండు బంగార్రాజు
నువ్వు హ్యాపీగా ఉండాలోయ్ బంగార్రాజు
ఉమ్మా... 
వస్సివాడి తస్సాదియ్యా



బంగారా బంగారా పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: మధు ప్రియ, అనూప్ రూబెన్స్

కళ్ళకి కాటుక ఎట్టుకొని
కాళ్ళకి పట్టీలు కట్టుకొని
సెవులకు కమ్మలు ఎట్టుకొని
సేతికి గాజులు ఏసుకొని

సిలుకు చీర కట్టుకొని
సెంటు గట్రా కొట్టుకొని
కొత్తగా ముస్తాబయ్యా
ఎప్పుడెప్పుడొస్తావయ్యా
నిన్ను సూడకుంటె గుండె
కొట్టుకోదయ్యా, ఆ ఆఆ

బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నువ్వంటే పడిపడి చస్తారా

బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నీ వెంటే లేచి వస్తారా

ఓ ఓ ఓఓ ఓ, చీరకు కుచ్చిళ్ళలాగా
జెడకు రిబ్బను లాగా
ఉంటావా ఉంటావా… తోడుగ ఉంటావా

ఓ, మూతికి ముడుపులాగ
నడుముకి మడతలాగ
నీతోనే ఉంటాగా… వదలనంటాగా

అంటుకు పోతావా
నా ఒంటికి అత్తరులా
సిగ్గై పోతావా నా సెంపకి
సువ్వి సువ్వాలా

నీకింకా ఇంకా ఇంకా
ఏం కావాలో చెప్పవే ఇల్లాలా
మళ్ళి మళ్ళి పుట్టేద్దామా
మొగడు పెళ్ళాల్లా, ఆ ఆఆ

ఊయ్, బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నువ్వంటే పడిపడి చస్తారా

బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నీ వెంటే లేచి వస్తారా

(బంగార్రాజు బంగార్రాజు)



ఎంత సక్కాగుందిరో పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ 
గానం: సాయి మాధవ్, మోహన్ భోగరాజ్, మేఘన, అపర్ణ, కావ్య  

రంగు రంగులు ఎగిసి
నింగి తాకే సంబరం
ఊరు ఊరంతా మెరిసే
అంగరంగా వైభవం

కోక కొంగు కోలాటాలు
ఆడే సరదా కృష్ణుడు
పింఛం పిల్లనగ్రోవి లేని
మా చిలిపి కృష్ణుడు

హే, రంగు ఓణీ రవ్వ గాజు
పిల్లని చూస్తే లడ్డుండా
ఎంతా సక్కాగుందిరో
ఎంత సక్కాగుందిరో

అరె కొంగు చాటు దాచుకున్న
నడుమును చూస్తే లడ్డుండా
ఎంతా సక్కాగుందిరో, యెహే
ఎంత సక్కాగుందిరో

ఆ, ఘల్లు ఘల్లు గజ్జెలు చూసి
గుండెకాయ గుంజీలు తీసే
బొంగరాల నడకలోన సక్కాగుందిరో
అరె అరె అరె అరే

ఎంతా సక్కాగుందిరో
ఎంత సక్కగుందిరో
లడ్డుండా లడ్డుండా, యెహే
లడ్డుండా, ఏ లడ్డుండా

హే, రంగు ఓణీ… రవ్వ గాజు
పిల్లని చూస్తే లడ్డుండా
ఎంతా సక్కగ సెప్పిండే
ఎంత సక్కగ సెప్పిండే

అరె బతికుండాలి ఖవ్వాలీలా
రోజు కొత్త ఉగాదిలా
కళ్ళల్లోనే దివాళిలా
ప్రతిపూటా పండుగలా

నువు పక్కన ఉంటే మహాశయా
రోజూ కృష్ణాష్టమేనయా
పొగిడావంటే అంతేనయా
సందట్లో సడేమియా

హే, పాలపిట్టకి పరికిణిలాగ
కొండవాగుకి గమకము లాగా
చందమామకి చెమికిలాగా
ఇరగేస్తుందోరి

అరె అరె అరె అరే
ఎంతా సక్కాగుందిరో
ఎంత సక్కగుందిరో
సక్కగుందే సక్కగుందే
సక్కగుందే సక్కగుందే




నువు సిగ్గుపడితే… పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: చిత్ర, రమ్యా బెహ్రా , సాయి చరణ్ 

నువు సిగ్గుపడితే… నువు సిగ్గుపడితే
నువు సిగ్గుపడితే బాగుంటావే
ఓ సత్యభామ సిగ్గుల సింగారముంటాదే

వద్దన్నా కొద్ది ముద్దొస్తావే
నా ఎన్నెలమ్మ
కారంగా చూస్తూనే
గారం చేస్తావే

నువ్వు మాటలతో పడగొడతావే
ఓ బంగార్రాజు నవ్వులతో సెగపెడతావే
నీ సూపులతో చుట్టేస్తవే… నా రంగుల రాజు
సూదంటు రాయల్లే లాగేస్తావే

మళ్ళీ పుట్టానా అనిపిస్తుందే
ప్రాణం నా నువ్వు నను చేరితే

ఓ ఓ ఓఓ, నువ్వు నేనొకటేగా… ఏడున్నా
నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా
నువ్వు నేనొకటేగా ఏడున్నా
నువు నా సొంతమెగా ఏ లోకంలో ఉన్నా

యాలె యాలె యాలెయాలె యాలే యాలే
యాలె యాలె యాలెయాలె యాలే యాలే

హోయ్ సుందరుడా సుందరుడా
మీసమున్న సెందురుడా
అందమైన ఆశపెట్టే నరుడా, హొయ్

ఊరువాడ పిట్టగోడ దూకినోడ్నే నేనాడా
కాసుకుంటానంటే పందెం ఈడా

అరె అరె అరె, చెఱుకుగడ పెరుగువడ
జున్ను పాల మీగడ
మాటల్లోనే చూపించావే గురుడా

హో, పూల జడ ఒంపు మెడ
హత్తుకున్న పావడా
ఎక్కి తొక్కుతున్నాయే గుండె కాడ

పొద్దూమాపంటూ ఏం లేదురా
స్వర్గమంటే ప్రతీ పూట
నీతోటే మా ఆటలే

ఓ ఓ ఓఓ, నువ్వు నేనొకటేగా… ఏడున్నా
నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా
నువ్వు నేనొకటేగా ఏడున్నా
నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా


Palli Balakrishna Thursday, January 13, 2022


చిత్రం: నేలటిక్కెట్ (2018)
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం: చైతన్య పింగళి
గానం: శ్రీకృష్ణ, రమ్యబెహరా
నటీనటులు: రవితేజ, మాళ్విక శర్మ
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత: రామ్ తాళ్లూరి
విడుదల తేది: 25.05.2018

విన్నానులే మది సవ్వళ్ళనే
అన్నానులే నను వచ్చేయని
చూశానులే కనుపాపల్లోనే
చెప్పానులే అవి నా ఇళ్ళనీ

ఊ కొట్టీ పలికేటీ హృదయము నీకే నజరానా
నిద్దట్టో సలిపేటీ తలపులు నాకే జరిమానా
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ

కాదన్నా ఔనన్నా
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
దూరంగా నెడుతున్నా
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
అంటూన్నావే లబ్ డబ్ అనీ నాలో నువ్వూ
ఉంటానులే నీ శ్వాసగా నిత్యం నేనూ

లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ

ఆకాశం అందేంతా నేలంతా కమ్మేంతా
ఊహల్లాగే వచ్చేయనా నీతో నేను
ప్రాణంలాగా నిండావులే నాలో నువ్వూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ

ఊ కొట్టీ పలికేటీ హృదయము నీకే నజరానా
నిద్దట్టో సలిపేటీ తలపులు నాకే జరిమానా

లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ

Palli Balakrishna Thursday, January 24, 2019



చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగచైతన్య , రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 26.05.2017



Songs List:



రా రండోయ్ వేడుక చుద్దాం పాట సాహిత్యం

 
చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్, గోపికా పూర్ణిమ

బుగ్గ చుక్క పెట్టుకుంది 
సీతమ్మ సీతమ్మ 
కంటి నిండ ఆశలతో
మా సీతమ్మా

తాలి బొట్టు చేత బట్టి 
రామయ్య రామయ్య 
సీత చెయ్యి పట్ట వచ్చె
మా రామయ్యా 

పెద్దలు వేసిన అక్షతలు 
దేవుడు పంపిన దీవెనలు 
దివిలో కుదిరిన దంపతులు 
ఈ చోట కలిశారు ఇవ్వాల్టికి 

ఆటలు పాటలు వేడుకలు 
మాటకు మాటలు అల్లరులు 
తియ్యని గుర్తుల కానుకలు 
వెన్నంటె ఉంటాయి వెయ్యేల్లకి 

రా రండోయ్ వేడుక చుద్దాం 
ఈ సీతమ్మని రామయ్యని 
ఒకటిగ చెసేద్దాం 
ఆడెద్దాం పాడేద్దాం
నవ్వేద్దాం నవ్వేద్దాం 

వారు వీరని తేడా లేదులే
ఇకపై ఒక్కటే పరివారం 
పేరు పేరునా పిలిచే వరసలై 
ఎదిగే ప్రేమలే గునకారం 

ఇద్దరి కూడిక కాదు ఇది 
వందల మనసుల కలయికిది 
ఈ సుముహుర్తమె వారదిగా
భూగోళమే చిన్నదవుతున్నది 

రా రండోయ్ వేడుక చుద్దాం 
వేద మంత్రాలతో ఈ జంటని 
ఆలు మగలందాం 
ఆడేద్దాం పాడేద్దం
నవ్వేద్దాం నవ్వేద్దాం 

కాలం కొమ్మపై మెరిసె నవ్వులై 
కలిసె గువ్వలే భందువులు 
కదిలే దారిలో మెదిలె గుర్తులై 
నడిపె దీవ్వెలె వేడుకలు 

ఎపుడొ తెలిసిన చుట్టాలు 
ఇపుడె కలిసిన స్నేహితులు 
మనసును తడిమిన సంగతులు 
కనువిందుగ ఉంది ఈ పందిరి 

రా రండోయ్ వేడుక చుద్దాం 
అయిన వాల్లందరం ఈ వేలిల 
ఒక్కటిగ చేరాం 
ఆడేద్దాం పాడేద్దాం
నవ్వేద్దాం నవ్వేద్దాం 




నీ వెంటె నేనుంటె  పాట సాహిత్యం

 
చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కపిల్ , శ్వేతా మోహన్

నీ వెంటె నేనుంటె బాగుందె చాలా 
నీ నీడకు పేరుంటె నాదయ్యెలా
నీతొ అడుగేస్తుంటె బాగుందె చాలా
నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా

నీకొసం ఎం చేస్తున్నా 
నాకె నే నచ్చెస్తున్నా 
ప్రాణాలే పంచివ్వాల 
నువ్వడగడమె ఆలస్యమనేల 

నీ వెంటె నేనుంటె బాగుందె చాలా 
నీ నీడకు పేరుంటె నాదయ్యెలా
నీతొ అడుగేస్తుంటె బాగుందె చాలా
నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా

నువ్వె ఒక పుస్తకమైతె 
నెమలీకై నీతో ఉంటా 
నువ్వె ఒక కిటికీవైతే
వెలుతురులా నిన్ను చూస్తుంటా 

నా చిరునామ ఏదంటె 
నీ చిరునవ్వేనని చెబుతా 
నా గమ్యం ఎక్కడ అంటె 
నీ పయనాన్నె చూపిస్త 
నీ కలలె నిజమయ్యేలా
నువ్వు కలగనడం ఆలస్యమనేల 

నీ వెంటె నేనుంటె బాగుందె చాలా 
నీ నీడకు పేరుంటె నాదయ్యెలా
నీతొ అడుగేస్తుంటె బాగుందె చాలా
నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా

నా రాజకుమారుడు నువ్వు 
నా రంగుల లోకం నువ్వు 
నిజమల్లె వచ్చెసావు 
హ్రుదయాన్నె పంచెసావు 

నీ కన్నుల కలలే తీసి 
నా కంటికి కాటుక చేసి 
నా మనసుకి ప్రాణం పోసి 
వెన్నెలతో నింపేసావు 

అద్దంలా నను దిద్దావు 
నా పెదవుల్లొ తొలి ముద్దయ్యావు 

నీ వెంటె నేనుంటె బాగుందె చాలా 
నీ నీడకు పేరుంటె నాదయ్యెలా
నీతొ అడుగేస్తుంటె బాగుందె చాలా
నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా




భ్రమరాంబ కి నచ్చెసాను  పాట సాహిత్యం

 
చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్

ఏ మేఘాల్లో డ్యాన్సింగ్ నేను 
మెరుపుల్తో రేసింగ్ నేను 
వాటర్ పై వాకింగ్ నేను 
చుక్కల్తో చాటింగ్ నేను  

రెయిన్బో లో స్విమ్మింగ్ నేను 
ఫుల్ ఫ్లో లో సింగింగ్ నేను 
జాబిలి పై జంపింగ్ నేను 
సంతోషాన్నే సిప్పింగ్ నేను 

హె నిన్నటిదాక అరె వింతలు అంటె 
మరి ఏడేనంటు తెగ ఫిక్సింగ్ నేను 
గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్నే
ఇంకొ వండర్ లా వాచింగ్ నేను 
(అరె ఏమైందమ్మ నీకు) 

హె భ్రమరాంబకి నచ్చెసాను 
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను 

హె భ్రమరాంబకి నచ్చెసాను 
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను 

ఏ మేఘాల్లో డ్యాన్సింగ్ నేను 
మెరుపుల్తో రేసింగ్ నేను 
వాటర్ పై వాకింగ్ నేను 
చుక్కల్తో చాటింగ్ నేను 

ఏ దిక్కులనె సెట్టింగ్ నేను 
నెలవంక వూయల్లో సిట్టింగ్ నేను 
వెన్నెలనె డ్రింకింగ్ నేను 
ఈ మాజిచ్ లొ మ్యుసిచ్ నె మంచింగ్ నేను 
తామర పువ్వల్లె వింటర్ గువ్వల్లె 
ఒంటరి ఊహల్లో వెయిటింగ్ నేను 
పండగ కబురొస్తె జాతర వీదల్లె 
హ్యపినెస్ తో డేటింగ్ నేను 

హె భ్రమరాంబకి నచ్చెసాను 
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను 

హె భ్రమరాంబకి నచ్చెసాను 
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను 

ఏ మ్యటర్నే క్వాటర్ చేసి 
చంద్రుడితో చీర్స్ అంటు చిల్లింగ్ నేను 
ఊహలకె వూఫర్లేసి 
నా గుండె సౌండింగ్నే లిసెనింగ్ నేను 
ఎవెరెస్ట్ ఎక్కేసి ఇంకా పైకెక్కె 
మౌంటైన్ ఏదంటూ సర్చింగ్ నేను 
మనసను రాక్కెట్లో వలపుల బ్రాకెట్లో
సంతోషంతో ఫ్లయింగ్ నేను 

హె భ్రమరాంబకి నచ్చెసాను 
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను 

హె భ్రమరాంబకి నచ్చెసాను 
హె జజ్జనక అంబరమె టచ్ చేసాను





తకిట తకఝం  పాట సాహిత్యం

 
చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జావేద్ ఆలీ

తకిట తకఝం  తకిట తకఝం
పలికెనే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం 
మెరిసెనే నా కల్లలో

గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు
వందేల్ల ఊపిరికై నీ పేరు రాసివ్వు 
రెప్పనార్పె కన్నుకా అలవాటునాపావు 
ఇంత అందం లేదని రుజువు చేసావు 

తకిట తకఝం  తకిట తకఝం
పలికెనే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం 
మెరిసెనే నా కల్లలో

నెమలి కన్నె కుంచె పట్టి 
గీసెనె నీ కన్నులే
ఓ తుమ్మెదలు తెగ కొల్లగొట్టి 
తేనె దాచిన పెదవులే
చప్పుడయ్యె గుండెకా అలవాటునాపావు 
ఆపలేవే నన్నిక నా ప్రాణమయ్యావు

తకిట తకఝం  తకిట తకఝం
పలికెనే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం 
మెరిసెనే నా కల్లలో

నిన్ను చూసిన ఈ క్షణానికి
పచ్చబొట్టయ్యానులే
నువ్వు విడిచె శ్వాసలోన
గాలిపటమయ్యానులే

కల్లగుంతలు కట్టినా 
నా అడుగు నీ వెంటే
ఒక్క మాటలో చెప్పనా 
నువ్వేలె నేనంటె

తకిట తకఝం  తకిట తకఝం
పలికెనే నా గుండెలో
ఏడు రంగుల ప్రేమ ఖనిజం 
మెరిసెనే నా కల్లలో




Break up పాట సాహిత్యం

 
చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: సింహా, ధనుంజయ్

Break up



తకిట తకఝం (Remix) పాట సాహిత్యం

 
చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జావేద్ ఆలీ

తకిట తకఝం తకిట తకఝం 
పలికెనే నా గుండెలో
కలలు సహజం అలలు సహజం 
చేరువయ్యే చెలిమిలో

పుస్తకం నేను నా పాటమే నువ్వు 
ప్రశ్ననే నేను నా బదులువే నువ్వు 
రెప్ప తన కనుపాపనె కాసే పరీక్షల్లే
ఈ వంద జన్మల ప్రేమకై 
ఇది నా నిరీక్షణలే

తకిట తకఝం తకిట తకఝం 
పలికెనే నా గుండెలో
కలలు సహజం అలలు సహజం 
చేరువయ్యే చెలిమిలో

క్షణముకెన్ని రోజులో
నా పక్కనుంటె నువ్విలా
రేయికెన్ని రంగులో
నా నిదురనే చెరిపేంతలా

పెదవి తన చిరునవ్వునే మోసే పరీక్షల్లే
నీ వంద జన్మల ప్రేమకై ఇది నా నిరీక్షణలే

తకిట తకఝం తకిట తకఝం 
పలికెనే నా గుండెలో
కలలు సహజం అలలు సహజం 
చేరువయ్యే చెలిమిలో

ఆగడాన్నె మరిచిపోనా 
నిన్ను నడిపిస్తూ ఇలా
అలసిపోని పరుగునవనా
నిన్ను గెలిపిస్తూ ఇలా

ప్రేమ తన హ్రుదయానికై రాసే పరీక్షల్లే
నీ వంద జన్మల ప్రేమకై ఇది నా నిరీక్షణలే

తకిట తకఝం తకిట తకఝం 
పలికెనే నా గుండెలో
కలలు సహజం అలలు సహజం 
చేరువయ్యే చెలిమిలో

Palli Balakrishna Tuesday, August 15, 2017



చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నాగార్జున , రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి, అనసూయ, అనుష్క 
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కుసరాల
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 15.01.2016



Songs List:



అరె డిక్క డిక్క డుం డుం పాట సాహిత్యం

 
చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అక్కినేని నాగార్జున, ధనుంజయ్, మోహన భోగరాజ్

అబ్బబబ్బ వాసివాడి తస్సాదియ్య
అది లెక్క
హెలొ హెలొ మైక్ టెస్టింగ్
1 2 3
అ వస్తుంది వస్తుంది
ఓ కె స్టార్ట్
డొంగ డొంగ డొంగ్ డొంగ్
డొంగ డొంగ డొంగ్ డొంగ్
డొంగ డొంగ డొంగ్ డొంగ్
ఎ పాడండె
డొంగ డొంగ డొంగ్ డొంగ్
డొంగ డొంగ డొంగ్ డొంగ్
డొంగ డొంగ డొంగ్ డొంగ్
ఏస్కొ

మొంత లోకల్లొ ఊరిస్త ఉంటె
ఒ సుక్క ఏసెయ్యరొ
కరెచ్ట్
ఒంటిలొ వేడి తన్నేస్త ఉంటె
ఓ పట్టు పట్టేయరో
రైటొ
కల్లు కోసం ఒచ్చినోడు
ముంత దాచి పెట్టుకోడు
కల్ల ముందు అందం ఉంటె
తస్సదీయ తప్పుకోడు
సంబరాలు చేసుకోరె
సొగ్గాడె చిన్ని నాయనా
హొయ్

అరె డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం (2క్ష్)

అబ్బబబ్బ ఎం ఊప్తున్నారె
తుర్ర్ర్ర్ర్ర

యొ యొ యొ యొ యొ యొ
యె యె
యొ యొ యొ యొ యొ యొ
యె
అరె మూడొచినప్పుడె
చింగిలాల్లొ
నువ్ గోడెక్కి దూకరొ
చింగిలాల్లొ
మరి నాలాగ ఎవ్వడు
చింగిలాల్లొ
నీకు బొట్టెట్టి చెప్పడు
చింగిలాల్లొ
అరె గొంతులోకి జారుతున్న
ఒక్కొక్క చుక్క
గంతులేసి ఆడమన్నదె
అరె పుట్టు మచ్చ చూశగానె
లేని పోని ఉక్క
చుట్టు ముట్టి చంపుతున్నదె
గంప గుట్టకొస్తవ
గాజుల్ని తెస్తను
పంపు షెడ్డు కొస్తవ
పట్టీలు తెస్తను
వంగ తోటకొస్తనంటె
రాసి ఇస్త వీలు నామ
హొయ్

ఒయ్ వస్తవ
అక్కడ్ర ఇక్కడ్ర అంటున్నవ్
ఇంతకి ఎంచేత్తవేంటి
ఇంకేం ఉంది
డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
అరె డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం

గోడ చాటుకెల్లి
ఆడ ఈడ గిల్లి
డిక్క డిక్క డుం డుం

అరె ఆరె ఆరె
కుర్రోడు సూపరొ
చింగిలాల్లొ
బోలెడున్నాది మ్యాత్తరొ
చింగిలాల్లొ
పాంతు చెక్కాడు చూడరొ
చింగిలాల్లొ
ఇంక తగ్గేది లేదురొ
అరె తేనె తీగ కుట్టినట్టు
చెప్పలేని చోట
నొప్పి నొప్పి నొప్పిగున్నది
అరె లేని పోని కొరికేదొ
రంకలేసుకుంటు
రయ్యి రయ్యి రయ్యి మన్నది
ఆవలింతలన్నవె రావేంతి
ఇప్పుటు
కౌగిలింత ఒక్కటె
కావలి ఇప్పుడు
ముట్టుకుంటె కందిపోయె
అందం ఉన్న చిన్నదాన

అగ్గది ఇప్పుడు మొదలవ్ద్ది చూడు
ఏంటది
అరె డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
డిక్క డిక్క డుం డుం
అంటె
అరె మోగిపోద్ది డప్పు
నిప్పు మీద ఉప్పు
డిక్క డిక్క డుం డుం



నిమిషంలొ పడగొట్టు
పైవాడె నీజట్టు
నిను తాకలేరు ఒట్టు




నీ నవ్వే హాయిగా వుంది పాట సాహిత్యం

 
చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజి
గానం: శ్రేయ ఘోషల్, ధనుంజయ్

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా
అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది

ప్రతిక్షణమూ మనసుపడీ
కలలుకనే నేనే అర్ధం కానా
రుస రుసలే చూపిస్తున్న
నను దూరం చేస్తూవున్నా
నాకోసం ఓ క్షణమయినా
ఆలోచిస్తే చాలన్నా

నిన్నల్లో ఊపిరి నువ్వే
నా రేపటిలో ఆయువు నువ్వే
నీకోసమే నే మారన
నీతోడిలా నాతోడుగా వుంటే
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది

తడబడితే పెదవులిలా
కనపడదా నాలో నీపై ఆశ
నీ చల్లని మాటల కోసం
లోలోపల ఎదురే చూసా
నీ ముద్దుముచ్చట కోసం
పడిగాపులు ఎన్నో కాసా

చుక్కల్లో జాబిలి నువ్వే
నా గుండెల్లో వెన్నెల కావే
నీ శ్వాసలో ఈ గాలిలా
నూరేళ్ళిలా నే వుండిపోతాలే
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ
ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా
అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు
హొ హొ హొ హొ హొ హోహో



వస్తానె వస్తానె పాట సాహిత్యం

 
చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్, కౌశల్య

ఏనాడొ రాసున్నాదె
కనుకె నువ్ తోడయ్యావె
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
హో ఓ
హొయ్ హొయ్ హొయ్ హొయ్
జగమేలె సంబరమేలె
నీ జతలొ నేనున్నాలె
ఈ జన్మకు నాకింకేం కావాలె
నిదరెందుకే
నిజమెందుకె
నీ కలల గాలి
నాకు హాయి ఊయలె
ఎ వస్తానె వస్తానె
నీ వెంటే వస్తానె
వస్త వస్త వస్తానె
నీ వెంటె వస్తానె
వస్తానె వస్తానె
నీ వెంటే వస్తానె
వస్త వస్త వస్తానె
నీ తోనె వస్తానె

హో నినుగాని కలవక పోతె
అసలేమయ్యేదొ ప్రానం
హో నీ అడుగున అడుగవ్తుంటె
తెలియదులె కాలం దూరం
ప్రపంచమె ఒ కొంచమై
నీల మారి
ప్రతి క్షనం సుమనోహరం
ఊఒ ప్రతి పుట్టుకలొ నిను కట్టుకొనేల
అడిగా బహుమానం

వస్తానె వస్తానె
నీ వెంటే వస్తానె
వస్త వస్త వస్తానె
నీ తోనె వస్తానె

నీతోనె ప్రతి ష్రీకారం
వద్దంట వర్జం వారం
ఆకాసం నా మమకారం
అది నీకేలె బంగారం
హొ దేహం ప్రానం అన్ని సగం
నువ్ లేకుంటె
సగం సగం నా జీవితం
నేనత సూన్యం నా సంతోషం
అంతా నీ సొంతం
వస్తానె వస్తానె
నీ వెంటే వస్తానె
వస్త వస్త వస్తానె
నీ తోనె వస్తానె
వస్తానె వస్తానె
నీ వెంటే వస్తానె
వస్త వస్త వస్తానె
నీ తోనె వస్తానె

ఏనాడొ రాసున్నాదె
కనుకె నువ్ తోడయ్యావె
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
హో ఓ
నిదరెందుకే
నిజమెందుకె
నీ కలల గాలి
నాకు హాయి ఊయలె
హె వస్తాలె వస్తాలె
నీ వెంటే వస్తాలె
వస్తా వస్తా వస్తాలె
నీ వెంటే వస్తాలె
వస్తాలె వస్తాలె
నీ వెంటే వస్తాలె
వస్తా వస్తా వస్తాలె
నీ తోనె వస్తాలె





ఉంటాలె ఉంటాలె పాట సాహిత్యం

 
చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మాళవిక

చిరుగాలిల నలువైపుల
నీ హాయి స్పర్ష నను వీడిపోదులె
ఉంటాలె ఉంటాలె
నీ వెంటె ఉంటాలె
ఏనాడైన ఎప్పటికైన
నీతొ ఉంటాలె
ఉంటాలె ఉంటాలె
నీ వెంటె ఉంటాలె
నేడొ రేపొ ఏనాడొ
నీ జంటై ఉంటాలె

ఏనాడొ రాసుందేలె
కనుకె నే తోడైయ్యానె
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
చిరునవ్వుల తిరునాల్లాంటి
నీ ప్రేమను చవి చూసాలె
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
చిరుగాలిలా ననువైపులా
నీ హాయి స్పర్ష నన్ను వీడిపోదులె

ఉంటాలె ఉంటాలె
నీ వెంటె ఉంటాలె
ఏనాడైన ఎప్పటికైన
నీతొ ఉంటాలె
ఉంటాలె ఉంటాలె
నీ వెంటె ఉంటాలె
నేడొ రేపొ ఏనాడొ
నీ జంటై ఉంటాలె




అద్ధిర బన్నా పాట సాహిత్యం

 
చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అనూప్ రూబెన్స్, దేవ్,  ధనుంజయ్, రఘురామ్, సంపత్, లోకేష్

అద్ధిర బన్నా
అద్ధిర బన్న పట్టు పట్టు
పడచులంత చుట్టు ముట్టు మన్మదుడె వచ్హినట్టు
మంత్రమేసి లాగినట్టు
దోర మీస గట్టు
అరె తెల్ల పంచ కట్టు
వీడి చూపె కనికట్టు
పిల్ల పడకపోతె ఒట్టు

అద్ధిర బన్నా
అద్ధిర బన్న పట్టు పట్టు
పడచులంత చుట్టు ముట్టు మన్మదుడె వచ్హినట్టు
మంత్రమేసి లాగినట్టు

అద్ధిర బన్న బంగారజ
సొగ్గాడికేర తగ్గడులేర
కన్నె పిల్లల సుర్రు సుమ్మెర
కొంటె చేష్టలె దుమ్ము దుమ్మెర
అరె పాపలున్న ఇల్లు
అరె నీకవి అత్తిల్లు
నిను మెచ్హె వాకిల్లు
ర రమ్మన్నవి వెల్లు

అద్ధిర బన్నా
అద్ధిర బన్న కొట్టు కొట్టు
పిడికిలిభిగ పట్టి కొట్టు
పదీతె ఇక లేవనట్టు
మల్లెప్పుడు పుట్టనట్టు
ఎందరున్న చుట్టు




సోగ్గాడే చిన్ని నాయనా పాట సాహిత్యం

 
చిత్రం: సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: సత్యయమిని, నూతన్ మోహన్, వినాయక్

(ఈ పాట నాగేశ్వరరావు నటించిన ఆస్తిపరులు (1966) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు)


అరేయ్ చెక్కెరకేళి చిన్నోడే
చుక్కలు చూపే చందురుడే
సుర్రు మంటూ వచ్చాడొచ్చాడే ఏ

హే గంధము గట్రా పూయండే
విందులు సిద్ధం చెయ్యండేయ్
వున్నదంతా వడ్డించేయండేయ్ ఏ

కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే
పట్టి పట్టి నన్నే చూసి ఇట్టా కవ్విస్తూ ఉంటే
ఎట్టా తప్పుకుంటా సెప్పండే ఏ ఏ ఏ

సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయనా వీడు సిగ్గులెక్క యెట్టినాడు సోగ్గాడు సోగ్గాడు

చూపు కలిపాడంటే మనసు దోచేస్తాడే
మాట కలిపాడంటే మౌల్డ్ -ని చేసేస్తాడే
అర్రెర్రేర్రీ అయ్యో ఆఅవలించామ ఆశ లెక్కెడతాడే
మంచోడమ్మా మంచోడనుకుంటే
అడ్డెడ్డెడ్డే మంచాలేక్కి మల్లెలు చల్లాడే

అదిరబాన్న్న అప్సరలంతా వెంట వెంట పడుతూవుంటే
దుడుకెట్టా దాక్కుంటాదే ఏ ఏ ఏ ఏ

సోగ్గాడే సోగ్గాడే సోగ్గాడే
సోగ్గాడే సోగ్గాడే సోగ్గాడే
సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడు

జిల్లా మొత్తం మీద ఇలాంటోడే లేడే
పిల్లాడప్పటినుండి పిల్లనగ్రోవుదాడే
నవ్వే కవ్వం చేసి ప్రాణం చిలికేతాడే
అన్యం పుణ్యం తేలేదనుకుంటే
అడ్డెడ్డెడ్డే అన్ని అన్నిచుసేతున్నాడే

ఒప్పుల కుప్ప ఒంపుల తిప్పా
సోకులా దెబ్బ ముద్దుల డబ్బా
నాకేం తెలుసు ఇది తప్పా హే హే హే

సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడు



Palli Balakrishna Friday, July 28, 2017

Most Recent

Default