Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "K. Anil Kumar"



చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: శ్రీకాంత్, స్నేహ, సునీల్, కె.విశ్వనాధ్ 
కథ, స్క్రీన్ ప్లే, మాటలు (డైలాగ్స్): ముళ్ళపూడి వెంకట రమణ
దర్శకత్వం: బాపు
అసిస్టెంట్ డైరెక్టర్: నాని (హీరో)
నిర్మాతలు: కె.అనిల్ కుమార్, కె.నాగేంద్ర బాబు
బ్యానర్స్: అంజనా ప్రొడక్షన్స్ , శ్రీ క్రియేషన్స్
విడుదల తేది: 29.04.2005



Songs List:



శతమానం భవతి పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

శతమానం భవతి 



నీ వాలు జడ పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు, సునీత ఉపద్రష్ట

పల్లవి:
చందమామ లాంటి మోము
నువ్వు పూవ్వు లాంటి ముక్కు
దొండ పండు లాంటి పెదవి
కలువపూల వంటి కళ్ళు
జామపండులాంటి బుగ్గ
బెల్ల ముక్క లాంటి గడ్డం
వలపు శంఖమంటి కంఠం
ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో
యవ్వనాల నవనిధులు
కవ్వించి ఊరించి చంపేవన్నీ
ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివే
వెనకనెందుకు ఉన్నావే జడా?

ఆ...ఆ బుగ్గలు సాగదీస్తావ్
ముక్కుని పిండుతావ్
పెదవులు జుర్రుకుంటావ్
గడ్డాన్ని కొరుకుతావ్
ముద్దులు గుద్దులు గిచ్చుళ్లు నొక్కుళ్లు
అదేమిటంటే ఆరళ్లు గీరళ్ళు
శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావనే
ఇలా.. వెనకాల ఉన్నా
నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్క కనిపెడుతున్నా
అవసరమైతే పని పడుతున్నా

ఓ వాలు జడా మల్లెపూల జడా
ఓ పాము జడా సత్యభామ జడా
నువలిగితే...నాకు దడా
ఓ పట్టు జడా రసపట్టు జడా
బుసకొట్టు జడా నసపెట్టు జడా
ఇప్పుడేందుకే ఈ రగడా....

ఓ వాలు జడా మల్లెపూల జడా
ఓ పాము జడా సత్యభామ జడా

చరణం: 1
వీపుకి మెడకి భుజములకి తగు అందం తెచ్చే జడా
ఈ తగవులేలనే జడా
కులుకుల నడుముకి వెనకన తిరుగుతు కళకళలాడే జడా
నను కనికరించవే జడా
పిరుదుల బిరుదుల జడగంటలతో జగతికి చాటే జడా
నా పొరపాటేమే జడా
అత్తరి ఇత్తర అనుమానాల తత్తర బిత్తర జడా
ఎద కత్తిరించకే జడా..ఆ ..ఆ

కనికట్టు జడా కనిపెట్టు జడా
పనిపట్టు జడా..ఆ..పనిపెట్టు జడా
నిను విడువని ప్రేమికుడా....

చరణం: 2
వడిసేలల్లే తిప్పితే జడా గుండెలోన దడదడా
ఏ గుబులు రేపకే జడా
నడుము తిప్పుడూ నాగస్వరానికి నాగుపామువే జడా
నగుమోము చూపవే జడా
జెడ కోలాటం సరసమె కానీ జగడము కాదే జడా
నను సరసకు రానీ జడా
జెడని దువ్వని పొగడని మొగుడు జఢపదార్ధమే జడా
నిను దువ్వనీయవే జడా...ఆ..ఆ

కనువిందు జడా నను పొందు జడా
సరసాల జడా ఇక చాలు జడా
ఏనాటికి నీవాడా....జజడాం జగడ జఝడాం...




ఆగడాలు పాగడాలు పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు, కల్పన

ఆగడాలు పాగడాలు జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే

ఆగడాలు పాగడాలు జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు

చరణం: 1
భార్య వేచి ఉండడాలు మొగుడు రాకవోపడాలు
కోపగించు కోవడాలు కారణాలు చెప్పటాలు
గొంతుచించు కోవటాలు సమర్ధించు వాదాలు
గోడవపెంచుకోవడాలు గోల చేసుకోవడాలు
అరవడాలు ఉరమడాలు కసరడాలు విసరడాలు
చిలిపి చిలికి గాలి వానల ఆవడలు
వాయుగుండం పడటాలు పొంపుదుండం ఆవడాలు
తెల్లవారుజామునే తీరని తాకడాలు
సోరిలు చెప్పటాలు సరే అనుకోవటాలు
అసలు ఏం జరగనట్టు తెల్లారిపోవడలు

చరణం: 2
ఫోను ఏదో రావడాలు  నవ్వుతూ మాట్లాడడాలు
అనుమానం రావడాలు తిరుగుటం అవడాలు
ఆరాలు తీయడాలు కారాలే నూరడాలు
ఏనాటికావాదాలు ఏకరువులు పెట్టడాలు
తిట్టడాలు నెట్టడాలు ఒకరినొకరు కట్టడాలు
రోజు రోజు మాటలాగిపోవడాలు
తిక్క తిక్కగా ఉండడాలు పక్క మంది చేయటాలు
బ్రహ్మయ్య ఉండటాలు మన్మధుని తిట్టడాలు
సోరి అని అనుకోవటాలు సర్దిచెప్పుకోవటాలు

చరణం: 3
చీరకట్టుకోవడాలు తెమరకుండపోవడాలు
మొగుడు ముట్టుకోవడాలు టైందాటిపోవడాలు
రైలు వెళ్లిపోవడాలు రోడ్ మీద ఎగరడాలు
తెల్లముఖం వేయడాలు ఇంటిముఖం పట్టడాలు
గంటసేపు తిప్పడాలు కంటినీళ్లు కార్చడాలు
అలగడాలు తలగడాలు తలవాదాలు
అర్ధరాత్రి దాటడాలు భద్రకాళి అవడాలు
నిద్రమానుకోవడాలు నిప్పుమీద చిమడాలు
సారీలు చెప్పడాలు చల్లబడి పోవడాలు
గుద్దులాట నవ్వులాటై ముద్దులాట ఆడుకోవడాలు

ఆగడాలు పాగడాలు జగడాలు
ఐ యామ్ సారీ...
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఐ యామ్ సారీ.. ఐ యామ్ సారీ..
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఐ యామ్ సారీ సారీ...
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఐ యామ్ సో సారీ...





మా ముద్దు రాధమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సునీత ఉపద్రష్ట

పల్లవి:
మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీమువ్వ గోపాల గీతాలు
ఆ చేయి ఈ చేయి తాళాలూ
అనురాగాలలో గట్టి మేళాలూ...

మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీ మువ్వ గోపాల గీతాలు
ఆ చేయి ఈ చేయి తాళాలూ
అనురాగాలలో గట్టి మేళాలూ

మా ముద్దు రాధమ్మ రాగాలే...

చరణం: 1
నువ్వందం నీ నవ్వందం
తల్లో మల్లె పువ్వందం
కట్టందం నీ బొట్టందం
నువు తిట్టే తిట్టే మకరందం

సూరీడు చుట్టూ భూగోళం
రాధమ్మ చుట్టూ గోపాళం
సూరీడు చుట్టూ భూగోళం...
రాధమ్మ చుట్టూ గోపాళం...

నడుము ఆడితే కధాకళి
జడే ఆడితే కూచిపూడి
నువ్వే ఆడితే ఫలానా తతిమ్మాది తిల్లానా

మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీ మువ్వ గోపాల గీతాలు
ఆ చేయి ఈ చేయి తాళాలూ
అనురాగాలలో గట్టి మేళాలూ

చరణం: 2
కూరలు తరిగే కూరిమి ఇష్టం
చేతులు తెగితే మూతులకిష్టం
ముద్దలు కలిపి పెడితే ఇష్టం
ముద్దులదాకా వెడితే...

వలచిన వారి పరాకు అందం
గెలిచిన సతిపై చిరాకు అందం
కొపతాపముల కోలాటంలో మనసు ఒక్కటే మంగల్యం
కస్సుబుస్సుల కామాటంలో కౌగిలిగింతే కళ్యాణం

ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలార మీరూ
ఓటమి గెలుపుల ఆటుపోటుల ఆలుమగల సంసార జలధిలో
ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలార నేడూ...



తొలి కోడి కూసేను పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ముళ్ళపూడి వెంకట రమణ
గానం: మురళీధర్, చిత్ర 

పల్లవి:
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
నాదు మొరకాస్త ఆలించి నిదురపో
అందగాడా నిదురపో చందురూడా నిదురపో
అందగాడా నిదురపో చందురూడా నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో

చరణం: 1
ఇల్లంతా కడగాలి కళ్లాపి చల్లాలి
ముగ్గులు పెట్టాలి గోపాలుడా
కాఫీలు కలపాలి టిఫినీలు చెయ్యాలి
చెంగు విడిచిపెట్టు గోపాలుడా
చెంగు విడిచిపెట్టి సెలవిచ్చి పంపితే
మాపటేళకు మళ్లీ వస్తాను
తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టి
గుమ్ము గుమ్మను కౌగిలిస్తాను
గుండెలో వలపంతా గుమ్మరిస్తాను
చెంగు వదలర సామి గోపాలుడా
సరుసుడ నా సామి గోపాలుడా

తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో

చరణం: 2
సుప్పనాతి సూరీడొచ్చెను
వెన్నెలంతా ఎర్రాబారెను
మల్లెలన్నీ నల్లాబోయెను కలువకన్నియ
కందీపోయెను కమిలిపోయెను కానుకో
కంటినిండా నిదురకోసం
కాచి ఉన్నది చూసుకో రసికరాజ నిదురపో
ధిక్తన ధిక్తన ధిక్తన ధిన ధిక్తన ధిక్తన ధిక్తన
మూడు జాములు తిరగాలేదు
నాలుగోది పొడవాలేదు
తొందరెందుకు సూరీడా ఎందుకొస్తివి సూరీడా
నిన్నెవరు పిలిచారు సూరీడా
నీకిక్కడేమి పని సూరీడా
నీకెప్పుడేమి పని సూరీడా...
పోరా పోరా సూరీడా రారా రారా సూరీడా
పోరా పోరా...





గ్రహణం పట్టని పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు

గ్రహణం పట్టని 

Palli Balakrishna Thursday, February 22, 2018



చిత్రం: అల్లరి బుల్లోడు (2005) 
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
నటీనటులు: నితిన్ , త్రిష , రతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: అనిల్ కుమార్. కె
బ్యానర్: మారుతి కంబైన్స్
విడుదల తేది: 15.09.2005



Songs List:



అందమంటే ఎవరిదీ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) 
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బి. చరణ్, సునీత

ఔరా ఔరౌరా..
అందమంటే ఎవరిదీ నీదికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
తెలివితేటలెవరివి నీవికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
ఆవు పాల లాంటి నవ్వు
ఆవగింజలాంటి నడుము
ఆయుదాల లాంటి కళ్లు
అధ్బతాల ఇల్లు ఒళ్లు
అంతరిక్షమంటి సొగసు
అంతకంటే గొప్ప మనసు
అబ్బా….
అబ్బా నీ దెబ్బకుప్పితబ్బిబ్బయిపోతున్నా
ఇంత హాయి మోయడం
నా వల్లకాక కాకకాక కాకకాక కాకకాక
ఔరా ఔరౌరా..
అశ కవితలెవరివి నీవికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
అదరగొట్టుడెవరిది నీదే కాకా……

పూవులన్ని నడచి వచ్చి
తేనె తోటి కాళ్లు కడగవా
తమను కొప్పులోన తురమమంటు అడగడానికి
కాక కాక
పక్షలన్నీ ఎగిరివచ్చి
పల్లకీగా నిన్ను మోయవా
వాటి చిట్టి రెక్కలన్నీ ధన్యమవ్వడానికి
కాకా కాకా
పూర్వకవులు అందరు పునర్జమ్మ పొందరా
నిన్ను చూసి కవితలన్నీ తిరగరాయడానికి
నాల్గు తలలు ఎత్తుతూ
నేలపైకి చేరడా
బ్రహ్మగారు తనగొప్పను చాటుకోవడానికి
పువ్వుని కాక నేను పక్షిని కాకా
బ్రహ్మను కాక నేను కవినీ కాకా
ఇంకేమవుతానే నీ దాసున్ని
కాక కాకకాక కాకకాక కాకకాక కాకకాక
హా..
ఔరా ఔరౌరా..
పచ్చి నిజాలెవరివి నీవికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
రెచ్చగొట్టుడెవరిది నీదేకాకా…..

చెట్టుకొమ్మ నిన్నుచూసి కాగితమై అవతరించగా
నీ చేతిరాత తాకి పులకిరంచడానికి
కాకా కాకా
ఏటి నీరు నిన్ను చూసి విరహంతో ఆవిరవ్వదా
తిరిగి వాన జల్లులాగా నిన్ను తడపడానికి
కాకా కాకా
పిల్లగాలి ప్రేమగా ఊపిరల్లే చేరదా
గుండెలోన గాలిమేడ కట్టకోవడానికి
మాటలన్నీ ముద్దుగా నిన్నుకోరి చేరవా
పాటలై తమ కీర్తిని పెంచుకోడానికి
చెట్టును కాను ఏటి నీటిని కాను
గాలిని కాను పట్టి మాటను కాను
ఇంకేమవుతారా నీ ప్రియురాలిని
కాకకాక కాకకాక కాకకాక కాకకాక కా
ఔరా ఔరౌరా..

పిచ్చి ప్రేమ ఎవరిది మనదికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
ప్రేమ పిచ్చి ఎవరిది మనదికాక
కాకకాక కాకకాక కాకకాక కాకకాక
ఆవు పాల లాంటి నవ్వు
ఆవగింజలాంటి నడుము
ఆయుదాల లాంటి కళ్లు
అధ్బుతాల ఇల్లు ఒళ్లు
అంతరిక్షమంటి సొగసు
అంతకంటే గొప్ప మనసు
అబ్బా…. అబ్బా
నీ దెబ్బకుప్పితబ్బిబ్బయిపోతున్నా
ఇంత హాయి మోయడం నా వల్ల
కాక కాక కాకకాక కాకకాక కాకకాక కా



నొప్పి నొప్పి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) 
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్ , శ్రేయఘోషల్

నొప్పి నొప్పి - ఏమి నొప్పి
నిన్ను చూడకుంటే గుండె నొప్పి
నొప్పి నొప్పి - ఏడ నొప్పి
నిన్ను చేరకుంటే ఈడ నొప్పి
కన్ను నువ్వు కొట్టకుంటే కంటి నొప్పి
నన్ను వీడి వెళ్ళిపోతే కాళి నొప్పి
ఉన్నమాట చెప్పుకుంటే చెప్పు నుండి కొప్పు దాక
నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి

నొప్పి నొప్పి - ఏమి నొప్పి
నిన్ను చూడకుంటే గుండె నొప్పి
నొప్పి నొప్పి - ఏటి నొప్పి
మాటలాడకుంటే గొంతునొప్పి
నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి
నిన్ను కౌగిలించ కుంటే ఛాతి నొప్పి
నీడ లాగ తిప్పకుంటే ప్రేమనుండి పెళ్లిదాక
నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి

ఆడపిల్ల కెప్పుడు తప్పనే తప్పదు
బుగ్గలోన పుట్టెడంత నొప్పి
అందగాడి కెప్పుడు తప్పనే తప్పదు
గోటిలోన గంపెడంత నొప్పి
గుచ్చేటి ముళ్ళు నింక ముళ్ళుతోటి తీసుకో
పుట్టేటి నొప్పినింక నొప్పితోటి తీర్చుకో
గుచ్చేటి ముళ్ళు నింక ముళ్ళుతోటి తీసుకో
పుట్టేటి నొప్పినింక నొప్పితోటి తీర్చుకో
గోటి తోటి బుగ్గగిల్లు నీకు నాకు తగ్గుతుంది
నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి

నొప్పి నొప్పి - ఏడ నొప్పి
నిన్ను చూడకుంటే గుండె నొప్పి
నొప్పి నొప్పి - ఏమి నొప్పి
నిన్ను చేరకుంటే ఈడ నొప్పి

హాస్పిటల్ కెళ్లినా ఆగనే ఆగదు 
ఐస్ లోనె అందమైన నొప్పి
అమృతాన్ని తాగినా ఆగనే ఆగదు
మనసులోన ముచ్చటైన నొప్పి
ఈ వ్యాధి కెప్పుడైన నాటువైద్యమొక్కటే
ఈ మంట కెన్నడైన నోటిమందు ఒక్కటే
ఈ వ్యాధి కెప్పుడైన నాటువైద్యమొక్కటే
ఈ మంట కెన్నడైన నోటిమందు ఒక్కటే
మూడు పూట్ల ముద్దు మాత్ర వేసుకుంటె చేరదంట
నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి

నొప్పి నొప్పి - ఏమి నొప్పి
నిన్ను చూడకుంటే గుండె నొప్పి
నొప్పి నొప్పి - ఏడ నొప్పి
నిన్ను చేరకుంటే ఈడ నొప్పి
నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి
నిన్ను కౌగిలించ కుంటే ఛాతి నొప్పి
ఉన్నమాట చెప్పుకుంటే చెప్పు నుండి కొప్పు దాక
నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి



దాచుకుంటే ధనా ధన్ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) 
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్

దాచుకుంటే ధనా ధన్





త్రిషా అచట ఇచట పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) 
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్. యమ్.కీరవాణి, చిత్ర

త్రిషా అచట ఇచట



మగవాడ మతిపోయెరా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) 
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, శ్వేతా పండిట్

మగవాడ మతిపోయెరా
మనసంతా నీవాయరా
ఒకటోసారి కోపించా
రెండోసారి తపించా
వేరోసారి వేదించా మరివో సారి మోహించా
మొత్తం మీద నిన్నే ప్రేమించా

మగవాడ మతిపోయెరా
మనమాడే ఆటుందిరా

పోకిరోడు నేడు కాదు
ప్రయోజకుడుగా మారగా
అల్లరోడు నేడు నను అల్లే తోడు అనిపించగా

అమాయకుడు వీడు
అమ్మాయి కుడిగా మారగా

నెమ్మదస్తు డొకడు బహు జబర్దస్తుడిగా చేరగా
అయ్యింది ముఖపరిచయం
ఇక అవ్వాలి సుఖపరిచయం
చూపుల్లో తొలి పరిచయం
ఇది వలపుల్లో బల పరిచయం
నా పైకి లంఘించరా రారా
నియమాలే ఉల్లంఘించరా

మగవాడ మతిపోయెరా
మనసంతా నీవాయరా

నిప్పులేని మంట మరి పుట్టించింది నువ్వే కడట్
మబ్బు లేని వాన కురిపించాల్సింది నీ బాధ్యత

నేలలేని పంట అది పండించింది నువ్వే కదా
కూలీ లేని పనిలో శ్రమ పడాల్సింది నేనే సదా

రావాలి ఆ యోగమే
అది ఇరువురికి ఉపయోగమే
అందాల ఆరోహణే
ఇది విరహాల అవరోహణే
ఎంతెంతో ఆశించారా
చేతుల్తో సంభాసించరా

చినదాన చిటికేయనా
చిటికేసి చెలరేగనా




అటక మీద ఉందమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి బుల్లోడు (2005) 
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: జాస్సి గిఫ్ట్ , సునిది చౌహాన్

అటక మీద ఉందమ్మో

Palli Balakrishna Wednesday, February 21, 2018

చిత్రం: ఒట్టేసి చెబుతున్నా (2003)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: శ్రీకాంత్, శివాజి, కనిక దివ్య, అనిత పాటిల్, ఆశా షైనీ
కథ: ఉదయ రాజ్
మాటలు: చింతపల్లి రమణ
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: కె.అనిల్ కుమార్
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
ఎడిటర్: శ్రీకర ప్రసాద్
బ్యానర్: శ్రీ క్రియేషన్స్
విడుదల తేది: 11.04.2003


చిత్రం: ఒట్టేసి చెబుతున్నా (2003)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
గానం: గోపాల్, శ్రీనిధి


పల్లవి:
ఒట్టేసిచెబుతున్నా వింటున్నావా ఓ మైనా
నువ్వంటే నేనేనని
అడుగేసి వస్తున్నా ఎందాకైనా ఎవైనా
నీ వెంటే వుండాలని
తీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారం
నీవల్లే మారిందే నా జాతకం
అందిందమ్మో అనుబంధం ఏవో జన్మల ఋణబంధం
నీ ఒళ్ళో వాలిందే నా జీవితం

చరణం: 1
వెళ్ళేటిదారుల్లోన నీడుంటే చాలనుకుంటే
బంగరుమేడై కలిసొచ్చావే
వేచేటి కన్నుల్లోన కలలుంటే చాలనుకుంటే
కమ్మని నిజమై కనిపించావే
దీవెన చాలని అనుకుంటే దైవం అందెనే
పూజకు రమ్మని పిలుపిస్తే ప్రాణం పంచెనే
నా రాతే మార్చేసే నా గీతే దిద్దేసే
భామిని ఉండగ బ్రహ్మెందుకో

చరణం: 2
నీ లేతపాదాలంటే ధూళైతే చాలనుకుంటే
పాపిటతిలకమే చేశావమ్మా
నీ పెరటితోటల్లోన గాలైతే చాలనుకుంటే
ఊపిరిలో నను నిలిపావమ్మా
నాలో నేడే వెలిగిందే ఆశాదీపము
ప్రేమే మనకు అందించే ఆశీర్వాదము
నీ మెళ్ళో ముళ్ళేసి పల్లెల్లో ఇల్లేసి
జతపడి బ్రతకని జన్మెందుకో


Palli Balakrishna Tuesday, August 8, 2017

Most Recent

Default