-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Jenda"



చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, గండవరపు సుబ్బారావు 
గానం: యస్.పి.బాలు, ఉష, వందేమాతరం శ్రీనివాస్, కుమార్ షాను , వరంగల్లు శంకర్ 
నటీనటులు: అజ్జు, సుదీర్, శ్రవణ్, రోషన్, అకృతి (నూతన పరిచయం )
మాటలు: పూసల 
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: సత్యమూర్తి కోటమరాజు
విడుదల తేది: 02.10.2002



Songs List:



జండా పాట సాహిత్యం

 
చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి

ప్రజహితం తన విధానమంటూ
జ్వలించే జనించే యువ ప్రభాతం
సమాజ ద్రోహుల సమాధి చేయగా
ప్రతిజ్ఞ చేసే అశోక చక్రం
యజ్ఞగుండమై బుగ బుగలాడిన
జాతిపౌరుషం ఈ చైతన్యం
నిశ్చయ నిర్భయ హిమాలయమై
యువత గుండె గర్జించిన సమయం

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి

ఉరుముల మెరుపుల ఉద్రేకముతో
పిడుగై పడినది చేడుపై లాఠి
పిడికిలి బిగించి విజ్రుభించి
నేరస్తుల పాలిట ప్రళయ దూర్జటి
చీకటి కొండల చీడలా పెరిగిన
కీచక మూకల ప్రకంపం
శివం ఎత్తినది..కదం తొక్కినది
ఖాఖి కట్టిన జంజా పవనం

జండా
గర్జించినది జండా
గంభిరమైన జండా

ప్రచండ స్వభావ విప్లవ సింహం
అయ్యింది ప్రపంచ శాంతి కపోతం
సమాజ శిల్పం చెక్కగ నిలిచెను
తూఫాను గుండెల ప్రభాత దీపం
ప్రజా పీడకుల దురాగతాలకు
అరచాకాలకు సమూల చేదం
స్వదేశ విదేశ వినాశకులపై
ఉక్కుపాదముల ఉల్కాపాదం

జండా
విధి మార్చు జండా

అనలం అనిలం అజ్వం కలిసిన
రాజకీయ ప్రక్షాళన యగ్నం
న్యాయం చట్టం రెక్కలు కాగల
ధర్మ బద్ద రాజ్యాంగ విహంగం
ప్రపంచ భ్రమణం..సముద్ర చలనం
అతిక్రమించే యువ సంచలనం
ధరిత్రి పధమున త్రిమూర్తులు ఒకటై
శ్వాశత ప్రగతికి తపించు తరుణం

జండా
స్వతంత్ర భారతం జాతి పతాకం
దాల్చేను నేడీ విశ్వరూపం
మహా సముద్రం హిమగిరి శిఖరం
మరో ప్రపంచపు జయ సంకేతం
మానవాళికిది శుభపరిణామం
సహస్రాబ్ధికి సువర్ణఘట్టం
కాకుడదు ఇది ఇలలో స్వప్నం
నిలవాలి ఇది కలకాలం
జయ జయ ఘోషలు
రెప రెపలు కాగా
జండా ఎగిరెను గగన సీమలో
సూర్యచంద్రులకు ధీటుగ నిలిచి
ప్రకాశించినది ఆకాశంలో

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ట పెంచాలి




వదలం..వదలం.. పాట సాహిత్యం

 
చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశొక్ తేజ
గానం: శంకర్ మహదేవన్

జిస్ దేష్ మైన్ గంగ బెహెతి హై
ఇస్ భారత్ కే హం వారస్ హై

తాజ్ మహల్ మా ప్రేమకు గుర్తు
కాశ్మీరం మా కుంకుమ బొట్టు

తలవంచని మా పౌరుషాన్ని చూపించేదే ఎవరెస్ట్ 
చుక్కలు దాటిన మన చరిత్రని
కుక్కలు చింపిన విస్తరి చేస్తే
వదలం..వదలం..ఎవ్వరినైనా వదలం

కళ్ళకు రేబాన్ గ్లాసులున్నా
పగటి దొంగలను చూస్తుంటాం
కాళ్ళకు రీబాక్ షూస్ ఉన్నా
గుంట నక్కలను తొక్కేస్తాం
లవర్తో ఐ లవ్ యూ అని డే అండ్ నైట్ చెబుతున్నా
గుండె గుండేలో ఐ లవ్ యూ భారత్ అనే మాటాను జపిస్తాం
గోల్డ్ మెడల్స్ ఉన్నా.. జాబ్స్ ఇవ్వమని తిరగం
రూట్ చెప్పమని తల్లి తంద్రులను అడగం
ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నా చిరునవ్వుతో సరిచేస్తాం

but

దేశ సంపదను వీధి కుక్కలు పంది కొక్కులా తింటుంటే
పట్ట పగలు నిల దీసి అడుగుతాం
నిప్పుతోటి నిలువెల్లా కడుగుతాం
యూత్ మొత్తం యూనిఫాం లేని మిలటరీ అవుతాం
వదలం..వదలం..ఎవ్వరినైనా వదలం

పదవుల కోసమని ఒకే జాతిని
చీల్చే వాళ్ళని చీలుస్తాం
పులి చర్మాలే నిలువునా వొలిచేస్తున్నా
మానవ పులులను మన్నించం
శిలాఫలకలను వేస్తూ ప్రజలను భ్రమలో పెడితే భరించం
కులాల పేరిట కుంపటి పెట్టే కుళ్ళు పురుగులను క్షమించం
ఖాకి డ్రెస్ ల నీతిని కాలరాసి వేస్తుందే
సైనిక శక్తుల నెత్తురు శవపేటికలుగా దోచెస్తే
సహించబోమీ ఘోరం
సవ్యసాచులై ఎదిరిస్తాం

but

జరుగుతున్న ఈ దురాగతం
మీరు పట్టనట్టుగా చూస్తుంటే
స్వాతంత్రం వచ్చింది చాలని నత్తగుల్లలై పడుకుంటే
మీ సోమరి గుండెలలోన ఉరుముతూ మేలుకొలుపుతాం
వదలం వదలం ఎవ్వరినైనా వదలం



అఖండ భారత జాతి పాట సాహిత్యం

 
చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, వందేమాతరం శ్రీనివాస్

అఖండ భారత జాతి విముక్తికి ప్రభవించిన జండా
వందేమాతరం
దురాక్రమనపై పరాక్రమించిన చరిత్ర ఈ జండా
వందేమాతరం
ప్రపంచ శాంతికి ప్రభాతదీపం ప్రియ భారత జండా
వందేమాతరం

జండా
జై హింద్ అని ఎగరాలి
మన ప్రతిష్ఠ పెంచాలి

ఎగరవేయకు నన్ను గగనసీమకు
గౌరవం అను పేర గుండెమంట రేపకు
స్వతంత్ర దినోత్స్తవాన రక్షణ కవచాల వెనుక
జాతి ప్రసంగం చేసే నాయకులను చూడలేను
భారతీయ గౌరవాన్ని..తెలుగు జాతి మర్యాదని
కుక్కలు చింపిన విస్తరి చేస్తుంటే ఆపలేను
దేశ భద్రతను అమ్మే నీచుల శిక్షించలేను
రాజకీయ చదరంగ ఎత్తులను భరించలేను
అర్ధ శతాభ్దము పైన పోందా అవమానాలు
పైనుంచి ఇక చూడలేను జరుగుతున్న ఘోరాలు
స్వతంత్ర యోధులను తెల్ల దొరలు కాల్చినారు
స్వతంత్ర భారతిని నల్ల దొరలు కూల్చె నేడు
రెప రెపలు కావు ఇవి..రేపవల కన్నీళ్ళు
ధగ ధగలు కావు ఇవి..గుండె పగులు మంటలు

జండా ఆఆ
ఎందుకు ఎగరాలి
నేనుదుకు ఎగరాలి



కుశలమా ఓ నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: 
గానం: ఉష, కుమార్ షాను 

కుశలమా ఓ నేస్తమా అని పిలిచిందోయమ్మ కొమ్మల్లో చిలకమ్మా 



# పాట సాహిత్యం

 
చిత్రం: జండా (2002)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, వందేమాతరం శ్రీనివాస్

భోలోరే భోలోరే భాయ్

Palli Balakrishna Thursday, April 30, 2026

Most Recent

Default