Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Faria Abdullah"
Ravanasura (2023)



చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హరివర్ధాన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: రవితేజా , శుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ , దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా 
దర్శకత్వం: సుదీర్ వర్మ 
నిర్మాతలు: అభిషేక్ నామ, రవితేజా 
విడుదల తేది: 07.04.2023



Songs List:



Ravanasura Anthem సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: ట్రెడిషినల్ 
గానం: స్వాతి పీపుల్, నోవ్లిక్, హారికా నారాయణ్, హర్షవర్ధన్ రామేశ్వర్

Ravanasura Anthem



ప్యార్ లోన పాగల్ పాట సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: రవితేజా

ప్యార్ లోన పాగల్ 



వెయ్యిన్నొక్క పాట సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: అనురాగ్ కులకర్ణి 

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడల్
అయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

కర్మకాలి రావణుండు
నిన్ను చూడలేదు గానీ
సీత ఊసునే తలచునా త్వరపడీ

భీష్ముడున్న కాలమందు
నువ్వు పుట్టలేదు గానీ
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడీ

ఇంతగొప్ప అందగత్తె
ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
అరెరెరె ఇంతగొప్ప అందగత్తె
ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే

పొరపాటు బ్రహ్మది గాని
సరిలేనిదీ అలివేణీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

Hey Girl Come to Me Follow
Im Gonna Take You to the Top
Come on Feel Naa
I Like to Chit Chat
You are My Cutie Cat
Hey Baby Come Come
Hey Baby Come Come Love

అల్లసాని వారిదంత
అవకతవక టేస్టు గనక
వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడూ
అయ్యయ్యయ్యె
వరూధినిని కాక నిన్నే
వలేసుంటె కళ్ళు చెదిరి
విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడూ

ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగ కొదిలి
వెంటపడతారే
అరెరెరె ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే

ముసలాడి ముడతలకైనా
కసి రేపగలదీ కూన

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే





డిక్క డిషుమ్ పాట సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల  శ్యామ్ 
గానం: స్వాతి రెడ్డి, భీమ్స్ సిసిరోలియో, నరేష్ మామిడ్ల

హే లాలు పూలసెట్టు కింద
లబ్బరు గాజుల లిల్లీ
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హ లబ్బరు గాజుల లిల్లీకొచ్చే
జబ్బల రైకల లొల్లి
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే లాలు పూలసెట్టు కింద
లబ్బరు గాజుల లిల్లీ
లబ్బరు గాజుల లిల్లీకొచ్చే
జబ్బల రైకల లొల్లి

హే టిప్పరు లారీ ఒళ్ళు
టక్కరు పెట్టే దిల్లు
ఏ టిప్పరు లైట్లే కళ్ళు
లిక్కరు కంటే త్రిల్లు

హే గజ్జెలు కడితే ఏక్ బార్
గజ్జున మోగాలే తీన్ మార్
మార్ మార్ మార్ మార్

చిల్ లాకే మార్ మార్ మార్
ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే పుట్టగానే దిష్టి సుక్క
పెరుగుతుంటే మిల్కు సుక్క
పెద్దగైతే విస్కీ సుక్క
రింకులు ఓ రింకులు

హే బుగ్గ మీద పెండ్లి సుక్క
ఫస్ట్ నైట్ పక్కన సుక్క
సిందుతుంటే సెమట సుక్క
టింకులు ఓ టింకులు

హే రింగుల మీద రింగులు
పెట్టేటోడు సింగిలు
రంగుల మీద రంగులు
మార్చేస్తుంటారు కింగులు

ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

Palli Balakrishna Wednesday, April 5, 2023
Bangarraju (2022)



చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా
దర్శకత్వం: కె. కళ్యాణ్ కృష్ణ
నిర్మాతలు: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
విడుదల తేది: 14.01.2022



Songs List:



లడ్డుండ పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: నాగార్జున, ధనుంజయ్, మోహన భోగరాజు, నూతన మోహన్, హరిప్రియ

బాబు తబలా...
అబ్బాయ్ హార్మొనీ...
తానా న న న న
డాంటకు డ డ న

రాజు గారు
డాంటకు డ డ న అనగా ఏమి

హ హ హ హ హ
ఓరి బుడ్డోడ ఇంతకాలం తెలుసుకోకుండా ఏమి చేస్తున్నావురా? అడగాలి కదా!

డాంటకు డ డ న
బంగారు పాపలూ...

చెరుకు తోటలో చారెడు బియ్యం
వంగతోటలో మరదలి కయ్యం
లగెత్తి కొడితే  లడ్డుండ లడ్డుండ

మాటల్లోనే మల్లెల చెండు
చూపుల్లోనే కితకితలుండు
బంగార్రాజు కి జువ్విచ్చి జువ్విచ్చి

జువ్విచ్చి జువ్విచ్చి
జువ్విచ్చి జువ్విచ్చి

హో కంది సేనుకాడ డాంటకు డ డ న
కన్ను కలిపితే డాంటకు డ డ న
పంపు షెడ్డు కాడ డాంటకు డ డ న
పైట తగిలితే డాంటకు డ డ న
లడ్డుండ లడ్డుండ

జువ్విచ్చి జువ్విచ్చి
తిప్పమాకు మీసాలు వెయ్యమాకు వేషాలు
నీ నవ్వు అగరొత్తి నీ చూపు చురకత్తి
కొయ్యమాకు ఊచకోతలు
ఓ ఆయీ ఆయీ ఆయీ
రీలు రీలు రీలు రీలు
ఆహా ఇరగదీస్తున్నారు స్త్రీలు

మెరిసే బంగారు కళ్ళు
తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు

లడ్డుండ జువ్విచ్చు
లడ్డుండ జువ్విచ్చు

హే గడ్డి మేటకాడ డాంటకు డ డ న
అగ్గిరాసుకుంటే డాంటకు డ డ న
వంగ తోట కాడ డాంటకు డ డ న
దొంగచాటుగా డాంటకు డ డ న

కల్లని చూస్తే కలుపు పువ్వు
వలపులు చూస్తే పాపి కొండలు
పిల్లని చూస్తే లడ్డుండ ఇచ్చే లడ్డుండ

జువ్విచ్చి లడ్డుండ
జువ్విచ్చి లడ్డుండ
జువ్విచ్చి లడ్డుండ
జువ్విచ్చి ఇచ్చే లడ్డుండ





నా కోసం పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ
గానం: సిద్ శ్రీరామ్

కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలైందో
అంతగా నాకర్ధం కాలేదే
మెరుపులా నీ చూపేమందో
చినుకులా నాపై వాలిందో
మనసిలా నీవైపే తిరిగిందే
ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేశావు
మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావూ..

నాకోసం మారావా నువ్వూ...
లేక నన్నే మార్చేశావ నువ్వూ..

చరణం: 1
ఓ నవ్వులే చల్లావూ పంచుకో మన్నావూ
తొలకరి చిరుజల్లై నువ్వూ...
కళ్లకి దొరికావు రంగులా మెరిసావూ
నేలపై హరివిల్లా నువ్వూ..
నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా
నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా
మాటల్లోని మరాలన్ని మంచులాగ మార్చావో

నీకోసం మారానే నేనూ...
నిండు నూరేళ్ళు ఉండేలా నేనూ..

చరణం: 2
మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్నూ...
కన్నులే అడిగేలా చూపులే అలిసేలా
ఎదురుగా నిలిపావా నిన్నూ..
పైకే నవ్వేలా లోకం అంతా నువ్వేలే 
నాకే ఈవేళ నేనే నచ్చానే నీవల్ల
మోమాటాలే దూరం చేసే మాట నీకు చెప్పేలా...

నీ వెంటే ఉంటున్నా నేనూ..
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ..




వస్సివాడి తస్సాదియ్యా పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కళ్యాణ్ కృష్ణ
గానం: మోహన్ భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్ధన్ చావలి

నీకేమైంది బుజ్జీ
మూడు లేదు మాస్టారూ..
నీకేమైంది
ఏమైందంటే ఏం చెప్పమంటావ్

ఓయ్ బంగార్రాజు
నువ్వు పెల్లిచేసుకేల్లిపోతే బంగార్రాజు 
మా కింకెవ్వడు కొనిపెడతాడు కోక బ్లౌజు
నువ్వు శ్రీరాముడు వైపోతే  బంగార్రాజు
మా కింకెవ్వడు తీరుస్తాడు ముద్దు మోజు 
నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే బంగార్రాజు
మాకు కెట్టుకో బుద్దవ్వదు బొట్టు గాజు
నా చేతి గారి తిన్నప్పుడు బంగార్రాజు
పొగిడి పొగిడి చంపావు నువ్వారోజు
అరె కట్టిపూడి సంతలోన బంగార్రాజు 
నువ్వు తినిపించ మరచిపోను కొబ్బరి లౌజ్
రెండొకట్ల మూడంటావ్ బంగార్రాజు
నీ ఎక్కాలకి పడిపోయా నేనా రోజూ

వస్సివాడి వస్సివాడి 
వస్సివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా 

హా నువ్వొచ్చినప్పుడు ముద్దిచ్చి నప్పుడు
నా గుండె చప్పుడు హండ్రెడ్
నీ చీర కట్టుడు నీ నడుము తిప్పుడు
నా గుండె చడుగుడు వాట్ టు డూ

ఊరుకున్నడొక్కడు పెళ్లి అంట ఇప్పుడు
మేము ఎట్ట బతుకుడు డూ డూ డూ
పిల్ల పేరు గిల్లుడు ఇంటిపేరు దూకుడు
దీన్ని ఎట్ట ఆపుడు డూ డూ డూ

హోల హోలమ్మ హోల హోలమ్మ
ఈ పిల్లాడు నచ్చాడు మనసైన సోగ్గాడు
ముద్దొస్తు ఉన్నాడు


వస్సివాడి వస్సివాడి 
వస్సివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా


నువ్వుంటే సందడి నీ రాక గారడీ
నీ రాక కొసమే అల్లాడి
గారాల అమ్మడి నీ సోకు పుత్తడి
కల్లోకి వచ్చేస్తావు అల్లాడి

నువ్వు పెద్ద తుంటరి చూపుల్లోన పోకిరి
కల్లతోనే కాల్చుతావు తందూరి
తేనెపట్టు సోదరి పాలముంజ మాదిరి 
నిన్ను చూస్తే గుండెజారి రి రి రీ

ఈ పిల్లాడు నచ్చాడు మనసైన సోగ్గాడు
ముద్దొస్తు ఉన్నాడు

వస్సివాడి వస్సివాడి 
వస్సివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా

నువ్వు పెళ్లి చేసుకెల్లి పోయినా బంగార్రాజు
మా గుండెల్లో ఉండిపోతావ్ బంగార్రాజు
నువ్వు ఎక్కడుంటే అక్కడుండు బంగార్రాజు
నువ్వు హ్యాపీగా ఉండాలోయ్ బంగార్రాజు
ఉమ్మా... 
వస్సివాడి తస్సాదియ్యా



బంగారా బంగారా పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: మధు ప్రియ, అనూప్ రూబెన్స్

కళ్ళకి కాటుక ఎట్టుకొని
కాళ్ళకి పట్టీలు కట్టుకొని
సెవులకు కమ్మలు ఎట్టుకొని
సేతికి గాజులు ఏసుకొని

సిలుకు చీర కట్టుకొని
సెంటు గట్రా కొట్టుకొని
కొత్తగా ముస్తాబయ్యా
ఎప్పుడెప్పుడొస్తావయ్యా
నిన్ను సూడకుంటె గుండె
కొట్టుకోదయ్యా, ఆ ఆఆ

బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నువ్వంటే పడిపడి చస్తారా

బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నీ వెంటే లేచి వస్తారా

ఓ ఓ ఓఓ ఓ, చీరకు కుచ్చిళ్ళలాగా
జెడకు రిబ్బను లాగా
ఉంటావా ఉంటావా… తోడుగ ఉంటావా

ఓ, మూతికి ముడుపులాగ
నడుముకి మడతలాగ
నీతోనే ఉంటాగా… వదలనంటాగా

అంటుకు పోతావా
నా ఒంటికి అత్తరులా
సిగ్గై పోతావా నా సెంపకి
సువ్వి సువ్వాలా

నీకింకా ఇంకా ఇంకా
ఏం కావాలో చెప్పవే ఇల్లాలా
మళ్ళి మళ్ళి పుట్టేద్దామా
మొగడు పెళ్ళాల్లా, ఆ ఆఆ

ఊయ్, బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నువ్వంటే పడిపడి చస్తారా

బంగారా బంగారా
బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా
బంగారా బంగారా
నీ వెంటే లేచి వస్తారా

(బంగార్రాజు బంగార్రాజు)



ఎంత సక్కాగుందిరో పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ 
గానం: సాయి మాధవ్, మోహన్ భోగరాజ్, మేఘన, అపర్ణ, కావ్య  

రంగు రంగులు ఎగిసి
నింగి తాకే సంబరం
ఊరు ఊరంతా మెరిసే
అంగరంగా వైభవం

కోక కొంగు కోలాటాలు
ఆడే సరదా కృష్ణుడు
పింఛం పిల్లనగ్రోవి లేని
మా చిలిపి కృష్ణుడు

హే, రంగు ఓణీ రవ్వ గాజు
పిల్లని చూస్తే లడ్డుండా
ఎంతా సక్కాగుందిరో
ఎంత సక్కాగుందిరో

అరె కొంగు చాటు దాచుకున్న
నడుమును చూస్తే లడ్డుండా
ఎంతా సక్కాగుందిరో, యెహే
ఎంత సక్కాగుందిరో

ఆ, ఘల్లు ఘల్లు గజ్జెలు చూసి
గుండెకాయ గుంజీలు తీసే
బొంగరాల నడకలోన సక్కాగుందిరో
అరె అరె అరె అరే

ఎంతా సక్కాగుందిరో
ఎంత సక్కగుందిరో
లడ్డుండా లడ్డుండా, యెహే
లడ్డుండా, ఏ లడ్డుండా

హే, రంగు ఓణీ… రవ్వ గాజు
పిల్లని చూస్తే లడ్డుండా
ఎంతా సక్కగ సెప్పిండే
ఎంత సక్కగ సెప్పిండే

అరె బతికుండాలి ఖవ్వాలీలా
రోజు కొత్త ఉగాదిలా
కళ్ళల్లోనే దివాళిలా
ప్రతిపూటా పండుగలా

నువు పక్కన ఉంటే మహాశయా
రోజూ కృష్ణాష్టమేనయా
పొగిడావంటే అంతేనయా
సందట్లో సడేమియా

హే, పాలపిట్టకి పరికిణిలాగ
కొండవాగుకి గమకము లాగా
చందమామకి చెమికిలాగా
ఇరగేస్తుందోరి

అరె అరె అరె అరే
ఎంతా సక్కాగుందిరో
ఎంత సక్కగుందిరో
సక్కగుందే సక్కగుందే
సక్కగుందే సక్కగుందే




నువు సిగ్గుపడితే… పాట సాహిత్యం

 
చిత్రం: బంగార్రాజు (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: చిత్ర, రమ్యా బెహ్రా , సాయి చరణ్ 

నువు సిగ్గుపడితే… నువు సిగ్గుపడితే
నువు సిగ్గుపడితే బాగుంటావే
ఓ సత్యభామ సిగ్గుల సింగారముంటాదే

వద్దన్నా కొద్ది ముద్దొస్తావే
నా ఎన్నెలమ్మ
కారంగా చూస్తూనే
గారం చేస్తావే

నువ్వు మాటలతో పడగొడతావే
ఓ బంగార్రాజు నవ్వులతో సెగపెడతావే
నీ సూపులతో చుట్టేస్తవే… నా రంగుల రాజు
సూదంటు రాయల్లే లాగేస్తావే

మళ్ళీ పుట్టానా అనిపిస్తుందే
ప్రాణం నా నువ్వు నను చేరితే

ఓ ఓ ఓఓ, నువ్వు నేనొకటేగా… ఏడున్నా
నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా
నువ్వు నేనొకటేగా ఏడున్నా
నువు నా సొంతమెగా ఏ లోకంలో ఉన్నా

యాలె యాలె యాలెయాలె యాలే యాలే
యాలె యాలె యాలెయాలె యాలే యాలే

హోయ్ సుందరుడా సుందరుడా
మీసమున్న సెందురుడా
అందమైన ఆశపెట్టే నరుడా, హొయ్

ఊరువాడ పిట్టగోడ దూకినోడ్నే నేనాడా
కాసుకుంటానంటే పందెం ఈడా

అరె అరె అరె, చెఱుకుగడ పెరుగువడ
జున్ను పాల మీగడ
మాటల్లోనే చూపించావే గురుడా

హో, పూల జడ ఒంపు మెడ
హత్తుకున్న పావడా
ఎక్కి తొక్కుతున్నాయే గుండె కాడ

పొద్దూమాపంటూ ఏం లేదురా
స్వర్గమంటే ప్రతీ పూట
నీతోటే మా ఆటలే

ఓ ఓ ఓఓ, నువ్వు నేనొకటేగా… ఏడున్నా
నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా
నువ్వు నేనొకటేగా ఏడున్నా
నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా


Palli Balakrishna Thursday, January 13, 2022
Jathi Ratnalu (2021)

 



చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
నటీనటులు: రాహూల్ రామకృష్ణ, నవీన్ పోలిశెట్టి, ప్రియ దర్శి
దర్శకత్వం: అనుదీప్. కె. వి
నిర్మాత: నాగ్ అశ్విన్
విడుదల తేది: 11.03 2021







చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రామ్ మిరియాల


చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా
నా గుండె ఖల్లాసేయ్
అట్టా నువ్వు గిర్రా గిర్రా
మెలికల్ తిరిగే ఆ ఊసే

నువ్వు నాకు సెట్టయ్యావని
సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే
వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే
చిమ్మ చీకటికున్న జిందగీ లోన
ఫ్లడ్ లైటేసావే

హతేరి నచ్చేసావే
మస్తుగా నచ్చేసావే
బ్లాక్ & వైట్ లోకల్ గాన్ని
లోకంలోన రంగులు పుసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే

చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో
లక్ష లైకులు కొట్టావే

యుద్ధమేమీ జరగలే
సుమోలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో
పచ్చజెండా చూపించినావే
మేడం ఎలిజిబెత్తు నీ రేంజైనా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా

మాసుగాడి మనసుకే ఓటేసావే
బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే
తీసుమారు చిన్నోడిని
డిజె స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బాడ్ ఉన్నోన్ని
నవాబు చేసేస్తివే

అతిలోక సుందరివి నువ్వు
ఆస్ట్రాల్ ఓ టపోరి నేను
గూగుల్ మ్యాపై
నీ గుండెకి చేర్పివే 

అరెరే ఇచ్చేసావే 
దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చి బజ్జి లాంటి లైఫులో
నువ్వు ఆనియన్ ఏసావే

అరెరే గుచ్చేసావే 
లవ్వు టాట్టూ గుచ్చ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో
నింబూ చెక్కై హల్చల్ చేసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే

చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో
లక్ష లైకులు కొట్టావే







చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహూల్ సిప్లిగంజ్

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డర ఖానులు
వాల్యూలేని వజ్రాలు
మన జాతి రత్నాలు

ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
శాటిలైటుకైనా చిక్కరు వీళ్లీ గల్లీ రాకెట్లు
డైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లు
సుద్దాపూసలు సొంటే మాటలు తిండికి తిమ్మ
రాజులు
పంటే లేవరు లేస్తే ఆగరు పనికి పోతరాజుల

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు

జాన్ జిగర్

వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తే కోతులు
వీళ్ళుగాని జపం చేస్తే దూకి చస్తాయి కొంగలు
ఊరిమీద పడ్డారంటే ఉరేసుకుంటై వాచీలు
వీళ్ళ కండ్లు పడ్డయంటే మిగిలేదింకా గోచీలు
పాకిస్థానుకైనా పోతరు ఫ్రీ వైఫై చూపిస్తే
బంగ్లాదేశ్ కైనా వస్తరు బాటిల్ నే ఇప్పిస్తే

జింగిలి రంగా బొంగరం సింగిల్ తాడు బొంగరం
వీళ్ళని గెలికినోడ్ని బతుకు చూస్తే భయంకరం

వీళ్ళని బాగుచేద్దాం అన్నోడి డిమక్ కరాబ్

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు

వీళ్ళు రాసిన సప్లిమెంట్లతో అచ్చెయ్యొచ్చు పుస్తకం
వీళ్ళ కథలు జెప్పుకొని గడిపేయొచ్చు ఓ శకం
గిల్లి మరీ లొల్లి పెట్టే సంటి పిల్లలు అచ్చము
పిల్లి వీళ్ళ జోలికి రాదు ఎయ్యరు గనక బిచ్చము
ఇజ్జత్కి సవాలంటే ఇంటి గడప తొక్కరు
బుద్ధి గడ్డి తిన్నారంటే దొడ్డి దారి ఇడవరు


భోళా హరిలో రంగ ఆ మొఖం
పంగనామాలు వాలకం
మూడే పాత్రలతో రోజు వీధి నాటకం
శంభో లింగ ఈ త్రికం గప్పాలు అరాచకం
బాబో ఎవనికి మూడుతుందో ఎట్టా ఉందో జాతకం

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు







చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: యోగి శేఖర్

చంచల్ గూడ జైలులో చిలకలయ్యి చిక్కారు
పలకమీదికెక్కిందయ్యో నెంబరు
సుక్కలందుకోని రెక్కలు విప్పి
తుర్రుమంటూ ఎగిరారు
వీళ్ళ గాచారమే గుంజి తంతే బొక్కలో పడ్డారు

ఏ నిమిషానికి ఏమి జరుగునో
పాటకు అర్థమే తెలిసొచ్చేనే
వెన్న తిన్న నోటితో మన్ను బుక్కిస్తిరే
ఏమి గానున్నదో ఏందో రాత

రంగు రంగుల పాల పొంగులా
మస్తు మస్తు కలలు కంటే
సిట్టి గుండెకే చెప్పకుండనే ఆశ పుట్టెనే

నీళ్ళలో సల్లగా బతికేటి చేపనే
ఒడ్డుకే ఏపీరే యమ తోమ బడితిరే
ఇంటినున్న పుల్ల తీసి అటు పెట్టనోనికి
నెత్తి మీద బండ పెట్టి ఉరికిస్తుండ్రే

అరె మారాజు తీరే ఉన్నోన్ని ఏ రందీ లేనోన్ని
బతుకాగం చెసిండ్రే ఓ బొందల తోసిండ్రే

అరె బేటా..! మీరు ఏది పట్టినా
అది సర్వనాశనం, ఇది దైవశాసనం

ఇంట్ల ఉన్నన్ని నాళ్ళు విలువ తెలువలేదురో
కర్మ కాలిపోయినంక కథే మారెరో
ఖైదీ బట్టలు, రౌడీ గ్యాంగులు నాలుగు గోడలే నీ దోస్తులాయెరో
అవ్వ పాయెరో, బువ్వ పాయెరో పోరి తోటి లవ్వే పాయే
ముద్దుగున్న మీ లైఫు అందమే పలిగి పాయెరో



Palli Balakrishna Tuesday, February 16, 2021

Most Recent

Default