-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Deepthi Sunaina"






  
పాట: విడిపోతే (2024)
సంగీతం: సయ్యద్ షహ్నావాజ్ 
సాహిత్యం: సురేష్ బనిశెట్టి 
గాయకుడు: రోహిత్ శామ్యూల్ గంట
నటినటులు: దీప్తి సునైనా, విజయ్ విక్రాంత్ 
డైరక్టర్: విజయ్ షణ్ముఖ్ 
నిర్మాత: ప్రసాద్ కుమార్ చించేటి 
మ్యూజిక్ లేబుల్: దీప్తి సునైనా 
విడుదల తేదీ: 18.10.2024


విడిపోతే పాట సాహిత్యం

 
పాట: విడిపోతే (2024)
సంగీతం: సయ్యద్ షహ్నావాజ్ 
సాహిత్యం: సురేష్ బనిశెట్టి 
గాయకుడు: రోహిత్ శామ్యూల్ గంట

కలలే కనులొదిలి
కదిలెనులే పిలవద్దు అని
నిజమే అని చెబితే
మనసే నమ్మదే…
మనసే మనసొదిలి ఎగిరెనులే
వెతకొద్దు అని…
ఋజువే ఎదురైనా… కనులు నమ్మవే

హృదయం అద్దంలా పగిలి
నడిచే అడగులకే తగిలే
ఐనా నొప్పిని అనిచేసి
నవ్వేస్తూ నడిచెనే

ఎపుడు తోడుగా వెనకొచ్చే
నీడే రానని విడిపోతే
దిగులే తొడని అనుకుంటు
మౌనంగా మిగిలెనే…

ఎవరు చూడగలరు
రెప్పచివరన కురిసిన కంటతడి
ఎవరు పోల్చగలరు
గొంతు పగలగ అరిచిన గుండె సడి
కాలమే తన చేయిని విధిలించగా ఇలా

హృదయం అద్దంలా పగిలి
నడిచే అడగులకే తగిలే
ఐనా నొప్పిని అనిచేసి
నవ్వేస్తూ నడిచెనే

గతమే నెమ్మదిగా చెరిగి
బ్రతుకే ఒంటరి అయిపోతే
జతగా రమ్మని శూన్యాన్ని
సాయాన్నే అడిగేనే



Palli Balakrishna Tuesday, April 7, 2026



సాంగ్: ఏమోనే (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: సురేష్ బానిశెట్టి 
గానం: విజయ్ బుల్గానిన్ , అదితి భావరాజు 
నటీనటులు: దీప్తి సునైనా, విశాల్
దర్శకత్వం: వినయ్ షణ్ముఖ్
నిర్మాతలు: దీప్తి సునైనా , మక సంపత్ కుమార్ 
విడుదల తేది: 08.01.2023



ఏమోనే పాట సాహిత్యం

 
సాంగ్: ఏమోనే (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: సురేష్ బానిశెట్టి 
గానం: విజయ్ బుల్గానిన్ , అదితి భావరాజు 

సాంగ్: ఏమోనే (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: సురేష్ బానిశెట్టి 
గానం: విజయ్ బుల్గానిన్ , అదితి భావరాజు

ఉండిపో ఉండిపో ఉండిపోవే
గుండెలో చప్పుడై నాతో
ఉండిపో ఉండిపో ఉండిపోవే
ఊపిరై వెచ్చగా నాలో

అందమైన ఏదో లోకం
అందుతోంది నీతో ఉంటె
అంతులేని ఏదో మైకం
ఆగమన్న ఆగనంటోందే

పట్టాసై పోయే ప్రేమలో
మటాష్ అయిపోయా మత్తులో
పరాకే కమ్మే హాయిలో
పతంగై ఎగిరే నింగిలో

లాలా లాలా లాలా లాలా లాలా లల్లా లాలా
కోల కోల కళ్ళతోటి చంపకే పిల్లా
లాలా లాలా లాలా లాలా లాలా లల్లా లాలా
వేల వేల ఊహల్లోన ముంచకే పిల్లా

నిన్ను తప్ప నన్ను నేను గుర్తుపెట్టుకోనే
ఎందుకింత ఇష్టమంటే ఏమోనే ఏమోనే
నీకున్నట్టే నాలోకూడా ఇష్టం ఉన్న అంటే
ఉన్నపాటు చెప్పమంటే ఏమోలే ఏమోలే

ప్రతి మాట తీయని వరమే
ప్రతి చూపు పరవశమే
ప్రతి మాటే తీయని వరమే
ప్రతి చూపు పరవశమే
వేరు వేరు చేసిపోదు లేమ్మా
వేరు వేరు లాగ పట్టుకున్న ప్రేమ ప్రేమ ప్రేమ

లాలా లాలా లాలా లాలా లాలా లల్లా లాలా
కోల కోల కళ్ళతోటి చంపకే పిల్లా
లాలా లాలా లాలా లాలా లాలా లల్లా లాలా
వేల వేల ఊహల్లోన ముంచకే పిల్లా

ఉండిపో ఉండిపో ఉండిపోవా
కంటికే రెప్పలా నాతో
ఉండిపో ఉండిపో ఉండిపోవా
నీడలా ఎప్పుడు నాతో

అల్లుకుంది ఎదో బంధం
అందుకనే ఇంత ఆనందం
ఇద్దరినీ కలిపెను కాలం
మరువది జీవిత కాలం

పట్టాసై పేరే ప్రేమలో
మటాష్ అయిపోయా మత్తులో
హఠాత్తుగా జరిగే తంతులో
అమాంతం ఎన్ని వింతలో

లాలా లాలా లాలా లాలా లాలా లల్లా లాలా
చల్ల చల్ల గాలే నన్ను తాకనే నీలా
లాలా లాలా లాలా లాలా లాలా లల్లా లాలా
అల్లిబిల్లి అల్లరేదో రేగెను చాలా

Palli Balakrishna Saturday, May 27, 2023

Most Recent

Default