Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Dasari Narayana Rao"
Circus Ramudu (1980)



చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
నటీనటులు: ఎన్.టి.రామారావు, జయప్రద, సుజాత
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: కోవై చెలియన్
విడుదల తేది: 01.03.1980



Songs List:



అక్కాచెల్లెలు పక్కన చేరి పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి:
అక్కాచెల్లెలు పక్కన చేరి బావయ్యంటే ఎట్టా
సుక్కల మద్దిన సెంద్రుడిమల్లే సిక్కునపడతాపిట్టా
అక్కపిట్టొ చెల్లిపిట్టొ పెద్దపిట్టొ చిన్నపిట్ట

చరణం: 1 
నాకు ఆకలా ఆగిచావదు.
నాకు దప్పికా తీరిచావదు
ఇద్దరు కలిసి ముద్దగ చేసి
నమిలేస్తుంటే ఎట్టా
ముద్దుల మద్దెల దరువులు వేసి
నడిపిస్తుంటే ఎట్టా
అక్క పిట్టొ చెల్లిపిట్టా గిల్లియిట్టా చంపకంటా

చరణం: 2
నాకు రేగితే ఆగిచావదు
జోడు పడవల స్వారి ఆగదు.
ఒక్కదెబ్బకే జంటపిట్టలు
ఎపుడో కొట్టిన వాణ్ణి
అదే దెబ్బకే చుక్కలు వెయ్యి
మొక్కిన భల్ మొనగాణ్ణి
అక్కపిట్టా చెలిపిట్టా ఆటపాట కట్టిపెట్టా

అక్కా చెల్లెలు పక్కనచేరి బావయ్యంటే ఎట్టా
సుక్కల మద్దిన చంద్రుడి మల్లె సిక్కునపడతా పిట్టా
అక్క పిట్టా చెల్లిపిట్టా పెద్ద పిట్టా చిన్నపిట్ట



ఘల్ ఘల్ మంది పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
ఘల్ ఘల్ మంది ఘల్ మంది గజ్జెల గుర్రం
వెయ్ వెయ్ మంది వెయ్య మంది వెయ్యర కళ్ళెం
కత్తి కట్టిన కోడి కన్నా వాడి దీనివయ్యారం
కూత కొచ్చిన పుంజు కన్నా మోత వీడియవ్వారం

చరణం: 1
తొలకరివే నువ్వయితే- తొలిచినుకే నేనయితే
కురవాలి నాపరుపం తడవాలి నీ అందం
చలికి నువు తోడయితే తెలిసి నీజోడయితే
గెలవాలి నా పందెం నిలవాలి మన బంధం
ఓరి దీని అందాలు ముందర కాళ్ళ బంధాలు
చంద్రగిరి గంధాలు చిలికిందిరో

చరణం: 2
అమ్మాయినడుమేదో సన్నాయి పాడింది
రవ్వంత కవ్వింత రాగాలు తీసింది
నీచూపే తగిలిందీ నావలపే రగిలిందీ
ఒళ్ళంత వయ్యారం తుళ్ళింత లాడింది
ఓరి దీని ముద్దంట చక్కల గిలిపొద్దంట
చుక్కల గిరి హద్దంట తెలిసింది రోయ్




సూరీడు చుక్కెట్టుకుంది పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, వాణీజయరాం 

పల్లవి:
సూరీడు చుక్కెట్టుకుంది
జాబిల్లి పువ్వెట్టుకుంది
పదలి చీరాగట్టి గోదారి పై టేసి
కడలి వస్తూన్నాది భూదేవి
భూదేవిలా నచ్చె నాదేవి

సూరీడు చుక్కెట్టుకుంది
జాబిల్లి పువ్వెట్టుకుంది
చలి చీరా గట్టి గోదారిపై చేసి
కదలి వస్తున్నాది భూదేవి
అభూదేవిలా వచ్చె నీదేవి

చరణం: 1
ముద్దు ముద్దుకీ పొద్దు పొడవాలి 
ముద్దబంతి పూలు పూయాలి
ఎండా వానా కురిసిపోవాలి.
గుండెలో ఎన్నెల్లే మిగలాలి

చుక్క మల్లె పూల పక్కమీదనేను
మబ్బు చాటున నీకు మన సిచ్చుకోవాలి.
పెదవికి పెదవులే ప్రేమకు పదవులై
జీవనమధువులై అందిన వేళ

చరణం: 2
పువ్వు పువ్వునా నువ్వు నవ్వాలి
పూల రుతువునై నేను మిగలాలి
పూలరుతువు నూరేళ్ళ ఉండాలి
ఆ--పులకరింత వెయ్యేళ్ళు పండాలి
పాలు పొంగే వయసు పట్టే మంచం మీద
కొంగు చాటున వలపు గుడి కట్టు కోవాలి.
తనువుకు తనువుగా తని నే తీరగా
మనసే మనుపుగా కలిసే వేళ




రాముడంటె రాముడు పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
ఏవండోయ్ - లేడీస్
ఏవండోయ్ - మిస్టర్స్ 
రాముడంటె రాముడు సర్కస్ రాముడు
సర్కస్ రాముడు... సర్కస్ రాముడు
సర్కస్...సర్కస్...సర్కస్... సర్కస్ రాముడు

చరణం: 1
పర్మిట్ పక్షుల రాజ్యంలో డామిట్ బ్రతుకే సర్కస్
లిక్కర్ పర్మిట్ చక్కెర లైసెన్స్
అడిగావంటే సైలెన్స్
మంత్రి గారికి దణ్ణం పెట్టు డూడూడూడూడూ
ఆఫీసర్లకి హారతి పట్టు డూడూడూడూడూ
చెప్పేవి శ్రీరంగ నీతులు
తీసేవి చల్లంగ గోతులు
నీతిలేని ఈ సర్కస్ కన్నా కోతులు చేసే సర్కన్ మిన్న
సిస్టర్స్ నోటియర్స్
బ్రదర్స్ నో ఫియర్స్
ఐయామ్ ఆల్వేస్ యువర్స్

చరణం: 2
కన్నెపిల్లకి పెళ్ళి చెయ్యడం కన్నతండ్రి కో సర్కస్
కడుపున కాళ్ళు పెట్టి బ్రతకడం కష్టజీనికో సర్కస్
అల్లుడి గారికి కట్నం పెట్టు డూడూడూడూడూ
అలిగి నప్పుడు కాళ్ళే పట్టు డూడూడూడూడూ
శ్రీకృష్ణ పరమాత్మ పింఛము
శ్రీరస్తు శుభమస్తు లంచము
మనుషులు చేసే సర్కస్ కన్నా మృగాలు చేసే సర్కన్ మిన్న




ఆకలి మీద అడపులి పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
ఆకలి మీద అడపులి దీన్ని
ఆపలేను భజరంగ బలి
మిర్రి మిర్రి చూస్తాది చిర్రు బుర్రుమంటాది.
మింగిందా గోవిందా హరి హరి హరి హరి
ప్రేమే ఎరుగని పెద్దపులి దీని
మనసు మార్పు భజరంగబలి
గుర్రు గుర్రు మంటాది - గుచ్చి గుచ్చి చూస్తాది.
మింగిందా గోవిందా హరి హరి హరి హరి

చరణం: 1
తగల మాక నాయెంటబడి
తల్లీ నీకో దండం పెడతా
ఎనక్కి తిరిగి వెళ్ళకపోతే
ఏనుగు తొండం పెట్టి కొడతా
దండ యాత్రలకు బెదిరేదాన్నా
దండం పెడితే వదిలే దాన్ని
సరసం కాస్తా విరసం చేస్తే
నీతో సర్కస్ చేయించేస్తా

చరణం: 2
తోక ఒక్కటే తక్కువ గాని
కోతి బుద్ధి ఈ కోమలిది
మచ్చ ఒక్కటే తక్కున గాని
అమావాస్యలో జాబిలిది
కొండ ముచ్చువని తెలిసే వచ్చా
కొబ్బరంటి నా మనసే యిచ్చా
చీ చీ ఫో పో అన్నా వంటే
సింగం నోట్లో తల దూరుస్తా



ఓ బొజ్జగణపయ్య పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య
నీ సవితెప్పుడో సెప్పవయ్య
నా సవితెవ్వరొ సెప్పవయ్య
ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్య
నీ సివితెప్పుడో సెప్పవయ్య
ఈ సవితి పోరే తీర్చవయ్య

చరణం: 1
సంపంగితోటలో సనజాతి పువ్విస్తే
కొంపంటుకున్నట్టు గగ్గోలు
ఎన్నెట్లో జతగలిసి ఎచ్చగా కవ్విస్తే
తేళ్ళు కుట్టినట్టు సోకాలు
కిటుకేమిటో చెప్పు స్వామి అటుకులే పెడతాను స్వామి
ఉన్నదేమిటో చెప్పు తండ్రీ ఉండ్రాళ్ళు పెడతాను తండ్రీ

చరణం: 2
సందకాడ తనకు సలితిరిగినాదంటే
పులిమీద పుట్రలా యమగోల
సుక్కలొచ్చిన వేళ చూసి పోదామంటే
కళ్ళతోనే కాల్చి చంపాలా?
గొడవేమిటో చెప్పుస్వామి వడపప్పు పెడతాను స్వామీ
పూనకం తగ్గించు తండ్రీ పానకం పోస్తాను తండ్రీ

చరణం: 3
ఈణ్ణి నమ్మినాకు ఈడొచ్చి కూకుంది
దాన్ని నమ్మిగుడె గూడెక్కి కూసింది
వళ్ళు చూస్తే దాన్ని వాటేయమంటుంది
బుద్ధి చూస్తే వద్దు వద్దు పొమ్మంటుంది.
చెరకు పెడతా నీకుస్వామి చేసెయ్యి మా పెళ్ళి స్వామి
టెంకాయ కొడతాను తండ్రీ లగ్గమెప్పుడో చెప్పుతండ్రీ





అమావాస్యకి, పున్నమికి పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
అమావాస్యకి, పున్నమికి రేగిందంటే మామో
పంబ రేగుతుందిరో మామో
మామ మామ మామ చీ పో చీమా దోమా

చరణం: 1
పిచ్చినాకు ముదురుతుంటే కచ్చనాకు పెరుగుతుంటే
చచ్చి సున్న మవ్వకుంటే ఒట్టు పెట్టు.. నీ
చచ్చు పుచ్చు నాటకాలు కట్టి పెట్టు 
వాటేసుకోబోయి పోటేసి పోతాను అరె అరె అరె అరె 
కాకెత్తి పోతోంది పిచ్చిగాలి నువ్వు
కాకి చూపు చూశావా బలి బలి బలి బలీ

చరణం: 2
బుద్ధి లేని మామ కంట బుర్రరామ కీర్తనంట
నీదుకాణ మెందుకంట కట్టి పెట్టు-నీ
తద్దినం పెట్టుకుంటే ఒట్టు పెట్టు
చిక్కాడే చిట్టి నాయనా- నాచేత
చిక్కి బక్క చిక్కి పోయినాడే
చేత కాక బిక్క చచ్చిపోయినాడే

చరణం: 3
అల్లుడంటే అర్థమొగుడు తగులు కుంటే అసలు మొగుడు
వళ్ళు గుళ్ళ చేయకుంటే లిట్టు తిట్టు- 
నిన్ను వళ్ళకాట్లో పెట్టకుంటే పట్టు పెట్టు
చుక్కెదురే మావయ్యో
దిక్కెవరూ లేరయ్యో
అత్తకు చెబితే పరువే హోగయే

Palli Balakrishna Sunday, December 10, 2023
Deeparadhana (1981)



చిత్రం: దీపారాధన (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఆనంద్, రమేష్, పుష్పలత
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద, మురళీమోహన్, మోహన్ బాబు, దీప, శివరంజని (నూతన నటి)
దర్శకత్వం: దాసరి నారాయణ రావు 
నిర్మాత: నన్నపనేని సుధాకర్
విడుదల తేది: 11.04.1981



Songs List:



సన్నగా.. సన సన్నగా... పాట సాహిత్యం

 
చిత్రం: దీపారాధన (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
సన్నగా.. సన సన్నగా...
సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు
సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు
ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో

చరణం: 1
కోరికమ్మ గుడిలో కోయిలమ్మ కూసిందో
జాజులమ్మ తోటలో గాజులమ్మ పిలిచిందో
జాజులు జాజులు చేరి గుసగుసమన్నాయి.. ల.. ల.. ల.. ల
గాజులు గాజులు చేరి గలగలమన్నాయి
అన్నాయి అమ్మాయి నీ నడుమే సన్నాయి
విన్నాయి అబ్బాయి ఈ నీ మాటల సన్నాయి

సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు
సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు
ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో
ఆ.. ఆహాహా... ఆహాహా.. ఆహహాహా

చరణం: 2
చుక్కలమ్మ వాకిట్లో జాబిలమ్మ పూచిందో
మబ్బులమ్మ పందిట్లో ఉరుములమ్మ ఉరిమిందో
మబ్బు మబ్బు కలిసి మంచం వేశాయి.. ఆహాహా..
చుక్క చుక్క కలిసి పక్కలు వేశాయి
వేశాయి అబ్బాయి ప్రేమకు పీటలు వేశాయి
వేశాయి అమ్మాయి పెళ్ళికి బాటలు వేశాయి

సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు
సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు
ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో
ఆ.. ఆహాహా... ఆహాహా..ఆహహాహా




మనిషికి సర్వం ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: దీపారాధన (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం: యస్.పి.బాలు, ఆనంద్, రమేష్

మనిషికి సర్వం ప్రాణం



వెన్నెలవేళ మల్లెలనీడ పాట సాహిత్యం

 
చిత్రం: దీపారాధన (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

వెన్నెలవేళ మల్లెలనీడ




సీతాదేవి కళ్యాణం పాట సాహిత్యం

 
చిత్రం: దీపారాధన (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం: జి. ఆనంద్, మాధవపెద్ది రమేష్ 

సీతాదేవి కళ్యాణం చూసిందెవరో చెప్పండి



తూరుపు తిరిగి దండం పెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: దీపారాధన (1981)
సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి
గానం::బాలు,P.సుశీల

తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు
తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు
ఆ తూరుపెక్కడో చెప్పాలండి..మీలో...ఒక్కరు
ఆ..ఎవరో...ఒక్కరూ..
ముక్కుకు సూటిగ పోతే నీకు ఉత్తరం మొస్తుండీ
ముక్కుకు సూటిగ పోతే నీకు ఉత్తరం మొస్తుండీ
ఆ పక్కకు తిరిగి వెనక్కు చూస్తె తూరుపు వుంటుందీ...తూరుపు వుంటుందీ..హ్హా..హ్హా..

అమ్మాయి..పుడితే..పేరేమి..అన్నాను..తప్పా..ఆ ఆ
అబ్బాయి..పుడితే..పేరేమి..అన్నాను..తప్పా..ఆ ఆ
అబ్బాయే..ఎందుకు పుట్టాలీ...అమ్మాయే..ఎందుకు పుట్టాలీ...
అబ్బాయే..ఎందుకు పుట్టాలీ...అమ్మాయే..ఎందుకు పుట్టాలీ...అబ్బాయెందుకు పుట్టాలీ ??అమ్మాయెందుకు పుట్టాలీ ??అబ్బాయెందుకు పుట్టాలీ ??
అమ్మాయెందుకు పుట్టాలీ ??
అబ్బాయే..అమ్మాయే..అబ్బాయే..అమ్మాయే..
అబ్బాయే..అమ్మాయే..అబ్బాయే..అమ్మాయే..అమ్మాయి అయితే బొట్టు కాటుక దిద్దొచ్చు..అబ్బా..
తలలో పూవులు పెట్టోచ్చు
అబ్బాయి అయితే..చొక్కా లాగు వేయోచ్చు..చక్కగ మీసం పెంచొచ్చు
అబ్భా మీసాలంటే నాకు భయమండీ
అబ్బాయొద్దు..గిబ్బాయొద్దు..నాకు అమ్మాయే..కావాలి
నీకు అమ్మాయే..కావాలా..ఆ..అమ్మాయే..కావాలా..ఆ..
అయితే తూరుపు తిరుగి దండం పెట్టు..హా హ హ హ
తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు
తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు
ఆ పక్కకు తిరిగి వెనక్కు చూస్తె తూరుపు వుంటుందీ...తూరుపు వుంటుందీ

వెళ్ళాలి..మనమూ..తిరపతీ..అన్నాను..తప్పా..ఆ
ఆ..వెళ్ళాలి మనమూ..బొంబాయి అన్నాను తప్పా..ఆ..
బోంబాయే ఎందుకు వెళ్ళాలీ ?
ఆ..తిరుపతే ఎందుకు వెళ్ళాలీ ?
బోంబాయే ఎందుకు వెళ్ళాలీ ?
ఈ..తిరుపతే ఎందుకు వెళ్ళాలీ ?
బోంబాయ్ ఎందుకు వెళ్ళాలీ...తిరుపతి ఎందుకు వెళ్ళాలీ..
బోంబాయ్ ఎందుకు వెళ్ళాలీ..తిరిపతే..ఎందుకు వెళ్ళాలీ..
తిరుపతే..బోంబాయే..తిరుపతే..బోంబాయే..
తిరుపతే..బోంబాయే..తిరుపతే..బోంబాయే..
బోంబాయ్ అయితే రైలూ..ప్లైను ఎక్కోచ్చు
దేశం చుట్టి రావచ్చు..
తిరుపతి అయితే...కోండ మెట్లూ ఎక్కోచ్చు
మొక్కి గుండు ఇవ్వొచ్చు..అబ్బో..గుండా..ఆ..
గుండంటే నాకు భంగా..హా..హా..హా..
అయితే..తూరుపు తిరిగి దండం పెట్టండి..హు..హు..
తూరుపు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడగారు
తూరుపు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడగారు
ఆ తూరుపెక్కడో చెప్పాలండి..మీలో...ఒక్కరు
ఆ..ఎవరో...ఒక్కరూ..




తెల్ల కాగితం మనిషి జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: దీపారాధన (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణ రావు 
గానం: యస్.పి.బాలు

తెల్ల కాగితం మనిషి జీవితం
ఒకో అక్షరం ప్రతి నిమిషం
చెయ్యి మారితే రాత మారుతుంది
చెయ్యి జారితే మచ్చ మిగులుతుంది

బాష ఏది ఐనా చూసేందుకు అక్షరాలు కొన్నే
అక్షరాలు కొన్నైనా రసేందుకు భవాలు ఎన్నో
అనుకున్నవి రాయలేరు కొందరు
రాసినా చెయ్యలేరు కొందరు
చేసినా పొందలేరు కొందరు
పొందినా ఉందలేరు కొందరు

బంగారం కురిసినా పట్టెందుకు చేతులు రెండే
చెతులెన్ని ఉన్నా తినడానికి నోరు ఒక్కటే
తినడానికి లెనివారు కొందరు
తిని అరిగించుకొలేనివారు కొందరు
ఉండి తినలేనివారు కొందరు
తిన్నా ఉండలెనివారు కొందరు

Palli Balakrishna Tuesday, November 28, 2023
Ketugadu (1980)



చిత్రం: కేటుగాడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల , యస్.పి.బాలు 
నటీనటులు: మోహన్ బాబు, సీమ, జయమాలిని 
దర్శకత్వం: దాసరి నారాయణరావు 
నిర్మాత: వి. వెంకట్రావు 
విడుదల తేది: 06.09.1980



Songs List:



రాక .... రాక రాక వచ్చారు బావగారు పాట సాహిత్యం

 
చిత్రం: కేటుగాడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల , యస్.పి.బాలు 

రాక .... రాక రాక వచ్చారు బావగారు
పక్కవూరికెళ్ళారు అక్కగారు
పక్కకింక ఎవరొస్తారు ఆకు వక్క లెవరిస్తారు

తెలిసి.... తెలిసి తెలిసి వచ్చారు బావగారు
పక్కవూరికెళ్ళారని అక్కగారు
పక్కకింక ఎవరొస్తారు 
అక్కబదులు చెల్లిస్తారు..

ఎప్పుడున్న పప్పు కూడు చెప్పిడంట అది
ఎప్పుడేసే ఇంటి ఘడీయ చప్పుడంట
తప్పు తప్పు అనమాకు అప్పు డప్పుడిది సోకు
అప్పడాల ఒడియాలు పెట్టమంట

మొన్నలేని మొగ్గలు నిన్న లేని సిగ్గులు
అక్కగారు చూసిందా లెక్కలేని చిక్కులు
పుడుకుంటె పక్కిస్తాను 
మీ పక్కలోకి దిండిస్తాను

కంచ మంటే తప్పులేదు బావగారు
పట్టెమంచ మంటే తప్పులేదు బావగారు
అక్క ఇంటి వాసాలు లెక్క పెట్టి మోసాలు
చెయ్యబోతె బడితె పూజ చేస్తారు

అక్కచాటు చెల్లెలా ఆకు చాటు మల్లెలా
ఒక్కమాటు రమ్మంటే శ్రీ రంగ నీతులా
అక్కరొస్తెఏం చేస్తాను
మీ అక్క నువ్వె అనుకుంటాను




ఒత్తరి ఒళ్లు... బిత్తరి కళ్లు అత్తరు జల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: కేటుగాడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల , యస్.పి.బాలు 

ఒత్తరి ఒళ్లు... బిత్తరి కళ్లు అత్తరు జల్లీ
మత్తెక్కించే అమ్మాయ్ అందాలు
ఆద్దిరబన్నా ....వద్దుర అన్నా.... నిద్దర పట్టని
అర్ధరాతిరి సన్నాయ్ మేళాలు
ఏవేవో తాళాలు వేస్తున్న బాణాలు
తీస్తున్నయ్ ప్రాణాలు ఇస్.... హా

అల్లరి కల్లు తిమ్మరి ఒళ్లు అల్లుకుపోయి
గిల్లుకు పోయే ఆబ్బాయ్ వేషాలు
అందని పిందా... అందిన పండు తుంచుకుపోయి
నంజుకు తిన్న తుంటరి మేళాలు
ఏవేవో తాళాలు వేస్తున్న బాణాలు
తీస్తున్నయ్ ప్రాణాలు ఇస్.... హా

మూర తక్కువ చీర కెక్కువ
ముద్దులొలికే అందం
పైట జారితే పాల పిట్టలే 
రివ్వు రివ్వ మన్న చందం
రివ్యూ రివ్వూ మన్న చందం

చేను మేసిన కంచెలాగున చెప్పరానిదీవాటం
తప్పు చేసిన కొప్పు మల్లెలే
గుప్పు గుప్పుమన్న ఫలితం
గుప్పూ గుప్పు మన్న ఫలితం
నీ సిగ్గు సిగ్గొయ్య నిన్నింక ఒగ్గెయ్యా
నీ లేత బుగ్గల్లో నా ముద్దు ముగ్గెయ్య

రంకె వేసిన కన్నె ఈడులో
రంకె వేసిన చప్పుడు కొసరులాడిన కోడె ఊసులో
గుట్టు మట్టులే చెప్పడు గుట్టూ మట్టూ చెప్పడు
మొలకరించిన పులకరింతలో
మొటిమి గిల్లిన చప్పుడు
కన్నె కాటుక కన్ను వేసిన
చిటిక లెందుకో చెప్పడు
చిటికో మెటికో చెప్పదు

నీ మోజు మొగ్గయ్య ఎన్నెల్లో అగ్గెయ్య
మలిసంజ చుక్కలో మనజంట పక్కెయ్య



అరె వారెవ్వా అందగాడా రారా పాట సాహిత్యం

 
చిత్రం: కేటుగాడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

అరె వారెవ్వా అందగాడా రారా
ఈ సందకాడ ముసలోడా
నీ బూజు దులపాల నామోజు తీరిపోవాల
ఓసి నీయవ్వ అవ్వా బువ్వా నువ్వే నా
గూడూ గువ్వా పసిదానా
నీ జాజు లివ్వాల నా మోజు తీరిపోవాల

జలతారు ముసుగూ వుంది జాబిల్లి కులుకువుంది
గానా బజానా లోన గంతు లేస్తావా
అరవైలో ఇకవై ఏళ్ళ పరువాల పదును వుంది

కవ్వాలీ కవ్వింతల్లో కౌగిలిస్తావా వావా
వస్తావా
అడిగింది ఇస్తావా
నేను అడగంది నువ్వు యిస్తావా
ఓసి నీయవ్వ

అరె వారెవ్వా
వారెవ్వా కేటుగాడా రారా
నా నీటుగాడా ఈవేళ
నీ పోజులింకేలా నా మోజు తీరిపోవాలా

చినదాని నవ్వల్లోన సిరిమల్లె చినుకుల్లోన
పరదా గోదారి మీన తేలి పోవాలా
చినవాడి చూపుల్లోన - చిరువేడి చురకల్లోన
సరదాల దారిలోన సాగిరావాలా
అరరరే వస్తావా 
అర ముద్దులిస్తావా
తెరచాటు విందు చేస్తావా




గోధూళి వేళ గోరంతదీపం పాట సాహిత్యం

 
చిత్రం: కేటుగాడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

గోధూళి వేళ గోరంతదీపం
వెలిగింది నీ దివ్యరూపం, నాలో
జరిగింది అమృతాభిషేకం
గోధూళి వేళ గోరంత దీపం
వెలిగింది నీ దివ్యరూపం, నాలో
జరిగింది అమృతాభిషేకం

సిరిమల్లె వానల్లో పరువాల హరివిల్లు
విరిసింది నా కంట నేడు 
కాశ్మీర ముందార కుసుమాలు వెదజల్లి 
కలిసింది నా కన్నె ఈడు

నీ మందహాసాలు మధుమాస గీతాలు
పాడాలి ప్రాణాల తోడు 
నెలవంక చెప్పాలి నెలయింక తప్పాలి
నీ పాప ఒడిచేరు వరకు 
ఇల్లాలినై లాలి పాడు వరకు

నావూపిరేతాకి! ఉప్పొంగు కెరటాల
ఆడాలి జలకాలు నీవు
నా చూపులే సోకి ఉదయించు
కిలణాల దిద్దాలి తిలకాలు నీవు
నీ అంద చందాల ఆమని ఉయ్యాల
ఊగాలి కడదాక నేను
తెలవారి పోరాదు తొలి రేయిలో
హాయి కలలన్ని కడ తేరు వరకు
నీ నేను నిను చేరు వరకు



ఆకాశంలో వున్నా నేను నీకోసం పాట సాహిత్యం

 
చిత్రం: కేటుగాడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల 

ఆకాశంలో వున్నా నేను నీకోసం శూన్యమై
కన్నీటి చుక్కలే నీ కంటికి చుక్కలై
నా హృదయం ముక్కలై అది ఎనిమిది దిక్కులై

నీ చేతి పసుపు పాఠాణితో
నీవు సాగనంపిన ఈ ప్రాణికి
ఏదీ నీ కౌగిలింత మాంగల్యం
ఏదీ నీసరసనున్న సౌభాగ్యం
మిగిలింది ఈ విరహా రూప వైధవ్యం

దివి నించి రాలేను దిగి నీ కోసం
మనసుంటే నీకు ఆ అవకాశం
సూర్య కిరణ నయనాలు విప్పినే చూస్తున్నా
సుప్రభాత సుస్వాగత గీతం సినిపిస్తున్నా
నుదుట సింధూరమై, సిగకు మందార మై
కదలిరా..... తరలిరా.... ఎగసిరా..




గోధూళి వేళ గోరంతదీపం (Sad Version)పాట సాహిత్యం

 

చిత్రం: కేటుగాడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు 

నావూపిరేతాకి ఉప్పొంగు కెరటాల
ఆడాలి జలకాలు నీవు
నీ చూపులే సోకి ఉదయించు
కిలణాల దిద్దాలి తిలకాలు నేను 
నీ అంద చందాల ఆమని ఉయ్యాల
ఊగాలి కడదాక నేను
తెలవారి పోరాదు తొలి రేయిలో
హాయి కలలన్ని కడ తేరు వరకు
నీ నేను నిను చేరు వరకు

గోధూళి వేళ గోరంతదీపం
వెలిగింది నీ దివ్యరూపం, నాలో
జరిగింది అమృతాభిషేకం

Palli Balakrishna Thursday, November 16, 2023
Korikale Gurralaithe (1979)



చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి,  కొసరాజు, దాసం గోపాలకృష్ణ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, వసంత 
నటీనటులు: మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు, కాంతారావు, ప్రభ, జయలక్ష్మి, రమాప్రభ 
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: జి. జగదీష్ చంద్ర ప్రసాద్ 
విడుదల తేది: 12.01.1979



Songs List:



కోరికలే గుర్రాలైతే (Female Version) పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే
అదుపేలేని మనసునకు - అందని స్వర్గం ఏముంది

తన యింట సిరితోట పూచేనని - తనదారి విరిబాట అయ్యేనని
దినదినము తియ్యన్ని పాటేనని - తాగన్న కలలన్ని పండేనని

సరదాలన్నీ చని చూడాలని సంబర పడుతుంది.
సంపదలన్నీ తనకే గలవని పండుగ చేస్తుంది.
జాబిల్లి తనకున్న విడిదిల్లని వెన్నెల్లు పన్నీటి జలకాలని
హరివిల్లు రతనాల జడబిళ్ళని తారకలు మెడలోని హారాలని
ఆకాశాన్ని దాటేయాలని నిచ్చెన వేస్తుంది 
ఈ లోకాలన్ని గెలిచేయాలని ముచ్చటపడుతుంది



రే రే రేక్కాయలో పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.జానకి

రే రే రేక్కాయలో - ఆ రే రే రేక్కాయలో
సందకాడ సిన్నోడు సందుకాశాడే
సంతసేసి వస్తావుంటే సరసమాడాడే 
బటానీల కోకమీద సిన్న సిటిక వేశాడే
సింతపువ్వ రైకమీద సెయ్యేశాడే.

తల్లోకి మల్లెపూల దండంపాడే
మెళ్ళోకి సెంద్రహారం గొలుసంపాడే
పట్టెమంచం పై కెమొ పరుపంపాడే
గదిలోకి అగరొత్తుల కట్టంపాడే

వంటకెమొ సన్నబియ్యం సంచులంపాడే
కూరకేమొ కొర్రమీను సేపలంపాడే
మంగళగిరి తిరణాళ్ళకి నన్ను తీసికెళ్ళాడే
రంగులరాట్నం ఎక్కించి రంగు సేశాడే




మనసే మన ఆకాశం పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

మనసే మన ఆకాశం - మనమే రవి చంద్రులం
ఇటు రేయి అటు పగలు - ఒకటై వెలిగే ప్రేమికులం
చందమామ నువ్వంట - వెన్నెల్లే నువ్వంట
సూరేడి వెచ్చనీ నీరెండె నువ్వంట
నీ మాట అనుకుంటె మాటలే రావంట
మాటల కందని మనిషివి నువ్వంట
మనుషుల కందని మమతే నువ్వంట
నీకు నీ వారుంటె నా కోసం నువ్వంట
ఏ ఏటి ఒడునా ఇల్లేల మనకంట
ఈ ఒంటివానికి నీ జంట ఇల్లంట 
ఆ యింట గోరంత దీపమై నేనుంట
గోరంత దీపానికి ఇల్లంత వెలుగంట
కొండంత దేవుడికి కోవేలే నేనంట





సలామలేకుం రాణి పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

సలాం లేకుం రాణి | నీ
గులాము నౌతాను 
ముత్యాల పల్లకిలోన నిను
మోసు కెళుతాను

సలాం లేకుం రాజా ! నీ
గులాము నౌతానునువు
మోసుకెళితే నిన్నే : ఎగ
రేసు కెళుతాను !
మరుమల్లె లెందుకులే - నీ
చిరునవ్వులే వుంటే
కరిమబ్బు లెందుకులే - నీ
కురుల నీడలే వుంటె
నీ - జడలోన ఒదిగున్న విరజాజిని
ఓ - జవరాలా నీ ప్రేమ పూజారిని

బృందావనినే వలవుల
ముంగిట నాటాలనీ 
స్వర్గ సుఖాలన్ని ప్రియుని
సందిట చూడాలని
నా కనులార కలగంటి ఇన్నాళ్ళుగా
ఆవి కనుగొంటి ఈనాడు నీ తోడుగా




ఏమి వేషం ఏమి రూపం పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు,  వసంత 

ఏమి వేషం - ఏమి రూపం
ఆహా కథానాయకీ
సావిత్రీ ఐ లవ్వూ !
నచ్చినానా - మెచ్చినావా
ఓహో ఆశదీర్చలేవా
ధర్మరాజా ! ఐ లవ్వూ

నిన్నటి నాటుపిల్ల 
యీ-నాడు బలే రసగుల్లా 
ఒక్క ఛాన్సు యిచ్చిచూడూ
దులిపేస్తా నీతోడూ
సరి సరి - నాకు తెలుసు

నీలో వున్న సరుకు
యిక - పెరుగులే మార్కెట్టు
సావిత్రీ  ఐ లవ్యూ 
ఒకసారి పై కిదెస్తే 
జన్మంతా రుణపడి వుంటా
రేయి పగలు కృషి చేస్తా
ఒకదారి నీకు చూపిస్తా
చూడు చూడు కోతి మూకల్ని
నవ్వు తుండే ఆ వెధవల్ని
ఏవరెటు చస్తే మనకేమీ
లవ్యూ - సావిత్రి ఒహో





కోరికలే గుర్రాలైతే (Male Version) పాట సాహిత్యం

 
చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

కోరికలే గుర్రాలయితే
ఊహలకే రెక్కలు వస్తే
మనిషికి మతిపోతుంది
బ్రతుకే శృతి తప్పుతుంది

నేలవిడిచి సాము చేస్తే
మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తి కొచ్చాయంటే
కాళ్ళు కొట్టు కుంటాయి
గాలి కోటలు కట్టాపు
అవి కూలి తలపై పడ్డాయి
చివరి మెట్టు పైకెక్కావు
చచ్చినట్టు దిగమన్నాయి

పులినిచూచి నక్కలాగ వేసుకొంటివి వాతలు
రాజు నెప్పుడోచూసి మొగుడికి పెట్టినావు వంకలు
అప్పు చేసిన పప్పుకూడు అరగదమ్మా వంటికి
జుట్టు కొద్ది పెట్టిన కొప్పె అందం ఆడదానికి

Palli Balakrishna Monday, October 30, 2023
Prema Mandiram (1981)



చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద , అంబిక, గీత, రామానాయుుడు 
దర్శకత్వం: దాసరి నారాయణరావు 
నిర్మాత: డి. రామానాయుడు 
విడుదల తేది: 19.09.1981



Songs List:



ప్రేమ మందిరం.. పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
ప్రేమ మందిరం.. ఇదే ప్రేమ మందిరం
ప్రేమ మందిరం.. ఇదే ప్రేమ మందిరం..

నిరుపేదలు తల దాచుకునే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
నిరుపేదలు తల దాచుకునే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం ఊ...ఊ..ఊ..

చరణం: 1
ఎనిమిది దిక్కుల నడుమ సంసారం
ఎనభై నాలుగు లక్షల సంతానం
ఎనిమిది దిక్కుల నడుమ సంసారం
ఎనభై నాలుగు లక్షల సంతానం

సప్తస్వర సంగీతం నవరసాల సాహిత్యం
రంగరించుకున్నదీ రంగుల వలయం

రిసరిగ గసగమ సగమదనిస
నిదపమగరిసనిద

సప్త స్వర సంగీతం నవరసాల సాహిత్యం
రంగరించుకున్నదీ రంగుల వలయం
మనసంఘమ నిలయం... నవసాగర మధనం...ఇది శాశ్వత ప్రణయం
సుందరం.. సుమధురం.. ప్రేమ మందిరం

నిరుపేదలు తలదాచుకొనే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం

చరణం: 2
నీలో విన్నా వలపుల ఓంకారం
నీలో కన్నా వెలుగుల ఆకారం
నీలో విన్నా వలపుల ఓంకారం
నీలో కన్నా వెలుగుల ఆకారం

ఉదయారుణ మందారం... హృదయేశ్వరి సింధూరం
కౌగిలిగా మెరిసిన... కళ్యాణ మంటపం
రిసరిగ గరిదప దపదప దపదస
ఉదయారుణ మందారం... హృదయేశ్వరి సింధూరం
కౌగిలిగా మెరిసిన... కళ్యాణ మంటపం

ఇది సృష్టికి ప్రాణం.. మన ముక్తికి మూలం
ఇది ఇలలో స్వర్గం...
సుందరం... సుమధురం... ప్రేమ మందిరం

నిరుపేదలు తల దాచుకొనే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం




చంద్రోదయం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

చంద్రోదయం



ఎక్కడో.. పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
ఎక్కడో... ఎప్పుడో...
ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు
బాలరాజువా దేవదాసువా బాటసారివా కాళిదాసువా

ఎక్కడో... ఎప్పుడో...
ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు
చంద్రలేఖవా శశిరేఖవా భద్రకాళివా చండీప్రియవా

చరణం: 1
మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ
చూసుకున్న చూపులన్ని అదో మాదిరి
మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ
చూసుకున్న చూపులన్ని అదో మాదిరి

ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి
అవి చెదరగానే కలత రాతిరి
ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి
అవి చెదరగానే కలత రాతిరి
కలల రాతిరీ కథల రాతిరి ప్రేమ కథల రాతిరి
కలత రాతిరీ బరువు రాతిరి గుండె బరువు రాతిరి

ఎప్పుడో... ఎక్కడో... 
ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు
చంద్రలేఖవా శశిరేఖవా బాటసారివా కాళిదాసువా

చరణం: 2
ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ
రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది
మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ
రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది

ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ
నువ్వు ఊరుకుంటే మీద పడతది
ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ
నువ్వు ఊరుకుంటే మీద పడతది

మీద పడతదీ మోజుపడతదీ పెళ్ళి మోజు పడతది
గట్టి పడతదీ కట్టమంటది తాళి కట్టమంటది

ఎక్కడో... ఎప్పుడో...
ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు
బాలరాజువా దేవదాసువా భద్రకాళివా చండీప్రియవా
పాటల ధనుస్సు 
ఎక్కడో... ఎప్పుడో...





ఆటా తందాన తానా తానా పాట పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

ఆటా తందాన తానా తానా పాట 




తోలిసారి పలికేను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు

తోలిసారి పలికేను



ఉదయమా ఉదయంచకు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు

ఉదయమా ఉదయంచకు




అమరం అమరం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాసరి 
గానం: యస్.పి. బాలు

అమరం అమరం




మా ఇంటి అల్లుడా... పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల , యస్. జానకి 

మా ఇంటి అల్లుడా... మాపటేల గిల్లుడా 
మహా జనానికి మరదలు పిల్లనురో 

Palli Balakrishna Sunday, October 15, 2023
Radhamma Pelli (1974)



చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All)
గానం: రమేష్ నాయుడు, యస్.జానకి, యస్.పి.బళ్ళు, ఎల్.ఆర్. అంజలి, రాజాబాబు, రమాప్రభ
నటీనటులు: కృష్ణ, మురళీమోహన్ ,  శారద (త్రిపాత్రాభినయం)
దర్శకత్వం: దాసరి నారాయణ రావు 
నిర్మాత: పి.యస్.భాస్కర రావు 
విడుదల తేది: 06.06.1974



Songs List:



పారే గోదావరిలా పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి

పారే గోదావరిలా పరుగెట్టేదే వయసు 



అయ్యింది రాధమ్మ పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: రమేష్ నాయుడు

అయ్యింది రాధమ్మ పెళ్లి 



ఆడది కోరుకునే వరాలు పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి

పల్లవి:
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం  చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం చక్కని సంతానం

చరణం: 1 
కాపురమే ఒక మందిరమై పతియే తన దైవమై
కాపురమే ఒక మందిరమై పతియే తన దైవమై
అతని సేవలో తన బ్రతుకే హారతి యైపోతే
అంతకుమించిన సౌభాగ్యం ఆడదానికేముంది
ఆడదానికింకేముంది
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం  చక్కని సంతానం

చరణం: 2 
ఇల్లాలే ఒక తల్లియై  చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో తాను కరిగిపోతే
ఇల్లాలే ఒక తల్లియై చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో తాను కరిగిపోతే
అంతకు మించిన ఆనందం ఆ తల్లికేముంది.. 
ఆ తల్లికింకేముంది   
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం చక్కని సంతానం




తాగుబోతు నయంరా తమ్ముడు పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు

తాగుబోతు నయంరా తమ్ముడు 



సంకురాతిరి అల్లుడూ పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి, యస్.పి. బాలు, ఎల్.ఆర్. అంజలి

సంకురాతిరి అల్లుడూ మూతి ముడుచుకొని



కాకినాడ రేవుకాడ పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: రాజబాబు, రమాప్రభ

కాకినాడ రేవుకాడ ఓడెక్కి బొంబాయి రేవు కాడ 




ఆడది కోరుకునే వరాలు (విషాదం) పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి

ఆడది కోరుకునే వరాలు రెండే రెండు 
చల్లని సంసారం చక్కని సంతానం  (విషాదం)

Palli Balakrishna Saturday, June 10, 2023
Naa Mogudu Naake Sontham (1989)



చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 
నటీనటులు: మోహన్ బాబు, వాణీ విశ్వనాథ్, జయసుధ, దాసరి నారాయణరావు, రోహిణి, బేబి లక్ష్మీ ప్రసన్న, మాష్టర్ విష్ణు వర్ధన్ బాబు, మాష్టర్ మనోజ్ 
దర్శకత్వం: దాసరి నారాయణరావు 
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 14.06.1989



Songs List:



సరిలేదు ఈ షాపుకు పాట సాహిత్యం

 
చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి. బాలు 

సరిలేదు ఈ షాపుకు 



గాలీ ప్రేమ గాలీ...పాట సాహిత్యం

 
చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

గాలీ ప్రేమ గాలీ...



లేఖా ఇది ఒక లేఖ పాట సాహిత్యం

 
చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి. బాలు

లేఖా ఇది ఒక లేఖ 




బెజవాడ కొండెక్కి పాట సాహిత్యం

 
చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి. బాలు 

బెజవాడ కొండెక్కి 



మా ఊరి కొబ్బరి చెట్టుకు పాట సాహిత్యం

 
చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: 

మా ఊరి కొబ్బరి చెట్టుకు

Palli Balakrishna Saturday, August 20, 2022

Most Recent

Default