-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Abhishek Nama"



చిత్రం: నాగ బంధం (2026)
సంగీతం: అభే 
నేపథ్య సంగీతం: జునైద్ కుమార్ 
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ 
దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాత: కిషోర్ 
విడుదల తేది: 03.07.2026



Songs List:



నమో రె పాట సాహిత్యం

 
చిత్రం: నాగ బంధం (2026)
సంగీతం: అభే
సాహిత్యం: శ్రీహర్ష ఈమని
గానం: సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరి 

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్

లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్

నమోరే నమోరే నమోరే నమో నమోరే
నమోరే నమోరే నమోరే నమో నమోరే

నమోరే నమో నమోరే
నమో నమో నారాయణే

ఓ నమోరే నమో నమోరే
నమో నమో నారాయణే

నమోరే నమో నమోరే
సమస్తము నారాయణే

స్మరిస్తే సుభిక్షం స్ఫురిస్తే సఖాల మోక్షం
నవగ్రహ పూజ్యం నమో నారాయణాయం
రాక్షస నాశ వినవయ్యా
రక్షవై మమ్ము గనవయ్యా

వామన క్షేత్ర నివాసా
కలియుగ పాలక శ్రీనివాసా
శరణం శరణం వైకుంఠపురవాసా

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్

ఓ వైకుంఠం తెరిచెను ద్వారం
వైకుంఠం తెరిచెను ద్వారం
ఆ వైకుంఠం తెరిచెను ద్వారం ఉత్తరాయణ కాలం
అష్టాక్షరి పలికిన మంత్రం ఆయుర్ధాయైశ్వర్యం

దీనుల కష్టాలరిష్టాలు తీర్చవా
ఆశల చెరసాల నుంచి విడిపించవా
ఆపదనే ఆయుధంలా ఖండించవా
దేవాది దేవా కరుణించవా

వామన క్షేత్ర నివాసా
కలియుగ పాలక శ్రీనివాసా
శరణం శరణం వైకుంఠపురవాసా

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్

నమో పద్మనాభం
నమో విశ్వభావం
నమో శైవ పూజ్యం
భజే హమ్ భజే హమ్



సుర సుర పాట సాహిత్యం

 
చిత్రం: నాగ బంధం (2026)
సంగీతం: అభే 
సాహిత్యం: శ్రీహర్ష ఈమని
గానం: కనకవ్వ, నల్గొండ గద్దర్, అనురాగ్ కులకర్ణి, కాలభైరవ, మంగ్లీ, సాహితి చాగంటి

ఎక్కే గుర్రాలనిస్తా ఏలేటి రాజ్యమిస్తా
ఎక్కే గుర్రాలనిస్తా ఏలేటి రాజ్యమిస్తా
రావయ్యా పెండ్లికొడకా పీటల మీదికి
రావయ్యా పెండ్లికొడుకా పీటల మీదికి
రావయ్యా పెండ్లికొడకా పీటల మీదికి

సుర సుర సుర సుక్కల్ తేరా సుట్టేద్దాం.. ఓయ్ ఓయ్
తర తర తర తోరణాలే కట్టేద్దాం.. ఓయ్ ఓయ్
గోర గోర గోర గోరెల్ తేరా కోసేద్దాం.. ఓయ్ ఓయ్
మేర మేర మేర మేకల్ తేరా ఉడికిద్దాం.. ఓయ్ ఓయ్

ఊరే నేసిందే జరి అంచుల్లోన ఓ చీరె
సారె నీకంపిందే పొలిమేర అమ్మోరే
నేల దిగివచ్చి ఆకాశం యేసే పందిళ్ళే
భూమి తన ఒడిలోనే పరిసిందే పిటల్నే

ఆ మాను ఈ మార్పు నిన్ను దీవించేటి సుట్టాలయీ
ఈ పెళ్లి జోరుగా జరిపించే….

బురా ఉదేద్దాం రారా
దండోరా ఎద్దాం రారా
డోలి మోసేద్దాం రారా హైలో హైలెస్సా

సొర్ర చేపల్ని తేరా
కొర్ర మినుల్ని తేరా
గిర్ర గిర్ర తిప్పేద్దాం హైలో హైలెస్సా

చిటికేనేలు పట్టుకుంటే.. నా గజ్జెల మొనారే
మోదుగ మొగ్గయ్యే బుగ్గ.. నా గజ్జెల మొనారే
ముత్యమంత మోముమీద ముత్యాల తలంబ్రాలు
రత్నమంటి పెళ్ళికొడుకు రాతిరైతే వడ్లుకాడు
ఇన్నాళ్ల అమ్మ కూచి అమ్మను కూడా మరిచి అత్తిలెల్లిపోతాదో..

చిటికేనేలు పట్టుకుంటే.. నా గజ్జెల మొనారే
మోదుగ మొగ్గయ్యే బుగ్గ.. నా గజ్జెల మొనారే…

దరిదాపు లేని యేరులాగా పొంగే నీ ప్రేమ
దాసుంచావయ్యా మాకు జర్రా దొరా
ఆ గంగా గౌరీ లెక్క మేమున్నాం నిన్నే నమ్మి

ఊరే దాటిందో ఇక వేరే ఇంటిది ఈ కూన
కోరి ఉంటాము జనమంతా నీతోనా..
ఆరు నూరైనా నా పాణం అంటే సెల్లెనా
పారే నా రాగతన్ని సిందించి ఒట్టైనా

ఏ చోట తానున్న నా గుండెల్లోనా దాచేస్తానే
నీడల్లే తోడై ఉంటానే…

బురా ఉదేద్దాం రారా
దండోరా ఎద్దాం రారా
డోలి మోసేద్దాం రారా హైలో హైలెస్సా

సొర్ర చేపల్ని తేరా
కొర్ర మినుల్ని తేరా
గిర్ర గిర్ర తిప్పేద్దాం హైలో హైలెస్సా


Palli Balakrishna Sunday, May 17, 2026



చిత్రం: DEVIL (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
నటీనటులు: కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ 
దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాత: అభిషేక్ నామా, దేవాన్ష్ నామా
విడుదల తేది: 29.12.2023



Songs List:



మాయే చేసి మెల్లగా పాట సాహిత్యం

 
చిత్రం: DEVIL (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
సాహిత్యం: సత్య RV
గానం: సిద్ శ్రీరామ్

మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా

ఒక నవ్వే నవ్వి నేరుగా
గుండెలనె పిండేసిందిగా
తన పేరే వింటే చాలుగా
తనువంతా పులకించేనుగా

ఏదో అయ్యిందిలే
గుండె ఝల్లిందిలే
ఒయ్ పిల్లా నీవల్లే

మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా

నే ముందు మునుపులా లేనుగా
రోజు రోజుకి కొత్తగా
నా తీరుతెన్నులే మారుతున్నవే
నాకు తెలియకుండా

ఆ నిండువెన్నెలే సాక్షిగా
జాబిలమ్మనే చాటుగా
నే చూడడానికే వేచి ఉన్ననే
నిండు రేయి పగలు

పద పద పద పదమని పాదం
నీవైపే లాగిందే
రేయి గడవదులే
కలలొదలవులే
ఈ వలపే నీ వలనే

ఒక నవ్వే నవ్వి నేరుగా
గుండెలనె పిండేసిందిగా
తన పేరే వింటే చాలుగా
తనువంతా పులకించేనుగా

ఏదో అయ్యిందిలే
గుండె ఝల్లిందిలే
ఒయ్ పిల్లా నీవల్లే

మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా

ఈ అల్లరేమిటో వింతగా
గుండె లోపలే చేరగా
ఈ రూపురేఖలే కళ్ళ లోపలే
నిండి పోయినాయే

ఆ నీలిమేఘమే తోడుగా
వెంట వచ్చెనే నీడగా
నే ఉన్నపాటుగా ఎందుకో ఇలా
మారిపోయినానే

అరె అరె అరె అరె రామా
ఏమైందో ఈ వేళా
ఎద కదిలెనులే
కధ మొదలయెనే
నీ తలపే ఎందుకిలా

ఒక నవ్వే నవ్వి నేరుగా
గుండెలనె పిండేసిందిగా
తన పేరే వింటే చాలుగా
తనువంతా పులకించేనుగా

ఏదో అయ్యిందిలే
గుండె ఝల్లిందిలే
ఒయ్ పిల్లా నీవల్లే

మాయే చేసి మెల్లగా
మది దోచేసిందే సిన్నగా
చూపే చూసి సన్నగా
నను చంపేసిందే సూటిగా



దిస్ ఈజ్ లేడీ రోజీ పాట సాహిత్యం

 
చిత్రం: DEVIL (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
గానం: రాజ కుమారి 

డాన్స్ డాన్స్ మళ్ళీ కొత్తగా
డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా
డాన్స్ డాన్స్ దిస్ ఈజ్ లేడీ రోజీ

డాన్స్ డాన్స్ మళ్ళీ కొత్తగా
డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా
డాన్స్ డాన్స్ దిస్ ఈజ్ లేడీ రోజీ

మిస్టర్ మేధావి ఆశాజీవి
ఏవేవో చదివి వచ్చిందా తెలివి
నేనో మాయావి నన్నైతే తవ్వి
కనిపెట్టగలవా నేన్ దాచేవి

మేధావులంతా పైకే
పెద్దొళ్ళు ఆహ
ఏకాంత వేళ అంతా
సంటి పిల్లలు

హలో హలో డర్టీ ఫెలో
ఐ నో నీకేం కావాలో
బేరాలైతే ఉండవులేరా
చేరాలంటే నా ఒళ్ళో

కరణం గారు ఓ లాగ
కలగన్నోళ్ళు ఓ లాగ
అడిగేదైతే అదేగా
రోజు కొత్తగా ఎస్ ఐ

ఒకడడిగేది ఓదార్పు
ఒకడడిగేది తెగింపు
ఒక్కొక్కరికో జవాబు
ఎట్టా ఇవ్వనూ

నాకే తెలిసింది
అందరికీ చెప్పాలని నేను
వెంటనే కనిపెట్టా మొదలెట్టా
ఈ ప్రైవేట్ ట్యూషను

హల్లో హల్లో డర్టీ ఫెలో
ఐ నో నీకేం కావాలో
బేరాలైతే ఉండవులేరా
చేరాలంటే నా ఒళ్ళో

మొత్తం చెదిరి మత్తే కలిగి
తనువంతా చేరి నీతో ఆడినది
సిద్ధం అంటూ పోటీ పడితే గెలుపేలా

డాన్స్ డాన్స్ మళ్ళీ కొత్తగా
డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా
డాన్స్ డాన్స్ దిస్ ఈజ్ లేడీ రోజీ

డాన్స్ డాన్స్ మళ్ళీ కొత్తగా
డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా
డాన్స్ డాన్స్ దిస్ ఈజ్ లేడీ రోజీ




దూరమే తీరమై పాట సాహిత్యం

 
చిత్రం: DEVIL (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
సాహిత్యం: సందీప్ భరద్వాజ్ 
గానం: సమీర భరద్వాజ్  

దూరమే తీరమై నింగి తాకె నేలని
తారలే చేరువై నన్ను చేరె ఆమని
కళ్ల ముందరుంది నేడిలా, ఎలా
నీకు నేను చేరువైన ఈ క్షణం ప్రేమగా

అటు ఇటు ఊగుతున్న మదినాపేదెలా
కలవరమైన వేళ కరుణించి ఇలా
నను నే మరిచేలా మనసే నిను కోరెనే
నీతో పరిచయమే తెలిపే ఒక బంధమే

కళ్ల ముందరుంది నేడిలా, ఎలా
నీకు నేను చేరువైన ఈ క్షణం ప్రేమగా

ఇంతకు ముందులాగ లేనే లేనుగా
చెంతకు చేరి నన్నే మార్చేసావుగా
ఒంటరి పయనంలో తోడై నడిచావులే
ప్రేమతో సంకెళ్లను విడిపించేసావులే

వేరు వేరు దారులే ఇలా, ఎలా
ఒక్కటైనా సంబరాన ఈ క్షణం ప్రేమగా

Palli Balakrishna Tuesday, January 16, 2024


చిత్రం: భైరవ గీత (2018)
సంగీతం: రవిశంకర్
సాహిత్యం: సిరాశ్రీ
గానం: అసిత్ త్రిపాఠి, స్వీకార్, అంజనా సౌమ్య
నటీనటులు: ధనుంజయ్ , ఇర్రా మోర్
దర్శకత్వం: సిద్దార్ధ తాతోలు
నిర్మాతలు: అభిషేక్ నామ, రాంగోపాల్ వర్మ
విడుదల తేది: 14.12.2018

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా
పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా

ఈరిఈరీ గుమ్మడి పండు ఈడిపేరమ్మా
ఇంతకన్నా నాకు ఏదీ పాట రాదమ్మా
హ ఛల్ ఛల్ గుర్రం చలాకీ గుర్రం
రాజు ఎక్కె గుర్రం అది రంగుల గుర్రం
ఒప్పులకుప్పా వయ్యారి భామా
చుక్ చుక్ రైలొత్తందమ్మా

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా

గుడి గుడి గుంజమంటూ
కాలికి గజ్జె ఇయ్యాలా పాడెయ్ నా
ఓయ్ దాగుడు మూత అంటూ
ఓ చెమ్మ చెక్కాడైనా పాడెయ్ నా
ఏయ్ కోతిబావ పెళ్ళి చేసేద్దామా మళ్ళీ
ఉడతా ఉడతా ఊచ్ సిందేద్దామా తుళ్ళీ
అరె తప్పెట్లోయ్ తాళాలోయ్
దేవుడి గుళ్ళో మేళాలోయ్

ఓ సందమామ రావే జాబిల్లీ రావే
అంటూనే పాడేయ్ నా
అ ఉప్పు కప్పురమ్ము పద్యాలు
పాటకట్టేసి పాడేయ్ నా
ఏయ్ సేత ఎన్నముద్ద సెంగల్వ పూదండ
నీ నవ్వులోన ఉంది తెల్లాని పాలకుండ
అరె ఉడతబోయి ఎలక వచ్చే
ఎలకా బోయీ పిల్లి వచ్చే

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా

ఈరిఈరీ గుమ్మడి పండు ఈడిపేరమ్మా
ఇంతకన్నా నాకు ఏదీ పాట రాదమ్మా
హెయ్ ఛల్ ఛల్ గుర్రం చలాకీ గుర్రం
రాజు ఎక్కె గుర్రం అది రంగుల గుర్రం
ఒప్పులకుప్పా వయ్యారి భామా
చుక్ చుక్ రైలొత్తాందమ్మా

పుట్టలోన ఏలుపెడితే సీమ కుట్టదా
సిట్టి సిలకా తోటకెళితే పండు కొట్టదా


Palli Balakrishna Friday, January 25, 2019



చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నటీనటులు: సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: అభిషేక్ నామ
విడుదల తేది: 27.07.2018



Songs List:



Design Your Destiny పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హర్షవర్ధన్ రామేశ్వర్, హరిచరణ్,  జితిన్ రాజ్

Design Your Destiny



ఇష్క్ కర్లె పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిచరణ్, యదు కృష్ణన్, జనని 

ఇష్క్ కర్లె



సౌందర్యలహరీ పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: జితిన్ రాజ్, ఆర్తి

లహరీ లహరీ లహరీ లహరీ
ఓ క్యూటు క్యూటు క్యూటుగా
మాటలాడుతుంటె నువ్వలా
కోటి సింఫనీలనే విన్న ఫీలు
నాకు వస్తదే మరీ
ఓ స్వీటు స్వీటు స్వీటూగా
స్మైలు చిందుతోంటె నువ్వలా
హార్టు లోపలెక్కడో ఉన్న హాయి
పైకి తంతదే మరి

కసిరే కళ్ళతో నువ్వు పోట్లాడితే
సరదాగ తోచినాదె ఆ మెమొరీ
ఓణీ అంచుతో నువ్వలా తాకితే
ఒకలాంటి కైపు రేపుతుంది మరీ

సౌందర్యలహరీ ఐ యామ్ ఇన్ లవ్ లహరీ
యూ ఆర్ మై లహరీ బేబీ యూ ఆర్ మై హనీ
సౌందర్య లహరీ హరిలో రంగ హరీ
ఇపుడీ లోకంలో నువ్వే నాకు దారి.

I am feeling like it's raining
in my heart you baby 
You are so traditional
Vandhanam baby
I can't move my eyes on you
my cutie baby
i really falling for you crazy
you my honey

గుండెలో ఏదో గాయమైందే
కారణం నువ్వే అంటూ ఉందే
నువ్వు పంచుతున్నా తీపి ముందు
ఎంత గాయమైన చిన్నదే

ఆఆఆ వదలమంటూనే వదులుకోలేని
గొడవలా ఉందోయ్ నాకు నీతో
విసుగుకుంటూనే విడిచి పోలేని
మాయదారి కర్మమేమిటో

విసుగో కోపమో ఏదైనా సరే
నువ్వు చూపుతోంటే సైతుగుంది మరి
చాలా మందిలో నీలా ఎవ్వరే
నువ్వు లైఫులోన పేద్ద డిస్కవరీ  

సౌందర్యలహరీ ఐ యామ్ ఇన్ లవ్ లహరీ
యూ ఆర్ మై లహరీ బేబీ యూ ఆర్ మై హనీ
సౌందర్య లహరీ హరిలో రంగ హరీ
ఇపుడీ లోకంలో నువ్వే నాకు దారి

పమ గమ రీ దప మగ మ రీ గమ ప
నిసరి గమప మదద నిసరీరి 
పమ రిగరిస నిరి స నిస దపమ దని 
సస పప రిరి నిసరి గమ పమ ఆఆఆఆ
 
I am feeling like it's raining
in my heart you baby 
You are so traditional
Vandhanam baby

వందనం రఘు నందనా...




దంగ్ దంగ్ దంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: పద్మలత, మానసి, అనంతు 

దంగ్ దంగ్ దంగ్



శివం శివం పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కె.జే.ఏసుదాస్, యస్.పి.బాలు, హరిహరన్, కైలాష్ కెహెర్, బోంబే జయశ్రీ

పంచభూత హిత గాత్రమిదే-పంచభూత కృత క్షేత్రమిదే
పంచభూత హిత గాత్రమిదే-పంచభూత కృత క్షేత్రమిదే 
సాక్ష్యం జరిగే ప్రతి చర్యకి 
సాక్ష్యం చేసే ప్రతి ఖర్మకి 
సత్యం అసత్యాలకి విదితం రహస్యాలకి
అన్నిటి కన్నిటి  కన్నిటికున్నది సాక్ష్యం 

శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం
నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచ భూతేశ్వరం 
అనాథేశ్వరం ఆదీశ్వరం స్వర్వకాలేశ్వరం  
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పినా 
అయిదో దిక్కొకటున్నది.. పైనా..!
అది చూస్తున్నది నువ్వేమి చేసినా..!!  
పంచభూతాల సాక్షిగా 
పంచభూతేషు సాక్షిగా 
పాఠం చెబుతది పాపం పండిన రోజున
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

శబ్ద గుణకం ఆకాశం, విశ్వ జనకం ఆకాశం 
సకల కధనాన్ని సాక్షిగ వీక్షించే 
అనంత నయనం ఆకాశం 
అనంత నయనం ఆకాశం
యుగాలు క్షణాలకైనా నిగూఢ నిజాలకైనా 
సాక్ష్యం.. విశాల గగనం 
సాక్ష్యం.. విశాల గగనం
సాక్ష్యం.. విశాల గగనం
నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పినా 
అయిదో దిక్కొకటున్నది.. పైనా..!
అది చూస్తున్నది నువ్వేమి చేసినా..!!  
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

భవమానాసుతం భక్తజననుతం   
శ్రీరామ ధూతం మారుతిం 
నమతు రాక్షసాంతకం
వాయుపుత్రం వాలగాత్రం వజ్రకాయం ఆంజనేయం
వానరేంద్రం ధీరసాంద్రం దీప్రదాయం ఆంజనేయం  
వాయువుతోనే ఆయువు ఆరంభం 
వాయువుతోనే ఆయువు అంతం 
నడుమన గడిచేదే నరుని జీవితం 
అది శ్వాసల లెక్కలు మూసిన వెంటనే సమాప్తం 
చిరు చిరు చిరు చిరు చిరుగాలై
నీకూపిరి పోసిన చేతితో 
సుడి సుడి సుడి సుడిగాలై
ఆ ఊపిరి తీస్తది కాచుకో 
గాలిలో కలిసిపో గాలిలో కలిసిపో
వాయుపుత్రం వాలగాత్రం వజ్రకాయం ఆంజనేయం
వానరేంద్రం ధీరసాంద్రం దీప్రదాయం ఆంజనేయం 
ఝంఝా మారుత గమనం-పాదద్వయ చలనం 
వింధ్యా మేరు ప్రకంపనం-విధ్వంసాన్విత రచనం
సాక్ష్యం.. విశాల గగనం 
సాక్ష్యం.. విశాల గగనం
తధ్యం శత్రు మరణం తధ్యం శత్రు మరణం  
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

ఓం అగ్నిర్వా అపామాయతనం 
ఆపోవా అగ్నేరాయతనం 
అగ్ని నీడే పురోహితం-యజ్జ్ఞస్య దేవ మృత్విజం 
యోధారం రత్న ధాతామం
అగ్ని దేవం నమామ్యహం 
అగ్ని దేవం నమామ్యహం
అగ్ని దేవం నమామ్యహం..నమామ్యహం 
అమ్మ ఒడిలోని వెచ్చదనం అగ్ని ప్రేమకది చిహ్నం 
అయ్య కళ్ళలో కాంతి కణం అగ్ని కరుణకది చిహ్నం 
ప్రేమ కరుణని దూరం చేసిన ధూర్తునిపై 
ధూర్జటి ఫాల నేత్రజ్వాల విరుచుకు పడదా తక్షణం 
చిటపట చిటపట చలిమంటై
చిరచిర చిరచిర చితిమంటై
భగభగ భగభగ భగభగమని నిను
భస్మం చేయును కాచుకో
మంటలో కలిసిపో మంటలో కలిసిపో 
కాలభైరవం కాశీ క్షేత్ర పాలకం ప్రభుమ్ 
కైలాసేష కేశయం విభుమ్ 
రుద్రం త్రికాల రుద్రం త్రిలోక రుద్రం భయంకరం 
వీరాగ్రహ ధృగ్వీక్షణం విధ్యుత్గ్రహ విస్ఫోటనం 
సాక్ష్యం.. విశాల గగనం 
సాక్ష్యం.. విశాల గగనం
తధ్యం శత్రు మరణం తధ్యం శత్రు మరణం
నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పినా 
అయిదో దిక్కొకటున్నది.. పైనా..!
అది చూస్తున్నది నువ్వేమి చేసినా..!!    
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

తత్ర గంగవతి పృథివి-నిత్య సహనవతి పృథివి
స్వచ్ఛ ప్రేమవతి పృథివి-స్థైర్య శక్తిమతి పృథివి
వందేహం... పృథ్వి మాతరం
బుడి బుడి అడుగుతో మొదలై ఎన్నడుగులేసినా  
భూమిలో ఆరడుగులేరా శాశ్వతం 
మణులను గనులను వలచి ఎంతెంత తవ్వినా 
మన్నులో కలిపేందుకే నువ్వంకితం
దేనికోసం ఆరాటం మరి దేనికోసమీ అరాచకం   
నిన్ను మోసే నేలతోనే ఆడకెప్పుడూ పరాచకం 
జననిగ తనయుని లాలించే ఆ వెచ్చటి మెత్తటి చేతితో 
గడగడ గడగడ లాడించే భూకంపం తెస్తది కాసుకో
మట్టిలో కలిసిపో మట్టిలో కలిసిపో 
వందేహం పృథ్వి మాతరం 
వంఛిత పీడిత యుద్ధ క్షేత్రం 
దుర్జన భంజన మారణాస్త్రం
మౌనం సమర శంఖం 
కర్తవ్యం ఖననం  
సాక్ష్యం.. విశాల గగనం 
సాక్ష్యం.. విశాల గగనం
తధ్యం శత్రు మరణం తధ్యం శత్రు మరణం
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

గంగేచ యమునేచైవౌ గోదావరీ సరస్వతిమ్
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు 
జలేస్మిన్ సన్నిధింకురు
దాహం తీర్చే నీరే ప్రాణం తీసే ఏరై 
ముంచుకు వస్తే ఎవ్వరాపగలరు
చినుకంతే అయినా మనసున్నోడి కన్నీరు 
సృష్థిస్తోందదిగో సుడిగుండాల మున్నేరు
జలజల జలజల జలన్ జలన్ జల
జలజల జలన్ జలన్ జల జలవిలయం 
పెళపెళ పెళపెళ పెళన్ పెళన్ పెళ 
పెళపెళ పెళపెళ పెళన్ పెళన్ పెళ పెనుప్రళయం 
చుట్టుముట్టి నిను తుదముట్టిస్తది కాచుకో 
గంగలో కలిసిపో 
తధీంతధీంత తకిట ధీంతనం 
తరంగ లాస్య జలధి నర్తనం
తోంతధీంధీంత తోంతతజ్జణం
అంబుధి కంట సింహ ఘర్జనం
తధీంతోం తకిట తోంతనం
అవశ్యం ధనుజ మర్దనం 
సాక్ష్యం.. విశాల గగనం
తధ్యం శత్రు మరణం తధ్యం శత్రు మరణం
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పినా 
అయిదో దిక్కొకటున్నది.. పైనా..!
అది చూస్తున్నది నువ్వేమి చేసినా..!!  
పంచభూతాల సాక్షిగా 
పంచభూతేషు సాక్షిగా 
పాఠం చెబుతది పాపం పండిన రోజున
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం




చెలియా చూడే పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హర్షవర్ధన్ రామేశ్వర్, మధుప్రియ 

చెలియా చూడే 

Palli Balakrishna Sunday, January 13, 2019



చిత్రం: కేశవ (2017)
సంగీతం: సన్నీ .యమ్.ఆర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: శాల్మలి ఖోల్లాడే, సన్నీ .యమ్.ఆర్
నటీనటులు: నిఖిల్ , రీతూ వర్మ
దర్శకత్వం: సురేందర్ వర్మ
నిర్మాత: అభిషేక్ నామా
విడుదల తేది: 19.05.2017

మౌనంగా నీతో నడిచే నీడలా
రావాల నేను నీతో  పాటిల
 నవ్వాలో లేదో కాస్తైన
చెప్పాలో లేదో నీకే తెలుసునా
కనులకు తెలిసిన కథ ఇదని
పెదవులు అడగవు తెలుపమని
పొదుపుగా దాచిన మాటలని
కావనము మనవి వినాలి అని

తెలుసా నీకు బహుశా
తెలుసా నీకు బహుశా

నా దగ్గారేయ్ ఈ దూరం
నీతో నువ్వే
ఇంకొంచం కొంచం దూరమా
నీ తీరమే ఏ పొద్దురా
నీలా నేనై
నీలోన వాలై సందేనురా
మనవి వినమని తెలుపమని మనసుని

తెలుసా నీకు బహుశా
తెలుసా నీకు బహుశా

ఓ ప్రాణం గుప్పెడు గుండె
పాపం తప్పేముందే
నీతో సాగాలని అంతే

మౌనంగా నీతో నడిచే నీడలా
రావాల నేను నీతో  పాటిల
 నవ్వాలో లేదో కాస్తైన
చెప్పాలో లేదో నీకే తెలుసునా
కనులకు తెలిసిన కథ ఇదని
పెదవులు అడగవు తెలుపమని
పొదుపుగా దాచిన మాటలని
కావనము మనవి వినాలి అని 

Palli Balakrishna Tuesday, August 15, 2017

Most Recent

Default