-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "2019"



పాట: గాయపడిన మనుసు నాదిలె (2019)
సంగీతం: కళ్యాణ్
సాహిత్యం: రామ్-లక్ష్మణ్
గానం: రాము


గాయపడిన మనుసు నాదిలె పాట సాహిత్యం

 
పాట: గాయపడిన మనుసు నాదిలె (2019)
సంగీతం: కళ్యాణ్
సాహిత్యం: రామ్-లక్ష్మణ్
గానం: రాము

గాయపడిన మనుసు నాదిలె
గాయాలు చేసిన మనిషి నువ్వేలే
నా గుండెకూ గాయం చేసినావులే
లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావులే

ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా...
ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా
ఒక్కసారైనా కల్లో నేనొస్తానా...

గాయపడిన మనుసు నాదిలె
గాయాలు చేసిన మనిషి నువ్వేలే

మోసం జేస్తివే నన్ను నువ్వు
పిచ్చిగా నమ్మితే నిన్ను నేను
మాటలు చెప్తివే ఎన్నో నువ్వు
నీతిని మరిచవే నిన్ను నీవ్వు

మనసును విరిచింది నువ్వేలే
మంటలు రేపింది నువ్వేలే
ఎంతో పిచ్చిగా నమ్మానే
గుడ్డిగా నిను ప్రేమించానే

మనసును విరిచింది నువ్వేలే
మంటలు రేపింది నువ్వేలే
ఎంతో పిచ్చిగా నమ్మానే
గుడ్డిగా నిను ప్రేమించానే

నువ్వేలే...నువ్వేలే...నన్నిట్ఠా ముంచావే!

దారంలా నన్ను నువ్వు తెంపినావే
నా ప్రాణం ఏ నువ్వు తట్టుకోదు
మిగిలిందే ఇలా ఎద కొత
ఏమను కుందునే నా రాత

బంధాన్ని తెప్పించి నువేలే
భారాన్ని వేసింది నువేలే
మౌనం లో ముంచింది నువేలే
మాటల్తో కాల్చింది నన్నెలే

బంధాన్ని తెప్పించి నువేలే
భారాన్ని వేసింది నువేలే
మౌనం లో ముంచింది నువేలే
మాటల్తో కాల్చింది నన్నెలే

నువ్వేలే...నువ్వేలే...నా ప్రాణం నువ్వేలే!

గాయపడిన మనుసు నాదిలె
గాయాలు చేసిన మనిషి నువ్వేలే
నా గుండెకూ గాయం చేసినావులే
లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావులే

Palli Balakrishna Monday, March 14, 2022



పాట : గుర్తుకొచ్చినప్పుడల్లా (2019)
సంగీతం: కళ్యాణ్
సాహిత్యం: లక్ష్మణ్
గానం: రాము


గుర్తుకొచ్చినప్పుడల్లా (నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే) పాట సాహిత్యం

 
పాట : గుర్తుకొచ్చినప్పుడల్లా (2019)
సంగీతం: కళ్యాణ్
సాహిత్యం: లక్ష్మణ్
గానం: రాము

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గాయాలు చేశావు ఈ జన్మకు
భారాన్ని వేశావు నా జన్మకు
బంధాన్ని తెంపావు ఈ జన్మకు
మరుపంటు రావమ్మ ఏ జన్మకు

మారిపోయావే ఓ పిల్లా
మరచిపోయావే నన్నిల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

ఏం చేశానే నేనే నేరం
నేనేం చేశానే నీకే ద్రోహం
ఏం చేశానే నేనే నేరం
నేనేం చేశానే నీకే ద్రోహం

కాకపోవచ్చే నేను అందగాడిని
లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే
కాకపోవచ్చే నేను అందగాడిని
లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే

నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే
ప్రాణమే నాది కాదా...
ఊరంచు వాగుల్లో అలల నడుమ
నేనీదుతుండంగా ఈత
వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళుతుంటే
నను చూసి పెట్టిన కూత

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

ఎందుకే అంతలా ప్రేమ చూపినావలా
అందుకే ఇంతలా నొప్పి గుండెలోపల
ఎందుకే అంతలా ప్రేమ చూపినావలా
అందుకే ఇంతలా నొప్పి గుండెలోపల
నిన్ను చూసినప్పుడే ఛీ అంటే పోవునే
బాధనే వుండపోవునే

నా పేరు నీ చేతిమీద చూసి
మీ నాన్న పెట్టంగ వాత
అమ్మా అనే అరుపే మరచి
నా పేరు వచ్చే నీ నోట

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

Palli Balakrishna



పాట: లచ్చిమి నా చిన్ని లచ్చిమి  (2019)
సంగీతం: 
సాహిత్యం: పత్తిపాటి రమనాకర్
గానం: శంకర్ బాబు 


లచ్చిమి నా చిన్ని లచ్చిమి పాట సాహిత్యం

 
పాట: లచ్చిమి నా చిన్ని లచ్చిమి  (2019)
సంగీతం: 
సాహిత్యం: పత్తిపాటి రమనాకర్
గానం: శంకర్ బాబ

అబ్బబ్బా లచ్చిమి నా చిన్ని లచ్చిమి
రాయే రాయే  జర రాయే రాయే

హోయ్ లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

హోయ్ లాయి లాయి లబ్బరు బొమ్మావే
లవ్ సక్కాదనమోలే ఉన్నావే

లచ్చిమి... లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

నీ దొండపండు పెదవులు రమ్మన్నయే
నీ దోర వయసు దోచుకోమ్మన్నయే
నీ దొండపండు పెదవులు రమ్మన్నాయే
లచ్చిమి
నీ దోర వయసు దోచుకోమ్మన్నయే

నీ హంస నడకలో అందమున్నదే
నిన్ను చూస్తే పాణం జివ్వమంటున్నాదే
నీ హంస నడకలో అందమున్నదే
నిన్ను చూస్తే పాణం జివ్వమంటున్నాదే

లచ్చిమి.. లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

నీ కందిరీగ నడుము కవ్వించెనే
నీ కనుసైగలు కైపె ఎక్కించెనే లచ్చిమి
నీ కందిరీగ నడుము కవ్వించెనే
నీ కనుసైగలు కైపె ఎక్కించెనే
నీ వాలు జడ వయ్యారం చూస్తనే
నా మనసంతా ఐసై పాయేనే లచ్చిమి
నీ వాలు జడ వయ్యారం చూస్తనే
నా మనసంతా ఐసై పాయేనే

ఓ లచ్చిమి... లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

నీ సొగసులిస్తనంటే పిల్లా నాకు
నా ఆస్తి పాస్తి రాసిస్తా నీకు లచ్చిమి
నీ సొగసులిస్తనంటే పిల్లా నాకు - లచ్చిమి 
నా ఆస్తి పాస్తి రాసిస్తా నీకు

నీకు నాకు ఒకటే తమలపాకు
నువు లేచొస్తే తాళి కడతా నీకు నీకు నీకు
నీకు నాకు ఒకటే తమలపాకు
నువు లేచొస్తే తాళి కడతా నీకు

ఒరేయ్...ఒరేయ్...
లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

నువ్వు చీర కట్లో సూపరుగున్నావే
ఓర చూపుల్తో చంపేస్తున్నావే
నువ్వు చీర కట్లో సూపరుగున్నావే
ఓర చూపుల్తో చంపేస్తున్నావే
నీ కిలకిల నవ్వులు మస్తుగున్నయే
నా కలలకస్తే ఖతర్నాక్ గున్నావే లచ్చిమి
నీ కిలకిల నవ్వులు మస్తుగున్నాయే - లచ్చిమి
నా కలలకస్తే ఖతర్నాక్ గున్నావే

అరెరెయ్...లచ్చిమి నా చిన్ని లచ్చిమి
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ

అబ్బా... ప్లీజే.... 

లచ్చిమి నా చిన్ని లచ్చిమి 
ప్లీజే....
అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చు మీ
లాయి లాయి లబ్బరు బొమ్మావే
లవ్ సక్కదనమోలే ఉన్నావే
లాయి లాయి లబ్బరు బొమ్మావే
లవ్ సక్కదనమోలే ఉన్నావే
ఓ లచ్చిమీ...

Palli Balakrishna Sunday, March 13, 2022
/>


పాట: అనాడేమైనంటిన తిరుపతి (2019)
సంగీతం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
గానం: లక్ష్మి
దర్శకత్వం: తిరుపతి మట్ల


అనాడేమైనంటిన తిరుపతి పాట సాహిత్యం

 
పాట: అనాడేమైనంటిన తిరుపతి (2019)
సంగీతం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
గానం: లక్ష్మి

త్వరలో...

Palli Balakrishna Thursday, December 30, 2021



చిత్రం: 90ML (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: కార్తికేయ రెడ్డి,నేహ సలోంకి
దర్శకత్వం: ఎర్ర శేకర్ రెడ్డి 
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ 
విడుదల తేది: 06.12.2019



Songs List:

Palli Balakrishna Wednesday, September 1, 2021


చిత్రం: పండుగాడి ఫోటో స్టూడియో (2019)
సంగీతం: వినోద్ యాజమాన్య
నటీనటులు: ఆలి, భవ్య శ్రీ
దర్శకత్వం: దిలీప్ రాజా
నిర్మాత: గుదిబండి. వెంకట సాంబిరెడ్డి
విడుదల తేది: 21.09.2019







చిత్రం: పండుగాడి ఫోటో స్టూడియో (2019) సంగీతం: వినోద్ యాజమాన్య సాహిత్యం: రాంబాబు గోశాల గానం: వినోద్ యాజమాన్య, శ్రేయా ఘోషల్ సాకీ: నిన్నే తలచి తలచి నా గుండె కొట్టుకుంటుందే పల్లవి: నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని నువు అవునన్నా కాదన్నా నీలోనే సగమవన నువ్వే ప్రాణమే అని మరువనులే కలనైనా విడువనులే ఏమైనా జతగుంటా చితినైనా మనదొక జగమవనీ పెదవుల దాటిన మౌనము ఈ క్షణమే మరి మరి ప్రేమగ పిలిచెనులే నిను కోరి కోరి కోరి చేరుకున్నా... ప్రియా నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని చరణం: 1 ఇది ప్రేమ అని తెలుసు ఇక ఆగదే మనసు నన్ను నన్నుగా ఉండనీయదే మాట విననంటుందా మాయలో పడుతున్నా లోకమే నేనందా నమ్మవన్నదా మన కలయే నిజము అని మన కదయే ఋజువివని ఊహాలకే ఉపిరిలా నీ నవ్వే వరమాయే ఇన్నాళ్ళుగా మనమిద్దరం ఇపుడవ్వుదాము ఒకరికొకరులా నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని చరణం: 2 కలలాంటి నన్ను ఇలా కడలల్లే దోచేవా ప్రాణబంధమై నన్ను అల్లవా కంటి రెప్పైనిన్ను కాచుకుంటా నేను గుండె చప్పుడల్లే ఉండిపోనా గడియైనా విడిపోనీ పయణమిలా మొదలవని నేనుందే నీకోసం అణువణువు నీ సొంతం నీతో ఇలా నడిపించిన మన ప్రేమ అమరమఖిలమేనులే నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని








చిత్రం: పండుగాడి ఫోటో స్టూడియో (2019)
సంగీతం: వినోద్ యాజమాన్య
సాహిత్యం: రాంబాబు గోశాల
గానం: వినోద్ యాజమాన్య, 

పల్లవి
ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి
ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి
నీ ప్రేమనే నా గుండెల్లోన దాచి
నా ప్రాణమే ఇన్నాళ్లు ఉంది వేచి
మనసు మనసు మరి మురిసేనా
కనులు కనులు ఇక కలిసేనా
కలల వాన జడి కురిసేనా
యదన లయల సడి ఎగసేనా

మాయ నేదేనా ఈ మాయ నీదేనా
హాయి నీదేనా ఈ హాయి నీదేనా

ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి
ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి

చరణం: 1
ఎన్నెన్నో వర్ణాల హరివిల్లై నా సొగసే
మీకోసం ఈ క్షణమే విరబూసే
నీ చిన్ని చిన్ని చిన్ని చిన్ని పలుకులే
నా చిట్టి చిట్టి మనసుని తాకగా
తొలి తొలి తొలి తొలి ప్రేమలే
ఈ చలి గిలి అలజడి రేపగా

అడుగు అడుగు పడు పయనాన
అడగలేనులే మౌనాన
మొదటి సారి ఈ ధింతననా
మురలైంది నీ వలనేనా

మాయ నేదేనా ఈ మాయ నీదేనా
హాయి నీదేనా ఈ హాయి నీదేనా

ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి
ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి

చరణం: 2
నిన్నే చూడకుంటేనే ఊపిరాగేలావుంది
నువ్వెదురే వస్తుంటే బాగుందే
నా మది నది పరుగులు తీసెలే
నీ జతకది సులువుగా చేరెలే

పరువపు పదనిస మోగెలే
నా తలపులు ఊగిసలాడెలే

ఆశ ఆశ పడి పిలిచేను
నిన్ను చూసి తపియించేను
ఎంతో ఇష్టపడు తున్నాను
ఇపుడే నాకు ఇది తెలిసేను

మాయ నేదేనా ఈ మాయ నీదేనా
హాయి నీదేనా ఈ హాయి నీదేనా

ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి
ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి



Palli Balakrishna Friday, May 21, 2021



చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: రాజ్ తరుణ్, షాలిని పాండే
దర్శకత్వం: జి. ఆర్. కృష్ణ
నిర్మాత: శిరీష్ (దిల్ రాజు సమర్పణ)
విడుదల తేది: 25.12.2019



Songs List:



You Are My Heart Beat పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: బాలాజీ
గానం: అనురాగ్ కులకర్ణి

You Are My Heart Beat



లా లా లా లా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీ మణి
గానం: సమీరా భరద్వాజ్

లా లా లా లా… నిజంలా నా కల..
లా లా లా లా… నీ వల్లే నేనిలా..

కనుపాపకిన్ని కాంతులా… చిరునవ్వుకిన్ని చిందులా..
ఒక నిన్నలోంచి నన్ను కోరి పూసే నేడిలా..

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా
ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా

లా లా లా లా… నిజంలా నా కల..
లా లా లా లా… నీ వల్లే నేనిలా..

చుక్కలందుకున్న రెక్కలా… చిక్కు తెంచుకున్న లేక్కలా..
వెన్నెలడ్డుకున్న రేయిలా… ఉన్నానివాల…

ఒక్కొక్క క్షణమిలా… ఒక్కొక్క ఋతువులా.. మారుతోందిలా
నీవెంటే అడుగనీ… నీకంటే ఎవరనీ.. అడుగుతున్న మదిలా

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా
ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా

చెప్పలేని మాటలన్నిలా… చెప్పమంటూ గొడవే ఎలా
విప్పమంటు పెదవే ఇలా… పదాలు చాలా

నీ నీడ భుజముపై.. నా నీడ హాయిగా తల వాల్చేలా
ఇన్నాల ప్రేమలో… ఈ ప్రేమ లేదని.. తెలుసుకున్న మదిలా

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా
ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా
ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా






అదే ఊరు పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: నూతన మోహన్

అదే ఊరు




చిరునవ్వే పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: బాలాజీ
గానం: ఇషాక్ వాలి

చిరునవ్వే




హోలా హోలా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీ మణి
గానం: అనురాగ్ కులకర్ణి, అదితి భావరాజు

హోలా హోలా



అనగనగా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరి లోకం ఒకటే (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: బాలాజీ
గానం: మోహన భోగరాజు

అనగనగా

Palli Balakrishna Tuesday, March 2, 2021

Most Recent

Default