చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు / ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం
గానం: సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య
సందమామా - ఓ సందమామా
అందమైన ఓ సందమామా
తొలికొండ యెనకాలా తొంగిసూసీ
పండువెన్నెల తెచ్చి పారబోసి
నువ్వు పరుగెత్తిపోతావు ఎందుకోయీ
నిన్ను పట్టొకో రెవ్వరు బలిమి సేసి
నువ్వు అలసీపోతావోయి ఆగవోయీ !
నిను మాసి ఓ సుక్క - మిలామిలా మెరిసింది
కను సైగ సేసింది తుదకి కలుసుకుంది
పలుకరించవేమి సందమామా
పలు బంగారమ సందమామా
దూరాన మేఘాన - దోబూచులాడుదువు
చిరునవ్వు లెందుకో తరుచు దాచుదు నీవు
తేట తెల్లము సేయ రాదొ ప్రేమా
చాటుమాటూయేల చందమామా
ధన్యతమము నా జన్మ లలనా పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం
గానం: కె. రఘురామయ్య
ధన్యతమము నా జన్మ లలనా
అగణ్యమగు నీ ప్రేమ కలనా
పుణ్య మేమి నే చేసితినో
లావణ్యరాశి నిను చేకొనగా
ప్రేమ మలచి ప్రతిమ చేసి
ప్రేమ చిలికి ప్రాణముపోసి
ప్రేమమంత్ర ముపదేశము చేసి
నాకై నిను నిర్మించే విరించి
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం
గానం: కె. రఘురామయ్య, సి. కృష్ణవేణి
ప్రేమ మధువుల గ్రోల అనురాగ జలదిదే
పావన శీల ఇదే ప్రేమ మధువుల గ్రోల
మధురాతి మాధుర్యమైన నీ ప్రనయంబుతో వివశ్యమాయే
ఆనంద రసానుభూతి నా మన మేమో అతివా రావో
జీవన వినోదలిలా తమ యవ్వనమున ఈ ప్రేమ
ప్రణయ జీవులెడబాయగ ఔనా నిముషమైనా
మధుర మధుర ప్రణయ జలది
ఓల లాడి తన్మయమై
నీలో నేను నాలో నీవు లీనమైపోదాము లేదేమెరెకా
ఉన్నావా లేవా కరునింపగ ఓ దేవా పాట సాహిత్యం
చిత్రం: గొల్లభామ (1947)
సంగీతం: ఎస్.బి దినకర్ రావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మం
గానం: సి. కృష్ణవేణి
ఉన్నావా లేవా కరునింపగ ఓ దేవా
అతి హీనపు బ్రతుకేల నన్ గొనిపోవా
నా ప్రాణపతి నీ సుతునీ మాయముచేసి
యేకాకినిచేసే దుఃఖాంబుధి త్రోసీ
యేనాటికి తుదిలేని నా జన్మ మికేలా
యేపాపము నే చేసితినో కోప మీదేలా
యేనాటికి నాకష్టముల కంతమె లేదా
నాకెందుకు శిక్షా యిదియేమి పరీక్షా
జీవచ్ఛవమై దురితముననే మనవలెనా