Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kuberaa (2025)




చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
నటీనటులు: ‘కింగ్’ నాగార్జున అక్కినేని , ధనుష్ , రష్మిక మందన్న 
దర్శకత్వం:  శేఖర్ కమ్ముల 
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు 



Songs List:



నా కొడుకా పాట సాహిత్యం

 
చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
గానం: సిందూరి విశాల్ 
సాహిత్యం: నంద కిషోర్ 

పచ్చ పచ్చని చెల్లల్లో
పూసేటి పువ్వుల తావుల్లో
నవ్వులు ఏరుతు నడిచేద్దాము
చేతులు పట్టుకో నా కొడుకా..

కడుపున నిన్ను దాచుకుని
నీడల్లే నిన్ను అంటుకుని
కలిసే ఉంటా ఎప్పటికీ
నీ చేతిని వదలను నా కొడుకా..

పదిలంగా నువ్వు నడవలే
పది కాలాలు నువ్వు బతకాలే
చందమామకు చెబుతున్నా
నిను చల్లగా చూస్తాది నా కొడుకా..

ఆకలితో నువ్వు పస్తుంటే
నీ డొక్కలు ఎండిపోయేరా
చెట్టు చెట్టుకి చెబుతున్నా
నీ కడుపు నింపమని నా కొడుకా..

నిద్దురలేక నువ్వుంటే
నీ కన్నులు ఎర్రగా మారేరా
నీలి మబ్బుతో చెబుతున్నా
నీ జోల పాడమని నా కొడుకా..

మనుషికీ మనిషే దూరమురా
ఇది మాయా లోకపు ధర్మమురా
బడిలో చెప్పని పాఠం ఇదిరా
బతికే నేర్చుకో నా కొడుకా..

తిడితే వాళ్లకే తాగిలేను
నిను కొట్టిన చేతులు విరిగేను
ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు
ఓపికతోటి నా కొడుకా..

రాళ్ళు రప్పల దారులు నీవి
అడుగులు పదిలం ఓ కొడుకా
మెత్తటి కాళ్ళు ఒత్తుకు పోతాయి
చూసుకు నడువురా నా కొడుకా..

చుక్కలు దిక్కులు నేస్తులు నీకు
చక్కగా బతుకు ఓ కొడుకా
ఒక్కనివనుకొని దిగులైపోకు
పక్కనే ఉంటా నా కొడుకా..

పాణము నీది పిట్టల తోటిది
ఉచ్చుల పడకు ఓ కొడుకా
ముళ్ళ కంపలో గూడు కట్టేటి
నేర్పుతో ఎదగారా నా కొడుకా..

ఏ దారిలో నువ్వు పోతున్నా
ఏ గండం నీకు ఏదురైనా
ఏ కీడు ఎన్నడు జరగదు నీకు
అమ్మ దివేనిది నా కొడుకా..

ఈ దిక్కులు నీతో కదిలేను
ఆ చుక్కలే దిష్టి తీసేను
ఏ గాలి ధూళి సోకదు నిన్ను
అమ్మ దివేనిది నా కొడుకా..

ఏ పిడుగుల చప్పుడు వినపడినా
ఏ బూచోడికి నువ్వు భయపడినా
ఈ చీకటి నిన్నేం చెయ్యదులేరా
అమ్మ దివేనిది నా కొడుకా..
అమ్మ దివేనిది నా కొడుకా.



అనగనగా కథ.. పాట సాహిత్యం

 
చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: హైడే కార్తీ , కరిముల్లా 

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

నమ్మే వాడిని అమ్మేయడం….
మొక్కేవాడిని తొక్కేయడం..
దొరికేవాడిని దోచేయడం..
తల వంచేవాడిని ముంచేయడం..

యుగాల నుండీ..
జరుగుతున్న కథ..
యుగాంతమైనా మారిపోని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

వంతెన కట్టేదొకడు..
దాన్ని దాటే వాడింకొకడు..
నిచ్చెన వేసేదొకడు…
పైపెకెక్కే వాడింకొకడు..
ముందుకు తీసుకు వెళ్ళేవాడిని అక్కడితోనే ఆపడం..
ఎత్తుకు మోసుకు వెళ్ళేవాడిని లోతులలోనే ఉంచడం..

పేదల నెత్తుటి మరకలు అంటని పెద్దల సిరి ఉందా!??
బీదల కన్నుల నీటిని తుడవని కథలకు అర్ధం ఉందా..?!?

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

లేని వాడికి నోటి ఆకలి..
ఉన్నవాడికి నోట్ల ఆకలి..
నోటికి తెలుసును వద్దు వద్దు..
నోట్లకు తెలియదు హద్దు పద్దు..

బలహీనుడికి ఆశే ఉంటది..
బలవంతుడికి అత్యాశుంటది..

ఓ.. ఆశకు బ్రతుకే సరిపోద్ది..
ఒక బ్రతుకే సరిపోద్ది..
అత్యాశే అందరి బ్రతుకులతో ఆట ఆడుకుంటది..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..



పోయిరా మావా పాట సాహిత్యం

 
చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: ధనుష్ 

ఏయ్ వన్ డే హీరో నువ్వే ఫ్రెండ్
నీ కోసమే డప్పుల సౌండు
అస్సలు తగ్గక అట్నేఉండు
మొక్కుతారు కాళ్ళు రెండు
నిన్నే చూస్తున్నది చూడు
ఊరు మొత్తం దేవుడి లాగ
వన్ వే లోన నువ్ వెళ్లిన ఆఫర్ నిన్నను అందరిలాగా
రధం మీద నువ్వే అలాగ
దూసుకువెళ్తా ఉంటె అబ్బో యమగా
సీఎం పీఎం ఎదురే వచ్చిన
నువ్వు సలాం కొట్టే పనే లేదుగా
ముందరిలాగా అంత ఈజీ గా
నిన్నే కలుసుకోలేరుగా
నీతో ఫోటో దిగాలన్న
చచ్చేతంత పనౌతుందిగా
ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా

చూస్తూ చూస్తూనే మారింది
నీ రేంజ్ ఈరోజున
నిన్నే అందుకోవాలి అనుకుంటే
సరిపోదే ఏ నిచ్చెన
సొమ్ములైన సోకులైన తలొంచావా నీ ముందర
నిన్నే కొనే ఐస పైసా ఈ లోకం లో యాడుందిరా
నిన్నే తిట్టి గళ్ళ పెట్టి సతాయించే సారె లేదు రా
ఓఓఓ ఓఓఓ…..
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా

నీతోటో మాట్లాడి గెల్చేటి దమ్మే ఈడ లేడేవాడికి
స్వర్గం అరేయ్ నీ జేబులో ఉంది బాధే లేదు ఏనాటికి
ఏరోప్లేనే రాకెట్టు నీ కాళ్ళ కిందే ఎగరాల్సింది
ఎంతోడైన తలే ఎత్తి ఆలా నిన్ను చూడాల్సిందే
తల రతన్ చెరిపి మల్ల రాసేసుకో నీకే నచ్చింది
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా


Palli Balakrishna Wednesday, December 10, 2025
Coolie (2025)




చిత్రం: కూలీ (2025)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: సుభాషిణి , అనిరుధ్ రవిచందర్ 
నటీనటులు: సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, శృతి హసన్ 
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ 



Songs List:



మోనికా... పాట సాహిత్యం

 
చిత్రం: కూలీ (2025)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: సుభాషిణి , అనిరుధ్ రవిచందర్ 

బెలూచీ ఎగిరే వచ్చింది
కడలే కదం తొక్కే సునామియే తెచ్చింది
మోనికా బెలూచీ తగ్గదీ ఎనర్జీ
అదిరే అందాలున్న తుఫాను లే అమ్మాడీ

టక్కున చూసిందో హై పల్సే బాడీ
హోయలే చేపలకే నేర్పించులే
కలకే కలరేసే జిలేబీ లేడీ
సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవ్వునే

మోనికా…
మై డియర్ మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా

హే జుమ్ జుమ్ జుమ్..తాకు
జుమ్మడా జుమ్మా జుమ్..తాకు
జుమ్ జుమ్ జుమ్..తాకు
జుమ్మడా జుమ్మా జుమ్..తాకు
లక లక లక లక లక లక లక
జుమ్ జుమ్ జుమ్..తాకు
జుమ్మడా జుమ్మా జుమ్
వచ్చి ఆడుకో

నజరానా పట్టుకోవా నాయగారం వేతకవా
నను నీవే హత్తుకోరా హత్తుకోరా
ఒక మాటు కలవవా
మత్తు ఎక్కి తిరగవా
పరువాలే పట్టువీరా పట్టువీరా

పోయే టైమ్‌ వస్తే ఎడ్చి అరవద్దే
పూజ ఆటల్లో ఇన్నొసెంట్ కానే వద్దు
సగమే కోకుంటే నిజము మాటొద్దే
పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదోయ్

మూనే ఎరుపెక్కే అందాల రాణీ
మనసు పైపైనే పడబాకిలా
ఇనుమే చెరుకయ్యే బొప్పాయి లారీ
భాష చేయి పడితే మారేనిలా

మోనికా…
మై డియర్ మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా

హే జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్..తాకు
జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్..తాకు
హే జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్మా
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్మా..
జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు
వచ్చి ఆడుకోరా

జుమ్ జుమ్ జుమ్
ఇక్కడికి రా మోనికా

మోనికా… మై డియర్
లక లక లక లక లక లక లక
జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు

మోనికా… మై డియర్
లక లక లక లక లక లక లక
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్..తాకు

Palli Balakrishna
Mirai (2025)





చిత్రం: మిరాయ్ (2025)
సంగీతం: గౌర హరి
సాహిత్యం: చంద్రబోస్ 
గాయకుడు: శంకర్ మహదేవన్ 
నటీనటులు: తేజ సజ్జ , మంచు మనోజ్
దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్  &  కృతి ప్రసాద్ 



Songs List:



రుధిర మగధ పాట సాహిత్యం

 
చిత్రం: మిరాయ్ (2025)
సంగీతం: గౌర హరి
సాహిత్యం: కార్తీక్ ఘట్టమనేని   
గాయకుడు: శ్రీచరణ్  భాస్కరుని, చైతు  సత్సంగ్, హర్షవర్ధన్ చావాలి 

రుధిర మగధ 



వైబ్ ఉంది బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: మిరాయ్ (2025)
సంగీతం: గౌర హరి
సాహిత్యం: కృష్ణ కాంత్  
గాయకుడు: అర్మాన్ మాలిక్ 

ఓ పొరి దిల్‌దారు వయ్యారివే
నీ చూపు తల్వారుతో కొయ్యకే
గాడ్ ఏమో నీకు నాకు రాసుంటడే
మన జోడీ ఒకటైతే మ్యాడ్ ఉంటదే…

వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నుపే వైబ్ ఉందిలే
వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే

వెరే ప్లానెట్టా
ఇంత అందం యెట్ట
నాకెట్టా పడ్డావులే..

కళ్లో డ్యూయెట్టా
స్వీటీ చోక్లట్టా
నా ఫేట్‌ మారిందిలే..

స్టెప్పులు వేసిందే
దినక్ దిన కొత్తగా నా గుండె
డప్పులు కొట్టిందే
దినకు దిన
పక్కాన నువ్వుంటే

నీ పేరు టాటూ లా రాయించనా?
మన పెయరే హిట్ పెయరే చేసేయానా?…ఆ

వైబ్ ఉంది బేబీ… వైబ్ ఉంది బేబీ

వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నుపే వైబ్ ఉందిలే
వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే



జైత్ర యాత్ర పాట సాహిత్యం

 
చిత్రం: మిరాయ్ (2025)
సంగీతం: గౌర హరి
సాహిత్యం: చంద్రబోస్ 
గాయకుడు: శంకర్ మహదేవన్

జైత్రాయ
ధైర్యం జైత్రాయ
సర్వం జైత్రాయ

కార్య సిద్ధికై తేగించు పోరులో
గ్రహాలు శుభమని అనుగ్రహించవా

మాతృ సేవకై తపించు త్రోవలో
జగాలు జయమని ఆశీర్వదించవా

ధర్మం జైత్రాయ..
ధైర్యం జైత్రాయ..
సర్వం జైత్రాయ..

కార్య సిద్ధికై తేగించు పోరులో
గ్రహాలు శుభమని అనుగ్రహించవా

మాతృ సేవకై తపించు త్రోవలో
జగాలు జయమని ఆశీర్వదించవా

అగ్ని కీలలే దిక్సూచి అవ్వగా
మేఘాల జ్యోతులే దీవించి పంపగా

నిశబ్ద శబ్దమే సంకేతమివ్వగా
నక్షత్ర మాలాలే లక్ష్యాన్ని చూపవా

ప్రతి కణం నీ మాతృ భిక్ష
ప్రతి క్షణం ఆ ప్రేమ రక్ష

జ్వలించగా నీ జీవితేచ్ఛ
ఫలించదా నీ దీక్ష….


Palli Balakrishna Monday, December 8, 2025
Peddi (2025)




చిత్రం: పెద్ది (2026)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
నటీనటులు: రాంచరణ్, జాహ్నవి కపూర్ 
దర్శకత్వం: బుచ్చిబాబు
నిర్మాత: వెంకట సతీష్ కిలారు , ఇషాన్ సక్షేన 
విడుదల తేది: 27.03.2026



Songs List:



చికిరి చికిరి పాట సాహిత్యం

 
చిత్రం: పెద్ది (2026)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: బాలాజి
గానం: మోహిత్ చౌహాన్ 

ఓ హో.. ల లా లా లాల..
ల ల లా లా లా ..

ఓ హో..హో.. ల లా లా లాల..
ల ల లా లా లా ..

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
దీనందాలో లెక్క,
దీనేషాలో తిక్క,
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక
చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక
ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..
చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…

ఆ ముక్కు పై.. పెట్టి కోపం
తొక్కేసావే.. ముక్కెరందం
చింతాకులా.. ఉందే పాదం
చిర్రాకులే.. నడిచే వాటం..
ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు,
నీ మత్తే తాగిందా తాటికల్లు.

కూసింతే చూత్తే నీలో వగలు
రాసేత్తారుగా ఎకరాలు
నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు

హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా.

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
దీనందాలో లెక్క,
దీనేషాలో తిక్క,
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

తందనాననా తర్ రంధనాననా
తర్ రంధనాననా తర్ రంధనానా..

తందనాననా తర్ రంధనాననా
తర్ రంధనాననా నా నా నా నా…

నచ్చేసావే మల్లెగంపా.. నీ అందాలే నాలో దింపా
ఏం తిన్నావో.. కాయ దుంపా
నీ యవ్వారం.. జరదా ముంపా
నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి
లొట్టెసి ఊరాయి నోట నీళ్లు..

నీ సింగారాన్ని చూత్తావుంటే సొంగకార్చుకుందే
గుండె బెంగ నిదరని మింగేసిందే చెయ్యలేసే.. చెయ్యలేసే…

చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
దీనందాలో లెక్క
దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక
చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక

Palli Balakrishna
Andhra King Taluka (2025)




చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
నటీనటులు: రామ్ పోతినేని,  ఉపేంద్ర , భాగ్యశ్రీ బోర్స్ 
సంగీతం: వివేక్  & మెర్విన్ 
గాయకుడు: రామ్ పోతినేని 
సాహిత్యం: భాస్కరభట్ల 
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ 
విడుదల తేది: 27.11.2025



Songs List:



Unlotld Emotions పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: స్వరాగ్ కీర్తన్

Unlotld Emotions



First Day First Show పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: దినేష్ కక్కేర్ల 
గానం: ఆంధ్ర కింగ్ తాలూకా ఫాన్స్ 

హే సిల సిల సిల సిల
హే గల గల గల గల
హే సిల సిల సిల సిల
హే గల గల గల గల

హే సిల సిల సిల సిల
హే గల గల గల గల
హే సిల గల

హే సిల సిల సిల సిల
హే గల గల గల గల
హే సిల గల

ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు

మన ఆంధ్రాకే కింగు

హే అన్నకు మేమే ఫ్యాన్సు
ఇప్పుడేస్తాంరా డాన్సు

వచ్చిందిరా పిలుపు
అన్నదేరా గెలుపు

మావోడి గ్లామరు
పాపలకే ఫీవరు

ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు కింగూ

మన ఆంధ్రాకే కింగు
మన మన మన మన మన మన
మన ఆంధ్రాకే కింగు

అదే అదే అదే అదే అదే

అన్నకు మేమే ఫ్యాన్సు
ఇప్పుడేస్తాంరా డాన్సు
అన్నకు మేమే ఫ్యాన్సు
ఇప్పుడేస్తాంరా డాన్సు

వచ్చిందిరా పిలుపు
అన్నదేరా గెలుపు
వచ్చిందిరా పిలుపు
అన్నదేరా గెలుపు

మావోడి గ్లామరు
పాపలకే ఫీవరు
మావోడి గ్లామరు
పాపలకే ఫీవరు

ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు
ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు



Puppy Shame పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: రామ్ పోతినేని 

వీడు మొహం ఏంట్రా మా డిపోయింది
మావ నువ్వు అందుకోరా

పోతదన్నావ్ ఇప్పుడేంటన్నా
ఏ.. హిట్ కొట్టాం
సొండ్ ఏదన్నా (లేదన్నా)

తొందరేంటి అరే ఉండన్నా
బెట్టు కట్టి జరుపోతుంటే ఊరుకుంటానా
ఈ బక్కోడి చెండె తియ్యనా
ఆ బండొడి గుండె గియ్యనా
మీదకేక్కేసి తొక్కేసి కుమ్మనా
నువ్వు ఉండన్నా..

ఈ అన్నకి బొట్టే పెట్టారా
ఆ అన్నకి దండే వెయ్యరా
ఏ ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా మర్యాదలే చేయాండ్ర

అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే విడి సీటే చిరిగిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే

రేయ్ రేయ్ రేయ్ మనిషి అన్నాక
భయం, భక్తి, బలం, బలుపు, ఉండాలి
అలాగే ఏది ఎప్పుడు ఎలా ఎంత ఉండాలో కూడా తెలిసుండాలి
తెలుసుకుంటే బాగుపడతావ్ లేకపోతే పైకి పోతావ్

దండమెత్తి పాలు పొయ్యన్నా
టెంకాయే తీసి కొట్టన్నా (కొట్టన్నా)
హారతిచ్చి కాళ్ళు మొక్కన్నా
ఫోటో దించుత ఫోజు ఇవ్వన్నా
హు నవ్వన్నా

ఏ బిత్తర చూపులు ఏంటన్నా
అక్కడున్నది ఆంధ్ర కింగ్ అన్న
ఎహే మీలాగే సప్పగా ఉందన్నా పసలేదన్న

ఏ ఫుల్లుగా సౌండే పెట్టారా
రయ్ రాయంటూ రచ్చే లేపరా
ఆ హంగు బొంగు పోయేదాకా
ఎడా పేడ దరువేయ్ రా

అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే విడి సీటే చిరిగిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే

అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా
నీకన్నా తక్కువ కాదన్నా
నువ్వెంత అనుకుంటే నికరంగా
నీకంటే ఎక్కువే ఉందన్నా

అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా
నీకన్నా తక్కువ కాదన్నా
నువ్వెంత అనుకుంటే నికరంగా
నీకంటే ఎక్కువే ఉందన్నా

అయ్యయ్యయ్యో పోయే అరె అయ్యో అయ్యో పోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే అరె అయ్యో అయ్యో పోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే




నువ్వుంటే చాలే... పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: రామ్ పోతినేని
గానం: అనిరుధ్ రవిచందర్ 

ఒక చూపుతో నాలోనే పుట్టిందే…
ఏదో వింతగా గుండెలో చేరిందే…
నువ్వెవరో నాలో అని అడిగానే…
తానేగా ప్రేమని తెలిపిందే…

పరిచయం లేదని అడిగా ప్రేమంటే..
కలిసాంగా ఇకపై మనమేగా అందే
వెతికిన దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే..

నువ్వుంటే చాలే…

నువ్వుంటే చాలే…
నువ్వుంటే చాలే…

మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే..
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..

దారేలేని ఊరినే అడిగానుగా
నువ్వేగా దారని నాకు చూపుతుంది
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరె గాలి వానై నన్ను తాకుతుంది

నాకే తెలియని నాలో యుద్ధమా.. లోలోన సంద్రమా..
లేదే పొంగుతున్నదే ఇంకేదో…
పేరు లేదుగా ఇంతే మాట రాదుగా
అంతే ఒప్పుకోమరి వింతేలే…

నువ్వుంటే చాలే…

మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే..
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…

నువ్వుంటే చాలే…



చిన్ని గుండెలో పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: సత్యయామిని, మెర్విన్ 

రంగు రంగు తారలన్నీ
తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటీలా
పైన లేని వెన్నెలంతా
నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా

మంచు వాన నన్ను ముంచేనంట
వాన విల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంట
ఈ లోకమంతా నిన్ను చూసేనంట
ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా

రంగు రంగు తారలన్నీ
తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటీలా
ఆ పైన లేని వెన్నెలంతా
నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా

చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఏ ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా

చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
నా ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యానే ఇలా

ఎంత అందమో నీ లోకమే
ఎంతైనా ఈ హాయి కలనే కదా
నీ రాకనే నాకో కల
కలలేవో నిజమేదో తేల్చేదెలా

ఏ హద్దులు ఆపనే లేని
ప్రేమంటే నీదే కదా
ఓ గుండెలో దాచలేని
ఆ ప్రేమనిచ్చింది నువ్వే కదా

చిన్ని గుండెలో ఇన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతానే నాతో రా ఇలా

చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యానే ఇలా

Palli Balakrishna
Mana Shankara Vara Prasad Garu (2025)




చిత్రం: శంకర వరప్రసాద్ (2026)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు: చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరిన్ త్రెసా 
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: 	సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
విడుదల తేది: 15.01.2026



Songs List:



హే మీసాల పిల్ల.. పాట సాహిత్యం

 
చిత్రం: శంకర వరప్రసాద్ (2026)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
సాహిత్యం: 	భాస్కరభట్ల
గానం: 	ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్

హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
పొద్దున్ లేచిన్ దెగ్గర నుంచి డైలీ యుద్ధాల
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళ

అట్టా కన్నెర్ర జెయ్యలా కారాలే నూరేలా…
ఇట్టా దుమ్మెత్తి పోయ్యలా దూరాలే పెంచేలా
కుందేలుకు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా..

నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..
అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల
నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..

ఓ బాబు నువ్వే ఇంతేనా..
మగజాతి మొత్తం ఇంతేనా..
గుండెల్లో ముల్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా..

మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..
మీసాల పిల్ల….

ఆ ఎదురింటి యెంకట్రావ్ కులుకు సచ్చుంటాడు
పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడు
ఈడు మట్టే కొట్టుకు పోను
వాడు యేట్లో కొట్టుకు పోను…

ఆ ఏడు కొండల వెంకన్నా నా బాధని చూసుంటాడు
శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడు
కనుకే నీతో కట్ అయ్యాను
చాల హ్యాపీ గుంటున్నాను..

నువ్వింత హార్ష్ గా మాటడాలా
హార్ట్ హాట్ అయిపోయేలా…
ఏ తప్పు చేయకుండా భూమ్మీద ఎవ్వరైనా ఉంటారా

నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా

హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..

రాజి పడదామంటే రావే మాజీ ఇల్లలా
నువ్వు రోజు పెట్టె నరకంలోకి మళ్ళి దూకాల
అబ్బా పాతవన్ని తొడాల నా అంతు ఏదో చూడాలా
కలకత్తా కాళీమాత నీకు మేనత్త అయ్యేలా

హే మీసాల పిల్ల.. నా మొహం మీద ఎన్ని సార్లు డోరె వెయ్యలా..
హల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా..




శశిరేఖా… పాట సాహిత్యం

 
చిత్రం: శంకర వరప్రసాద్ (2026)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ

శశిరేఖా… ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక…
ఓ ప్రసాదూ.. మోమాటాలేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ….

ఓ శశిరేఖ… నీ చుట్టూ బిలియన్సు
నావన్ని EMI-సు…
ఓ ప్రసాదు… పైసాల్లో ఏముందోయ్
నీకుంది మంచి మనసు…

మహల్లోనా నీకు కిరాయ్ ఇల్లు ఇరుకు
ఏ ఇల్లోనా కాదోయ్.. ప్రేమ పంచె గుండెల్లోనా ప్లేస్ చాలు నాకు

ఏయ్ యురేకా నువ్వు కేక .. భలే బాగుంది రేఖ
రియాలిటీ చూస్తూ ఉంటే.. భయంగా ఉంది ఇంకా
ప్రసాదు ఓ ప్రసాదు.. కామోన్ ఏ టెన్షనోద్దు
ఎవ్రిథింగ్ చూసుకుంటా.. పిప్పి డూమ్ డూమ్ లు కొట్టు……

హేయ్ సిద్ధంగున్న పెళ్ళామా, సిగ్నెల్ ఇచ్చేయ్ చాలమ్మా
కొండ మీది కోహినూరు కావాలా..
జెంగిలెల్లి జాగువారు తేవాలా..

కానుకలోదోయ్ శ్రీవారు, లొంగదు వాటికి నా ప్యారు
చెప్పినట్టు టైముకొస్తే చాలంటా..
అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంటా..

పదపద పదపద పరుగున పద పద నేనే నీ ట్యాక్సీ
చకచక చకచక జతపడి మనమిక చూడదాం గ్యాలక్సీ
అటుఇటు ఇటుఅటు, ఇటు అటు అటుఇటు తిరుగుడులోద్దయ్యో..
నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో..

హేయ్ యురేకా నువ్వు కేక.. భలేగా ఉంది రేఖ
మిరాకిల్ అంచుదాకా.. ఛలో పోదాము ఇంకా
ప్రసాదు ఓ ప్రసాదు.. కామోన్ ఎహే మాటలొద్దు
ఇలా ఈ లైఫ్ లాంగ్ .. ఇదేలా లైక్ కొట్టు……

ఓ శశిరేఖ… ఓ ప్రసాదు…

Palli Balakrishna

Most Recent

Default