Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pushpaka Vimanam (2021)





చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన, గీత్ షైనీ,  సునీల్, నరేష్,
దర్శకత్వం: దామోదర
నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దశి, ప్రదీప్ ఎర్రబెల్లి
విడుదల తేది: 20.05.2021



Songs List:



సిలకా...పాట సాహిత్యం

 
చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: రామ్ మిరియాల, ఆనంద్ గుఱ్ఱం
గానం: రామ్ మిరియాల

సిలకా...
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
సిలకా...
చిన్నబోయిందే చిట్టి గుండె నువ్వు లేకా
బంగారు సిలకమ్మో ఈ అలక దేనికమ్మో
ఈ అల్లిబిల్లి ఆటలింకా ఆపవమ్మ్మో
గుండెను తప్పుజారి పండనుకున్నవేమో
ఇంకెంత కొరుకుతావే జాలి చూపవమ్మో

సిలకా...
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
ఏ హే హే... సిలకా... ఎగిరిపోయావా... ఏ...

నిన్నమొన్న దాక కులుకులాడినావే
ఇంతలోనే ఎట్ట జారిపోయినావే
నువ్వు గుర్తుకొచ్చి క్వార్టర్ ఏసినానే
మాటలాడలేక పాట రాసినానే
ప్రేమలోన నేను దేవదాసు
గుళ్ళు కట్టలేని రామదాసు

హేయ్... పాట రాసుకొచ్చ ఫస్ట్ క్లాస్
పాడమంటే అవుత యేసుదాసు
ఒక్క ఛాన్స్ ఇచ్చి నాకు చూడవే
ఇంకో ఛాన్సు అడిగితే చెప్పు తీయ్వే
నిన్ను విడిచి అస్సలుండలేనే
మిన్ను విరిగి మీద పడ్డా వదలనే

కూల్ డౌన్... మై బాయ్

సిలకా...
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా

చెల్లియో చెల్లకో అత్త తెచ్చిన కొత్త చీర నచ్చకో
బావ తెచ్చిన మల్లెపూలు ముడవకో
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నదో

వాడపల్లి రేవు పుంతల్లో చూశా
సింగరాయికొండ జాతర్లో వెతికా
హైదరాబాద్ పోయి మైత్రివనం సెంటర్లో
లవ్వు మిస్సింగని పాంప్లెట్లు పంచా

తొందరేం లేదు... టైం తీసుకొని
ఓలా ఎక్కి రావే నీలవేణి
ఒక్కసారి నిన్ను చూసుకోని
ఎన్నిసార్లైనా సచ్చిపోనీ

కూనవరం కోనలోకి పోదామే
గోరువంకలల్లే జంట కడదామే 
రెల్లు పాకలు అల్లుకొని వెచ్చగా
మళ్ళి మళ్ళి ఒక్కటైపోదామే

సిలకా, ఏ హే సిలకా

సిలకా...
ఎక్కడున్నాగాని గూటికొచ్చి వాలిపోవే, సాలికా
సిలకా...
సిన్నబోయిందే చిట్టి గుండె.... నువ్వు లేకా

రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ




కళ్యాణం పాట సాహిత్యం

 


చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సిద్ శ్రీరామ్,   మంగ్లీ, మోహన్ భోగరాజు, దివ్య మాలిక్, హరిప్రియ

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో

కళ్యాణం కమనీయం 
ఒకటయ్యే వేళ నా వైభోగం
కళ్యాణం కమనీయం 
ఈ రెండు మనసులే రమణీయం
మూడే ముళ్ళటా.. ముడిపడుతుంటే ముచ్చట
నాలుగు దిక్కులకంట.. 
చూడముచ్చటైన వేడుకంట
ఆ పంచభూతాల తోడుగా 
ప్రేమ పంచుకునే పండగంట
ఆరారు కాలాలు నిండుగా
ఇది నూరేళ్ళ పచ్చని పంట

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
ఇంటిపేరు మారే ఈ తంతులో
చుక్కలే అక్షింతలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
పలకరించే తడి ఓ లీలలో
పుట్టినింట కళ్ళలో

ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా
ఏడు జన్మలా బంధంగా
ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
మీ అనుబంధమే బలపడగా
ఇక తొమ్మిది నిండితే నెల
నెమ్మ నెమ్మదిగా తీరే కల
పది అంకెల్లో సంసారమిలా
పదిలంగా సాగేటి అల

ఒకటయ్యేనంట ప్రాణం
ఒకరంటే ఇంకొకరి లోకం
ఇద్దరు చెరో సగం
ఇక ఇద్దరిదంట కష్టం సుఖం

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో !!





No comments

Most Recent

Default