Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
నటీనటులు: అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: బి.వి.ఎన్. ప్రసాద్
విడుదల తేది: 25.01.2019



Songs List:



మిస్టర్ మజ్ను పాట సాహిత్యం

 
చిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రమ్యా NSK, ఎస్. ఎస్.థమన్

దేవదాసు మనువడో
మన్మధుడికి వారసుడో
కావ్యములో కాముడో
అంతకన్నా రసికుడో
పెర్‌ఫ్యూమ్ నవ్వుతో
హత్తుకునే యవ్వనుడు
కన్నే కళ్లలో కలలేవి వదలడు

హార్మోన్స్‌లోన
సెగలు రేపు పొగలు
షార్ట్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్
వీడి ముద్దు పేరు...

మిస్టర్ మజ్ను
కైపుకి కజిను
మిస్టర్ మజ్ను
కన్నెల ప్రిజను 

దేవదాసు మనువడో
మన్మధుడికి వారసుడో
కావ్యములో కాముడో
అంతకన్నా రసికుడో
పెర్‌ఫ్యూమ్ నవ్వుతో
హత్తుకునే యవ్వనుడు
కన్నే కళ్లలో కలలేవి వదలడు

హార్మోన్స్‌లోన
సెగలు రేపు పొగలు
షార్ట్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్
వీడి ముద్దు పేరు...

నిన్నలోనే ఉండడే
రేపు మనకే దొరకడే
ఈరోజంతా మనదే దందా
గ్రాండ్‌ సాంగుడే

ఉన్నచోటే ఉండడే
వన్నెచాటు కృష్ణుడే
గుండెల్లోన బాణమల్లె వీడు
ఎన్నాళ్లున్నా నొప్పి తెలియనీడు...

మిస్టర్ మజ్ను
కైపుకి కజిను
మిస్టర్ మజ్ను
కన్నెల ప్రిజను
మిస్టర్ మజ్ను





నాలో నీకు నీలో నాకు పాట సాహిత్యం

 
చిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: కాల భైరవ, శ్రేయా ఘోషల్

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదులుకుంటున్నా
నీ కబురింక విననంటున్న హృదయానా
నువ్వే నిండి ఉన్నావంది నిజమేనా

నాకే సాధ్యమా నిన్నే మరువడం
నాదే నేరమా నిన్నే కలువడం
ప్రేమను కాదనే బదులే ఇవ్వడం
ఏదో ప్రశ్నలా నేనే మిగలడం

గాయం చేసి వెళ్తున్నా
గాయం లాగ నేనున్నా
ప్రాయం ఇంత చేదై మిగిలేనా
గమ్యం చేరువై ఉన్నా
తీరం చేరలేకున్నా
దూరం ఎంత జాలే చూపినా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదులుకుంటున్నా

ఓ నవ్వే కళ్లతో బ్రతికేస్తానుగా
నవ్వుల వెనక నీరే నువ్వని చూపక
తియ్యని ఊహల కనిపిస్తానుగా
ఊహల వెనుక భారం ఉందని తెలుపక

నువ్వని ఎవరిని తెలియని గురుతుగా
పరిచయం జరగనే లేదంటానుగా

నటనైపోదా బ్రతుకంతా
నలుపైపోదా వెలుగంతా
అలుపే లేని ఆటే చాలిక

మరిచే వీలు లేనంతా పంచేసావు ప్రేమంతా
తెంచెయ్‌మంటే సులువేం కాదుగా

మనసులే కలవడం వరమా శాపమా
చివరికి విడువడం ప్రేమా న్యాయమా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదులుకుంటున్నా




ఏమైనదో ఏమైనదో పాట సాహిత్యం

 
చిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్

ఏమైనదో ఏమైనదో 
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో 
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో

చుక్కలే మాయమైన నింగి లాగ
చుక్కలే కురవలేని మబ్బు లాగ
ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో

ఏమైనదో ఏమైనదో 
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో 
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో

వివరమంటు లేని వింత వేధనా
ఎవరితోటి చెప్పలేని యాతనా
తలను వంచి తప్పుకెళ్లు తప్పే చేశానా
ఎంత మంది వచ్చి వెళ్లి పోయినా
నువ్వెలాగ వేడుకోలు అంచున
ఇంత గుచ్చలేదు నన్ను ఏ పరిచయమైనా
ఓ నీకు నచ్చినట్టు నేనుంటున్నా
ఎందుకంటే చెప్పలేనంటున్నా
అర్ధమవదు నాకు ఇంతగా మారెనా
కాలమే కదలనన్న క్షణము లాగ
ఎన్నడూ తిరగరాని నిన్నలాగ

ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో





హే నేనిలా పాట సాహిత్యం

 
చిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: శృతి రంజని

హే నేనిలా




కోపంగా కోపంగా పాట సాహిత్యం

 
చిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్, ఎస్. ఎస్.థమన్

కోపంగా కోపంగా




చిరు చిరు నవ్వులా పాట సాహిత్యం

 
చిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: తుషార్ జోషి , సాలూరి కోటి, రమ్యా బెహ్రా

చిరు చిరు నవ్వులా

No comments

Most Recent

Default