చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: జస్టిన్ ప్రభాకరన్, గౌతమ్ భరద్వాజ్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మీక మందన్న
దర్శకత్వం: భరత్ కమ్మ
నిర్మాత: యాష్ రంగినేని
విడుదల తేది: 26.07.2019
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
నీ వైపే లాగేస్తుంది నన్నే
ఓ... ఓఓఓఓఓ
నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే
నీకోసమే, నా... కళ్ళే వాకిల్లే
తీసి చూసే ముంగిల్లే
రోజు ఇలా, నే... వేచే ఉన్నానే
ఊగే ప్రాణం నీ వల్లే
ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురుమరచిన నా ఎదసడిలో
ఎదురుచూస్తూ ప్రతి వేకువలో
నిదుర మరిచిన రాతిరి వడిలో
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
నీకాలి అందెల్లోని సంగీతమే సోకి
దేరన దేరానన దేనా...
చిత్రం: Dear కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: ఐశ్వర్య రవిచంద్రన్, సిద్ శ్రీరామ్
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
ఒడిచేరి ఒకటై పోయే
ఒడిచేరి ఒకటై పోయే
తీరం కోరే ప్రాయం
విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే
అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా
చెంతచేరి సేదతీర ప్రాయమిలా
చెయ్యి చాచి కోరుతోంది సాయమిలా
కాలాలు మారినా - మారినా
నీ ధ్యాస మారునా- నీ ధ్యాస మారునా
అడిగింది మోహమే
నీ తోడు ఇలా ఇలా
విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే
కడలల్లె వేచి కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచి కనులే
కదిలేను నదిలా కలలే
నిన్నే నిన్నే కన్నులలో
దాచానులే లోకముగా
నన్నే నన్నే మలిచానే
నీవుగా
బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో
నీలోన చేరగా - చేరగా
నా నుంచి వేరుగా - నా నుంచి వేరుగా
కదిలింది ప్రాణమే
నీ వైపు ఇలా ఇలా
No comments
Post a Comment