సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, శ్రీచరన్ పాకాల
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి
దర్శకత్వం: Dr. అనిల్ విస్వంత్
నిర్మాత: సాయి అభిషేక్
విడుదల తేది: 24.12.2020
తీరు మారుతోందే
పేరు తెలియకుందే
కొత్త కొత్తగుందే ఊరికే
ఎంత దగ్గరున్నా
దూరమల్లె ఉందె
నిన్న మొన్న ఇట్టా లేదులే
కరిగి కదిలి దూకుతున్న
చినుకు లాగ మనసె
మురిసి కురిసి వెతికి
నిన్ను చేరుకున్న వరసే
చూసి కూడ చూడనట్టు
వెళ్ళిపోకు గాలిలా...
ఉన్నపాటుగా
వెంట పడుతు పడుతు
ఒక్క సారిగా ఆగితే
చుట్టు పక్కలా దిక్కులన్ని చూస్తే
లెక్కపెట్టనా అంకెలే
కొంచెంగ కొంచెంగ నీ దగ్గరై
ఇంకాస్త దూరంగ నన్నుంచితే
నీ చేయి దాటేసి ఆ గీతలే
నీకు నాకు బంధమేయవా
నీకోసం ఆరాటమూ
నువ్వుంటే మోమాటమో
తాకాలనీ నీ గురుతుని
క్షణం ఎటూ కదలకే మరి
కళ్ళ ముందరే నువ్వు ఉండగా
గుండె చప్పుడే వినపడేట్టుగా
గుర్తు చేయాలనే కోరికే
సిగ్గుతో చంపుతుందే
తీరు మారుతోందే
పేరు తెలియకుందే
కొత్త కొత్తగుందే ఊరికే
ఎంత దగ్గరున్నా
దూరమల్లె ఉందె
నిన్న మొన్న ఇట్టా లేదులే
కరిగి కదిలి దూకుతున్న
చినుకు లాగ మనసె
మురిసి కురిసి వెతికి
నిన్ను చేరుకున్న వరసే
చూసి కూడ చూడనట్టు
వెళ్ళిపోకు గాలిలా

No comments
Post a Comment