Search Box

MUSICAL HUNGAMA

Sankarabharanam (1980)చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం
నటీనటులు: జె. వి.సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
విడుదల తేది: 15.01.1980

దొరకునా... దొరకునా... దొరకునా...
దొరకునా ఇటువంటి సేవా దొరకునా ఇటువంటి సేవా
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవా
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవా

రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై...
నాలోన చలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే...
ఆ... నాదాత్మకుడవై నాలోన చలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే...
నిను కోల్చువేళ దేవాదిదేవా దేవాది దేవా...
దొరకునా ఇటువంటి సేవా
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవా

ఉచ్చ్వాస నిశ్వాసములు వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు
ఉచ్చ్వాస నిశ్వాసములు వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ మహానుభావా...
మహానుభావా...
దొరకునా... సేవా...
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవా దొరకునా ఇటువంటి సేవా
*******  ******  *******


చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

రాగం తానం పల్లవి
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి
రాగం తానం పల్లవి
నాధ బర్తులై వేదమూర్తులై
నాధ బర్తులై వేదమూర్తులై
రాగకీర్తులై త్రిమూర్తులై
రాగం తానం పల్లవి

కృష్ణా తరంగాల సారంగ రాగాలు
కృష్ణ లీలా తరంగిణీ భక్తి గీతాలు
కృష్ణా తరంగాల సారంగ రాగాలు
కృష్ణ లీలా తరంగిణీ భక్తి గీతాలు
సస్య కేదారాల స్వరస గాంధారాలు
సస్య కేదారాల స్వరస గాంధారాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
క్షీర సాగర శయన దేవ గాంధారిలో
క్షీర సాగర శయన దేవ గాంధారిలో
నీ పద కీర్తన సేయగా... పమపదని
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి
రాగం తానం పల్లవి

శ్రుతి లయలే జననీ జనకులు కాగా
భావాల రాగాల తాళాల తేలి
శ్రుతి లయలే జననీ జనకులు కాగా
భావాల రాగాల తాళాల తేలి
శ్రీ చరణ మందార మధుపమ్మునై వ్రాలి
శ్రీ చరణ మందార మధుపమ్మునై వ్రాలి
నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి
నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి
భరతాభినయ వేద...
భరతాభినయ వేద వ్రత దీక్ష పూని
కైలాస సదనా కాంభోజి రాగాన
కైలాస సదనా కాంభోజి రాగాన
నీ పద నర్తన సేయగా...
ప ద ని రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి
రాగం తానం పల్లవి

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0