Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "K. Viswanath"
Kalanthakulu (1978)



చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, వి. రామకృష్ణ, పి.సుశీల 
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ 
మాటలు: సముద్రాల
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
నిర్మాణ సంస్థ: కవితా ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 06.05.1978



Songs List:



అంతా నాటకం మనదంతా నాటకం పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, వి. రామకృష్ణ

అంతా నాటకం మనదంతా నాటకం



మంచోడు దొరికాడు పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మంచోడు దొరికాడు మంగళవారం మారుతుంది జాతకం బుధవారం



కొండా కోనా పిలిచింది పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కొండా కోనా పిలిచింది కొమ్మా రెమ్మా పిలిచింది




పడిందిరోయ్ పడనే పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, వి. రామకృష్ణ, పి.సుశీల 

పడిందిరోయ్ పడనే పడిందిరోయ్ అచ్చోసిన ఆంబోతు పచ్చాని చేలోన విరుచుకు పడిందిరోయ్



ఎవరున్నారు ఇంకెవరున్నారు పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

ఎవరున్నారు ఇంకెవరున్నారు నిన్నుమించిన దైవం?



రంగూ రంగూల పండగ పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల & బృందం 

రంగూ రంగూల పండగ ఇది రామా చక్కని పండగ




గున్నా గున్నా గువ్వల పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: వి.రామకృష్ణ,  పి.సుశీల 

గున్నాగున్నా గువ్వలచెన్నా కన్నాకన్నా

Palli Balakrishna Wednesday, January 3, 2024
President Peramma (1979)



చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, దాసం గోపాలకృష్ణ 
గానం: పి.సుశీల,యస్.పి.బాలు
నటీనటులు: కవిత, నూతన్ ప్రసాద్, రాజబాబు, రమాప్రభ 
కథ, మాటలు: దాసం గోపాలకృష్ణ 
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: డి.వి.యస్.రాజు
విడుదల తేది: 12.04.1979



Songs List:



తెల్లారి కలగన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తెల్లారి కలగన్న - పెళ్ళాడినట్టు
గదిలోకి రాగానే - గడియేసినట్లు
గడియ గడియకీ నిన్ను ముద్దాడినట్టు
పెళ్లాడినట్టు గడియేసినట్టు ముద్దాడినట్టు
బంజారా బంజారా బంజారా బంజారా

తెల్లారి కలగన్నా - నీ తెలివి తెల్లారినట్లు
గడిలోకి రాగానే - నే గరిటె తిరిగేసినటు
తిరగేసి మరగేసి నీ దుమ్ము దులిపేసినటు
తెల్లారినట్టు తిరగేసినట్టు దులిపేసినట్లు
బంజారా బంజారా బంజారా బంజారా

నీ పొంగు మడతెట్టే కడకొంగు ముడిబెట్టి
సరిగంగ తానాలు నేనాడినట్టు
మనసుల్లో మడిగట్టి - వయస్సుల్లో జతకట్టి
ముడుపుల్నీ, మొక్కుల్నీ చెల్లించినట్టు

ఓం తడియారకుండా మడికట్టుకోనిమ్యహం
మడిఒట్టతో నే ముడి పెట్టుకోనిమ్యహం
ముడివూడకుండా మ్యాహం
గుడిమెట్ల క్రింద మ్యహం
ఇద్దరూ మ్యాహం
ముద్దుగా ముద్దు ముద్దుగా
మూడు నిదర్లు చేస్తే - మ్యహం - మ్యహం - మ్యహం
బంజారా - బంజారా బంజారా

నునులేత నీ బుగ్గ - కొనగోట నే నొక్క
సీకట్లో నెలవంక - సిగురించినట్టు
ముప్పేట ముడికాస్తా - మూడేళ్ళ కొడుకయ్యి
మన ముద్దుకే హద్దు పెట్టేసినట్టు
చెల్లాయి కావాలి చెల్లాయి - ఇవ్వనంటే నీకు జిల్లాయి
చెల్లాయి - జిల్లాయి

సేమంతి పువ్వంటి సెల్లెల్ని ఇద్దామా
తామర పువ్వంటి తమ్ముణ్ణి ఇద్దామా
బంజారా బంజారా బంజారా

గదిలోకి రాగానే - నే గరిటె తిరగేసినట్టు
గడియ గడియకే నిన్ను ముద్దాడినట్టు
పెళ్లాడినట్టు - గడియేసినట్టు - ముద్దాడిననట్టు - ముద్దాడినట్టు
బంజారా - బంజారా - బంజారా
బంజారా బంజారా
బంజారా - బంజారా




ఏమంత తొందర పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఏమంత తొందర
కాసింత ఆగరా
కడసందె కాలేదు కాలేదురా
పడకిల్లు సరిచేసి రాలేదురా
పెదవికి గిలిగింత కలగనీ -
పయ్యెదకున్న ఓపిక తొలగనీ
మరులేమొ మరికొంత పొంగనీ
మనవేమొ మరునికి లొంగనీ
అందాకా అందాకా ఆగరా...

పరువపు పన్నీరు చిలకనీ
సరసపు సిరిగంధ మలదనీ
వలవుల దండ వేయనీ
వలపులకై దండవేయనీ
తలపుల తాంబూల మీయనీ
అందాకా - ఆందాకా ఆగరా



పంచమినాడే పెళ్ళంట పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, నూతన్ ప్రసాద్

పంచమినాడే పెళ్ళంట పంచలచాపు నేయించు
దశమీ రేతిరి... అంట
ఏటంట ?
తెలవదు తెలవదు నాకంట
తెల్లచీర తెప్పించు-మల్లెపూలు రప్పించు
అబ్బా. ఇయ్యాల నన్నిట్టా పట్టుకున్నావేంటే?
పట్టుకున్నవాడే - పట్టుగొమ్మంట
పట్టుగొమ్మ నీడే పడకటిల్లంట
పడకటింటిలోనే పట్టు తేనంట

పట్టుతేనె విందూ - పగలూ రేయంట
పగలూ రేయీ ఒకటే... ఆంట
ఏటంట...?
తెలవదు తెలవదు నాకంట
తెల్లాచీరా తెప్పించు మల్లెపూలు రప్పించు
ఏయ్ ఒక్కటి కొంటానంటేనా...?
కొట్టేచెయ్యీ కోరే మనసూ ఒకటేలెమ్మంట
ఒకటీ ఒకటి కలిసే ముచ్చట మూడౌతుందంట
మూడు రాత్రుల పున్నమి
ఏడు జన్మల పున్నెమంట
పున్నెమెంత సేసినా ఈ పులకరింత దొరకదంట 
దొరికిందంతా ఇపుడే... అంట
ఏటంట...?

తెలవదు తెలవదు నాకంట
తెల్లాచీరా తెప్పించు మల్లెపూలూ రప్పించు




అందరాని చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

అంధేరేమె తూ దియాహై మేరే సనమ్మ
మిల్కర్ రహేంగే పియా హర్ జనమ్

అందరాని చందమామ నాకెందుకూ
అదంలాంటి నా మామ చాలు నాకూ
అందరాని చందమామ నీకెందుకూ...?
నే అద్దంలా వున్నాను నువ్వు సూసేందుకు
ఏటిలోని నురగల్లాగ - పైటకొంగు పొంగుతుంటే
లేతగాలి ఇసురుల్లో పూత వయసు వూగుతుంటే
ఇసకా తిన్నెలు గుసగుసమంటే మసకా కోరిక
బుసకొడుతుంటే
సూడాలి అప్పుడు - ఈ జోడుగుండె చప్పుడు

సూడాలి అప్పుడు— ఈ జోడుగుండెల చప్పుడు ॥ఆంధేరేమె॥

నీరెండి సీరకట్టీ - నీలినీడ రైక తొడిగీ
పొదుపొడుపు తిలకం దిద్ది 
పొన్నపూల నవ్వులు పొదిగి

వనలచ్చిమిలా నువ్వొస్తుంటే
ఊరూ నాడూ పడిచస్తుంటే 
సూడాలి అప్పుడు
నన్నేలినోడి దూకుడు....




కూత్ కూత్ కూత్ కూత్ కుక్కపిల్లలు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: యస్.పి.బాలు

కూత్ కూత్ కూత్ కూత్
కుక్కపిల్లలు
రొట్టెముక్క చూపి సే
లొట్టలేసాయి
కావు కావు కావు కావు కాకి మూకలు
చుట్టముక్క చూపిసే చుట్టు చేరాయి
కుక్కపిల్లలూ - కాకి మూకలూ
జంతర మంతర ధాం లాంతర లాంతర లాంతర తోం తనంతర ధాం

ఎత్తమంటే సెయ్యి ఎత్తేవోళ్లు ఏ ఎండకాగొడుగు పట్టేవోళ్లు 
ఎంగిలి మెతుకులు కతికేవోళ్లు ఏబరాసి బతుకులు బతికేవోళ్ళు
కలిసికట్టు లేనోళ్ళు నాయాళ్ళు - గొలుసుకట్టు మతలబోళ్ళు నాయాళ్ళు
ఈళ్ళంతా - మనవూరు ఏలేవాళ్ళు
కుక్కపిల్లలూ - కాకిమూకలూ
జంతర మంతర ధాం తనంతర - లాంతర లాంతరం తనంతర ధాం

నెగ్గిందాక మాట ఇచ్చేవోళ్ళు - నెగ్గినాక ప్లేటు మార్చేవోళ్ళు
పొట్టలు కొట్టే గొటంగాళ్ళు పొదుగులు కోసే కసాయివోళ్ళ
గోడమీద పిడకలు నాయాళ్లు గోతికాడ నక్కలు నాయాళ్ళు
ఈళ్ళంత మన ఊరు ఏలేవోళ్లు - కుక్కపిల్లలూ - కాకిమూకలు
జంతర మంతర ధాం తనంతర - లాంతర లాంతరం తనంతర ధాం 



పానకాలస్వామిని నేను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

శ్రీశైల మల్లమ్మ - అలివేలు మంగమ్మ
బెజవాడ కనకదురగమ్మో
పానకాల స్వామిని నేను పూవకం మీదున్నాను
శ్రీశైల మల్లన్న శివమెత్తి ఆడంగ -
సింహాద్రి అప్పన్న సింగమై దూకంగ
పోతరాజో పోలేరమ్మా

పోలేరమ్మో దాటి పోలేరమ్మా
బండరాయి పగలగొట్టు - బావురు కప్పను పట్టు
ఆశ్శరభ శరథ అల్లల్ల భీర

నాపరాయీ పగలగొట్టు - నల్లనీటి ఊటబట్టు
ఆశ్శరభ శరభ అల్లల్ల భీర
కంచె చేను మేస్తుంటే కంచి కామాక్షమ్మ
బురిడీలు కొట్టకమ్మో - మరిడీ మాలచ్చమ్మా
పోతరాజో పోలేరమ్మా 
పోలేరమ్మో దాటి పోలేరమ్మా
తలపైన తట్టుంది శరభా - తట్టలో బుట్టుంది శరభా
బుట్టలో గుట్టుంది పట్టుకో శరభా
అశ్శరభ శరభ అల్లల్ల భీర

తట్టాబుట్టా సర్ధి శరభా - తైతక్కలాడుకుంటూ శరభా
తలవాకిటున్నాది తందనాల బొమ్మ
అశ్శరభ శరభ అల్లల్ల భీర

పాపనాశనం కోసం తానమాడ బోతేను
వంశనాశనం కోసం మొసలెత్తు కెళ్ళింది
కటకటాలు తప్పవమ్మో కోటగుమ్మం రాయడమ్మో
పోతరాజో పోలేరమ్మో -
పోలేరమ్మో దాటి పోలేరమ్మో


Palli Balakrishna Monday, October 30, 2023
Chelleli Kapuram (1971)



చిత్రం: చెల్లెలు కాపురం (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కొసరాజు, దాశరధి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, పి.బి.శ్రీనివాస్, బి.వసంత 
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, మణిమాల, చంద్రమోహన్
కథ: మన్నవ. బాలకృష్ణ 
మాటలు: గొల్లపూడి మారుతీరావు
దర్శకత్వం: కె.విశ్వనాధ్ 
నిర్మాత: మన్నవ వెంకటరావు 
విడుదల తేది: 27.11.1971



Songs List:



పిల్లగాలి ఊదింది పిల్లనగ్రోవి పాట సాహిత్యం

 
చిత్రం: చెల్లెలు కాపురం (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు 

పిల్లగాలి ఊదింది పిల్లనగ్రోవి




భలే భలే మా అన్నయ్య పాట సాహిత్యం

 
చిత్రం: చెల్లెలు కాపురం (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.జానకి

భలే భలే మా అన్నయ్య 



ఈ దారి నా స్వామి నడిచేనే.. పాట సాహిత్యం

 
చిత్రం: చెల్లెలు కాపురం (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్.జానకి

పల్లవి:
ఈ దారి నా స్వామి నడిచేనే... పాదాల జాడలివిగోనే
రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూ
కృష్ణుడు రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూ
లేవండీ పొదరింటా లేవండీ పొదరింటా లెండే పొగడా గోరింటా
రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూ
ఎవరే ఎవరే ఎవరే
మువ్వల మురళిని నవ్వే పెదవుల ముద్దాడే వాడే నన్నేలువాడు
కన్నుల చల్లని వెన్నెల జల్లులు విరజిమ్మే వాడే.. నన్నేలువాడు
ఓ... ఓ... ఓహో 
ఈ నల్లని రూపం చూచీ ఈ పిల్ల సోయగము వలచీ
ఈ నల్లని రూపం చూచీ ఈ పిల్ల సోయగము వలచీ
రేపల్లె విడిచి రేయల్ల నడచి మన పల్లెకు దయచేసాడటే
లేవండీ పొదరింటా లెండే పొగడా గోరింటా
రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూ కృష్ణుడు
రానే వచ్చాడు తీరా తానే వచ్చాడూ

చరణం: 1
అటు అడుగిడితే నా తోడూ ఇటు చూడూ
అడుగిడితే నా తోడూ ఇటు చూడూ
ఇట నిలిచినాడు నీ కోసం లీలా ప్రియుడూ ఇటు చూడూ
వలచి వలచి వచ్చినదెవరో పిలిచి పిలిచి అలసిన ఈ
పిల్లనగ
వలచి వలచి వచ్చినదెవరో పిలిచి పిలిచి అలసిన ఈ
పిల్లగ్రోవినడుగు
పిల్లగ్రోవినడుగూ ఇటు చూడూ

చరణం: 2
కృష్ణా.. ఏల స్వామీ దయమాలీ ఈ దీనురాలిని ఎగతాలీ
ఏల స్వామి దయమా నీ కళ్ళ ఎదుటా నిలువలేనీ పాదధూళిని
పొందలేనీ
నీడకైనా నోచుకోనీ రేయి కనులా నల్లనైన దీనురాలిని ఎగతాలీ
కనులకు తోచేది కాదు సోయగమూ మనసులో పూచేటీ
మధురిమగానీ
నీ చెలులు చూసేదీ నీ బాహ్యమూర్తీ నేను వలచేదీ నా నీలలోదీప్తి




చెలువ పంపిన పూల రేకులు పాట సాహిత్యం

 
చిత్రం: చెల్లెలు కాపురం (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు 

చెలువ పంపిన పూల రేకులు 



విరహమోపగలేక పాట సాహిత్యం

 
చిత్రం: చెల్లెలు కాపురం (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు 

విరహమోపగలేక 



నా చిట్టీ నా చిన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: చెల్లెలు కాపురం (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల, బి. వసంత 

పల్లవి:
రాణీ  రమణీ మల్లీ వల్లీ రాజీ రోజా సరోజా
ష్... నా చిట్టి నా చిన్నీ నా చిట్టి నా చిన్నీ
ఆనక అన్నీ చెబుతాలే లిల్లీ లిల్లీ 
అల్లరి పెట్టకు అందరిలో తల్లీ తల్లీ
ఆనక అన్నీ చెబుతాలే లిల్లీ లిల్లీ
అల్లరి పెట్టకు అందరిలో తల్లీ తల్లీ

నా చిట్టీ నా చిన్నీ  నా చిట్టీ నా చిన్నీ

చరణం: 1 
ఎన్నడు లేనీ ఈ పులకింతా ఎందుకోసమే నీ వళ్ళంతా
ఎన్నడు లేనీ ఈ పులకింతా ఎందుకోసమే నీ వళ్ళంతా
ఎందుకే ఎందుకే ఎందుకే

మల్లెల గాలీ చల్లగ వీచి ఝల్లని పించెను ఒళ్ళంతా
మల్లెల గాలీ చల్లగ వీచి ఝల్లని పించెను ఒళ్ళంతా
అందుకే అందుకే  అందుకే ఆ.. ఉం  

బేబీ రూబీ సీతా గీతా షీలా మాలా సుశీలా
ష్.. నా చిట్టీ నా చిన్నీ  నా చిట్టీ నా చిన్నీ

చరణం: 2
నీ బుగ్గలలోనా సిగ్గుల రోజా మొగ్గలు తొడిగే ఏ ఎందుకనీ
నీ బుగ్గలలోనా సిగ్గుల రోజా మొగ్గలు తొడిగే ఏ ఎందుకనీ
ఎందుకే ఎందుకే ఎందుకే 

చెలి చేతులలో చిక్కిన వేళా సిగ్గే మొగ్గై విరిసెనులే
చెలి చేతులలో చిక్కిన వేళా సిగ్గే మొగ్గై విరిసెనులే
అందుకే అందుకే అందుకే అంతేనా హా
రాజు రామూ వేణూ శీనూ సోమూ  గోపీ బాలయ్యా
ష్..  నా చిట్టీ నా చిన్నీ నా చిట్టీ  నా చిన్నీ  





ఎవరికోసం రాధ పాట సాహిత్యం

 
చిత్రం: చెల్లెలు కాపురం (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు 

ఎవరికోసం రాధ 




పరిమళించు వెన్నెల నీవే పాట సాహిత్యం

 
చిత్రం: చెల్లెలు కాపురం (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పల్లవి:
పరిమళించు వెన్నెల నీవే - మ్మ్ 
పలకరించు మల్లిక నీవే - మ్మ్
నా జీవన బృందావనిలో - మ్మ్
నడయాడే రాధిక నీవే
కనుల ముందు నీవుంటే 
కవిత పొంగి పారదా - మ్మ్
తొలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా - మ్మ్

కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా
తొలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా

చరణం: 1
అలనాటి జనకుని కోలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో
అలనాటి జనకుని కోలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో
ఆ..ఆ..రాముని చూసిన జానకివై
అభిరాముని వలపుల కానుకవై
వాల్మీకి కావ్య వాకిట వెలసిన.. వసంత మూర్తివి నీవే
కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా
తొలి చిగురులు చూడగానే కల కోకిల కూయదా

చరణం: 2
అలనాటి సుందరవనములో వనములో
ఎల ప్రాయం పోంగిన క్షణములో
అలనాటి సుందరవనములో ఎల ప్రాయం పోంగిన క్షణములో
ఆ..ఆ..రాజును కనిన శకుంతలవై
రతిరాజు భ్రమించిన చంచలవై
కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయ మూర్తివీవే
కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా
తొలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా

చరణం: 3
అజంతా చిత్ర సుందరివై ఎల్లోరా శిల్ప మంజరివై
అజంతా చిత్ర సుందరివై ఎల్లోరా శిల్ప మంజరివై
రామప్ప గుడి మోమున విరిసిన రాగిణివై నాగినిపై
అమరశిల్పులకు ఊపిరిలూది అమృతమూర్తివి నీవే
కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా
తోలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా





చరణ కింకిణులు (ఆడవే మయూరీ) పాట సాహిత్యం

 

చిత్రం: చెల్లెలు కాపురం (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
కర కంకణములు గలగలలాడగ
అడుగులందు కలహంసలాడగా
నడుములో తరంగమ్ములూగగా
వినీల గజభర విలాస బంధుర
తనూలతిక చంచలించిపోగ

ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నీ కులుకును గని నా పలుకు విరియ 
నీ నటనను గని నవ కవిత వెలయగ
ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
ఆడవే మయూరీ

అది యమునా సుందర తీరము 
అది రమణీయ బృందావనము
అది విరిసిన పున్నమి వెన్నెల 
అది వీచిన తెమ్మెర ఊయల
అది చల్లని సైకత వేదిక
అట సాగెను విరహిణి రాధిక

అది రాధ మనసులో మాధవుడూదిన 
రసమయ మురళీ గీతిక

ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నా పలుకులకెనయగు కులుకు చూపి 
నా కవితకు సరియగు నటన చూపి
ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ

పాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా
పతిని కోలు పడి రతీదేవి దుఖిఃతమతియై రోదించగా
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా
ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా
ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్భటుల జలిత దిక్ తటుల 
జహిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల

కనులలోన 
కనుబొమలలోన 
అధరమ్ములోన 
వధనమ్ములోన
కనులలోన కనుబొమల లోన 
అధరమ్ము లోన వధనమ్ము లోన

కళ సీమలోన కటి సీమలోన
కరయుగములోన పదయుగము లోన 
ఈ తనువులోని అణువణువు లోన 
అనంత విధముల అభినయించి 
ఇక ఆడవే ఆడవే ఆడవే...

Palli Balakrishna Friday, July 22, 2022
Subhodayam (1980)



చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: చంద్రమోహన్, సులక్షణ
మాటలు: జంధ్యాల 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విశ్వనాథ్ 
నిర్మాత: సి.హెచ్. నరసింహా రావు 
విడుదల తేది: 01.11.1980



Songs List:



అసతోమ సద్గమయా పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు 

అసతోమ సద్గమయా



గంధం పుయ్యురుగా పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

గంధం పుయ్యురుగా 
పన్నీరు గంధం పుయ్యురుగా



కంచికి పోతావా కృష్ణమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

కంచికి పోతావా కృష్ణమ్మా




మందార మకరంద పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: పోతన 
గానం: పి. సుశీల  

పల్లవి:
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు పోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునే తరంగిణులకు...

ఆ..ఆ..
ఆ చింత నీకేలరా... ఆ చింత నీకేలరా స్వామీ.. నీ చెంత నేనుండగా..
ఆ చింత నీకేలరా... ఆ చింత నీకేలరా స్వామీ.. నీ చెంత నేనుండగా..
ఆ చింత నీకేలరా..

సొంతమైన ఈ సొగసునేలక పంతమేల పూబంతి వేడగా
సొంతమైన ఈ సొగసునేలక పంతమేల పూబంతి వేడగా
ఆ చింత నీకేలరా

చరణం: 1 
సరసాల మనుగడ సగపాలు చేసి...
వరసైన నా యీడు నీ తోడు పెట్టి
సరసాల మనుగడ సగపాలు చేసి...
వరసైన నా యీడు నీ తోడు పెట్టి...
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నీ
కరిగించి కౌగిళ్ళ తినిపించగా....
ఆ..ఆ..ఆ..ఆ  

చరణం: 2 
ఆ వంక ఆ వెన్నెలమ్మా.. ఈ వంక ఈ వన్నెలమ్మ
ఆ వంక ఆ వెన్నెలమ్మా.. ఈ వంక ఈ వన్నెలమ్మ
యే వంక లేని నెలవంక నేనమ్మా...
నీకింక అలకెందుకమ్మా

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర
మరుగునే సాంద్రనీహారములకు
వినుత గుణశీల మాటలు వేయునేలా




నటనం ఆడెనే పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

నటనం ఆడెనే 



రాయైతే నేమిరా దేవుడు పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

రాయైతే నేమిరా దేవుడు హాయిగుంటాడు జీవుడు 





కస్తూరి రంగ రంగ (శ్లోకం ) పాట సాహిత్యం

 
చిత్రం: శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల

కస్తూరి రంగ రంగ 


Palli Balakrishna Saturday, June 25, 2022
Undamma Bottu Pedata (1968)



చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: కృష్ణ, జమున 
దర్శకత్వం: కె. విశ్వనాధ్ 
నిర్మాత: ఆదుర్తి సుబ్బారావు 
విడుదల తేది: 28.09.1968



Songs List:



శ్రీశైలం మల్లన్న పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, పి.సుశీల & కోరస్

శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా 
చేనంతా గంగమ్మా వానా 
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా 
చేనంతా గంగమ్మా వానా
తిరుమల పై వెంకన్న కనువిప్పేనా 
కరుణించు ఎండా వెన్నెలలై నా 
తిరుమలపై వెంకన్న కనువిప్పేనా 
కరుణించు ఎండా వెన్నెలలైనా 

శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా
చేనంతా గంగమ్మా వానా 
కదిలొచ్చి కలిసొచ్చి
కలుపులు తీసేరో కలవారి కోడళ్ళు
నడుమొంచి చెమటోడ్చి
నాగళ్లుపట్టేరో నాజూకు దొరగార్లు

కదిలొచ్చి - కలిసొచ్చి
కలుపులు తీసేరో- కలవారి కోడళ్లు కలవారి కోడళ్లు

నడుమొంచి చెమటోడ్చి
నాగళ్లుపట్టేరో - నాజూకు దొరగార్లు
దంచకుండ నలిగేనా ధాన్యాలు
దంచకుండ నలిగేనా ధాన్యాలు
వంచకుండ వంగేనా ఆ ఒళ్లు

ఏటికైన ఏతాము ఎత్తేవాళ్లం 
మేమూ అన్నదమ్ములం 
ఏడేడు గరిసెల్లూ నూర్చేవారం

మేమూ అక్కాచెల్లెళ్లం 
ఏటికైన ఏతాము ఎత్తేవాళ్లం 
మేమూ అన్నాదమ్ములం
మేమూ అన్నదమ్ములం 
ఏడేడూ గరిసెల్లూ నూర్చేవారం 
మేమూ అక్కాచెల్లెళ్ళం



రావమ్మా మహలక్ష్మీ పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల & కోరస్

రావమ్మా మహలక్ష్మీ రావమ్మా 
రావమ్మా మహలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ యిల్లు కొలువై వుందువుగాని 
నీ కోవెల ఈ యిల్లు కొలువై వుందువుగాని 
కొలువై వుందువుగాని - కలుములరాణి 
గురివిందా పొదకిందా గొరవంకా పలికే
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికే
గురివిందా పొదకిందా గొరవంకా పలికే 
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికే 

లేచింది తెల్లారి
తెల్లారి పోయింది.పల్లె లేచింది. 
తెల్లారి  పోయింది
పల్లె లేచింది

పల్లియలో ప్రతియిల్లు కళ్లూ తెరచింది 
కడివెడు నీళ్లూ కల్లాపి చల్లి గొబ్బిళ్లో గొబ్బిళ్లు 
కావెడు పసుపూ గడపకుపూసి గొబ్బిళ్లో గొబ్బిళ్లు 
కడివెడు నీళ్ళూ కలాపి చల్లి గొబ్బిళ్లో గొబ్బిళ్లు 
కావెడు పసుపూ గడపకు పూసి గొబ్బిళ్లో గొబ్బిళ్లు
ముత్యాల ముగ్గుల్లో - ముగ్గుల్లో గొబ్బిళ్లు 
ముత్యాల ముగ్గులో రతనాల ముగులో

ముగ్గులో గొబ్బిళ్లు ముగ్గులో గొబ్బిళ్లు
రతనాల ముగులో ముగులో గొబ్బిళ్లు
కృష్ణార్పణం

పాడిచ్చే గోవులకు పసుపూ కుంకం 
పనిచేసే బసవనికి పత్రీపుష్పం
గాదుల్లో ధాన్యం కావిళ్ల భాగ్యం
గాదుల్లో ధాన్యం కావిళ్లా భాగ్యం
కష్టించే కాపులకూ - కలకాలం సౌఖ్యం 
కృష్ణార్పణం
కలకాలం సౌఖ్యం.



ఎందుకీ సందెగాలి పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల & కోరస్

ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి
ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి
తొందర తొందర లాయె విందులు విందులు చేసే
ఆగలేక నా లాగే ఊగే ఈ దీపము
ఆగలేక నా లాగే ఊగే ఈ దీపము
పరుగు పరుగునా త్వర త్వరగా
ప్రభుని పాదముల వాలగ
తొందర తొందర లాయె విందులు విందులు చేసే

ఏ నాటిదో గాని - ఆ రాధా పల్లవ పాణీ
ఏ మాయెనో గాని - ఆ పిల్లన గ్రోవిని విని 
ఏ నాటిదోగాని - ఆ రాధా వలవ పాణీ 
ఏ మాయెనో గాని - ఆ ఆ పిల్లన గ్రోవిని విని
విని - విని
ఏదీ ఆ యమున
యమున హృదయమున గీతిక
ఏదీ బృందావనమిక - ఏదీ విరహ గోపిక




చుక్కలతో చెప్పాలని పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల, య.పి.బాలు & కోరస్

చుక్కలతో చెప్పాలని -
ఏమనీ ?
ఇటు చూస్తే తప్పనీ 
ఎందుకనీ?
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అనీ 

చెదిరే ముంగురులూ కాటుకలూ
నుదురంతా పాకేటీ కుంకుమలూ
సిగపాయల పూవులే సిగ్గుపడేనూ
చిగురాకుల గాలులే ఒదిగొదిగేనూ
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అనీ 

మనసులో ఊహ కనులు కనిపెట్టె వేళ
చెవిలో ఒక చిన్నకోర్కె చెప్పేసే వేళ
మిసిమి పెదవి మధువులు తొణికేనని 
పసికట్టే తుమ్మెదలూ ముసిరేననీ
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అనీ 




అడుగడుగున గుడి వుంది పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల

అడుగడుగున గుడి వుంది
అందరిలో గుడి వుంది
ఆ గుడిలో దీపముందీ అదియే దైవం
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ 
ఈసుని కొలువనిపించాలి 
ఎల్ల వేళలా మంచు కడిగినా
మల్లెపూవులా వుంచాలి
దీపం మరి మరి వెలగాలి తెరలూ పొరలూ తొలగాలి

తల్లీ తండ్రీ గురువు పెద్దలూ పిల్లలు కొలిచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు
తలులు వలచే దైవం
ప్రతి మనిషే నడిచే దైవం
ప్రతి పులుగూ ఎగిరే దైవం



చాలులే నిదురపో పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

చాలులే నిదురపో
జాబిలి కూనా

ఆ దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలాడేనా 
నీ సోగకనుల రెప్పల్లో తూనీగ లాడేనా 
ఆ దొంగ కలువ రేకులోతుమ్మెదలాడేనా 
నీ సోగకనుల రెప్పలో తూనీగ లాడేనా 
తుమ్మెద లాడేనా - తూనీగ లాడేనా 
అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా 
ఓసి వేలెడేసి లేవు - బోసి నవ్వులదానా 
అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా 
ఓసి వేలెడేసి లేవు - బోసి నవ్వులదానా
మూసే నీకనుల ఎటుల పూసేదే నిదర అదర
జాబిలి కూనా

ఆ దొంగ కలువ రేకుల్లో తుమ్మెదలాడేనా- 
నీ సోగ కనుల రెప్పల్లో తూనీగ లాడేనా 
తుమ్మెద లాడేనా... తూనీగ లాడేనా
అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే 
కానీ చిట్టితమ్ము డొకడు నీ తొట్టిలోకి రానీ 
అమ్మను బులిపించి - నీ అయ్యను మరిపించావే
కానీచిట్టితమ్ము డొకడు నీ తొట్టిలోకిరానీ
ఔరా.... కోరికలు కలలు
తీరా నిజమయితే - అయితే
జాబిలి కూనా





పాతాళ గంగమ్మ రారారా పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, పి.సుశీల

కోరన్,
గంగమ్మా రా గంగమ్మా రా- గంగమ్మా రా
పాతాళ గంగమ్మ రారారా ఉరికురికీ ఉబికుబికీ రారారా
పగపట్టే పామల్లే పై కీ పాకీ 
పరుగెత్తే జింకల్లే దూకీ దూకీ

వగరుసూ గుండెదాక పగిలిందీ నేల 
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేల 
వగరుసూ గుండెదాక పగిలిందీ నేల
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేల

సోలిన ఈ చేవికీ సొమ్మసిలిన భూమికీ 
సోలిన ఈ చేనికీ - సొమ్మసిల్లిన భూమికీ 
గోదారి గంగమ్మా - సేదా తీర్చావమ్మా

పాతాళ గంగమ్మా రారారా 
ఉరికురికీ ఉబికునికీ రా రా రా 
పాతాళ గంగమ్మా రారారా 
శివమూర్తి జటనుంచి - చెదరీవచ్చావో 
శ్రీ దేవి దయలాగా సిరులే తెచ్చావో 
శివమూర్తి  జటనుంచి చెదరీ వచ్చావో 
శ్రీ దేవి దయలాగా సిరులే తెచ్చావో

అడుగడుగున బంగారం - ఆకుపచ్చని సింగారం 
అడుగడుగున బంగారం ఆకుపచ్చని సింగారం 
తోడగవమ్మ ఈ నేలకు సశ్యశ్యామల వేషం

పాతాళ గంగమ్మా రారారా
ఉరికురికీ ఉబికుబికీ రా రా రా 
పగబట్టె పామలే పైకీ పాకీ 
పరుగెత్తే జింకలే దూకీ దూకీ 
పాతాళ గంగమ్మా రారారా


Palli Balakrishna Tuesday, November 30, 2021
Private Master (1967)



చిత్రం:  ప్రైవేట్ మాస్టర్ (1967)
సంగీతం: కె.వి,మహదేవన్ 
నటీనటులు: కృష్ణ, వారణాసి రాంమోహన రావు, కాంచన, సుకన్య 
దర్శకత్వం: కె.విశ్వనాధ్ 
నిర్మాతలు: బి.హెచ్.వి. చలపతి రావు, టి.రామ్మూర్తి సమ , టి.వి.ఎస్.శేషగిరి రావు 
విడుదల తేది: 14.07.1967



Songs List:



అద్దంలో కనిపించేది పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రైవేట్ మాస్టర్ (1967)
సంగీతం: కె.వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

అద్దంలో కనిపించేది 



చిరు చిరు జల్లుల పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రైవేట్ మాస్టర్ (1967)
సంగీతం: కె.వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల 

చిరు చిరు జల్లుల 



ఎక్కడ ఉంటావో పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రైవేట్ మాస్టర్ (1967)
సంగీతం: కె.వి,మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

ఎక్కడ ఉంటావో 




ఎక్కడికెళ్ళావే పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రైవేట్ మాస్టర్ (1967)
సంగీతం: కె.వి,మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, పి. సుశీల 

ఎక్కడికెళ్ళావే పిల్లా 



మల్లెపూల మంచం ఉంది పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రైవేట్ మాస్టర్ (1967)
సంగీతం: కె.వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల 

మల్లెపూల మంచం ఉంది 



మనసుంటే చాలదులే పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రైవేట్ మాస్టర్ (1967)
సంగీతం: కె.వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్. జానకి 

మనసుంటే చాలదులే 





పడుకో పడుకో పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రైవేట్ మాస్టర్ (1967)
సంగీతం: కె.వి,మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు 

పడుకో పడుకో 




తెరవకు తెరవకు పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రైవేట్ మాస్టర్ (1967)
సంగీతం: కె.వి,మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

తెరవకు తెరవకు 

Palli Balakrishna Thursday, August 19, 2021
Prema Bandham (1976)





చిత్రం: ప్రేమ బంధం (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వేటూరి
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, జయప్రద
దర్శకత్వం: కె. విశ్వనాథ్
నిర్మాతలు: సత్యన్నారాయణ, సూర్యనారాయణ
విడుదల తేది: 01.12.1976



Songs List:



చేరేదెటకో తెలిసి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ బంధం (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల


చేరేదెటకో తెలిసి 





ఏ జన్మకైనా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ బంధం (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: సుశీల 

ఏ జన్మకైనా 



ఎక్కడున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ బంధం (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, సుశీల, వి.రామకృష్ణ 

ఎక్కడున్నాను 




అమ్మమ్మా అల్లరి పిడుగమ్మా... పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ బంధం (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల

అమ్మమ్మా అల్లరి పిడుగమ్మా...



అంజలిదే గొనుమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ బంధం (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: సుశీల

అంజలిదే గొనుమా



పువ్వులా నవ్వితే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ బంధం (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, సుశీల

పువ్వులా నవ్వితే 


Palli Balakrishna Thursday, August 5, 2021
Sruthilayalu (1987)




చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: రాజశేఖర్, సుమలత, షణ్ముఖ శ్రీనివాస్, జయలలిత, నరేష్ 
దర్శకత్వం: కె.విశ్వనాధ్ 
నిర్మాతలు: కరుణాకర్, సుధాకర్ 
విడుదల తేది: 1987



Songs List:



ఆలోకయే శ్రీ బాల పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: తారంగం
గానం: వాణి జయరాం 

ఆలోకయే శ్రీ  బాల 




ఇన్ని రాశుల యునికి పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: అన్నమాచార్యుని కృతి
గానం: యస్.పి.బాలు, వాణి జయరాం 

ఇన్ని రాశుల యునికి 



జానకి కుంహ సమరణం పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు

జానకి కుంహ సమరణం




కోరిన చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: త్యాగరాయ కృతి
గానం: పూర్ణచందర్

కోరిన చిన్నది 



మేరా జుతా హై జపానీ పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: ఎస్.జానకి  

మేరా జుతా హై జపానీ



శ్రీ గాననాధం పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: తారంగం 
గానం: పూర్ణచందర్, వాణి జయరాం

శ్రీ గణనాధం 



శ్రీ శారదాంబ పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: ఎస్.జానకి  

శ్రీ శారదాంబ



తక తిక పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: త్యాగరాయ కృతి
గానం: పూర్ణచందర్

తక తిక 



తందనాన పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు 

తందనాన



తెలవారదేమో స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: యేసుదాస్

తెలవారదేమో స్వామి 



తెలవారదేమో స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: సుశీల

తెలవారదేమో స్వామి 



తనదు వారసత్వం పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: సుశీల

తనదు వారసత్వం 

Palli Balakrishna Saturday, June 26, 2021
Neramu Siksha (1973)




చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: కృష్ణ, భారతి, కుమారి, పండరి భాయి 
దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాత: ఎమ్. బాలయ్య
విడుదల తేది: 27.07.1973



Songs List:



One Two One Two పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల 
గానం: యస్.పి.బాలు, ఆనంద్ 

One two  One two One two
ఒకరికి తోడుగ ఒకరుంటూ
నేడు నిజమంటూ రేపు లేదంటూ
ఆడుతూ పాడుతూ సాగిపోతుంటే
జీవితమంతా Joy Enjoy
హాయ్ - హాయ్ - హాయ్

చరణం: 1
జేబుల్ నిండా డబ్బుంటే
జల్సాచేసే దమ్ముంటే
మనసుకు నచ్చిన మగువుంటే
మనిషికి వేరే స్వర్గం లేదూ
జీవితమంతా Joy - Enjoy
హాయ్ - హాయ్ - హాయ్

చరణం: 2
బాధ్యతలన్నీ పెదల కొదిలెయ్ దేవా - ఓ దేవా
పరీక్ష మాట పంతులు కొదిలెయ్ - దేవా - ఓ దేవా
పరువం పోతే మళ్ళీ రాదూ జీవా - ఓ జీవా
కరువుతీరా అనుభవించరా జీవా - ఓ జీవా
జీవితమంతా Joy - Enjoy
హాయ్ - హాయ్ - హాయ్

చరణం: 3
కొత్తసినిమా వచ్చిందంటే - ఫస్టు షోకి చెక్కే సెయ్
అమ్మ నాన్న అడిగారంటే - అలిగి అన్నం మానేసెయ్
ఫీజుకట్టే 'పైకంతో - పిక్ నిక్ పార్టీ పెట్టేసెయ్
ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తే - గుడ్ బై చెప్పి వచ్చే సెయ్

జీవితమంతా Joy - Enjoy
హాయ్ - హాయ్ - హాయ్





చేసిన పాపం నీది పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డి.వి.కృష్ణ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు

చరణం: 1
చేసిన పాపం నీది
చితికిన బ్రతుకింకొకరిది
ఒకరిదా నేరం - వేరొకరికా శిక్ష
దిక్కులేని దీన అదిగో
రెక్క తెగిన పక్షి అదిగో
అక్కడ గూడైనా లేదు
ఎక్కడా ఒక తోడు లేదు
ఏమిటింత దారుణం
దీనికెవ్వరు కారణం ?

చరణం: 2
కన్నులా వెలుగారిపోయె
ఉన్న ఊత జారిపోయె
ఊరులేదు, వాడ లేదు
దారి యేదీ కానరాదు
ఏమిటింత దారుణం
దీనికెవ్వరు కారణం ?

చేసిన పాపం నీది
చితికిన బ్రతుకింకొకరిది
ఒకరిదా నేరం - వేకొకరికా శిక్ష !

చరణం: 3
చేసిన పాపం నీది
చితికిన బ్రతుకింకొకరిది
ఒకరిదా నేరం-వేరొకరికా శిక్ష
ఏమిటింత దారుణం
దీనికెవ్వరు కారణం




దాగుడుమూత దండాకోర్ పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డి.వి.కృష్ణ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు, భాస్కర్, లత

పల్లవి
దాగుడుమూత దండాకోర్ చెల్లెమ్మా 
నీ బావొచ్చాడు భద్రం భద్రం బుల్లెమ్మా
ఓ చెల్లెమ్మా సొగసరి బుల్లెమ్మా!
ఒహో' చెల్లెమ్మా ! గడసరి బుల్లెమ్మా

చరణం: 1
చంద్రుణ్ని అడిగాను సూర్యుడ్ని అడిగాను
ఏడని ! నీ వాడేడని ?
చుక్కల్ని అడిగాను - దిక్కుల్ని అడిగాను
ఏడని ? మా బావేడని ?
ఎక్కడా ? చిరునామా ఎక్కడా ?
ఎక్కడా చిరునామా చిక్కక చక్కావచ్చాను
చివరి నీ మూగమనసే చెపితే విన్నాను
ఏమని ? ఇతగాడే నీ జతగాడని

చరణం: 2
ఇన్నాళ్ళు నువ్వు నా చెల్లివి
మరి ఈనాడో అతని మరుమల్లివి
వలచే ప్రియురాలవై కొలిచే యిల్లాలివే
మనసిచ్చే నెచ్చెలివై మమతలు పంచు తల్లివై
నువ్వు కమ్మగా కాపురం వుండాలి
నీ అన్నయ్య దీవనలే పండాలి

చరణం: 3
ఏనాడు నీ బొమ్మ చూశానో
ఆనాడే నాలోన దాచాను
ఆనాటినుండి అనురాగం పండి
అను నిమిషం నీకోసం వేచాను
చెరిగిపోని తొలివలపే నీదని
మచ్చలేని మలెమనసు నీదని
తెలిసింది ఓ చెలీ, కలిసింది కౌగిలి
కలకాలు ఈ బంధం కళతగని జాబిలి




ఏమండి సారూ పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరధి 
గానం: యస్.పి.బాలు, జానకి 

ఏమండి సారూ  ఓ బట్లర్ దొరగారూ
అన్నీ తెలుసని అన్నారు
యెన్నో కోతలు కోశారు
ఇంతేనా - మీ పనితన మింతేనా

అయ్యోయ్యయో అయ్యయయ్యే
అయ్యయ్యయో అయ్యయయ్యో
అంతటిమాట అనకండి
అఖరుదాకా ఆగండి
చూడండీ నా పనితనమేదో చూడండి

చరణం: 1
బీరా కంద చామా
యే కూరైన ఒకటే రుచి ఓ రామా
కోడి పులావు కుర్మా
తిందామంటే నల్లుల వాసన ఖర్మా !
యెరువులు వేసిన కాయగూరలు
ఎవరు వండిన అంతేనమ్మా !

కమ్మని రుచులు కావాలంటే
కల్తీలేని శాల్తీలిచ్చి చూడండి
నా పనితనమేదో చూడండి !

అయ్యయ్యయో ! అయ్యయయ్యో !
అయ్యయ్యయో ! అయ్యయాయ్యో !
అందాకా ఈ ప్రాణం నిలిచేనా !

చరణం: 2
మనసు మమత మంచి
కలిపి దేవుడు వండినవంటే మనిషి
యెందుకు ఉప్పుకారం
మీలోనే వున్నది కమ్మని మమకారం
అయ్యలు మా కలలోటి
తియ్యటి  మాటలతోటి 
తీరునటయ్యా ఆకలి
చేతలలో నే చూపాలి
నీ చేతి మహత్యం చూపాలి




రాముని భంటునిరా పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, జానకి 

జై రామచంద్రకీ జై
రాముని బంటునురా
సీతారాముని బంటునురా !
దిక్కుల కాంతులు పిక్కటిల్లగా
గుప్పున కన్నుల నిప్పులు రాలగ
బర బర బర బర అంబర వీధిని
వాలము దిప్పుడు వచ్చినాడురా.....

చరణం: 1
ఇక్కడ వున్నాడొక రావణుడు
నక్కలాగ పొంచున్నాడు గుంట
సక్కలాగ పొంచున్నాడు
వాడిని పట్టి నేలకు కొట్టి
కండలు కోసి గుండెలు చీల్చి
కాకుల కెగరేసాడు నీడు

చరణం: 2
పిచ్చివాడిని నేనురా మద
పిచ్చివాడిని కానురా
చచ్చు పుచ్చు లోకానికి
చదుపు చెప్పే వాడ్నిరా
పచ్చపచ్చని కాపురాలకు
చిచ్చు పెట్టి వాళ్ళ మెడకు
ఉచ్చులాంటి వాడ్నిరా
కార్చిచ్చులాంటి వాడ్నిరా....

చరణం: 3
అమ్మా ! సీతమ్మా !
ఆ రాముడు సంపగ వచ్చానమ్మా
రఘురాముడు పంపగ వచ్చానమ్మా !
కష్టాలన్నీ కడతేరే ఆ
మంచిరోజు వచ్చేనమ్మా
అమ్మా ! సీతమ్మా !
ఈ రక్కసి బాధల నుక్కడంప
నీ రక్షణకై వచ్చానమ్మా.....




వేశావు భలే వేషాల పాట సాహిత్యం

 
చిత్రం: నేరము శిక్ష (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పి.గణపతి శాస్త్రి 
గానం: సుశీల 

పల్లవి:
రాజ నా రాజా!
వేశావు బలే వేషాలు
చేశావులే తమాషాలు
తెలిసెనులే - ఇక తెలిసెనులే
తెరలో దాగిన దెవ్వరో -- నీ వెవరో
తెలిసె తెలెసెలే తెలిసెనులే....

చరణం: 1
మింటి నడుమ జాబిల్లీ నీవే
వంటఇంటి కుందేలై నావే
మగసిరులొలికే మహరాజ
మగువల చేతలు తమకేల?
పసందైన ఈ కోడె వయస్సులో
హుషారులేదా - విషాదమే
రాజా.... నా రాజా....

|| వేశావు||

చరణం: 2
ఉలకపు పలకవు
పెదవి కదిపితే వొలికి పోవునా వరహాలే
ఒక్క మాటతో - ఓరచూపుతో
ఒళ్ళు పులకరించేనే
నా గుండె జలదరించేనే....
బెట్టు చేయనేల ? పట్టు విడచి రావా ?
లెక్కచేయవేల ! అక్కున చేర్చుకోవా ?
రాజా.... నా రాజా....

|| వేశావు||



Palli Balakrishna Wednesday, March 13, 2019
Jeevitha Nouka (1977)


చిత్రం: జీవిత నౌక (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె (All)
గానం: ఎస్.పి.బాలు, సుశీల
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద, జయసుధ, చంద్రకళ,శరత్ బాబు
మాటలు: సముద్రాల జూనియర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
విడుదల తేది: 1977

పల్లవి:
చిలకపచ్చని చీరలోనా...  చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్వింది.. చిటికేసి పిలిచింది
చిట్టమ్మి... నీ మీద ఒట్టమ్మి...హహహహహహ

చిలకపచ్చని చీరలోనా...  చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్విందా.. చిటికేసి పిలిచిందా
ఎందుకని... ఓరబ్బి ఎవరికని... హహహహహహహా

చిలకపచ్చని చీరలోనా....

చరణం: 1
సిగ్గులన్ని మూటగట్టీ నీ బుగ్గ మీదా దాచుకో
సిగ్గులన్ని మూటగట్టీ నీ బుగ్గ మీదా దాచుకో
నా పెదవులు నిన్నడిగితే... ముడుపుగా ఇచ్చుకో

ఇచ్చే ఆ ఘడియకై... ఎన్నెన్ని ఎదురుచూపులో
ఇచ్చే ఆ ఘడియకై... ఎన్నెన్ని ఎదురుచూపులో
ఇచ్చిన ఆ వేళలో... ఎన్నెన్ని తీపి మెరుపులో

చిలకపచ్చని చీరలోనా చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్విందా.. చిటికేసి పిలిచిందా
ఎందుకని... ఓరబ్బి ఎవరికని... లరలరలరలరలర

చిలకపచ్చని చీరలోనా....

చరణం: 2
చల్లని నీ రూపమే...  నా కళ్ళలోనీ కాటుకా
చల్లని నీ రూపమే...  నా కళ్ళలోనీ కాటుకా
పచ్చని నా పరువమే...  నీ దోసిట కానుక

నీ కాటుక కన్నులే...  నా కలలకు పొదరిల్లు
నీ కాటుక కన్నులే...  నా కలలకు పొదరిల్లు
వేసేను ఆ కలలే...  విడిపోని మూడుముళ్ళు

చిలకపచ్చని చీరలోనా...  చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్వింది.. చిటికేసి పిలిచింది
ఎందుకని... ఓరబ్బి ఎవరికని...
ఇందుకని... చిట్టమ్మి ఇందుకేనని


******  *******   ******


చిత్రం: జీవిత నౌక (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: సుశీల

పల్లవి:
వేయి దీపాలు నాలోన వెలిగితే
అది ఏ రూపం.. నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
అది ఏ రాగం.. ఆ అనురాగం..

చరణం: 1
ఈ చీకటి కన్నుల వాకిలిలో.. ఓ.. వెలుగుల ముగ్గులు వేసేదెపుడో
ఆ వెలుగుల మంగళవేదికపై.. నా వేణులోలుని చూసేదెపుడో
చూడలేని నీ కన్నులకూ.. ఎదురుచూపైనా ఉందొకటి
చూడగలిగే నా కన్నులకు.. చుట్టూ ఉన్నది పెనుచీకటి..
వేయి దీపాలు నాలోన వెలిగితే
ఏ రూపం.. నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
ఏ రాగం.. ఆ అనురాగం..

చరణం: 2
సుడివడిపోయే జీవితనౌక.. కడలితీరం చేరేదెపుడో
కలగా తోచే ఆశారేఖ.. నిజమై ఎదురై నిలిచేదెపుడో
వేచి ఉన్న నీ హృదయంలో.. రేపటి ఉదయం మెరిసింది
వేగిపోయే నా గుండెలో.. గతమే స్మృతిగా మిగిలింది..
వేయి దీపాలు నాలోన వెలిగితే
ఏ రూపం.. నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
ఏ రాగం.. ఆ అనురాగం..

Palli Balakrishna Friday, March 1, 2019
Seetamalakshmi (1978)





చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: తాళ్లూరి రమేశ్వరి, చంద్రమోహన్
మాటలు: జంధ్యాల 
కథ ,దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాతలు: మురారి-నాయుడు
విడుదల తేది: 1978



Songs List:



చాలు చాలు ఈ విరసాలు పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: జి. ఆనంద్ , విజయలక్ష్మి శర్మ 

చాలు .... చాలు …... ఈ విరసాలు
మేలు .…... మేలు .... నీ సరసాలు

కంటిచూపులా బాకులు- నీ కళ్లా కలువరేకులు
చాలు ... చాలు .... ఈ విరసాలు
మనసున మసిలే దొకరితో - నువ్వు
నువ్వు మాట్లాడేదింకొకరితో
మేలు మేలు... నీ సరసాలు
పదుగురితో నీ వలపు నేను పంచుకోలేను
వదిలిపెడితే చాలును బతికిపోతాను

కాదు .... కాదు .... పొమ్మంటే
చేదు.... చేదు....నీ వలపంటే
వాదులాడను ఇంక నీ దరికే రాను
మేలు.... మేలు .... నీ సరసాలు
చాలు …... చాలు .... ఈ విరసాలు



కొక్కొరోకో కోరుకో పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కొక్కొరోకో ..... కొక్కొరోకో
కోడికూత పెట్టింది - ఈడు పూత పట్టింది
ఎందుకో తెలుసుకో - ఇప్పుడే కలుసుకో
కోరుకో ఏం కావాలో కోరుకో
అమ్మబాబో
పల్లె నిదరలేచింది - పిల్ల ఎదర నిలిచింది
అమ్మబాబో
అందితే తీసుకో - ఏమైనా చేసుకో
కోరుకో ఏం కావాలో కోరుకో

గుజనాల రైకతొడిగి-గుత్తంగా సొంపులన్నీ
గుచ్చెతే రాశిపోసి, గునా, గునా - హెయ్
గునా, గునా నువ్వు నడిచొస్తుంటే
ఆ రాలు గింజల్నే, నే కోడి పుంజల్లే
ఏరుకుంటానే - నిన్ను ఏలుకుంటానే
కోరుకో ఏం కావాలో కోరుకో

వనరైన పాగా చుట్టి వలెవాటు పంచెగట్టి
కసరెక్కి కస్సుమంటూ కసా, పిసా - హెయ్
కసా, పిసా నువ్వు కదిలొస్తుంటే
నీ రాకతో సోకు మారాకు వేస్తుంటే
ఇచ్చుకుంటాలే - ఇచ్చి పుచ్చుకుంటాలే
కోరుకొ ఏం కావాలో కోరుకో

మాగాణి చేనుకాడ నాటేసే నన్ను చూడ
కాటేసే కళ్ళతోన - కరా, కరా- హెయ్
కరా, కరా నువు నమిలేస్తుంటే
గోదారి గట్టుమీద, గోరింట చెట్టుకింద
కొమరాల కొప్పుతోన ఘుమా, ఘుమా - హేయ్
ఘుమా, ఘుమా నువు బుసకొడుతుంటే

ఆ వాడి చూపుల్లో - నీ వేడి చూస్తుంటే
ఓడిపోతాలే నీలో ఒదిగి పోతా లే
కోరుకో ఏం కావాలో కోరుకో




మావిచిగురు తినగానే పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా??

మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా??

కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా?
కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా?
ఏమో..ఏమనునో గానీ..ఆమని..ఈవని!!

ఆ..ఆ మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ..

తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటల..
అ ఆ..తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటల!!

తారాటల..సయ్యాటల..
సయ్యాటల..తారాటల..

వన్నెలే కాదు, వగలే కాదు,ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు??
వన్నెలే కాదు, వగలే కాదు,ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు??

బింకాలు.. బిడియాలు.. పొంకాలు..పోడుములు..
ఏమో..ఎవ్వరిదోగానీ ఈ విరి?? గడసరి!!

ఆ..ఆ..ఆ మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ..
కోవిల పలికేనా??

ఒకరి ఒళ్ళు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాల..
ఉయ్యాల..జంపాల..జంపాల..ఉయ్యాల..
ఒకరి ఒళ్ళు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాల..

ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో..
ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో!!

పలకరింతలో.. పులకరింతలో
పలకరింతలో.. పులకరింతలో
ఏమో..ఏమగునోగానీ ఈ కథ..మన కథ!!

మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా??
కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా?
ఏమో..ఏమనునో గానీ..ఆమని..ఈవని!!

మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ..
కోవిల పలికేనా??





నువ్విట్టా నేనిట్టా కూకుంటే పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

నువ్విట్టా, నేనిట్టా, కూకుంటే ఇంకెట్టా
తెల్లారిపోయేదెట్టా - ఈ ఉడుకు
చల్లారిపోయే దెట్టా
నీకిట్టా, నాకిట్టా రాసుంటే ఇంకెట్టా
ఈ ఊపు ఆపేదెట్టా
నీ దుడుకీ కాసేపు ఓ పేదెట్టా
సిటికంత నవ్వంట - సిలికింత పువ్వంట
ఆ పువ్వు కోసుకుంటే ఆపేది ఎవ్వరంట

సీకట్లో సింగారం సిటికేసే యవ్వారం
నీ పొగరంతా ఆణిగేదెట్టా- ఈ
పొగరాని సెగలే తంటా

మసకేస్తే మనసంట - మనసైతే వరసంట
ఈ గడియ గడిపేదెట్టా - ఆ గడియ తీసేదెట్టా
ఆగడియా రానీకు- నన్నిడిసీ పోమాకు
తొలిపొద్దు పొడిచిందంటే
చలి తీరిపోతే ఎట్టా - ఎట్టా




పదే పదే పాడుతున్నా పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

పదే.... పదే..... పాడుతున్నా పాడినపాటే
అది బ్రకుకో పాటో నాకే తెలియదు పాడుతువుంటే
డైలాగ్: ఇది అనగనగా కథకాదు- అందమైన జీవితం
కన్నెవయసు చిలకమ్మ, వెన్నమనసు గోరింక
కలసి కట్టుకున్న కలలగూడు ఒకనాడు

చరణం: 1 
చిలకమ్మా ఎగిరిపోయే గోరింకను విడిచి
గోరింక కన్నీరింక వగచె ఇది తలచి
ఆమనులే వేసవులె తే ఎవరిని అడగాలి
దీవెనలే శాపాలై తే ఎందుకు బ్రతకాలి
మనసన్నది చెయ్యని పాపం
మనసివ్వడమే ఒక నేరం
మనిషైనా, మాకైనా అనుభవమొకటే

చరణం: 2
రామలీల ప్రేమజ్వాల రగలిన బ్రతుకేలే
రాలుపూత బంగరుసీత మిగిలిన వలపేలేపదే పదే పాడుతున్నా 
సత్యం : పదే.... పదే..... పాడుతున్నా పాడినపాటే
అది బ్రకుకో పాటో నాకే తెలియదు పాడుతువుంటే
డైలాగ్; ఇది అనగనగా కథకాదు- అందమైన జీవితం
కన్నెవయసు చిలకమ్మ, వెన్నమనసు గోరింక
కలసి కట్టుకున్న కలలగూడు ఒకనాడు

మనసుపడ్డ మనిషే దేవుడు శిలగా నిలిచాడు
చూపులకే ఊపిరిపోసి చీకటి కొలిచాడు
ఎడారిలో కోయిలవున్నా
ఆ దారినరాదు వసంతం
మనిషైనా, మాకైనా అనుభవ మొకటే



సీతాలు సింగారం.. పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, సుశీల

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం..
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే.. శ్రీలచ్చిమవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..

సీతాలు సింగారం..ఊమ్మ్...

కూసంత నవ్విందంటే పున్నమి కావాల...
ఐతే నవ్వనులే..ఏ..ఏ

కాసంత చూసిందంటే కడలే పొంగాల...
ఇక చూడనులే ..ఏ.. ఏ

కూసంత నవ్విందంటే పున్నమి కావాల..
కాసంత చూసిందంటే కడలే పొంగాల..

ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల..
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల... ఆ..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే ..భగవంతుడవతారం
మనసున్న మందారం...

లలల్లలా..లాలాలాలా..లలలాలా..

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను..
ఐతే నేనే వస్తాలే.. ఏ.. ఏ

చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను..
ఎగిరొస్తాలే.. ఏ.. ఏ..

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను

గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి... వెలిగించాల
నీ వెలుగుకు నీడై.. బ్రతుకున తోడై.. ఉండిపోవాలా
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల.. ఆ..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..
లలలాల..లలలా..లలలా...




ఏ పాట నే పాడను పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను 
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు 
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు 

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం

ఆ సుప్రభాతాలు ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు

ఏ పాట నే పాడను...
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికీ
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికీ

రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ

ఆ.ఆఆ.. ఆ రామలాలికి ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ 

ఏ పాట నే పాడనూ 
బ్రతుకే పాటైన పసివాడనూ
ఏ పాట నే పాడనూ
చేరువై హృదయాలు దూరమైతే పాట
జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
ఎందుకో ఎందుకో...
నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు 
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
గారాలు నీరాయే తీరాలు వేరాయే
మనసు మీరాలాయే వయసేటి పాలాయే

ఎందుకో ఎందుకో 
నా మీద అలిగాడు చెలికాడు 
కలలు చెదిరినా పాటే 
కలత చెందినా పాటే 
ఏ పాట నే పాడనూ... 


Palli Balakrishna
Chinnanati Snehitulu (1971)




చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్. టి.రామారావు, జగ్గయ్య, శోభన్ బాబు, వాణిశ్రీ , దేవిక
దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
విడుదల తేది: 06.10.1971



Songs List:



ఇక్కడే ఈ గదిలోనే పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: గంటసాల, పి.సుశీల

ఇక్కడే ఈ గదిలోనే
అప్పుడే ఒకటైనప్పుడే
అలివేణి సిగపూలు ఏమన్నావో...ఈ
అలివేణి సిగపూలు ఏమన్నావో
తొలిరేయి తెలవారలేనన్నదో
మరి ఏమన్నదో చెప్పనా మళ్ళీ చెప్పనా

శృతిమించెను శ్రీవారి మనసు
గడుసైన వయసు అగుపించెను
ఆనాటి తలపు అరువైన వలపు

నీ ఓర చూపుల తొందరలు
నీ దోర నవ్వుల దొంతరలు
అలనాటి రాగాలే పాలికించగా
అనురాగ వీణ నిదురింతునా నా

ఇక్కడే ఈ గదిలోనే
అప్పుడే ఒకటైనప్పుడే
దొరగారి యెదపొంగు ఏమన్నదో...ఈ
అలివేణి సిగపూలు ఏమన్నాదో
పరువాలు విరబూసి 
చెప్పవే జాబిల్లి చెప్పవే

ఇక తీరును ఇన్నాళ్ల వేడుక ఇల్లాలి కోరిక
ఉదయించును మన ఇంట భానుడు ఒక బలరాముడు
మీనోటి పలుకే దీవనయై
మీ తోటి బ్రతుకే పావనమై





ఏమని తెలుపనురా స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

పల్లవి:
ఏమని తెలుపనురా స్వామి
ఏమని తెలుపనురా !
తొలి చూపులోనే-ఏ
గిలిగింతలాయెనో!!

చరణం: 1
చిననాటి కధలేవో తెలిపీ-
చేయి కలిపీ
కొనగోట నునుబుగ్గ
మీటీ-కన్ను గీటీ
చెమరించు నా మేని
పెనుగాలి వలె తాకి
మనసు తెలిసి మరులుకురిసి
కన్నియ మది కరగించిన గడసరివని
ఏమని ! ఏమని! ఏమని
ఇంకేమని తెలుపనురా !

చరణం: 2
ఎదలోని పొదరింట జేరీ - నన్నే కోరీ
పదునైన తల పేదో రేపీ - ఆశ చూపీ
రసలోక శిఖరాల - కొసలేవో చూపించి
ఏమనందు! ఇంకముందు
ఏ వింతల ! పులకింతల ! తేలింతువో !
ఏమని ! ఏమని! ఏమని ! ఇంకేమని !!



అడగాలని వుంది పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

అడగాలని వుంది ఒక టడగాలని వుంది
అడిగిన దానికి బదులిస్తే
అందుకు బహుమానం
ఒక టుంది!
ఎదురుగా నిలుచుంటే
ఎంతో ముద్దుగ మెరి సేదేదీ ?
అందీ అందకుంటే
ఇంకెంతో అందం చిందేదేదీ ?

చేప ! చూపు ! సిగ్గు ! మొగ్గ
మొగ్గ కాదు కన్నెపిల్ల బుగ్గ !!
కొత్తగా రుచి చూస్తుంటే
మత్తుగా వుండేదేదీ !
మళ్ళీ తలచుకుంటే
మరింత రుచిగా వుండేదేదీ

వెన్న ! జున్ను ! తీపి ! పులుపు
పులుపు కాదు తొలి వలపు ! !
ఎంతగా చలి వేస్తుంటే
అంతగా మనసయ్యేదేదీ ఎంతగా చేరదీస్తే
అంతగా మురిపించేదేదీ !

కుంపటి! దుప్పటి ! గొంగలి ! కంబళి
కంబళి కాదు కౌగిలీ !!

అడగాలని వుంది అది
అడగాలని వుంది!
అడగంగానే ఇచ్చేస్తే
అందులో రుచి యేముంది!!





అందాల శ్రీమతికి పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

అందాల శ్రీమతికి
మనసైన ప్రియసతికి
వలపుల కానుకగా! 
ఒక పాపను నేనివ్వనా !!

మబ్బులలో విహరించే
మావారి అనురాగం
వాడని మందారం! 
నా పాపిట సింధూరం!!
మా బాబు నయనాలు!
లేత జాబిల్లి కిరణాలు !

వీడే.. ఇంతవాడే! 
అంతవాడై వెలుగుతాడు!

కళలు నిండారగా
సిరులు పొంగారగా!!
శౌర్యంలో నేతాజీ
సహనంలో గాంధీజీ
శాంతి గుణంలో నెహ్రూజీ
సాహసంలో శాస్త్రీజీ
ఒరవడిగా వడివడిగా 
నీ నడవడి తీర్చిదిద్దుకొని
సరిహద్దులలో పొంచిన ద్రోహుల
తరిమి తరిమి కొట్టాలి!
వీర సైనికుడవై భారతావని
పేరును నిలబెట్టాలి!!
వందేమాతరం!
వందేమాతరం!




సీతమ్మతల్లికి సీమంతమమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల & పార్టీ

పల్లవి:
సీతమ్మతల్లికి సీమంతమమ్మా
శ్రీదేవిభూదేవి దీవింతురమ్మా
శ్రీరస్తు శుభమస్తు సుపుత్రాప్రాప్తి రస్తు తథాస్తు,

చరణం: 1
వేదగాననే వినువీధులంటగ
మంగళనాదాలు ముంగిట
శ్రీవాణి జయ స రంగ -
శ్రీగౌరి శుభగీతి వినిపించగ

చరణం: 2
కరముల రతనాల గాజులు తొడిగీ
శిరమున ముత్యాల సేసలు చల్లీ
ముత్తైదువలే హారతు లివ్వగా
ముక్కోటి దేవతలు దీవించగా




నోములు పండగా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల & వసంత

నోములు పండగా నూరేళ్ళు నిండగా
పెరగాలి బంగారు నాన్నా నిలపాలి నీ పేరు కన్నా

చీకటినే వెలిగించే
దివ్వెవు కావాలనీ
చింతలు తొలగించే
చిరునవ్వువు కావాలని
కన్నతల్లి ఎన్నికలలు కన్నదో
ఎన్నెన్ని దేవతలకు
మొక్కుకున్నదో!

పరమాత్మకు ప్రతిరూపం నీవనీ
పసిడి కళల మణిదీపం నీవనీ
కలలుగని నినుగన్న కన్నతల్లి మనసు

కడుపులో పెరిగిన ఓ కన్నా!
సీకే తెలుసు! నాకన్నా నీకే తెలుసు!

పాలిచ్చి పాలించే ఈ తల్లీ తల్లి కాదు నీపాలి కల్పవల్లీ
ఈ వరాల మొలకను! ఈ జాబిలి తునకను
దీవనగా మాకిచ్చిన ఆ తల్లి తల్లి కాదు మాపాలి కల్పవల్లి




ఎందుకయ్యా నవ్వుతావు పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఎందుకయ్యా నవ్వుతావు ఎవరు సుఖపడినారనీ
నవ్వుకోరా తనివి తీరా ఎవ్వరేమైతేమని!
నువ్వు కడుపున పడిననాడే 
నుదుటి కుంకుమ చెరిపినావే
నిండు వెన్నెల బాటలో
కన్నీటి చీకటి నింపినావే
చావు బ్రతుకుల ఉందిరా
నిను చల్లగా కాపాడు దేవత
ఆమె నీడయె లేని నాడు
ఆగిపోవును మన కథ
నిన్ను పెంచిన కల్పవల్లీ
నిండుగా బ్రతకాలనీ
వేడుకోరా వెంక టేశుని

వేడుకోరా విశ్వనాధుని
వేడుకోరా! వేడుకోరా!


Palli Balakrishna Sunday, February 17, 2019

Most Recent

Default