Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Samarasimha Reddy (1999)





చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, అంజలి జవేరి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: చంగల వెంకట్రావు
విడుదల తేది: 13.01.1999



Songs List:



నందమూరి నాయకా అందమైన కానుక పాట సాహిత్యం

 
చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్.పి.బాలు, చిత్ర

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగుచాటు
చేయక తాకనీవే తనివి తీరా

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు
చేయక తాకనీవే తనివి తీరా

ఉంగా ఉంగరం పెట్టేయినా
నీ గుండె మీద వాలిపోనా
బుల్లో బొంగరం తిప్పెయినా
నీ బంగార బొడ్డు మీనా

జింగిలాలో జింగిలాలో
జింగిలాలో కొంగు జారే వంగ చేలో
అవ్వలాలో మువ్వలాలో
జవ్వలాలో జుర్రుకోర జున్ను పాలో

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు
చేయక తాకనీవే తనివి తీరా

(జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో)

పొద్దుగాల ముద్దు జోల
కోరస్: పాడుకో నాయన
మద్దినేల హద్దు లేక
కోరస్: ఆడుకో నాయన
మాపిటేలమంతనాలు
కోరస్: చేసుకో నాయన
రాతిరేల రంకెలేసి
కోరస్: రెచ్చిపో నాయన

లలనానాజూకు వదన
తనువే తాంబూలమా
సఖుడా సౌందర్య ప్రియుడా
సుఖమే సంగీతమా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో 
చిక్కినావే చక్కిలాలో
అవ్వలాలో మువ్వలాలో జవ్వలాలో
చల్లు కోర చందనాలో

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు
చేయక తాకనీవే తనివి తీరా

పక్కనుంటే పావురాయి
కోరస్: అల్లరే అమ్మడు
జివ్వుమంటే జామకాయి
కోరస్: గిల్లుడే గిల్లుడు
అడ్డుకుంటే ఆకురాయి
కోరస్: ఆగడే పిల్లడు
రెచ్చిపోతే రాలుగాయి
కోరస్: దంపుడే దంపుడు

వీరా జగదేక వీర కైపే కైలాసమా
సుమతి సురలోక మహతి ఊపే వైభోగమా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో
గుర్తుపట్టి సిగ్గు చేరో
అవ్వలాలో మువ్వలాలో జవ్వలాలో
జంటకొస్తే జాతరే హొయ్

నందమూరి నాయక అందమైన కానుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు
చేయక తాకనీవే తనివి తీరా

ఉంగా ఉంగరం పెట్టేయినా
నీ గుండె మీద వాలిపోనా
బుల్లో బొంగరం తిప్పెయినా
నీ బంగారు బొడ్డు మీనా



అందాల అడ బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్ సుజాత

పల్లవి:
అందాల అడ బొమ్మ 
ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ
కందిపోతుంది కన్నె జన్మ

పుచేడ కొనల్లోన కన్ను చిక్కుకుంది
రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది
కవ్విస్తే కట్టు తప్పనా

అందాల అడ బొమ్మ
ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ 
కందిపోతుంది కన్నె జన్మ

చరణం: 1
చెప్పుకుంటే తప్పులేదే
ఉప్పు తిన్న నీ ఒంటి యాతనా
తట్టుకుంటే వప్పుకోదే
నిప్పులాటి నీ కొంటె వేదనా
నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా
కానుంది మంచిదే ఎలాగా
కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగా
లేచింది వన్నె కన్నె  తీగ
వందేళ్ల సందిళ్ళ పందిళ్ళు వేయించన

అందాల అడ బొమ్మ
ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ
కందిపోతుంది కన్నె జన్మ

చరణం: 2
సున్నితంగా చూసుకుంటే
సొమ్ములన్ని నీ చేతబెట్టనా
నిబ్బరంగా నమ్ముకుంటే
కౌగిలింత నే మూతబెట్టనా
వంపుల్ని లెక్కబెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి
నీ ప్రేమ నారు నాటి పోయా
ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూతబట్టి 
నిలువెల్లా మల్లితోట కావా
గంధాలు చిందేల అందాలు పండించవ

అందాల అడ బొమ్మ
ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ
కందిపోతుంది కన్నె జన్మ

పుచేడ కొనల్లోన కన్ను చిక్కుకుంది
రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది
కవ్విస్తే కట్టు తప్పనా



లేడీ లేడీ కన్నె లేడీ పాట సాహిత్యం

 
చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, సుజాత

లేడీ లేడీ కన్నె లేడీ చుడిదార్ ప్యారీ లేడీ
బ్యూటీ రాణీ నాకే జోడి స్వీటీ కళ్ళ గిన్నెక్కోడి
మూడీగా ఉన్నదండి వేడెక్కి ఊగుతుంది
స్పీడెంతో ఉన్న పాప రావే నా తోడు అందండీ

ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్

బాలా బాల బాలగోపాలా నీదే ఈ లండన్ లైలా
మనసిచ్చానోయ్ మురళీ లోలా జోడిచ్చేయ్ ముద్దు మసాలా
రారా నా హార్ట్ హీరో ప్రేమించా ధూమచ్చారో
ఛాలెంజి చేసి యారో ముద్దిస్తా మత్తుగా మారో

కమ్మని పెదవి కవ్విస్తోంది రమ్మంటూ ఊరిస్తోంది
కళ్ళకు మత్తు కమ్మేస్తోందోయ్
వెచ్చంగా వేదిస్తోందోయ్
నీలో ఒయ్యారముంది నాలో ఉత్సాహముంది
హైహారే.. అందగాడా టీజింగ్లో ఎంత సుఖముంది

ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్

లేడీ లేడీ కన్నె లేడీ చుడిదార్ ప్యారీ లేడీ
బాలా బాల బాలగోపాలా నీదే ఈ లండన్ లైలా

సూర్యుడు షాపుని కట్టేశాడు
చంద్రుడు కర్టన్ తెరిచేశాడు
కమ్మని కౌగిలి అందకపోతే
కాముడు గోల పెట్టేస్తాడు
ఆ.. డౌటు ఎందుకంటా నీ జంటే నేను ఉంటా
ఇంకా లేటెందుకంటా బెడ్ లైటు ఆపుచేయ్ సజనీ..

ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్

లేడీ లేడీ కన్నె లేడీ చుడిదార్ ప్యారీ లేడీ
బాలా బాల బాలగోపాలా నీదే ఈ లండన్ లైలా
హేయ్ మూడీగా ఉన్నదండి వేడెక్కి ఊగుతుంది
ఛాలెంజి చేసి యారో ముద్దిస్తా మత్తుగా మారో హ

ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్
ధీంత నకదిన్ ధీంత నకదిన్ ధీంత నకదిన్ దిన్



రావయ్యా ముద్దుల మామ పాట సాహిత్యం

 
చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: ఎస్.పి.బాలు, చిత్ర

రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమా
వచ్చాక వదలను భామ
జంట జాగారం చెయ్యాలమ్మా
మల్లెల పాట పాడుకుందామా
అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకునే వెల్లువలో 
ఝల్లుమనే కథే విందామా

రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమా
వచ్చాక వదలను భామ
జంట జాగారం చెయ్యాలమ్మా

మనసైన మాపటి లగ్గం లోన
మన పెళ్లి జరిగేనూ
అక్షంతలెయ్యగా వలపులు రేపు
లక్షింతలయ్యేనూ
నీరిక్షనే ఫలియించి వివాహమేకాగా
ప్రతిక్షణం మనకింక విలాసమై పోగా
కలలే నిజమై సల్లాపమే సన్నాయిగ మోగే

హే! రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమా
వచ్చాక వదలను భామోయ్
జంట జాగారం చెయ్యాలమ్మా...

విరజాజివేళకు విందులు చేసి
విరిసింది నా ఈడూ
మరుమల్లె పూజకు తొందర చేసి
మరిగింది నీ తోడూ
సుతారమైనా మేను సితారలా మోగే
ఉల్లాసమే నాలోన ఉయ్యాలలే ఊగే
ఒడిలో ఒదిగే వయ్యారమే సయ్యాటలే కోరే

రావయ్య ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమా
వచ్చాక వదలను భామ
జంట జాగారం చెయ్యాలమ్మా
మల్లెల పాట పాడుకుందామా
అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకునే వెల్లువలో
ఝల్లుమనే కథే విందామా



అడిసు బబ్బా పాట సాహిత్యం

 
చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మనో, రాధిక

అడిస
అడిసు బబ్బ అల్లమురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా ఖుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ
అడిస బబ్బ అల్లమురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా ఖుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

పిస్తా పురి ఇస్తే మరి వస్తానులే పోరి
కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి

అడిస బబ్బ అల్లమురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా ఖుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

మందార పువ్వే పెట్టూ మనసంత లాగేట్టు
శృంగార కన్నే కొట్టూ కంగారు కలిగేట్టు
ఓయ్ ముద్దబంతి పువ్వు ముసినవ్వు మురిపించేట్టు కొసరివ్వు
అద్దమంటి నవ్వు ఎదురవ్వు ఎద లోతుల్లో చోటివ్వూ
చిలిపి వలపు చెరుపు తలుపు తెరవక టుస్...

అడిస బబ్బ అల్లమురబ్బ చూస్తావా నా దెబ్బ హా..
కులాస బాబా ఖుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

మ్యాట్నీకి పోదాం పట్టూ స్టోరీలు ముదిరేట్టు
బుగ్గల్లో సోడా కొట్టూ పుంజాలు అదిరేట్టు
ఇద్దరంటే ప్రేమ కలిశామా బిగి కౌగిళ్ళ హంగామా హోయ్..
తోచనీదు భామ తొలిప్రేమ తొలిచేస్తుంది చలి చీమ
మధువు కొరకు పెదవి కొరకు కదలికిటు

అడిస బబ్బ అల్లమురబ్బ చూస్తావా నా దెబ్బ
కులాస బాబా ఖుషీ కుటుంబ వస్తావా హాయిరబ్బ

పిస్తా పురి ఇస్తే మరి వస్తానులే పోరి
కిస్తాబులా ముస్తాబులే చేస్తానులే కోరి



చలిగా ఉందన్నాడే పాట సాహిత్యం

 
చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్.పి.బాలు, చిత్ర

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు
చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు

నీటుగా వేశాడమ్మా నడుముపై చెయ్యి
మోజులో పడ్డానమ్మా మెదడు షాకైయ్యీ
అసలైనా ఆంధ్రా కింగే వీడు
నైటంతా కితకితలే పెట్టాడు 
అసలైనా ఆంధ్రా కింగే వీడు
నైటంతా కితకితలే పెట్టాడు

చలి చంపేస్తా ఉంటె ఏంచైనే బుల్లమ్మా
దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా 
అరె చలి చంపేస్తా ఉంటె ఏంచైనే బుల్లమ్మా
దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా 

సొగసుగా ఉంటే వేశా నడుముపై చేయ్యీ
వయసు తెగ రెచ్చిందమ్మో
మనసు లాక్ అయ్యా
కుదిరిందే పిల్లా మనకు జోడు
లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ
కుదిరిందే పిల్లా మనకు జోడు
లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ

మలక్పేటలో ఝలక్ చూపి
నా కులుకు దోచినాడే
వరస పట్టేసినాడే ఒడిలో కట్టేసినాడే
మటన్ ప్లేటులో చికెన్ ముక్కలా
వగలు చూపుతుంటే
ఇక నేన్ ఏం చెయ్యనమ్మో
తకధీమ్ స్టార్ట్ చేస్తినమ్మో

అణువణువూ ఆవిరి అదో తీపి తిమ్మిరి
భయపడకే సుందరీ తప్పదమ్మ నా గురి
అవునంటే హైదరాబాదుని పిల్లో
రాసిస్తా రావే నా జిల్ జిల్లో
కాదంటే వింటావా ఊయల్లో
పొందిగ్గా పూలెట్టేయ్ నా జల్లో

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
చలి చంపేస్తా ఉంటే ఏంచైనే బుల్లమ్మా

మొదల్ కిస్సుకే సెగల్ పుట్టి నువ్
గుబుల్ పడ్డ ఉంటే
ఫర్ థర్ ఏంచైనే పోరి ఎట్టా లాగిస్తా లారీ
ఫికర్ మాని నువ్ జబర్దస్త్ గా
జిగర్ చూపవయ్యో
దిల్ జిల్ జోడిస్తానయ్యో
బాంచన్ కాల్ మోక్తనయ్యో

ఓయ్ మెహబూబా మస్త్ గా
మోహాబాత్ చూపనా
బల్మాషం షేరుగా కిల్ మీ అని చెప్పనా
ఐ లవ్ యు లవ్ యు వెల్వెట్ రాణీ
లబ్లీగా వినిపిస్తా సింఫోనీ
జారిందోయ్ వోణి ద్బిర్ జానీ
కానిచ్చేయ్ దేదో జల్దీ కానీ

చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
హొయ్ చలి చంపేస్తా ఉంటే ఏంచైనే బుల్లమ్మా
నీటుగా వేశాడమ్మా నడుముపై చేయ్యో
వయసు తెగ రెచ్చిందమ్మో మనసు లాకయ్యి

అసలైనా ఆంధ్రా కింగే వీడు
లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ
అసలైనా ఆంధ్రా కింగే వీడు
లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ

Most Recent

Default