Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gundamma Katha (1962)

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: గంటసాల
నటీనటులు: యన్. టి.ఆర్, ఏ. యన్. ఆర్, సావిత్రి, జమున
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాతలు: బి.నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 07.06.1962

Songs List:

లేచింది నిద్ర లేచింది పాట సాహిత్యం

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: గంటసాల
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: గంటసాల

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం 
దద్దరిల్లింది పురుష ప్రపంచం 
లేచింది మహిళాలోకం 

చరణం: 1 
ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మం గారు 
ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మం గారు 
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా.... 
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా 
విస్సన్న చెప్పిన వేదం కుడా 
లేచింది మహిళాలోకం 

చరణం: 2 
పల్లెటూళ్ళలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు 
పల్లెటూళ్ళలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు 
అది ఇది ఏమని అన్ని రంగముల... 
అది ఇది ఏమని అన్ని రంగముల 
మగధీరులనెదిరించారు నిరుద్యోగులను పెంచారు 
లేచింది మహిళాలోకం 

చరణం: 3 
చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటి చేసి 
చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటి చేసి 
ఢిల్లీ సభలో పీఠం వేసి..ఆ..ఆ..ఆ. 
ఢిల్లీ సభలో పీఠం వేసి 
లెక్చరులెన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు 

లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం 

సన్నగ వీచే చల్లగాలికి పాట సాహిత్యం

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: గంటసాల
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: సుశీల

సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే 
తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే 
సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే 
తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే 
అవి తలచిన ఏమో సిగ్గాయే 
కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే 
కనులు తెరచినా నీవాయే 

చరణం: 1 
నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే 
నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే 
కలవరపడి నే కనులు తెరవగా కంటిపాపలో నీవాయే 
ఎచట చూచినా నీవాయే 
కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే 
కనులు తెరచినా నీవాయే 

చరణం: 2 
మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
 మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
ఉలికిపాటుతో కలయవెదకిన హృదయఫలకమున నీవాయే 
కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవేనాయే 

అలిగిన వేళనే చూడాలి పాట సాహిత్యం

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: గంటసాల
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: సుశీల

పల్లవి: 
అలిగిన వేళనే చూడాలి గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి 
రుసరుసలాడే చూపులలోనే రుసరుసలాడే చూపులలోనే 
ముసిముసి నవ్వుల చందాలు అలిగిన వేళనే చూడాలి 

చరణం: 1 
అల్లన మెల్లన నల్లపిల్లి వలే వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన 
అల్లన మెల్లన నల్లపిల్లి వలే వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన 
తల్లి మేలుకొని దొంగను చూసి... 
తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనే చూడాలి గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి 

చరణం: 2 
మోహనమురళీ గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా 
మోహనమురళీ గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా 
దృష్టి తగులునని జడిసి యశోద... 
దృష్టి తగులునని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే 
అలిగిన వేళనే చూడాలి గోకులకృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి 

ఎంత హాయి పాట సాహిత్యం

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: గంటసాల
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: గంటసాల, సుశీల

ఎంత హాయి ఎంత హాయి ఈరేయి 
ఎంత మధురమీ హాయి ఆ ఆ ఆ 
ఎంత హాయి ఈరేయి 
ఎంత మధురమీ హాయి 
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా 
ఆ చందమామ చల్లగా పన్నీటిజల్లు చల్లగా 
ఎంత హాయి ఎంత హాయి ఈరేయి 
ఎంత మధురమీ హాయి ఆ ఆ ఆ 
ఎంత హాయి 

చరణం: 1 
ఆ ఆ ఆ 
ఒకరి చూపులొకరిపైన విరిటూపులు విసరగా 
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా 
విరితావుల పరవడిలొ విరహమతిసయింపగా 
ఆ విరితావుల ఘుమఘుమలొ మేను పరవశింపగా 
ఎంత హాయి ఎంత హాయి ఈరేయి 
ఎంత మధురమీ హాయి ఎంత హాయి 

చరణం: 2 
కానరాని కొయిలలు మనల మెలుకొలుపగా 
కానరాని కొయిలలు మనకు జోలపాడగా 
మధురభావలాహిరిలొ మనము తూలిపోవగా 
మధురభావలాహరిలొ మనము తేలిపోవగా 
ఎంత హాయి ఎంత హాయి ఈరేయి 
ఎంత మధురమీ హాయి 
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా 
ఎంత హాయి 

ప్రేమయాత్రలకు బృందావనము పాట సాహిత్యం

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: గంటసాల
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: గంటసాల, సుశీల

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో 
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో 
ఆహాహా ఆహాహా హా 
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో 
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో 
తీర్ధయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో 
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో 
ఆహాహా ఆహాహా హా 
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో 
తీర్ధయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో 

చరణం: 1 
చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా 
ఆహాహా ఆహా ఆహాహా ఆహాహా హా 
చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా 
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీశాయగా 
ఆహాహా ఆహాహా హా 
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీశాయగా 
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో 

చరణం: 2 
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా 
ఆహాహా ఆహా ఆహాహా ఆహాహా హా 
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా 
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా 
ఆహాహా ఆహాహాహా 
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా 
తీర్ధయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ ఏలనో 
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా 

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో 
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో 

వేషము మార్చెనూ హొయి పాట సాహిత్యం

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: గంటసాల
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: గంటసాల, పి.లీలా

వేషము మార్చెనూ హొయి 
భాషను మార్చెనూ హొయి 
మోసము నేర్చెనూ అసలు తానే మారెనూ 
అయినా మనిషి మారలేదూ 
ఆతని మమత తీరలేదు 
మనిషి మారలేదూ 
ఆతని మమత తీరలేదు 

చరణం: 1 
కౄరమృగమ్ముల కోరలు తీసెను 
ఘోరారణ్యములాక్రమించెను 
కౄరమృగమ్ముల కోరలు తీసెను 
ఘోరారణ్యములాక్రమించెను 
హిమాలయముపై జెండా పాతెను 
హిమాలయముపై జెండా పాతెను 
ఆకాశంలొ షికారు చేసెను 
అయినా మనిషి మారలేదూ 
ఆతని కాంక్ష తీరలేదు 

చరణం: 2 
పిడికిలి మించని హృదయములో 
కడలిని మించిన ఆశలు దాచెను 
పిడికిలి మించని హృదయములో 
కడలిని మించిన ఆశలు దాచెను 
వేదికలెక్కెను వాదము చేసెను 
వేదికలెక్కెను వాదము చేసెను 
త్యాగమె మేలని బోధలు చేసెను 
ఐనా మనిషి మారలేదూ 
ఆతని బాధ తీరలేదు 
వేషము మార్చెను 
భాషను మార్చెను 
మోసము నేర్చెను 
తలలే మార్చెను 
ఐనా మనిషి మారలేదూ 
ఆతని మమత తీరలేదు

కోలో కోలోయన్న కోలో నా సామి పాట సాహిత్యం

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: గంటసాల
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: గంటసాల, సుశీల

కోలో కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు 
కోలో కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు 
మేలో మేలోయన్న మేలో నా రంగ కొమ్మలకు వచ్చింది ఈడు 
మేలో మేలోయన్న మేలో నా రంగ కొమ్మలకు వచ్చింది ఈడు 
ఈ ముద్దుగుమ్మలకి చూడాలి జోడు 
కోలో కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు 

చరణం: 1 
బాల బాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల 
బాల బాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల 
బేలో బేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా 
బేలో బేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా 
 ఈ బేల పలికితే ముత్యాలు రాల 

కోలో కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు 

చరణం: 2 
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమో మంచిదే పాపం 
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమో మంచిదే పాపం 
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం 
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం 
జంటుంటే ఎండురానీదు ఏ లోపం 
కోలో కోలోయన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు 

మౌనముగా నీ మనసు పాట సాహిత్యం

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: గంటసాల
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: గంటసాల

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే 
తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే 
నీ మనసు నాదనుకొంటిలే 

చరణం: 1 
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే.. ఆ.... 
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే 
ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మైమరచితిలే 
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే 

చరణం: 2 
ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే ఆ.... 
ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే 
రుస రుస లాడుతు విసిరిన వాల్ జడ వలపు పాశమని బెదిరితిలే 
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే 
తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే 
నీ మనసు నాదనుకొంటిలే 
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే 

Most Recent

Default