చిత్రం: తిమ్మరుసు (2021) సంగీతం: శ్రీ చరణ్ పాకాల నటీనటులు: సత్యదేవ్ , ప్రియాంక జ్వాల్కర్ దర్శకత్వం: శరన్ కొప్పిశెట్టి నిర్మాత: మహేష్ కోనేరు, సృజన్ యారబోలు విడుదల తేది: 30.07.2021
Songs List:
తిమ్మరుసూ పాట సాహిత్యం
చిత్రం: తిమ్మరుసు (2021) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ గానం: రఘుదీక్షిత్, జ్యోత్న పాకాల, యామిని గంటసాల, అంబిక శశిట్టల్ హే నల్లకోటులోన న్యాయదేవతేన… ప్రాణమొచ్చి నీలా మారిందా రేటు కట్టలేని రూటులోన నువ్వే సాగగా హెయ్, దారి తప్పకుండా వ్యూహమేదో రాసి మంత్రిలాగ ఉంటూ క్షణంలో రాజుగాని రాజై మాటతోని యుద్ధం చేశాడా, యే రానే రాదే..!! ఏం రాదమ్మో..!! రూపాయి రూపంలో అయినా సాగే ఈ యుద్ధము సత్యాన్వేషణలో రానే రాదే..!! ఏం లాభమో… రూపాయి రూపంలో అయినా సాగే ఈ యుద్ధము సత్యాన్ని శోధించగా తిమ్మరుసూ… ఒహ్హో, యే తిమ్మరుసూ… ఒహ్హో, యే యే తిమ్మరుసూ… ఒహ్హోహో హో, యే యే తిమ్మరుసూ… ఒహ్హో, యే ధర్మాన్నే రక్షించే మార్గంలో… హో ఓ గీతాల్నే దాటింది పురాణం కర్మయోగులున్న చోట పరిధి దాటి సాగుతున్న నీతి బాట తప్పుతుంటే కాల గతులు మార్చి తప్పటడుగు వేసినట్టు తెలివితోటి ఆటలాడి దారిలోకి తెచ్చుకుంటే తప్పేకాదే ఏం రాదమ్మో… రూపాయి రూపంలో అయినా సాగే ఈ యుద్ధము సత్యాన్వేషణలో రానే రాదే..!! ఏం లాభమో… రూపాయి రూపంలో అయినా సాగే ఈ యుద్ధము సత్యాన్ని శోధించగా తిమ్మరుసూ… ఒహ్హో, యే తిమ్మరుసూ… ఒహ్హో, యే యే తిమ్మరుసూ… ఒహ్హోహో హో, యే యే తిమ్మరుసూ… ఒహ్హో, యే
2021
,
Mahesh S. Koneru
,
Priyanka Jawalkar
,
Satyadev Kancharana
,
Sharan Koppisetty
,
Sricharan Pakala
,
Thimmarusu
Thimmarusu (2021)
Palli Balakrishna
Thursday, September 30, 2021
