చిత్రం: శిక్ష (1985) సంగీతం: కె. వి.మహదేవన్ మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి. సుశీల, వాణీ జయరాం, జేసుదాసు నటీనటులు: చంద్రమోహన్, శరత్ బాబు, సుహాసిని మణిరత్నం, రజని, రాజేష్ దర్శకత్వం: రేలంగి నరసింహారావు నిర్మాత: పి.శశిభూషణ్ విడుదల తేది: 12.07.1985
Songs List:
ఎర్రగా బుర్రగా పాట సాహిత్యం
చిత్రం: శిక్ష (1985) సంగీతం: కె. వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: వాణీ జయరాం ఎర్రగా బుర్రగా
నా వయసుకు పాట సాహిత్యం
చిత్రం: శిక్ష (1985) సంగీతం: కె. వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: వాణీ జయరాం నా వయసుకు
పాడుతూ ఉంటాను పాట సాహిత్యం
చిత్రం: శిక్ష (1985) సంగీతం: కె. వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి. సుశీల పల్లవి: పాడుతూ ఉంటాను నీ తోడుగా ఉంటానూ ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంతవరకూ నే పాడుతూ ఉంటానూ.... పాడుతూ ఉంటాను నీ తోడుగా ఉంటానూ ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంతవరకూ నే పాడుతూ ఉంటానూ.... చరణం: 1 నా పాటలో పలుకు ప్రతిమాటలో తొణుకు అనురాగమే నీకు నా అర్చనై నీ కనులలో కులుకు చిరునవ్వులో చిలుకు అభిమానమే నాకు నీ అభయమై నా పాటలో పలుకు ప్రతిమాటలో తొణుకు అనురాగమే నీకు నా అర్చనై నీ కనులలో కులుకు చిరునవ్వులో చిలుకు అభిమానమే నాకు నీ అభయమై నేను నీ సేవనై... నీవు నా స్వామివై ఈ ఇల్లు శివపార్వతుల వాసమై... కైలాసమై విలసిల్లగా... నే పాడుతూ ఉంటానూ.... చరణం: 2 వెన్నెల్లు వచ్చినా చీకట్లు ముసిరినా ఒక రీతినే మురియు ఆకాశమై ఒక బాటనైనా ఎడబాటునైనా ఒక ప్రీతినే చూపు అనుబంధమై వెన్నెల్లు వచ్చినా చీకట్లు ముసిరినా ఒక రీతినే మురియు ఆకాశమై ఒక బాటనైనా ఎడబాటునైనా ఒక ప్రీతినే చూపు అనుబంధమై నేను నీ ఆత్మనై ... నీవు పరమాత్మవై నేను నీ ఆత్మనై ... నీవు పరమాత్మవై మన జంట సుఖదుఃఖ్ఖముల యోగమై.. ఒక యాగమై తరియించగా.... నే పాడుతూ ఉంటాను నీ తోడుగా ఉంటానూ ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంత వరకూ నే పాడుతూ ఉంటానూ....
విధి పగలేసిన పాట సాహిత్యం
చిత్రం: శిక్ష (1985) సంగీతం: కె. వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: జేసుదాసు విధి పగలేసిన
Shiksha (1985)
Palli Balakrishna
Thursday, August 26, 2021
