చిత్రం: అక్షర (2021)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: నందిత శ్వేత, షకలక శంకర్, మధునందన్
దర్శకత్వం: బి. చిన్నికృష్ణ
నిర్మాతలు: సురేష్ వర్మ, అహితేజ బెల్లంకొండ
విడుదల తేది: 26.02.2021
చిత్రం: అక్షర (2021)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: బాలాజీ
గానం: అనుదీప్ దేవ్
కనులను కాపలాగ ఉంచా
నీ పేరు ప్రేమ దేశమా
మనసుకి తలుపులన్ని తెరిచా
నీ ప్రేమకింత అందమా
పెదవిని కదిపితే నీ పేరు పాటలా
అడుగులు ఆగితే నీ ప్రేమ చోటులా
నీ జడ పువ్వులో తుమ్మెదలా ఇలా
మర్చేసావులే నన్నే నువ్వులా
నా నా నా న నా న
నాలోని కులుకులన్ని
నా నా నా న నా న
గుండెల్లో చల్లుకుంటు
నా నా నా న నా న
నాలోని కలలకింక
నా నా నా న నా న
కాస్తంత దొరకవే
సెకనుకి ఓ సారి నీ మాట తలచినా
మిగులుతు ఉంటాయి నీ మీద ఊహలే
చూసిన ప్రతసారీ అందాలు కొత్తగా
కనబడుతుంటాయి మీటుతు కన్నులే
నీతో పాటుంటే గడిచేనా ఈ కాలం
వెనకే పడుతుంది నీడలా
నువ్వే తోడుంటే నాకెందుకు ఈ లోకం
నేడే గడిపేస్తా జన్మిలా
నా నా నా న నా న
నాలోని కులుకులన్ని
నా నా నా న నా న
గుండెల్లో చల్లుకుంటు
నా నా నా న నా న
నాలోని కలలకింక
నా నా నా న నా న
కాస్తంత దొరకవే
హే తడిసిన పాదాలు ఈ నేల మోపుతూ
అడుగులు వేస్తుంటే జాడలు పువ్వులే
పొడిపొడి మాటైనా నీ నోరు జారితే
తేనెల బాణాలై గుండెను తాకెనే
నడుమే అరసున్నా నెలవంకే సరిపోనా
నడకల దీవిలోన హంసలే
మెరిసే మెరుపైనా ఒంకరగా ఉంటుందే
నిలువుగు నీ సొగసుని మించదే
నా నా నా న నా న
నాలోని కులుకులన్ని
నా నా నా న నా న
గుండెల్లో చల్లుకుంటు
నా నా నా న నా న
నాలోని కలలకింక
నా నా నా న నా న
కాస్తంత దొరకవే
2021
,
Akshara
,
Allluri Suresh Varma
,
B. Chinni Krishna
,
Bellamkonda Ahiteja
,
Nandita Swetha
,
Shakalaka Shankar
,
Suresh Bobbili
Akshara (2021)
Palli Balakrishna
Tuesday, February 23, 2021
