Search Box
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ నటీనటులు: వెంకట్, మీనా, జయసుధ, తేజెస్వి కథ: గోవింద భాయ్ పటేల్ మాటలు: గణేష్ పాత్రో దర్శకత్వం: మౌర్యా నిర్మాత: యమ్.ఎస్. రెడ్డి సినిమాటోగ్రఫీ: సి. విజయ్ కుమార్ విడుదల తేది: 20.02.1999
Songs List:
విశ్వమంత నిండి వున్న పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: మనో & కోరస్ విశ్వమంత నిండి వున్న వెలుగునీడలు ..... అవి అనాదిగా మంచిచెడుల అడుగుజాడలు ...... పగలు వెంటె రాతిరని సుఖం వెంటె దుఃఖమని గంట కొట్టినట్లు చెప్పు జంట గురువులు :.... ||విశ్వ || కోటికి పడగెత్తినట్టి గొప్పగొప్ప వాళ్ళనైన కూటికింత నోచుకోని కూలినాలి జనులనైన తరతమబేధాలు లేక క్షణమైన విడిచిపోక వెన్నంటే వుంటాయి వెలుగునీడలు .... ఆ బ్రహ్మకైన తప్పవు ఆటుపోటులు .. ఆ బ్రహ్మకైన తప్పవు ఆటుపోటులు ... ||విశ్వ ||
ఊగవే ఊగవే ఉయ్యాలా ... పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: శ్రీలేఖ & కోరస్ ఊగవే ఊగవే ఉయ్యాలా ... ఊరువాడా మెచ్చ జంపాలా వెలుగునీడల నడుమ వెలిగిపోతూవున్న చిలిపి నవ్వుల రాధ అలసిపోయేదాక ... || ఊగవే || ఇంతలోనె ఏవిటీ వింత ... ? ఈడొచ్చి కూకుంది మనకంత ...! ఈడొస్తే సరిపోదు ఉయ్యాలా ... మంచి జోడూ కుదరాలమ్మా జంపాలా !! మందార మొగ్గంటి అందాలరాశివి నీకేమి తక్కువే ఉయ్యాలా ! మొగలిరేకూలాంటి మగసిరీ గలవాడు నిన్నెగరేసుకెళతాడె జంపాలా ! అక్క పెళ్ళికి ముందు ఉయ్యాలా ! ఆ పప్పు ఉడకదే జంపాలా !!
అల్లీ బిల్లీ ఆటలతో పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, చిత్ర & కోరస్ అల్లీ బిల్లీ ఆటలతో అర్థం తెలియని మాటలతో చదువుల బడిలో... దేవుడి గుడిలో ఒకరికొకరుగా పెరిగాము ! ఇపుడిద్దరమొకటై నిలిచాము !! రేకులు విరిసిన వేకువ నువ్వు! ఆకులు రాలని ఆమని నువ్వు ! నందకిశోరుని మోవి చివురుపై నర్తించే దరహాసం నువ్వు !! అలు పెరుగుని మగసిరినీ అగుపించని గడసరిని వరముగ బడసిన హిమగిరి నువ్వు!! పడగెత్తిన పరువం నువ్వు! పాలకడలి తరంగం నువ్వు ! పార్వతి యెదలో తాండవమాడే పరమశివుని ప్రతిరూపం నువ్వు! సరిగమలే ఒరవడిగా పదనిసలే నడవడిగా అడుగులిడెడు కలహంసవు నువ్వు!!
ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, చిత్ర ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చందక లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చందక ఎదురుతెన్నెలు చూసిన ఫలితం ఎదురుగ వరమై నిలిచిందమ్మా ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు కరగిపోయిన గతం సర్వం మరిచిపోదాము చెరగని ప్రేమకు మెరుగులు తరగని శీర్షికలౌదాము కరగిపోయిన గతం సర్వం మరిచిపోదాము చెరగని ప్రేమకు మెరుగులు తరగని శీర్షికలౌదాము నింగి నేల సాక్షిగా నిర్మల ప్రేమే దీక్షగా ఒకరు పాదమై ఒకరు నాధమై కమ్మని పాటకు శృతిలయలౌదాము కాలం పరుగుకు కళ్లెం వేద్దామూ ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు ఆగిపోయిన పెళ్లికి మళ్ళీ ఆయువు పోద్దాము ఆగక పొంగే ఆశలన్నిటికి హారతి పడదాము ఆగిపోయిన పెళ్లికి మళ్ళీ ఆయువు పోద్దాము ఆగక పొంగే ఆశలన్నిటికి హారతి పడదాము ముద్దుముచ్చట తోడుగా ఇద్దరమూ సరిజోడుగా ఒకరు సత్యమై ఒకరు నిత్యమై బంగరు భవితకు బాటలు వేద్దాము బృందావనికే గంధం పూద్దామూ ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చందక లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చందక ఎదురుతెన్నెలు చూసిన ఫలితం ఎదురుగ వరమై నిలిచిందమ్మా ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు
పెళ్ళికి ముందే సిగ్గంతా పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: శ్రీలేఖ, శ్వేతనాగ & కోరస్ పల్లవి : పెళ్ళికి ముందే సిగ్గంతా నువ్వొలక బోయకమ్మా ! శోభనరాత్రికి అంతో ఇంతో దాచుకోవమ్మా.... కాస్త తల పైకెత్తమ్మా.......... ! పాలగ్లాసుతో పడకటింటిలో కాలు మోపగానే..... పూల పానుపు రారమ్మంటూ మేలమాడునమ్మా..... అప్పుడు... మురిపెం బిడియం కలబోసి.... ముసిముసి నవ్వులు జతచేసి... నులివెచ్చని చూపు విసిరావంటే... ఆచూపే ఆ చూపే దీపాలారు పునమ్మా!... || పెళ్ళికి || రాధా రాధా... వియ్యాలవారొచ్చేశారు అయితే పదండి పదండి!.... రండి రండి వియ్యాలవారు ! మీ రాకకు మా జోహారు ! అలసిపోయినట్లున్నారు ! చిలకరించమా? పన్నీరు ! ఆలస్యంగా వస్తేనేమి? అందగాడు కాకుంటేనేమి? ఒక్కమాటలో చెప్పాలంటే అక్కమొగుడు బంగారం... మా అక్కమొగుడు బంగారం !... ఉఁ గడుసుదానివే పొట్లకాయలా వుంటేనేమి...? బుగ్గలు బూరెలు అయితేనేమి....? చక్కదనంలో పెళ్ళికూతురు చెల్లెలికన్నా నయం నయం... ఈ చెల్లెలికన్నా శానా నయం.... !! పెళ్ళికుమారుడి వెంట తోకలా... పెంచుకున్న ఓ కంచి మేకలా.... వచ్చాడమ్మా తోడు పెళ్ళికొడుకు! వేసే వుంచాం కుర్చీ నీ కొరకు! ఏంటి? అలా బిత్తరపోయి చూస్తున్నావ్... రా.... వచ్చి కూర్చో ! ఇది దివిలో కుదిరిన కళ్యాణం ! భువిలో జరిగే వైభోగం ! మంగళకరమీ అనుబంధం ! గంగాయమునల సంబంధం ! పచ్చని చేలే పల్లెకు అందం ! పదుగురి రాకే పెళ్ళికి అందం ! పిన్నలు పెద్దలు అందరు రండి ! పెద్ద మనసుతో దీవించండి... !
అత్తవారంట పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: మనో అత్తవారంట సకల భాగ్యములున్న అచ్చమా రామచంద్రుడే అల్లుడైన ! ఆడకూతురు అత్తింటి కరుగునపుడు కంట తడిబెట్టు పుట్టింటి గడపకూడ !!
గోపాలుడలనాడు పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: చిత్ర, శ్వేతనాగ గోపాలుడలనాడు మురళి వాయించితే గోవులన్నీ మోరలెత్తి విన్నాయంట ! కన్నయ్య కరిమబ్బు తునక...! అతని ప్రతిమాట మరువంపు మొలక...!! పెరుగు చిలికే రాధ తరుణ సౌందర్యాన్ని కళ్ళతోనే మురళి జుర్రుకున్నాడంట...! నా రాధ బంగారు చిలక ! ఆమె ప్రతిమాట కలకండ తునక... ! రాధికా కృష్ణుల రసరమ్యకేళిని... యమునా తరంగిణే ఆగిచూసిందంట...! అరుదైన ఆనాటి జంట... ఈనాడు మా ఇంట వెలిసినాదంట.... !
ఒక్క క్షణం పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: మనో, శ్రీలేఖ ఒక్క క్షణం...... ఒక్క క్షణం ! ఆగు ప్రియా... ఒక్క క్షణం ! జారిపోతె... ఈ క్షణం... తిరిగిరాదు మరుక్షణం... !! || ఒక్క క్షణంII రెపరెపలాడే నీ కళ్ళల్లో రేపటి సుఖములు ఎన్నో చూశాను ! రేపటిదాకా... ఆగలేకా... చూపులతో వలవేశాను... ను వ్వందిస్తే చాలు చేయి ! మోగుతుంది సన్నాయి ! మోగుతుంది సన్నాయి !! || ఒక్కక్షణంII పుత్తడి బొమ్మకు ప్రాణం పోసి... పున్నమి వెన్నెల మేనికి పూసి... దేవుడు నిన్నీరూపంలో... నా వద్దకు పంపాడు ! మాటలకందని ఆనందం... నా మదిలో నింపాడు... !... నే నందిస్తున్నా చేయి ! ఇక జీవితమంతా హాయి !!....
మమత లెరుగని కాలమా... పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, చిత్ర & కోరస్ మమత లెరుగని కాలమా... ! మంచితనమే నేరమా... ! కపటమెరుగని కన్నెబ్రతుకును కాటువేయుట న్యాయమా.....? కాటువేయుట న్యాయమా...? ఏమి పాపం చేసినామని వేసినావీ కఠిన శిక్ష....? కాపుకాచే రెప్ప ఉరిమితే కంటిపాపకు ఎవరు రక్ష...? రాతికైనా గుండె పగిలే ఘాతుకం తల పెట్టినావే..... !! || మమత || బ్రహ్మరాసిన రాత చెరిపి... కాలకూట విషాన్ని చిలికి.... మార్చి రాసిన రాత తుదకే మలుపు తిరుగునో చెప్పగలవా....? చెప్పకుంటే మానవత్వం శేష ప్రశ్నగ మిగిలిపోదా... ! || మమత ||
ఎగురుతున్న ఎండి మబ్బుకు పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, చిత్ర & కోరస్ ఎగురుతున్న ఎండి మబ్బుకు
ఇది అదీ అంతం లేని కధ పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: మనో ఇది.... ఇది అదీ అంతం లేని కధ !! ఆడజన్మ కన్నీటి కధ ! వేదమంత్రములు వేసిన బంధం వెక్కిరింత పాలైన కధ !.... || ఇది|| కోరలు సాచిన నవనాగరికత కొరివి దెయ్యమైనట్టి కధ ! ఆశలన్ని అడియాశలైన... ఒక ఆడబడుచు విషాద కథ! వేదమంత్రములు వేసిన బంధం వెక్కిరింత పాలైన కధ.... || ఇది ||
భవ్యచరితగ పాట సాహిత్యం
చిత్రం: వెలుగు నీడలు (1999) సంగీతం: శ్రీలేఖ సాహిత్యం: మల్లెమాల గానం: శ్రీలేఖ & కోరస్ భవ్యచరితగ వన్నెకెక్కిన భరతమాతకు వందనం !! ఆమె హృదయం రేకువాడని ఆకురాలని నందనం ! II భవ్య || అట్టి సుందర నందనంలో పుట్టి పెరిగిన లతలు పూసిన పూవులం మనమందరం !! || భవ్య ||
Velugu Needalu (1999)
చిత్రం: శివరామరాజు (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ నటీనటులు: నందమూరి హరికృష్ణ, జగపతిబాబు, వెంకట్, శివాజి, పూనమ్ సింగార్, లయ, కాంచి కౌల్, మోనిక దర్శకత్వం: వి.సముద్ర నిర్మాత: ఆర్.బి.చౌదరి విడుదల తేది: 01.11.2002
Songs List:
అందాల చిన్ని దేవత పాట సాహిత్యం
చిత్రం: శివరామరాజు (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్ గానం: శంకర్ మహదేవన్ సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు పూవులెన్నొ పూచే నువ్వు నవ్వగానే ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే నీడపడితే బీడు పండాలి అడుగు పెడితే సిరులు పొంగాలి కల్మషాలు లేని కోవెలంటి ఇల్లుమాది అచ్చమైన ప్రేమే అంది అల్లుకుంది స్వార్ధమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి ఎన్ని జన్మలైన గంగకన్న స్వచ్ఛమైన ప్రేమబంధమంటె మాదిలే సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై హే స్వాతిముత్యమల్లే పెరిగినట్టి చెల్లి కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి నలక పడితే కంటిలో నీకు కలత పెరుగు గుండెలో మాకు అమృతాన్ని మించే మమత మాకు తోడువుంది మాట మీద నిలిచే అన్న మనసు అండవుంది రాముడెరుగలేని ధర్మమేదో నిలిచివుంది కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది నేల మీద ఎక్కడైన కానరాని సాటిలేని ఐకమత్యమంటే మాదిలే సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు శ్రీ లక్ష్మీ దేవి రూపము శ్రీ గౌరి దేవి తేజము కలిసి మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటిదేవతై సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణమే ఇక దొరికింది సిరుల కానుకా గతజన్మల పుణ్యఫలముగా కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
డింగ్ డింగ్ పాట సాహిత్యం
చిత్రం: శివరామరాజు (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్ గానం: ఉదిత్ నారాయణ్, సుజాత డింగ్ డింగ్
అమ్మా భవాని పాట సాహిత్యం
చిత్రం: శివరామరాజు (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్ గానం: యస్.పి. బాలు ఓం శక్తి మహా శక్తి ఓం శక్తి మహా శక్తి అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మ అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మ ఓ ఓ ఓ ..... సృష్టికే దీపమ శక్తి కె మూలము సింహ రధమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించమ్మ అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మ అమ్మ పసుపు కుంకుమ చందనము పాలాభిషేకము ఎర్రని గాజులు లతో పువ్వులతో నిను కొలిచాము అమ్మ చంధానమే పూసిన వొళ్ళు చూడు అమ్మ చంధానమే పూసిన వొళ్ళు చూడు అమ్మ పున్నమి పుట్టిల్లు అ కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపులా నోము చూడు అమ్మమ్మా ముగ్గురమ్మల మూలా పుటమ్మ మీ అడుగులే తలలు అమ్మ నిప్పులనే తొక్కిన నడక చూడు అమ్మ దిక్కులన్నే దాటిన కీర్తి చూడు వెయ్యే సురిల్లె మెరిసిన శక్తి ని చూడు మనుషుల్లో దేవుడి ఈ భక్తుని చూడు ని పద సేవయే మాకు పుణ్యం అమ్మ నీ చూపు సోకినా జన్మ ధాన్యం అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ తల్లి ని మహిమల్ని చూపవమ్మ దిన్నకు దిన్నకు త దిన్నకు దిన్నకు త గలగల గలగల గలగల దిన్నకు దినన్నకు త గజ్జల్నే కట్టి ఢమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట భూమే ఊగేల ఇయ్యాలి హారతి భూమే ఊగేల ఇయ్యాలి హారతి కాయలు కొట్టి ఫలములు పెట్టి పదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లి చిరలు తెచ్చాం రవికలు తెచ్చాం చల్లంగ అందుకో జై జై శక్తి శివ శివ శక్తి జై జై శక్తి శివ శివ శక్తి కంచిలో కామాక్షమ్మ మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మా కాశీలో అన్నపూర్ణవే శ్రీశైల భ్రమరాంబవే బెజవాడ కనకదుర్గవు నువ్వే అమ్మా కలకత్తా కాళీమాతవే నరకున్ని హతమార్చి శ్రీకృష్ణున్ని కాచి సత్య భామ మై శక్తివి నివే చూపినావే నార లోక భారాన్ని భూదేవీ మోచి సాటిలేని సహనం చాటినవే భద్రకాళి నిన్ను శాంతి పరిచేందుకు రుద్రనేతుండు శివుడిన సరితుగున బ్రహ్మకు మేధస్సు విష్ణువు తేజస్సు ని పద పుపెఇనె తాకగా వచెనటా బ్రహ్మకు మేధస్సు విష్ణువు తేజస్సు నీ పద ధూళిని తాకగ వచ్చెనటా నీ పద ధూళిని తాకగ వచ్చెనటా నీ పద ధూళిని తాకగ వచ్చెనటా నీ పద ధూళిని తాకగ వచ్చెనటా
పిడుగులు పడిపోని పాట సాహిత్యం
చిత్రం: శివరామరాజు (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్ గానం: యస్.పి. బాలు పిడుగులు పడిపోని
నిరుపేదల దేవుడయా పాట సాహిత్యం
చిత్రం: శివరామరాజు (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్ గానం: యస్.పి. బాలు, సుజాత నిరుపేదల దేవుడయా
స్వాగతం పాట సాహిత్యం
చిత్రం: శివరామరాజు (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్ గానం: ఉదిత్ నారాయణ్, సుజాత స్వాగతం
Siva Rama Raju (2002)
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి (All) నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వెంకట్, చాందిని దర్శకత్వం: వై. వి.యస్. చౌదరి నిర్మాత: అక్కినేని నాగార్జున విడుదల తేది: 05.02.1998
Songs List:
ఏవమ్మా వైన వమ్మా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర, సునీత, విజయలక్ష్మి పల్లవి: ఏవమ్మా వైన వమ్మా ! ఏం వున్నా నాకు చెప్పమ్మా అసలే ఈ గదిలో ఒంటరిగా ఉన్నావు అయినా ఎవ్వరితో ఊసులాడుతున్నావు వామ్మో ! ఏవైనా గాలిగాని సోకిందా ! పల్లవి: పోవమ్మా చాలు లేవమ్మా ఊరికినే వెంట పడకమ్మా ఎప్పుడూ నావెంటే తోక లాగ వుంటావు నేనేమి చేస్తున్నా తొంగి తొంగి చూస్తావు పైగా ఇప్పుడేమో లేని పోని వంటావా చరణం: 1 పరాకు పెరిగిందా పలకవేమె చిలకమ్మా వివేటు పిలవొచ్చా నవగతే ఎలాగమ్మా అద్దం ముందు వున్నది నువ్వే అంత సిగ్గు ఎందుకో కోయమ్మా పక్కకొచ్చి చక్కిలిగింత లెన్నో పెట్ట లేదా నువు చెప్పమ్మా ఉలుకు ఏంటమ్మా! పులకరింతమ్మా ! కులుకులేంటమ్మా ! ఉన్నవేనమ్మా ! అయిన వాళ్ళు ఇందరు వుండగ ఇంక తమరి బెంగ ఎందుకు తలుపు వైపు దొంగ చూపు లెవరి కోసమేంటి సంగతి చెప్పమ్మా చరణం: 2 చలేసి చేస్తున్నాం నీకు చెమటలేంటమ్మా నీకేమి జ్వరమో అది నాకు లేదులేవమ్మా పక్కనున్న మమ్మల్ని ఒదిలి మనసు ఎక్కడ సందమ్మా కళ్ళజోడు పెట్టుకుని చూడు మెల్లకన్ను గల వదినమ్మా తప్పుకోకమ్మా ! తగులుకోకమ్మా ! ఒప్పుకోవమ్మా ! ఒదిలి పెట్టమ్మా ! ఒక్కపూట గడవలేదు కట్నాల సంగతి తేల లేదు పెళ్ళి చూపులైన వెంటనే అంత తొందర పనికి రాదు లేవమ్మా పల్లవి: ఓ హో హో ! ఊరుకోవమ్మా ఉడికించే గోల చాలమ్మా చెబుదామనుకున్నా ఒప్పుకోని సిగ్గమ్మా ఎప్పుడో మీక్కూడా జరిగివున్న దేనమ్మా వివరాలెందుకులే గుచ్చి అడగరాదమ్మా
ఓ ప్రేమా... ఓ ప్రేమా... పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, సునీత, విజయలక్ష్మి హరికథ: రామనామమే ప్రాణముగా ఆరావణ వనమున సీతమ్మా సీతాస్మరణమే శ్వాసగా సంద్రానికి ఈ వల రామయ్యా ఇరువురి దూరము కరిగించగ ఆ విరహమే వారధిగా మారెనుగా పల్లవి: ఓ ప్రేమా... ఓ ప్రేమా... ఏనాడూ వాడని వనమా ఏనాడూ తీరని ఋణమా ఏనాడూ వీడని నీడ నీవే ప్రేమా కాలానికి ఓడని బలమా కలహానికి లొంగని గుణమా నాపోరాటానికి తోడు నీవే ప్రేమా ! చరణం: 1 నీవు కలవని నమ్మినిలిచిన నన్నే చూడమ్మా వీవిలువే చాటించుమా నీవు గెలవని పోరులేదని సాక్ష్యం చెప్పమ్మా రావమ్మా ఓ ప్రణయమా మాయని మమతల కావ్యము నీవని చాటిన ఆలయమా దీవెనలీయవ జానకి రాముల కళ్యాణమా పల్లవి 2: ఓ ప్రేమా ఓ ప్రేమా నా ఆలాపనలో స్వరమా నా ఆరాధనలో వరమా నా ఆవేదన విని జాలి పడిరావమ్మా నా ఆలోచనలో భయమా నా ఆల అయిదో తనమా నా ఆయువు నిలిపే అమృతం నీవమ్మా చరణం 2: నిన్ను కలవగ కన్నె కలువకి దారే లేదమ్మా విన్నావా నా చంద్రమా జాలి తలవని జ్వాలలో పడి కాలిన కలనమ్మా చూశావా నా ప్రాణమా తీయని పాటకి పల్లవి పాడిన చల్లని స్నేహితమా కోయిల గొంతును కోసిన మంచును కరిగించుమా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: సురేష్ పీటర్ పల్లవి : ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏపీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ మాతృభూమి భారతిని We Love India where ever we are We ove India She is the Mother We ove India చరణం: 1 అలజడులెదురొస్తే కదలని ఎవరెస్టె నిలిచిన దేశంలో మా పుణ్యం పుట్టింది. అలల గ తలలెత్తే కలతలు కవ్విస్తే చెదరు సంద్రంలా మా ధర్మం మిగిలింది ప్రతి ||తికాలం ముందర తల వంచి, శిధిల లైనిన్నటి కథగా మారింది. మన శం కాలాలన్ని ఎదిరించి కలకాలం నిలిచే వుంటుంది Tell he brother where is that great nation మేరే తన్ హిందూస్తాన్ చరణం: 2 బ్రత కును అందించే అమ్మా నాన్నల్ని కనబకు దైవాలే అనుకుంటూ పూజిస్తాం మన ని బంధించే మమతల మంత్రంతో మనముల గుండెల్లో రాజ్యాలే పాలిస్తాం సహవన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తాం శరణ, టి శత్రువునైనా ప్రేమిస్తాం మతముంటే మంచిని పెంచే సిద్ధాంతం అట్ను అంతా పయనిద్దాం Telline brother who gave us this notion Than is again Hindustan
రామాయణ సారం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: సునీత కొడుకుగ, అన్నగ, భర్తగ, రాజుగ బాధ్యతలెరిగిన పురుషుని చరితం అగ్ని సైతమూ శిరసొంచే సదుణ తేజానికి సాక్ష్యం చూపిన సాధ్వీ కథనం భక్తి శ్రద్ధలతో ధర్మానికి అంకితమయ్యే సేవా భావం బంటుని సైతం భగవంతునిగా పెంచిన సుందర కావ్యం జగమును శాసించే ఘనులైనా అహమును గెలువని వారైతే పతనం తప్పదనే గుణపాఠం ఇదే ఇదే రామాయణ సారం భారత సంస్కృతికిది ఆధారం
నీ ఊహల్లో ఏకాంతం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: యమ్.యమ్.కీరవాణి, సురేష్ పీటర్, సునీత పల్లవి: నీ ఊహల్లో ఏకాంతం నేనంటూ లేనందీ ఏది ఎటు, నా ప్రాణం ఏమైంది అనే ఈ దేహన్ని ఎట్టా మోసేద మైలవ్ ... నీతోనే వుండాలి లేకుంటే పోవాలి నా ప్రాణం ఏమైంది అనే ఈ దేహాన్ని ఎట్టా మోసేది మైలవ్ ... నీతోనే వుండాలి లేకుంటే పోవాలి ఓ మైలవ్....నీ ఊసును తెచ్చేగాలి నా ఊపిరిగా సూరాలి లేదా అర్థం లేని వాక్యం లాంటి నన్నే చెరిపెయ్యాలి పల్లవి: 2 నీ ఊహల్లో ఏకాంతం నేనంటి నువ్వంది నాలో ప్రాణం నీరూపం పొందింది శరీరం మాత్రమే ఇలా మిగిలింది మైలవ్ .... ఆ ప్రాణం ఈ దేహం ఒకటయ్యే తీరాలి ఓ మైలవ్ ...ఈ విరహంలో వడగాలి మన దూరం కరిగించాలి లేదా కరగని కలగా నాకన్నుల్లో నువ్వే కొలువుండాలి పల్లవి: 3 నీ ఊహల్లో ఏకాంతం నువ్వున్నట్టే వుంది కాలం దూరం ఏనాడు రాలేని ఓ లోకం సృష్టించి మనకే ఇచ్చింది. మైలవ్ .... ప్రేమంటూ ఓ మాట ఏ భాషలో ఉన్నా ఓ మైలవ్ ... ఆ మాటకి నువ్వూ నేను రెండక్షరము గా ఉన్నాం కనుకే నిన్ను నన్ను కలిపే లోకం ప్రేమ అని చదవాలి
బంటు రీతి కొలువు పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు పల్లవి : బంటు రీతి కొలువు ఈయవయ్యా రామా చరణం: 1 మేనమామవని సిరులొలుకు మేని ఛాయల కన్నె పిల్లకు తండ్రివని దైవమని ముచ్చట పడి నేనొచ్చా కాబట్టి చిన్న తనమున ఈ ముంగిటను నేను నేర్చిన పాటలన్నీ గత స్మృతులై లయజతులై అనుబంధాలకి అద్దం పడుతుంటే చరణం: 2 చూపుకు లేనిది చుట్టరికం ప్రేమకు లేనిది దాపరికం రమ్మనుటో, పొమ్మనుటో కాయో, పండో తేలే తరుణంలో అమ్మపుట్టిల్లు మీకెరుక, ప్రేమ పుట్టిల్లు నాకెరుక ఎవరేమీ అనుకున్నా ఎన్నటికైనా సత్యం గెలిచేలా బంటు రీతి కొలువుతీయవయ్యా మామా
ఓం... అని పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు, సునీత పల్లవి : ఓం... అని ఓం... అని మొదలవుతూ వుంది. అనురాగపు తొలి గమకం మదినే మీటిండి కాలి తాకిడిలో తమకం ప్రణయ మంత్రికి ఇది ప్రణవం మౌనమే గానమును సమయం చరణం: 1 వరదై ఉరికే వరుసు పరుగులో అలలై ఎగసే మనసు మడుగులో కలలకు అందని కలవరముందని తెలిసిన నిముషములో చరణం: 2 చినుకై తడిమే కొనలతో మెరుపై తరిమే డికనులతో తొలకరి ఆశల ఆదీసిన ఊసులు చేసిన అల్లరిలో
హాయ్ రబ్బా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల, పి.కె. మిశ్రా గానం: చిత్ర, రాధిక సాకీ: ఝుంకా మేరి లోకో చూమె కాజల్ అగ్గాయె చమ్ చమ్ చమ్ పాయల్బలే నిందియా ఉడ్ ఉడ్ జాయే మెహింది కా రం వీకాలాగే చూడియా చుటే చుజాయే బిందియా క్యోం మ హోష్ కరే ఏ కొయీ ముజే బతాయే పల్లవి: హాయ్ రబ్బా ఈ చెందటే వయసిట్టా పొంగిపోయి ఆయీ జవానీ ఆట జవానీ హోయ్ హోయ్ హోయ్ హయ్ రబ్బా వుందిలే షాదీ మడియెదురాయి ఆయీ జవానీ అయి జవానీ హోయ్ హోయ్ హోయ్ చరణం: 1 చెప్పమ్మా డాక్టర్ జోడి కడతావా నాబాబాన నారే వాన క్యోం బాబా క్యోం క్యోంరే బాబా క్యోం పేషంట్ల పిలుపొస్తే అతగాడు పెళ్ళాన్ని విదిలించి పోతాడు. పోనీలే డ్రైవర్ తో సర్దుకు పోతావా తోబా తోబా తోబా తోబా క్యోంరె తోబా బోలో బాబా ఆలి అంటే లారీ అనుకుంటాడు ప్రతిసారి బ్రేకేస్తు వుంటాడు సినిమా డైరక్టర్ ని పతిగా తెమ్మంటావా ఆమ్మో ! ఇది అన్నింటి కన్నా పెద్ద గొడవ జసా క్యోం బేటి బోలోనా బేబీ బోల్ బోల్ బోల్ హీరోయిన్స్ సరాగాలు యింటికొచ్చి బీబీతో కలహాలు పల్లవి : హాయ్ రబ్బా మైక్యా కరూం ఇంకెవర్నీ తీసుకు రాను ఆయీ జవానీ ఆయి జవానీ హోయ్ హోయ్ హోయ్ చరణం: 2 ఇంచక్కా ఏ కర్కైనా ఓకేనా నీకు నా బాబాన నారే బాబాన క్యోం బావా క్యోం క్యోంరే బాబా క్యోం ఆ గొర్రె తోకంతా జీతంతో సంసారం సాఫీగా సాగొద్దాం బిజినెస్ మేన్ సంబంధం తీసుకు వచ్చేదా దయ్యా దయ్యా నారె దయ్యా క్యోంరే దయ్యా క్యోం, దయ్యా రాత్రంతా బెడ్రూంలో శ్రీవారు అకౌంట్లు తిరిగేస్తూ వుంటారు.. పరదేశమున ఉన్నాడు వరుడై ఓకేనా ఫారిన్లో పనా ఇక్కడా ఫీసర్నని కోస్తాడు. అక్కడ వీధులూడూస్తాడు. చీ ఛీ ఛీ అలా అనొద్దు బేటీ పనేదైనా మనీ తెచ్చి పోషించే ఆ పరదేశి సుఖదాయి పరదేశి సుఖదాయి పరదేశి సుఖచాయి
ఏవమ్మా కంప్యూటరమ్మా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: మనో, యమ్.యమ్.కీరవాణి, సునీత, సుజాత పల్లవి: ఏవమ్మా కంప్యూటరమ్మా తేల్చి నువ్వు చెప్పాలమ్మా శివరంజని తెలివిని కొలిచి జనరంజని చురుడుతో పోల్చి చివరికెవరు గెలిచనవారో చక్కగా లెక్కలు వెయ్యాలమ్మా చరణం: 1 పుట్టుక యిచ్చిన చుట్టరికాలను మించిన బంధం స్నేహం తన కన్నా నిను అధికంగా అభిమానించడమే స్నేహం అమృతమైనా విషముగ మార్చే చెప్పుడు మాటలే ద్రోహం సమ్మాకాన్ని నట్టేట ముంచేటి వంచన పేరే ద్రోహం పల్లవి: ఏవమ్మా కంప్యూటరమ్మా ఎంత వరకు తేల్చావమ్మా చరణం: 2 ఎంత చదివినా అంతే వుండని వింత కధే ఈ జీవితం ఎవ్వరి నిర్వచనాలకు లొంగని విచిత్రమైనది జీవితం ఆమె అతడు ఇద్దరికే చోటుండే లోకం ప్రేమ కాలం దూరం ఎన్నడు చేరని మరో ప్రపంచం ప్రేమ ఒకరి శ్వాస ఇంకొకరి బ్రతుకుగ నడిపించేదే ప్రేమ అనుభవమైతే గాని తెలియని అద్భుత భావం ప్రేమ
శుక్లాం భరధరం విష్ణుం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: Treditional గానం: సునీత శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
ఎవరూ చూడని ఏకాంతంలో పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: యమ్.యమ్.కీరవాణి, చిత్ర పల్లవి: ఎవరూ చూడని ఏకాంతంలో ఎవరూ చేరని ఈ సమయంలో రసవేదమై రవళించనీ ఎదలో లయ జతలీలలో శృతి మించనీ కరిగే క్రియా ప్రియా ప్రియా ప్రియా ప్రియా చరణం: 1 విడువకు విడిగా అనే కదా నిను వేడుతోంది. ప్రాయం నీ ఎదనడిగా ఆయా కదా అని పాడుతోంది ప్రాణం ఒట్టేసి మళ్ళీ .. ఆ మాటే చెప్పవా నువ్వే లేక నేనన్నాళ్ళు ఉన్నానన్న మాటే నాకు నమ్మాలంటే కష్టంగా వుంది. నువ్వంటూ నాక్కనిపించాక నాలోనేనే లేనే అన్న సత్యం ఎంతో ఇష్టంగా వుంది చరణం: 2 కదలని శిలగా అవాలిగా మన వైపు చూస్తే లోకం కరగని కలగా అయిందిగా మనమేలుతున్న కాలం ఇలా ఇద్దరం , అయి పోదాం ఒక్కరం ఎండా కాలం, వానాకాలం, శీతాకాలం ఏవీతాని కారాగారం కానీ కౌగిలి నవ్వేవాళ్ళు ఏడ్చేవాళ్ళు వాళ్ళూ వీళ్ళూ అంతా చేరి నువ్వూ నేనే అవుదాం నెచ్చెలి
Story Theme (Instrumental)
Story Theme
Sri Sita Ramula Kalyanam Chootamu Raarandi (1998)
చిత్రం: అన్నయ్య (2000) సంగీతం: మణిశర్మ నటీనటులు: చిరంజీవి, సౌందర్య దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య నిర్మాత: కె.వెంకటేశ్వర రావు విడుదల తేది: 07.01.2000
Songs List:
హే సయ్యారే సయ్యా పాట సాహిత్యం
చిత్రం: అన్నయ్య (2000) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు హే సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య అరె సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య పెంచింది నన్ను మీ అభిమానము మీ తోడై ఉంటాను కలకాలము సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో హే సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య చరణం: 1 అన్నా తమ్ముళ్ళ ఈ అనుబంధమూ ఇలలో అందరికీ అది ఆదర్శము లోకం నాలోకం ఇక మీరేనురా ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా వేళ్ళు ఒక్కటైతే అది ఉక్కు పిడికిలిరా అందరొకటైతే అది అగ్గిపిడుగేరా అభిమానం కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే హే సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య చరణం: 2 మీరే నా కళ్ళు ఇక ఏ నాటికీ మీరే తమ్ముళ్ళు ఏజన్మకీ ఎపుడూ తీరని మీ ఋణమన్నదీ దైవం తెచ్చాడు ఈ వరమన్నదీ అన్న కన్నుల్లో వెలిగేటి దివ్వెలివి అన్న గుండెల్లో పూచేటి పువ్వులివి నామాటే వేధంగా నడిచేటి తమ్ముళ్ళంటే మీరే హొయ్ సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య పెంచింది నన్ను మీ అభిమానము మీ తోడై ఉంటాను కలకాలము సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో
హిమసీమల్లో హల్లో పాట సాహిత్యం
చిత్రం: అన్నయ్య (2000) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: హరిహరన్, హరిణి హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే చరణం: 1 సోసో కాని సోయగమా ప్రియ శోభనమా సుఖ వీణ మీటుదమా వా వా అంటే వందనమా అభివందనమా వయసంత నందనమా మొహమాటమైన నవ మోహనం చెలగాటమైన తొలి సంగమం మది వదిలే హిమ మహిమ ఓ... అది అడిగే మగతనమా నీదే భామ పడుచు పంచదార చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో చరణం: 2 మామా అంటే మాధవుడే జత మాధవుడే పడనీదు ఎండ పొడి సాసా అంటే సావిరహే బహుశా కలయే నడిజాము జాతరలే వాటేసుకుంటే వాత్సాయనం పరువాల గుళ్ళో పారాయణం రవి కలనే రచన సుమా ఓ... సుమతులకే సుమ శతమా నీవే ప్రేమా పెదవి ప్రేమలేఖ ఇతిని చదవగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే
గుస గుసలె గున్నా మామిల్లో పాట సాహిత్యం
చిత్రం: అన్నయ్య (2000) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత గుస గుసలె గున్నా మామిల్లో అన్ని రుస రుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో య య సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మరిగి ఇంకా ఇంకాల హొయ్ చెమటలతో చెంగే పట్టాల హొయ్ సుఖ పడుతూ కట్టే సుఖాల గుస గుసలె గున్నా మామిల్లో అన్ని రుస రుసలే కన్నే చూపుల్లో కడవ చిన్న నడుము కున్నా కదలిక లెన్నో కని దులుపు కుంటాడే అదే వలపు అన్టాదె ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కధకళి తోనే ఏదో దరువేస్తుంది తానే దరికొస్తుంది పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకే అని సయ్యన్నట్టే పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకే అని సయ్యన్నట్టే చెలి సలహా పస్తే నంటాడు చలి విరాహా లొస్తాయంటాడు అది మినహా అన్ని తయారి అబ్బా కలహాలా కన్యా కుమారి నడక భలే నెమలివలే ఒడికొస్తూనే ప్రియా తినిపిస్తుంది లయే కలిపేస్తుంది మురళి వలె స్వరములిల వాయిస్తూనే బుగ్గే దాచుకుంటుంటే ముగ్గే దోచుకుంటాడు తగునా ఓ మదన ఈ తగువంటుంటే తగనా ఓ లలనా నీ జతకంటాడు తగునా ఓ మదన ఈ తగువంటుంటే తగనా ఓ లలనా నీ జతకంటాడు చలి పడితే సలామ్ ఆలేకుం సెగ పుడితే జళాభిషేకం మసకేస్తే మరో ప్రపంచం ఉడూకేస్తే ఉయ్యాల మంచం గుస గుసలె గున్నా మామిల్లో అన్ని రుస రుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో య య సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య ఎద కొరిగి ఎన్నో బింకాల హేయ్ రుచి మరిగి ఇంకా ఇంకాల హొయ్ చెమటలతో చెంగే పట్టాల హొయ్ సుఖ పడుతూ కట్టే సుఖాల
వాన వల్లప్ప వల్లప్ప పాట సాహిత్యం
చిత్రం: అన్నయ్య (2000) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: హరిహరన్, సుజాత వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కోరస్: సామిరంగా ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కోరస్: సామిరంగా ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే చరణం: 1 ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్ తారా రారా రారా (2) వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కోరస్: సామిరంగా చరణం: 2 వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో అమ్మదొంగా సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా తూరు రురు తూరు రురు (2) వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కోరస్: సామిరంగా ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా
బావా చందమామలు పాట సాహిత్యం
చిత్రం: అన్నయ్య (2000) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, చిత్ర, యస్.పి.బి.చరణ్ బావా చందమామలు మరదళ్ళు వీరె ఇంటికి మణి దీపాలు గుణంలో మేలిమి బంగారు పనుల్లో ఎవ్వరు సరిపోరు మావాళ్ళ ముందర మీవాళ్ళు నిజంగా తేలిపోతారు భామా సూర్యచంద్రులు మా వాళ్ళు నాకు వీరె భరత - లక్ష్మణులు నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు ఎప్పుడో అప్పుడు ప్రేమలో మునగడం తప్పదమ్మ నీకు కూడా ఎవ్వరో ఆతడు ఎక్కడో ఉండటం చెప్పవయ్య వాడి జాడ రాజాలా ఉంటాడే ప్రేమంటే వాడేలే నచ్చితే అమ్మడు చెప్పవే ఇప్పుడు పట్టు పట్టి జట్టు చేస్తాం చక్కని వదినకి సయ్యనే అన్నకి వీడిపోని బంధమేస్తాం ఊ అంటే కన్యా రత్నాలే కానిస్తాం కన్యా దానాలే వయ్యారి అక్కా-చెల్లెళ్ళే అవుతారు తోడి-కోడళ్ళే ఆనందం - మీ అందం సంగీతం - మా సొంతం కొంగుతో కొట్టడం పైటనే జార్చటం నచ్చినట్టు గుర్తులే లే గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం తీయనైన ప్రేమ తీరే ఆ ప్రేమే స్వీకారం నీకే నా సహకారం అక్కలే ఆకులై బావలే వక్కలై పక్క పక్క చేరుకోండి ఉమ్మడి కాపురం ఉత్తమం అందరూ ఒక్కటిగ సాగిపోండి భలేగ చెప్పావ్ బాబయ్య మా ఇంటి పెళ్ళిళ్ళ పేరయ్య హనీమూన్ వెల్లండోరయ్య చెయ్యండి నన్ను తాతయ్య భామా సూర్యచంద్రులు మా వాళ్ళు నాకు వీరె భరత - లక్ష్మణులు నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు
ఆటకావాలా పాటకావాలా పాట సాహిత్యం
చిత్రం: అన్నయ్య (2000) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భువనచంద్ర గానం: సుక్విందర్ సింగ్, రాధిక ఆటకావాలా పాటకావాలా స్వచ్చమైన అచ్చతెలుగు బీటు కావాలా ఆటకావాలి పాటకావాలి గాజువాక సెంటర్లో ఫ్లాటు కావాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదెట్టా గురువా అదినా హాబీ ఊపే ఊల్లే - చేసేయ్ డ్రిల్లే భూగోళం అదిరేలా కదం తొక్కాలె స్వీటుకావాలా హాటుకావాలా నాణ్యమైన నాటుచికెన్ లెగ్స్ కావాలా స్వీటు కావాలి హాటు కావాలి రాసిస్తే వైజాగ్ స్టీలు ఫ్లాంటు కావాలి చరణం: 1 ఝులుకు ఝులుకు కులుకులతో మెరిసే ఓ పోరీ నీ తళుకు తళుకు అందాలతో మత్తెక్కించే పోరీ చూపులతో నా మనసును గుచ్చేశావే నారీ ఇటు చూస్తే మనసాగునంటే ఆయాం వెరీ సారీ చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే పిల్లగాలి గిల్లుతోంది దిల్‌దే బేబే మండపేట కుర్రదాన్ని ఓ బావయ్య మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యా ఓకే రాణీ చేస్తా బోణీ ఆపైన చెప్పొద్దే మరో కహానీ చిప్స్ కావాలా లిప్స్ కావాలా గరం గరం సింగపూరు పప్సు కావాలా చిప్స్ కావాలీ లిప్స్ కావాలీ అప్పనంగా ఇస్తే షిప్సు యార్డ్ కావాలీ చరణం: 2 కింగులాంటి నిన్ను చూస్తే మనసౌతాంది ఈ డ్రెస్సుతోటి రావాలంటే సిగ్గేస్తుందీ పట్టుచీర కొనిపెడితే ముంబాయి బుల్లి గట్టిపట్టు పట్టనిస్తావా జూకామల్లి అయితే రెడీ పట్టేయ్యి గిలీ కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబాడీ దిండు కావాలా దుప్పటి కావాలా నైట్ లైటు లండన్ ఫోం బెడ్డుకావాలా దిండు కావాలీ దుప్పటి కావాలీ రెచ్చిపోతే మినపసున్ని ఉండ కావాలీ ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదెట్టా గురువా అదినా హాబీ ఊపే ఊళ్ళే - చేసేయ్ దిళ్ళే భూగోళం అదిరేలా కదం తొక్కాలే స్వీటు కావాలా హాటు కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా స్వీటు కావాలి హాటు కావాలి మస్తుమస్తు మెగాస్టార్ ముద్దు కావాలి
Annayya (2000)
Anandam (2001) Telugu Songs Lyrics
Banner : Ushakiran Movies
Music : Devi Sri Prasad
Director : Sreenu Vaitla
Producer : Ramoji Rao
Actors : Akash
Actresses : Rekha Vedavyas
Supporting Cast : Venkat, Tanu Roy, Shweta Menon
Release Date : 28 September 2001
• Shweta Menon made a special appearance in the song "Mona Lisa".
• Venkat played the role of Vamsi, while Tanu Roy portrayed Deepika in Anandam (2001).
Anandam Song Lyrics in Telugu – Anandam (2001)
'Anandam' song from Anandam (2001) movie is composed by Devi Sri Prasad and sung by Tippu. Lyrics are written by Sirivennela Seetharama Sastry.
Kanulu Terichinna Song Lyrics in Telugu – Anandam (2001)
'Kanulu Terichinna' song from Anandam (2001) movie is composed by Devi Sri Prasad and sung by Mallikarjun and Sumangali. Lyrics are written by Sirivennela Seetharama Sastry.
Monalisa Song Lyrics in Telugu – Anandam (2001)
'Monalisa' song from Anandam (2001) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad and Kalpana. Lyrics are written by Bhuvana Chandra.
Evarina Epudaina (Male) Song Lyrics in Telugu – Anandam (2001)
'Evarina Epudaina (Male)' song from Anandam (2001) movie is composed by Devi Sri Prasad and sung by Pratap. Lyrics are written by Sirivennela Seetharama Sastry.
Evarina Epudaina (Female) Song Lyrics in Telugu – Anandam (2001)
'Evarina Epudaina (Female)' song from Anandam (2001) movie is composed by Devi Sri Prasad and sung by K. S. Chithra. Lyrics are written by Sirivennela Seetharama Sastry.
Oka Merupu Song Lyrics in Telugu – Anandam (2001)
'Oka Merupu' song from Anandam (2001) movie is composed by Devi Sri Prasad and sung by Sunitha Rao. Lyrics are written by Potula Ravikiran.
Premante Emitante Song Lyrics in Telugu – Anandam (2001)
'Premante Emitante' song from Anandam (2001) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad, Mallikarjun and Sumangali. Lyrics are written by Devi Sri Prasad.




