Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sridevi Vijaykumar"
Pelli Kani Prasad (2008)


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రేయఘోషల్
నటీనటులు:  అల్లరి నరేష్ , శివాజి , శ్రీదేవి విజయకుమార్, తనురాయ్
దర్శకత్వం: సత్యం ద్వారపూడి
నిర్మాత: రమేష్ కుమార్ ఆలపాటి
విడుదల తేది: 28.02.2008

చెప్పనా చిన్న సంగతి నిన్నలా నేను లేనని
ప్రేమనే చిలిపి సందడి నన్నిలా చేరుకుందని
ఇప్పుడే విన్న మాటలా కొత్తగా తోచినా
ఎప్పుడో చూసినట్టుగా హాయిగా ఉందిలే
ఇన్నాళ్లు ఈ వింత నాలోనేదాగుందని
నే చూడనే లేదులే
నన్నింత బాధించి జాదూల చేసిందని
నే మారిపోయానులే

చెప్పనా చిన్న సంగతి నిన్నలా నేను లేనని
ప్రేమనే చిలిపి సందడి నన్నిలా చేరుకుందని

నువ్వుతప్ప పిచ్చిమనసుకి
అదేంటో ప్రేమకూడ గుర్తులేదులే
నిన్ను మరచిపోని వయసుకి
అదెంత రాతిరైన పొద్దుపోదులే
ఉలికి పడ్డ ఊహలోంచి ఉన్నపాటు మాయమై
తేరుకున్న వెళలోన తిరిగినాకు చేరువై
అంది అందనట్టు ఆడుకుంటే ఎట్టా
గుండెలో ఊసులే గుట్టుగా తలుచుకోవ
ఏమాయ చేశావు ఈ భామని
నేడిలా జారెనులే
మనస్సుకేమందు పోసింది నీ అల్లరి
నువ్వులేని నేను లేనులే

చెప్పనా చిన్న సంగతి నిన్నలా నేను లేనని
ప్రేమనే చిలిపి సందడి నన్నిలా చేరుకుందని

కట్టుబాటు లేని ఈడుని నిజంగ తిట్టుకోని రోజు లేదులే
ఫక్తు లేని పరుగులా ఇలా నా చుట్టు వీడినిన్ను చేరుకుందిలే
హే ఎప్పుడైన ఎక్కడైన నిన్నువీడి పోనులే
పక్క పక్క ఉన్న నన్ను చూసి చూడవేంటని
అడుగుతున్న నిన్ను ఆగలేను నేను
రెప్పలే తెరిచినా మూసినా ఉంది నువ్వే
వెన్నెల్లే నవ్వుంటె చాల్లే మరీ ఆనాడు అన్నా సరే
మరింతగా నువ్వు నా ఊపిరవ్వాలని నే కోరుకుంటానులే

చెప్పనా చిన్న సంగతి నిన్నలా నేను లేనని
ప్రేమనే చిలిపి సందడి నన్నిలా చేరుకుందని

ఇప్పుడే విన్న మాటలా కొత్తగా తోచినా
ఎప్పుడో చూసినట్టుగా హాయిగా ఉందిలే
ఇన్నాళ్లు ఈ వింత నాలోనేదాగుందని
నే చూడనే లేదులే
నన్నింత బాధించి జాదూల చేసిందని
నే మారిపోయానులే

చెప్పనా చిన్న సంగతి నిన్నలా నేను లేనని
ప్రేమనే చిలిపి సందడి నన్నిలా చేరుకుందని


*****   ******   *******


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: రవివర్మ , కౌశల్య

అయ్యయ్యో


*****   ******   *******


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్  , నాగ సాహితి

కంటి పాప


*****   ******   *******


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: జస్సి గిఫ్ట్ , లక్ష్మీ

కేక


*****   ******   *******


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి) , కౌశల్య

సారి సారి


*****   ******   *******


చిత్రం: పెళ్లికాని ప్రసాద్ (2008)
సంగీతం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: భాస్కరభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీ (కె. శ్రీనివాస చక్రవర్తి) , నాగ సాహితి

ఏమో ఏమో



Palli Balakrishna Wednesday, March 14, 2018
Ninne Ishtapaddanu (2003)


చిత్రం: నిన్నే ఇష్టపడ్డాను (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , యస్. పి. బాలు
నటీనటులు: తరుణ్, శ్రీదేవి విజయ్ కుమార్, అనిత
దర్శకత్వం: కొండా
నిర్మాత: కె.ఎల్. నారాయణ
విడుదల తేది: 12.06.2003

ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా
ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి  వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా

ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...

సంకోచం చాలు అని ఇంకొంచం చేరమని చోటిచ్చిందా ఈ స్నేహం
అవకాశం చూసుకొని సావాసం పంచమని అందించిందా ఆహ్వానం
చినుకంత చిన్నతడి వెంటపడి వెళ్ళువగ మారిందా
అణువణువు తుళ్ళి పడి గుండేసడి ఝల్లు మని మోగిందా
ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా

ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...

మోమాటం కప్పుకొని ఏమాట చెప్పనని ఎన్నాళ్ళింకా ఈ మౌనం
జడివానై కమ్ముకొని సుడిగాలై చుట్టుకొని తరిమేయవా ఈ దూరం
ఉబలాటమున్నదని ఒప్పుకొని అందుకో నా జంట
నీ వేలు పట్టుకొని వదలనని నడపనా నా వెంట
ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస

ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...

ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా
ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస
వరించే కలలొచ్చి వరాలే కురిపించి
స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా
ఓ... ఆ... ఓ... ఆ... ఓ... ఓ
ఆహా హా... ఓహో హో... ఆహా హా... ఆ... ఆ...




*********  *********  ********




చిత్రం: నిన్నే ఇష్టపడ్డాను (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , యస్. పి. బాలు

కుకు కుకు కుకు కుకు
కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా
నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా కమ్మనైన ఈ స్వరాల లీనమైపోనా
కుకు కుకు కుకు కుకు, కుకు కుకు కుకు కూ

కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా

ఎన్ని రంగులో నిన్నమొన్న చూడలేదు  కమ్ముకొచ్చే ఇంతలో ఇలా
ఎన్ని ఉహలో ఉన్నచోట ఉండనీవు గాలిచిందు లెంతసేపిలా
కొంటె ఊసులు కొత్త ఆశలు అల్లుకుంటే అన్ని వైపులా
గుప్పెడంత ఈ చిన్ని గుండెలో గుట్టునింక ఆపడం ఎలా
కుకు కుకు కుకు కుకు, కుకు కుకు కుకు కూ

కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా

ఇన్నిరోజులు ఉన్నమాట చెప్పలేదు చిన్నదాని సన్నజాజులు
నన్ను ఎప్పుడూ రెప్పలెత్తి చూడలేదు కన్నెపిల్ల కంటి చూపులు
సైగ చేయడం నేర్చుకున్నవి ముచ్చటైన లేత నవ్వులు
కొమ్మచాటుగా దాగనన్నవి విచ్చుకున్న సిగ్గు పువ్వులు
కుకు కుకు కుకు కుకు, కుకు కుకు కుకు కూ

కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా
కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా
నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా కమ్మనైన ఈ స్వరాల లీనమైపోనా
కుకు కుకు కుకు కుకు, కుకు కుకు కుకు కూ

Palli Balakrishna Sunday, July 16, 2017
Eswar (2002)




చిత్రం: ఈశ్వర్ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ప్రభాస్, శ్రీదేవి విజయ్ కుమార్
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: కె.అశోక్ కుమార్
విడుదల తేది: 11.11.2002



Songs List:



అమీర్ పేటకి ధూల్ పేటకి పాట సాహిత్యం

 
చిత్రం: ఈశ్వర్ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్

పల్లవి:
ధం ధమా ధం డోలు బాజా షోర్ మచా
చం చమ చం చెయ్ ర చిచా మాస్త్ మజా

అమీర్ పేటకి ధూల్ పేటకి షహరొకటే రా 
కార్లకైనా కాళ్లకైనా నడకొకటే రా 
ఎవడి కలల కోటకి మహరాజు వాడేరా 
ఎగిరిపడే నవాబ్ గిరి చెల్లదు పోరా 
అరె చల్ బే తెగ డబ్బుందని కళ్లు నెత్తికెక్కితే 
చెడతవు భయ్ 
మరీ ఫోజేస్తే మా దమ్ముతో నీ దుమ్ముని దులిపితే దిక్కెవడోయ్ 

ధం ధమా ధం డోలు బాజా షోర్ మచా
చం చమ చం చెయ్ ర చిచా మాస్త్ మజా

అమీర్ పేటకి ధూల్ పేటకి షహరొకటే రా 
కార్లకైనా కాళ్లకైనా నడకొకటే రా 

చరణం: 1 
దేవుడైనా మనలా ధీమాగా తిరగగలడా 
కోవెలొదిలి వీధిలోపడి 
చిరంజీవి అయినా సినిమాలు చూడగలడా 
మొదటి ఆట క్యూలో నిలబడి 
బోనాల్ జాతరలో చిందులెయ్యగలరా 
హోలీ రంగులతో తడిసి నవ్వగలరా 
గొప్ప గొప్ప వాళ్లెవరైనా 

ధం ధమా ధం డోలు బాజా షోర్ మచా
చం చమ చం చెయ్ ర చిచా మాస్త్ మజా

అమీర్ పేటకి ధూల్ పేటకి షహరొకటే రా 
కార్లకైనా కాళ్లకైనా నడకొకటే రా 

చరణం: 2 
కొత్త వానలోని ఈ మట్టి సువాసనని 
ఏ అంగడి అమ్ముతుందిరా 
పాత బస్తీలోని ఈ పానీ పూరీనీ 
రుచి చూడని జన్మెందుకురా 
సొమ్ము పిలవగలదా చల్లని వెన్నలనీ 
ఎంతవాడు గానీ ఎంత ఉన్న గానీ 
కొనగలడా అమ్మ ప్రేమనీ

ధం ధమా ధం డోలు బాజా షోర్ మచా
చం చమ చం చెయ్ ర చిచా మాస్త్ మజా

అమీర్ పేటకి ధూల్ పేటకి షహరొకటే రా 
కార్లకైనా కాళ్లకైనా నడకొకటే రా 



ఓలమ్మో ఓలమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: ఈశ్వర్ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

ఓలమ్మో ఓలమ్మో 
ఓలమ్మో ఓలమ్మో అని చిన్నా పెద్దా అంతా రండి 
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతేలెండి 
షెహనాయి వినంగా సెహభాసు అనంగా 
జనమంత కనంగా జరగాలి ఘనంగా 
బారాత్ హోరులో గందరగోళం 
ఊరేగే దారిలో చిందుల మేళం

ఓలమ్మో ఓలమ్మో 
ఓలమ్మో ఓలమ్మో అని చిన్నా పెద్దా అంతా రండి 
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతేలెండి 

చరణం: 1 
గడిలోని కుమారికి నడి వీధి కుర్రోడికీ 
కలిసింది ఇలా జత వలపంటే అదే కదా 
మట్టికి సొంతం చినుకన్నది 
అది మబ్బులో ఎన్నాళ్లు ఒదిగుంటది 
గాలికి జైలెక్కడ ఉన్నది 
అది డోలీ తీసుకు వస్తున్నది 
నయ్ నయ్ నయ్ నయ్ ఇది ఆగదురయ్యో 
రయ్ రయ్ రయ్ రయ్ ఎటూ సాగేనయ్యో

ఓలమ్మో ఓలమ్మో 
ఓలమ్మో ఓలమ్మో అని చిన్నా పెద్దా అంతా రండి 
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతేలెండి 

చరణం: 2 
మగపెళ్లివాళ్లే ఇట్టా మొగమాటపడితే ఎట్టా 
మన ధూల్పేట సత్తా చూపాలి కదా కాస్త 
దామాద్ అంటే తెలిదేమిరా 
జర మామకు దిమాగ్ చెడగొట్టరా 
దర్జా తగ్గితే తగువెయ్యరా 
మన బస్తీ ఇజ్జత్ నిలబెట్టరా 
వెయ్ వెయ్ వెయ్ ఇలా సీఠీ వెయ్రా 
అరె చెయ్ చెయ్ చెయ్ గలాటాలు చెయ్యరో

ఓలమ్మో ఓలమ్మో 
ఓలమ్మో ఓలమ్మో అని చిన్నా పెద్దా అంతా రండి 
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతేలెండి 
షెహనాయి వినంగా సెహభాసు అనంగా 
జనమంత కనంగా జరగాలి ఘనంగా 
ఓయ్ బారాత్ హోరులో గందరగోళం 
ఊరేగే దారిలో చిందుల మేళం

ఓలమ్మో ఓలమ్మో 
ఓలమ్మో ఓలమ్మో అని చిన్నా పెద్దా అంతా రండి 
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతేలెండి 




గుండెలో వాలవా పాట సాహిత్యం

 
చిత్రం: ఈశ్వర్ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్, ఉష
 
గుండెలో వాలవా చెలి చిలకా 
శ్వాసలో కోరిక విన్నావుగా 
కళ్లలో చేరవా తొలి వెలుగా 
నీడవై చాటుగా ఉన్నావుగా 
మాటలే చేతకాక సైగ చేశానుగా 
సంతకం లేని లేఖా చేరనే లేదుగా 
కలుసుకో త్వరగ కలలు నిజమవగా 

గుండెలో వాలవా చెలి చిలకా 
శ్వాసలో కోరిక విన్నావుగా 

చరణం: 1 
నీ వెంట తరుముతూ ఉంటే 
అసలు కన్నెత్తి చూశావా నన్ను
మరి నీ ముందే తిరుగుతూ ఉంటే 
ఎపుడు పన్నెత్తి పిలిచావా నన్ను 
రోజు ఇలా ఈ గాలిలా నీ చెవిని తాకేది నేనేగా 
మామూలుగా మాటాడక ఈ గాలి గోలేంటి చిత్రంగా 
కలుసుకో త్వరగ కలలు నిజమవగా 

కళ్లలో చేరవా తొలి వెలుగా 
నీడవై చాటుగా ఉన్నావుగా 

చరణం: 2 
కాస్తైన చొరవ చేయందే 
వరస కలిపేదెలాగంట నీతో 
నువు కొంతైనా చనువు ఇవ్వందే 
తెలుసుకోలేను నీ సంగతేదో 
వెంటాడక వేటాడక వలలోన పడుతుంద వలపైనా 
నన్నింతగా వేధించక మన్నించి మనసివ్వు ఇపుడైనా 
కలుసుకో త్వరగ కలలు నిజమవగా 

గుండెలో వాలవా చెలి చిలకా 
శ్వాసలో కోరిక విన్నావుగా 
కళ్లలో చేరవా తొలి వెలుగా 
నీడవై చాటుగా ఉన్నావుగా 
మాటలే చేతకాక సైగ చేశానుగా 
సంతకం లేని లేఖా చేరనే లేదుగా 
కలుసుకో త్వరగ కలలు నిజమవగా 

కళ్లలో చేరవా తొలి వెలుగా 
శ్వాసలో కోరిక విన్నావుగా 




ధింధిరనా ధింధిరనా పాట సాహిత్యం

 
చిత్రం: ఈశ్వర్ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్, ఉష

ధింధిరనా ధింధిరనా అందెలు తొడిగిన పదమవనా 
ఆశపడే సందడిగా నిన్నే పిలువనా 
ధింధిరనా ధింధిరనా చిందులు నిలుపని పరుగవనా 
వెంటపడి తొందరగా నిన్నే కలవనా 
రంగుల కల కనపడెనా రమ్మని నను పిలిచేనా 
పొంగిన అలనైపోనా ఎవ్వరాపినా

ధింధిరనా ధింధిరనా అందెలు తొడిగిన పదమవనా 
ఆశపడే సందడిగా నిన్నే పిలువనా 

చరణం: 1 
వందేళ్ల వరమా అనుబంధాల బలమా 
మదిలో మౌనాలు తెలిపే మనవి వినుమా 
అందాల వరమా సుమగంధాల స్వరమా 
అదిరే నీ గుండె బెదురే నిలుపతరమా 
తొలి పొద్దులాంటి నమ్మకమా 
వదలద్దు నన్ను సంబరమా 
కదలద్దు నువ్వు ఇక ఆగిపో సమయమా 
చెలి సోయగాల నందనమా 
చలి కంచె తెంచుకోవమ్మా 
చిగురించుకున్న చిరునవ్వు చెదరదమ్మా 

ధింధిరనా ధింధిరనా అందెలు తొడిగిన పదమవనా 
ఆశపడే సందడిగా నిన్నే పిలువనా 

చరణం: 2 
ప్రాణాలు నిలిపే నా పంతాల గెలుపా 
నీదే నా బతుకు అంతా మొదటి వలపా 
నీ వెంట నడిపే గత జన్మాల పిలుపా 
నేడే నీ సొంతమవుతా మేలుకొలుపా 
ఎడబాటు కంటపడనీక ఎద చాటునుండవే చిలకా 
అలవాటు పడ్డ తడబాటు మరచిపోవా 
విరహాన్ని తరిమికొట్టాక సరికొత్త మలుపు తిరిగాక
మురిపాలు కాస్త శృతి మించి తుళ్లిపడవా 

ధింధిరనా ధింధిరనా అందెలు తొడిగిన పదమవనా 
ఆశపడే సందడిగా నిన్నే పిలువనా 
ధింధిరనా ధింధిరనా చిందులు నిలుపని పరుగవనా 
వెంటపడి తొందరగా నిన్నే కలవనా 
రంగుల కల కనపడెనా రమ్మని నను పిలిచేనా 
పొంగిన అలనైపోనా ఎవ్వరాపినా 

ధింధిరనా 
ధింధిరనా 
ధింధిర ధింధిర ధిర నననా
ధింధిరనా 
ధింధిరనా ధిర నననా




ఇన్నాళ్లు చూడకున్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఈశ్వర్ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్, ఉష

ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా 
నీ నీడై నిలిచి ఉన్నాననీ 
ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా 
నీ కోసం బతికి ఉన్నాననీ 
కొలువుండిపో ప్రాణమై ఇలా 
ఎద నిండిపో అనురాగమా 

ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా 
నీ కోసం బతికి ఉన్నాననీ 

చరణం: 1 
స్వప్నమో సత్యమో తెలుసుకోవద్దనీ 
చూపుతో చెప్పనీ రెప్ప వేయొద్దనీ 
ఎప్పుడూ నిన్నిలా చూస్తుంటే చాల్లే అనీ 
మబ్బుల్లో జాబిల్లినీ గుప్పిట్లో పొందాలని 
నమ్మాలి అనిపించని ఊహల్లో నన్నుండనీ

ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా 
నీ నీడై నిలిచి ఉన్నాననీ 

చరణం: 2 
నేననే మాటనే మరిచిపోయాననీ 
నిన్నిలా అల్లుతూ కొత్తగా పుట్టనీ 
ఇప్పుడీ జన్మకి నీ పేరులే పెట్టనీ 
నిట్టూర్పులన్నింటినీ నిన్నల్లో వదిలెయ్యనీ 
రానున్న వెయ్యేళ్లనీ ఈ పూట ఉదయించనీ

ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా 
నీ కోసం బతికి ఉన్నాననీ 
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా 
నీ నీడై నిలిచి ఉన్నాననీ 
కొలువుండిపో ప్రాణమై ఇలా 
ఎద నిండిపో అనురాగమా 
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా 
నీ నీడై నిలిచి ఉన్నాననీ 



కోటలోని రాణి పేట పోరగాణ్ణి పాట సాహిత్యం

 
చిత్రం: ఈశ్వర్ (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్, ఉష

పల్లవి : 
కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా 
మేడలలో దొరసాని మా వాడ చూశావా 
గాలి కూడా రాని గల్లీలోనే కాపురముంటానంటావా 
పేదల బస్తీలోనే నీ గూడు కడతావా 
ఎప్పుడూ తోటరాముణ్ణే కోరుకుంటుంది యువరాణి 
ఎందుకో ఏమో ప్రేమనే అడిగి తెలుసుకోవచ్చుగా

కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా 
మేడలలో దొరసాని మా వాడ చూశావా 

చరణం: 1 
ఎపుడూ నీ పైన పడదే చినుకైనా 
గొడుగై ఉంటాగా నేనే నీతో 
ఇక పై ఎవరైనా వెతకాలనుకున్నా 
కొలువై ఉంటాలే నేనే నీలో 
నూరేళ్ల పాటు నేనే నీ చుట్టూ కంచై కాపాడనా 
డాకటేరు కాడు ఇంజినీరు కాడు ఊరు పేరు లేనోడు 
ఎందుకు నచ్చాడమ్మా ఇటువంటి కుర్రాడు 
మొండి సచ్చినోడు కొండముచ్చుగాడు 
నిన్నెట్టా సుఖపెడతాడు 
భూమ్మీదెవడూ లేడా ఇంతోటి మగవాడు 
ఇష్టమైనాడే ఈశ్వరుడు 
మనసు పడినాడే మాధవుడు 
ప్రేమ కుట్టాక పిచ్చి పట్టాక ఆశ ఆగదు కదా

చరణం: 2 
నగలే కావాలా వగలే వెలిగేలా 
ఒక్కో ముద్దు తాకే వేళ 
సిరులే ఈ వేళ మెడలో వరమాల 
మహరాజంటేనే నే కాదా 
ఏదో సంతోషం ఏదో ఉత్సాహం 
వేరే జన్మే ఇలా 
సత్తు గిన్నెలోని సద్ది బువ్వతోనే సద్దుకుపోగలనంటావా 
అపుడపుడు పస్తుంటూ అలవాటు పడగలవా 
ఉప్పులెక్కువైనా గొడ్డు కారమైనా ఆహా ఓహో అనగలవా 
ఉక్కిరి బిక్కిరి అవుతూ ఈ కూడు తినగలవా 
పంచదారంటి మమకారం పంచిపెడుతుంటే సంసారం 
పచ్చిమిరపైన పాయసం కన్నా తీయగా ఉండదా




Thillana (Theme Music)

 


Thillana (Theme Music)

Palli Balakrishna Monday, July 3, 2017

Most Recent

Default