-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sivakarthikeyan"



చిత్రం: పరాశక్తి (2026)
సంగీతం: G. V. ప్రకాష్ కుమార్
నటీనటులు: శివకార్తికేయన్ , శ్రీలీల 
దర్శకత్వం: సుధా కొంగర 
నిర్మాత: ఆకాష్ భాస్కరన్ 
విడుదల తేది:  10.01.2026



Songs List:



సింగరాల సీతాకోక పాట సాహిత్యం

 
చిత్రం: పరాశక్తి (2025)
సంగీతం: G. V. ప్రకాష్ కుమార్
సాహిత్యం: భాస్కర్ బట్ల
గానం:  L. V. రేవంత్, ధీ, సీన్ రోల్డాన్ 

హే.. సింగారాల సీతాకోక వే..
నీ అలకే తొలగీ.. గుండె మీద రంగయ్యింది లే.. హో..

హే.. బుంగమూతి బొండు మల్లినీ
ఒక ముద్దే పెట్టీ.. పంచదార పాలు పోస్తివే

హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక
పెదవులు పడ్డాయి కంగారే
హే గిల్లేసి పాడితే జోలా.. నవ్వింది ఈ మేఘమాలా..

హే.. సింగారాల సీతాకోక వే..
నీ అలకే తొలగీ.. గుండె మీద రంగయ్యింది లే…. ఆ..

హేయ్.. ఆ పరుగు.. రైలు బండి రా.. ఆడిందో నెమలి రా
పోగిడింది చల్లేరా.. పొలమారి పొయేలా
దేవత దిగివచ్చింది.. పువ్వుల్తోటి పూజే రా
నీ ఆజ్ఞే.. పాటిస్తా.. చిత్తం అలివేనీ..

హేయ్.. సింగారాల సీతాకోక వే..
నీ అలకే తొలగీ.. గుండె మీద రంగయ్యింది లే….
హే గిల్లేసి పాడితే జోలా.. నవ్వింది ఈ మేఘమాలా..
బుంగమూతి బొండు మల్లినీ
ఒక ముద్దే పెట్టీ.. పంచదార పాలు పోస్తివే

హేయ్.. త్వర పడకు.. తడిమీ వెళ్ళను..
నువ్వు తరిమే టందుకూ..
పేకాటే ఆడవో రాణిలాగా నే వస్తా..
ఎంతటి మొనగాడివి అయిన ముక్క మూసీ వొడిస్తా
అయితే నే.. అయిపోతా.. నీకే బానిసనీ..

హే.. బుంగమూతి బొండు మల్లినీ
ఒక ముద్దే పెట్టీ.. పంచదార పాలు పోస్తివే.. ఓ ..

హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక
పెదవులు పడ్డాయి కంగారే
హే గిల్లేసి పాడితే జోలా.. నవ్వింది ఈ మేఘమాలా..
బుంగమూతి బొండు మల్లినీ
ఒక ముద్దే పెట్టీ.. పంచదార పాలు పోస్తివే..ఆ..

Palli Balakrishna Tuesday, April 7, 2026



చిత్రం: అమరన్ (Amaran) (2024)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్
నటీనటులు: శివకార్తికేయన్, సాయి పల్లవి
దర్శకత్వం: రాజ్‌కుమార్
నిర్మాత: కమల్ హాసన్ , సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్
విడుదల తేది:  31.10.2024



Songs List:



హే రంగులే పాట సాహిత్యం

 

చిత్రం: అమరన్ (Amaran) (2024)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్
సాహిత్యం: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి 
గానం: అనురాగ్ కులకర్ణి , రమ్య బెహరా

హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగేనే

వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే

స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం

సమయానికి తెలిపేదెలా
మనవైపు రారాదని దూరమై పొమ్మని
చిరుగాలిని నిలిపేదెలా
మన మధ్యలో చేరుకోవద్దని

పరిచయం అయినది
మరో సుందర ప్రపంచం నువ్వుగా
మధువనం అయినది
మనస్సే చెలి చైత్రం జతగా

కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా

హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగేనే

హే వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే

స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం

Palli Balakrishna Wednesday, November 13, 2024

Most Recent

Default