-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sendhil Thyagarajan"


 







చిత్రం: విశ్వాసం (2019)
సంగీతం: డి. ఇమ్మాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సత్య ప్రకాష్
నటీనటులు: అజిత్ కుమార్, నయన్ తార, జగపతి బాబు
దర్శకత్వం: శివ
నిర్మాత: టి. జి. త్యాగరాజన్
విడుదల తేది: 10.01.2019

చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండె లోగిలి
నీ ఊసులోనే ముసరాడుతోంది ఈ నాన్న ఊపిరి
కాలాలు ధాటి ఏనాటికైనా చేరాలి నీ ధరి
ఎన్నాళ్ళు ఉన్నానంటే ఉన్నానంటూ ఏకాకి మాదిరి

ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో

చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండె లోగిలి

కను చివరన జారే తడి చినుకును సైతం
సిరి తలుకుగా మార్చే చిత్రం నీవే
కలతగపొల మారే ఎద మంటల గ్రీష్మం
సులువుగా మరిచే మంత్రం నీవే
నువ్వంటే నా సొంతమంటూ పలికిందీ మమకారం
ఆమాటే కాదంటూ దూరం నిలిపింది అహంకారం
తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా
నిండు నూరేళ్ళ లోటు తీరిపోదా అదే క్షణానా

చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండె లోగిలి
నిదురించు వేల నీ నుదుట నేను ముత్యాల అంజలీ
జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి
ఏ బూచి నీడ నీపై రానీకుండా నేనేగా కావలి

ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో

చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ




Palli Balakrishna Monday, January 18, 2021

Most Recent

Default