-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sana Yadi Reddy"
Sampangi (2001) Telugu Songs Lyrics Album Cover

Sampangi (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Sampangi (2001)
Banner : Siri Media Productions
Music : Ghantadi Krishna
Director : Sana Yadi Reddy
Producer : Smt. Kalyani Venkatesh
Actors : Deepak
Actress : Kanchi Kaul
Supporting Cast : Chandra Mohan, Ranganath
Release Date : 13 July 2001
MOVIE HIGHLIGHTS

• Sampangi (2001) was a surprise musical blockbuster that took the youth by storm with its fresh tunes and emotional love story.

• Music Director Ghantadi Krishna shot to fame with this album, which became one of the top-selling audio cassettes of that year.

• The film features the emotional masterpiece "Gundenedukichavura Devuda", sung soulfully by the legend S. P. Balasubrahmanyam.

• Lyricist Varikuppala Yadagiri penned catchy and relatable lyrics for all tracks, contributing significantly to the film's massive reach.

• Starring debutants Deepak and Kanchi Kaul, the film is fondly remembered for its clean narration and evergreen melodies.

Pantesthe Gani Song Lyrics in Telugu – Sampangi (2001)

'Pantesthe Gani' song from Sampangi (2001) movie is composed by Ghantadi Krishna, written by Varikuppala Yadagiri, and sung by Varikuppala Yadagiri and Ghatikachalam.

SONG INFORMATION
Movie : Sampangi (2001)
Music : Ghantadi Krishna
Lyricist : Varikuppala Yadagiri
Singers : Varikuppala Yadagiri, Ghatikachalam
జగదాంబ సెంటర్ పక్క వీధిలో సరోజ ఇంటర్మీడియట్ మూడుసార్లు తప్పి ఖాళీగా ఉందిర మావా, ఆహ రామకృష్ణ బీచ్ ఎదురు సందులో జుంకీల అనుపమ డిగ్రీ డుంకి కొట్టి మనకోసమే ఎదురు చూస్తుందిరా బావ బావ అనకురా నాకు అక్కచెల్లెళ్ళు లేరు వెధవా సీతమ్మధారలో షర్మిల ఊర్మిళ ప్రమీల ఇంటర్ డిగ్రీ ఎంసీఏ నీకు ఎంసీఏ సీన్ లేదు నాయనా అగ్రహారంలో అమల, గాజువాకలో గంగ కాకాని వీధిలో కమల ఇలా లిస్టు చెబుతూపోతే వీధి వీధికి బిజీయేరా… బిజీయేరా ఫాంటేస్తే గాని తెలియలేదురా మావో నాకు సైటేసే వయసొచ్చిందని నిక్కరేసినా వీడు మేలు కధ బావో ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు రెండు జల్ల ఆ జలజ సగం స్కర్ట్ ఆ సరళ నీలి కళ్ళ ఆ నళిని కళ్ళజోడు కామాక్షి అరె పూట పూటకు డ్రెస్సులు మార్చి గుండెల్లో బాణాలు గుచ్చేస్తు ఉంటె ఫాంటేస్తే గాని, అబ్బో అరె ఫాంటేస్తే గాని, అబ్బబ్బబ్బ ఫాంటేస్తే గాని తెలియలేదురా మావో నాకు సైటేసే వయసొచ్చిందని నిక్కరేసినా వీడు మేలు కధ బావో, అబ్బా ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆహా షకలక బేబీ ఒకతి షాపింగుకు తీసుకెళ్ళి అయిదు వేలు బిల్లు చేసింది (ఇంకేంట్రో లైన్లో పెట్టావుగా) చివరకు రాఖే కట్టేసింది కొత్తపేటలో రజిని ఓ గిఫ్టు కోసమే నన్ను లవ్ లో దించేసింది చెవిలో పువ్వే పెట్టేసింది మనీ లేనిదే ప్రేమకు నేడు విలువ లేదు మావో, మావో కాసు ఉంటే ఈ లోకానికి నువు బాసువేరా మావో… లవ్ లో పడితే తెలిసొచ్చిందిర మావో ఈ లవ్ అనేదే మోసమని అది కాసుతోనే దొరుకునని పక్కింట్లో పావని తన రూట్లో ఉందని ఎక్కడ పోతుందని మన పాకెట్లో ఉందని (మన పాకెట్లో ఉందని) చాపమీదికెక్కగా లంగా వోణి కట్టగా అరె పెద్ద మనిషి అవ్వగా పాడు సూపు సోకెగా (పాడు సూపు సోకెగా) ఆ సుబ్బారావు గాడు ఆ జాన్సన్ రాజు గాడు ఆ షబ్బీర్ అలీ గాడు ఆ జబ్బర్ సింగ్ గాడు నా ఫిగరు, నీ ఫిగరని గొడవలు పడుతుంటే మాకేమో సమజుకాక పరేశానుకుంటే అందరికీ లుక్కులిచ్చి, ఆ లుక్కులిచ్చి అందరిని ఆశ పెట్టి, ఆ ఆశ పెట్టి అందరిని రెచ్చగొట్టి అబ్బబ్బబ్బా టెన్షన్ పెట్టకుండా జరిగిందేదో చెప్పరా ఆ పాలుపోసే గోపాల్ గాడితో లేసిపోయిందిర మావో, వార్ని భద్రం కొడకో… సైట్ కొట్టకురో నా కొడక భద్రం కొడకో… లవ్ బాయిలోన పడబోక భద్రం కొడకో… పిల్ల సూపుల్లో పడమాక భద్రం కొడకో… పోరి నవ్వులకు గురిగాక భద్రం కొడకో… సదువు సంకనాకి పోతాది భద్రం కొడకో… ప్రేమ మంటల్లో కాలిపోతవ్ భద్రం కొడకో… ప్యారు ఊబిలోన దిగమాకా భద్రం కొడకో… సైట్ కొట్టకురో నా కొడకా, ఆ

Gundenedukichavura Devuda Song Lyrics in Telugu – Sampangi (2001)

'Gundenedukichavura Devuda' song from Sampangi (2001) movie is composed by Ghantadi Krishna, written by Varikuppala Yadagiri, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sampangi (2001)
Music : Ghantadi Krishna
Lyricist : Varikuppala Yadagiri
గుండె నెందుకిచ్చావురా దేవుడా ఎండమావి చేసావురా దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావు మరు నిముషంలో విషముగా మరిగిస్తావు గుండె నెందుకిచ్చావురా దేవుడా మనసు మనసుతో ముడివేసి మౌన ప్రేమతో పెనవేసి ఒకరినొకరిగా తోడును చేస్తావు ఒకరి నీడలో ఒకరిని చూస్తావు వలపు దీపాలు వెలిగించి వేళా వెన్నెలలు కురిపించి కళల కాలాన్ని కరిగించేస్తావు శిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు ఆడినంతసేపడుకొని బొమ్మలన్నీ విసిరేస్తావు ఊహ తెలియని పసిపాపై బొమ్మరిల్లు తన్నేస్తావు ఏమాయ తెలియని పసి హృదయాలను తలో దిక్కుగా విసిరికొడతావు గుండె నెందుకిచ్చావురా దేవుడా ఎదను గుడిలాగా మార్చేసి ఎదుట దేవతను చూపించి ప్రేమ పూజలే జరిపించేస్తావు వింత మాయలో పడదోసేస్తావు బ్రతుకు హారతిగా వెలిగించి వెతల పాత్రలో కరిగించి వెలుగు రేఖలను నిలువునా కోస్తావు విలువ చీకటిగా మిగిలించేస్తావు నిండు ప్రాణాలు కదిలిపోతుంటే కన్నె నీటితో కాల్చేవు బండరాయిలా నువ్వుంటావు కనుకనే బాధపడలేవు ఈ మాయలన్ని ఇక నీకే తెలుసని మనిషిని పట్టుకు వేధిస్తావు గుండె నెందుకిచ్చావురా దేవుడా ఎండమావి చేసావురా దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావు మరు నిముషంలో విషముగా మరిగిస్తావు గుండె నెందుకిచ్చావురా దేవుడా

Andamaina Kundanala Bommara Song Lyrics in Telugu – Sampangi (2001)

'Andamaina Kundanala Bommara' song from Sampangi (2001) movie is composed, written, and sung by Varikuppala Yadagiri.

SONG INFORMATION
Movie : Sampangi (2001)
Music : Ghantadi Krishna
Lyricist : Varikuppala Yadagiri
Singers : Varikuppala Yadagiri
కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే ఓపెనర్ జారిపోయే వీడి గుండె ఓపెనైపోయే మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే అంతలోనే మాయమాయె వాడి మనసు దాటి వెళ్లిపోయే అల్లంత దూరాన చుక్కలాగా మెరువగా బైక్ వాడు స్టార్ట్ చేస్తే రైల్ ఉ గేట్ దాటి వెళ్లిపోయే వీడి గుండె గిల్లి వెళ్లిపోయే అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా ఏ ఇంటి వనితో మరీ నా ఎద మీటి పోయే చెలీ ఏచోట ఉందొ మరీ నా ప్రియమైన ఆ సుందరీ అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా అనుకోకుండానే నేను చూసాను ఆమెనూ ఆపే వీళ్ళేకా ఆమెతో పాటు నా మనసునూ అనుకోకుండానే నేను చూసాను ఆమెనూ ఆపే వీళ్ళేకా ఆమెతో పాటు నా మనసునూ ఎక్కడని వెతకాలి ఆ ప్రేమనూ చూడకుండా ఉండలేను ఏం చెయ్యనూ ఏమో ఏ మెడల్లో దాగి ఉందొరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడీ చూపుల వలా వేసి తీసుకెళుతుంది తన వెంబడీ ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడీ చూపుల వలా వేసి తీసుకెళుతుంది తన వెంబడీ ఒక్కసారి చేరాలి ఆ నీడనూ విన్నవించుకోవాలి ఈ బాధనూ ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా ఏ ఇంటి వనితో మరీ నా ఎద మీటి పోయే చెలీ ఏచోట ఉందొ మరీ నా ప్రియమైన ఆ సుందరీ అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లి పోయెరా

Cheliya Ninu Chudakunda Song Lyrics in Telugu – Sampangi (2001)

'Cheliya Ninu Chudakunda' song from Sampangi (2001) movie is composed by Ghantadi Krishna, written by Varikuppala Yadagiri, and sung by Udit Narayan and Anuradha Sriram.

SONG INFORMATION
Movie : Sampangi (2001)
Music : Ghantadi Krishna
Lyricist : Varikuppala Yadagiri
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ నా గుండెల్లో చొరబడి పొయ్యవే నేచ్ఛేలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలినై నా చెలి నుదుటికి అందానిచ్ఛే సిందూరమై కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై హక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై గున్నమావి తోటల్లోనా నే ఎదురు చుస్తాలే గుప్పెడంత గుండెల్లోనా చోటిస్తా రావయ్యో నా ప్రేమ రాశివి నువ్వే హా నా ఊపిరి చిరునామా నువ్వే మానస వాచా నీ మదిలోన కొలువుండానా నా నిలువెల్లా దాసోహాలే చేసేయనా ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచేయనా ఏడడుగులతో కొంగు ముడేస్తా ఏదేమైనా నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా నా రెండు కన్నులు నువ్వే హా నా చంటి పాపవు నువ్వే చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా నా అడుగుల్లో అడుగేస్తూ నా మది లోయల్లో చూస్తూ నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ నా గుండెల్లో చొరబడి పొయ్యవే

Nacchave Bhama Song Lyrics in Telugu – Sampangi (2001)

'Nacchave Bhama' song from Sampangi (2001) movie is composed by Ghantadi Krishna, written by Varikuppala Yadagiri, and sung by Sukhwinder Singh.

SONG INFORMATION
Movie : Sampangi (2001)
Music : Ghantadi Krishna
Lyricist : Varikuppala Yadagiri
హయ్ రె గోరి కిత్ని ప్యారి చాంద్ సే బి కుచ్ సింగారి నవ్వుతో చంపెయ్యకే గోరీ నీ నవ్వు కోరి బ్రతికే బికారి ఆ ఆఆ, నచ్చావే భామ… నువ్వే నా ప్రేమ నచ్చావే (భామ)… నువ్వే నా (ప్రేమ) వేశావే నాపై ఓ మంత్రం అయ్యాలే నీకే దాసోహం ప్రియా నీ నవ్వే నా సొంతం నచ్చావే (భామ)… నువ్వే నా (ప్రేమ) నచ్చావే భామ నిన్ను చూసే దాకా అనుకోలేదే… ప్రేమంటూ ఒకటుందని, నిన్ను కలిసేదాకా ధ్యాసే లేదే… అది నాలోనూ దాగుందని, నీ జాడ కోసం సుడిగాలిలా తిరిగి తిరిగి… ఇలా చేరానే మీ ఇంటికీ, (వహ్వా) నా కళ్ళల్లోని స్వప్నాలన్నీ… నువ్వేలే ప్రియా నా మాటల్లోని అర్ధాలన్నీ … నువ్వేలే ప్రియా నా కళ్ళల్లోని స్వప్నాలన్నీ… (నువ్వేలే ప్రియా) నా మాటల్లోని అర్ధాలన్నీ … (నువ్వేలే ప్రియా) నువ్వే నా గజల్… ఇక నువ్వే ఆజ్ కల్ నీదైపోయే దిల్… నా ప్యార్ తాజ్ మహల్ నా కళ్ళల్లోని స్వప్నాలన్నీ… (నువ్వేలే ప్రియా) నా మాటల్లోని అర్ధాలన్నీ … (నువ్వేలే ప్రియా) స్నేహానికి సాటే లేదురా ఏ బంధం పోటీ కాదురా స్నేహానికి సాటే లేదురా ఏ బంధం పోటీ కాదురా ప్రాణాలే వీడిపోయినా మా స్నేహం వీడిపోదురా ప్రాణాలే వీడిపోయినా మా స్నేహం వీడిపోదురా, ఆ హా ఆ (ప్యారి ప్యారి తేరి బాతే దిల్ కో చురాయి హై సాగర్ కి ఆద మేరే రంగ్ లేకే ఆయీ హై) (ప్యారి ప్యారి తేరి బాతే దిల్ కో చురాయి హై సాగర్ కి ఆద మేరే రంగ్ లేకే ఆయీ హై) చందనాల లోగిలిలో… కుందనాల బొమ్మవులే చందమామ అందమంతా… రంగరించుకున్న జాణవులే చందనాల లోగిలిలో… కుందనాల బొమ్మవులే చందమామ అందమంతా… రంగరించుకున్న జాణవులే ఆగిపోయే నా హృదయం… వేగమయ్యే నీ కోసం జారిపోయే ఆ తరుణం… చేరువయ్యే మన కోసం చేరరావా ప్రియ నేస్తం… నమ్మవే నా ప్రేమ నిజం నచ్చావే భామ… నువ్వే నా ప్రేమ నచ్చావే (భామ)… నువ్వే నా (ప్రేమ) వేశావే నాపై ఓ మంత్రం అయ్యాలే నీకే దాసోహం ప్రియా నీ నవ్వే నా సొంతం నచ్చావే (భామ)… నువ్వే నా (ప్రేమ) నచ్చావే భామా, హా

Sampangi Remma Pubanthi Vamma Song Lyrics in Telugu – Sampangi (2001)

'Sampangi Remma' song from Sampangi (2001) movie is composed by Ghantadi Krishna, written by Varikuppala Yadagiri, and sung by Unnikrishnan.

SONG INFORMATION
Movie : Sampangi (2001)
Music : Ghantadi Krishna
Lyricist : Varikuppala Yadagiri
Singers : Unnikrishnan
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్దాలోయమ్మా సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుందే ఓ… నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోందే మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే ఓ…యదను తాకగనే ఏదో హాయి రగిలేనే చాటుమాటుగా నిన్నే నే చూస్తున్నానే గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే ఓ… కలలో నిన్నే చూసి మురిసిపోతానే ఆ ఆ ఆ ఆ ఉదయమే ఐనా మేల్కొన మనసు పడనీదే ఓ… కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని ఏకాంతానా నీ ఊహలో జీవిస్తానే ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా

Palli Balakrishna Friday, July 28, 2017

Most Recent

Default