Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ramabanam"
Ramabanam (1979)



చిత్రం: రామబాణం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, మాధవపెద్ది, జేసుదాస్, రామకృష్ణ 
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద,  కృష్ణం రాజు, లత, జగ్గయ్య, జమున, మోహన్ బాబు 
దర్శకత్వం: వై.ఈశ్వర రెడ్డి 
నిర్మాత: యం.యస్.రెడ్డి  (మల్లెమాల సుందర రామిరెడ్డి)
విడుదల తేది: 02.03.1979



Songs List:



పచ్చిమిరపకాయ బజ్జీలూ పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.జానకి

పచ్చిమిరపకాయ బజ్జీలూ,.. బల్
పసందైన బుల్లి బజ్జీలూ...
కారంలో... ఆకారంలో... నా
బజ్జీలకు లేనేలేవు సమ ఉజ్జీలు

మతిమరుపును పోగొడతాయి
అతి తెలివిని పుట్టిస్తాయి...
ఆజీర్తిరోగం వున్నవాళ్ళకి...
ఆకలి ఘాటు చూపిస్తాయి. . .

ఈతకల్లు ఈరయ్యైనా...
ఇప్పసారా అప్పన్నైనా...
బ్రాందీ... విస్కీ... దొరలైనా... నా
బజ్జీలంటే పడిచస్తారు




సూరీడు యెదమిటినాడు... పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

సూరీడు యెదమిటినాడు... నా
సొగసంత రవళించె నేడు...
వెలుగుల వల విసిరేసి....
తొలి వలపులు కాజేశాడు...

సుమబాల కనుగీటగానే... ఈ
సూరీడు యెద మీటినాడు...
కను... సైగలు చెలి విసిరాకే...
తను.. వెలుగుల వల విసిరాడు

ఎండా వెన్నెల రెండూ కాని
ఏదో తీయని గిలిగింత
ఉండీ లేని బిడియంలోనే
ఊహలకందని పులకింత
ఆ... గిలిగింత... ఈ... పులకింత
కలిపికూడితే.. జగమంత

అందీ అందని అందాలెన్నో
ముందుపోసినది ఈ ఉదయం
అంతేలేని ఆనందంలో
హరివిల్లైనది నా హృదయం ..
ఆ... హరివిల్లు... కురిసే జల్లు...
అనురాగానికి పుట్టిల్లు 



తాకకుండా తనువు దోచిన పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

తాకకుండా తనువు దోచిన
తాను వరసకు ఏమౌతాడు...?
తాళి కడితే మొగుడౌతాడు
తరిమికొడితే సగమౌతాడు...

మాటువేసి మనసుదోచిన
మగువ వరుసకు ఏమౌతుంది?
తాళి కడితే ఆలౌతుంది
తరిమికొడితే తేలౌతుంది...

కళ్ళతోనే గాలం వేసి ఒళ్ళుమొత్తం గాయంచేసి
ప్రేమగందం పెదవికి రాశాడు... తన
పిచ్చినాలో రెచ్చగొట్టాడు...
చిలిపి తలపుల తలుపులు తీసి సిగ్గులన్నీ ఆవలతోసి
పంటినొక్కులు నాపై రువ్వింది. అహ
పడకటింటికి కాలు దువ్వింది...





అమ్మ... ప్రేమకు మారుపేరు...పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, జేసుదాస్

అమ్మ... ప్రేమకు మారుపేరు...
ఆమ్మ మనసు పూలతేరు... ఆ
తేరునీడా సోకగానే
నూరు జన్మల సేదదీరు...

మండు వేసవిలో ముంగిట వెలసిన
మంచుకొండ మా అమ్మ
పవలూ రేయీ ఆరక వెలిగే
పరంజ్యోతి మా అమ్మ...
ఆలనకైనా... పాలనకైనా
ఆదిదేవత మా అమ్మ...
జన్మ జన్మలా పున్నెమువలన... నీ
కమ్మని కడుపున పుట్టాను...
మళ్ళీ జన్మలు ఎన్నున్నా... నా
తల్లివి నీవే అంటాను...
కలలోనైనా... మెలకువనైనా
నీ దీవెనలే కోరుకుంటాను...




నా మాటా రామబాణం పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, రామకృష్ణ 

నా మాటా రామబాణం
న్యాయం నా ఆరవ ప్రాణం
అతి చౌకగ లోకజ్ఞానం అందించడమే నా ధ్యేయం
నా మాటా మన్మధ బాణం నా పత్రిక ప్రేమ పురాణం
ఉచితంగా సెక్స్ జ్ఞానం రుచి చూపడమే నా ధ్యేయం

చక్కెర బొమ్మకు మీసాలొస్తే చక్కని కాలక్షేపం...
రాతిరి పూటా రాణీ పేటా రసికుల పాలిటి స్వర్గం ...
కాలే కడుపుకు మండే గంజి కమ్మని అమృతపానం..
మంచిని పెంచి మనోవికాసం కలిగించేవి బుక్స్...
మంచం పట్టిన మనిషిని సైతం కదిలించేది సెక్స్...
నీతి రీతీ లేని పత్రికలు జాతిని పతనం చేస్తాయి
తాతలనాటి పుస్తకాలు తలగడకే పనికొస్తాయి...

నా మాట మన్మధ బాణం నా పత్రిక ప్రేమపురాణం
నా మాట రామబాణం న్యాయం నా ఆరవ ప్రాణం




వయసు మళ్ళిన అందగాడా పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

వయసు మళ్ళిన అందగాడా
వచ్చాను సందకాడా...
అర్ధరాతిరౌతుంది. ఆరాటం పెరుగుతూంది
ఆగలేను అందుకోరా...

సిగపూలూ వాడలేదు
అప్పుడే...
చెక్కిలైనా కందలేదు
ఇంతలోనే...
ఎంత సేపని ఎదురుచూసేది ?
నా కోసమేనా ?
ఎప్పుడింకా మోజుతీరేది?
ఆరినీ

ఏయ్ పిల్లా 
ఊ‌‍...
ఇదుగో రా దగ్గరికి రా
ఊ… హూ……
హ పట్టుకోలే ననుకున్నావా ?
ఏయ్...
ఏమిటి? చక్కిలి గిలా ?
మరుమల్లెల పక్కేశాను
బలే పనిచేశావ్
మంచి గందం తీసుంచాను
ఆహా
ఇంతకన్నా ఏమి చేసేది ?
బోలెడున్నాయ్
అంత సూటిగ ఎలా చెప్పేది?
నే చెప్తాగా....
వగలమారీ కుర్రది
వయసుమళ్ళి నేనున్నాని
చూడు చూడు నావంక
సోకు తగ్గలేదింక
రంగేళి రామ చిలకా నిన్ను
వదల్లేను చచ్చేదాకా
నిన్ను వదల్లేను చచ్చేదాకా...


Palli Balakrishna Sunday, November 5, 2023
Ramabanam (2023)



చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
నటీనటులు: గోపీచంద్, 
దర్శకత్వం: శ్రీవాస్ 
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల
విడుదల తేది: 05.05.2023



Songs List:



ఐఫోన్ సేతిలో పట్టి పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిర్యాల, మోహన భోగరాజు

ఐఫోన్ సేతిలో పట్టి
హై క్లాసు సెంటె కొట్టి
హై హీల్స్ చెప్పులు తొడిగి
తిక్క తిక్క బోతే ఉంటె
తిప్పుకుంటా పోత ఉంటె
నా పానం ఆగది పిల్లా
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగడు పిల్లా
దివాలి కాకరపుల్ల

రోలెక్స్ ఘడి పెట్టి
రేబాన్ జోడు బెట్టి
రేమాండ్స్ సూట్ తొడిగి
రేంజ్ రోవర్లా వస్తా ఉంటె
రయ్యు రయ్యునా వస్తా ఉంటె
నా పానం ఆగదు పిలగో
తెర్సుకుంది గుండెలో గొడుగో
నా పానం ఆగదు పిలగో
తట్టుకైనది ఎలాగో పిలగో

నీ పిప్పరమెట్టె వొల్లే
సప్పరించి పోయే తిల్లే
బుర బుగ్గల్లే మెరుపల్లె
పెంచినాయే కరెంటు బిల్లే
నా బుజ్జి బంగారు కొండా
నీ పోలిక సల్లగుండా
పోరి సోకె నువ్వుల ఉండా
ఆడుకోరా గిల్లి దండా
నడుములో భూకంపాలు
సూపించదే రిక్టర్ స్కేలు
నాభి లోతు సుడి గుండాలు
నా పాణం నా పాణం
అరెరే నా పాణం ఆగది పిల్లో
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగది పిల్లగో
తెర్సుకుంది గుండెలో గోడుగో
నా పాణం ఆగది పిల్లగో
తట్టుకునేది ఎలాగో

నువ్వు కస్సున సుత్తే సాలు
ఆడుతలే సెయ్యి కాలు
నీ ఒంపులో ఫెవికాలు
అత్తుకున్నాయి రెండు కళ్ళు
ఇది రింగు రింగు పిట్టా
నీ పైనే వాలిందిట్ఠా
అందాల ఆనకట్ట
తెంచుకోరా ఒంపు మిట్టా
ఏమున్నవే కోరమీను
నీ నవ్వే ఓ విటమిన్
నీ జల్లో నా జాస్మిన్
నేనయ్యి ఉంటా రావే నా జాను
నా పాణం ఆగది పిల్లో
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగది పిల్లగో
తెర్సుకుంది గుండెలో గోడుగో
నా పాణం ఆగది పిల్లగో
తట్టుకునేది ఎలాగో
నా పానం ఆగది పిల్లా
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగడు పిల్లా
దివాలి కాకరపుల్ల



దరువెయ్ రా పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కృష్ణ తేజస్వి, చైత్ర అంబలపూడి

ఎప్పుడైతే ఆటంకమొస్తాదో ధర్మానికి
అప్పుడే నువ్వొస్తావయ్య సామీ ఈ భూమికి

కొత్త రూపం ఎత్తాలయ్య
సెడుని మట్టు పెట్టాలయ్యా
నమ్మినోళ్ళ కాపాడ రావయ్యా
నరసింహయ్య

గంగం గణగణ… గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా… జంజం జనజనా
ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న

నింగి హోరెత్తగా… కలవా కలవా
నేల శివమెత్తగా… గలబ గలబలేక
చిందు కోలాటాలు… చెక్క భజనల్లోనా
నీ ఒంట్లో నా ఒంట్లో… నరసన్న పూనాలిరా

ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
తకదిన్నా దిన్నా దిన్నా
పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి
పండగ, ఆ ఆ

ధనా ధనా ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
దిక్కులదిరెట్టు తిరనాల్ల
జరగాలి జోరుగా

గంగం గణగణ… గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా… జంజం జనజనా
ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న

సింగమంటి సిన్నవాడ
నీలో కంట బిరుసు ఉన్నదిరా
ఉన్న ఊరు నిన్ను చూసి
గుండె రొమ్ము చరుసుకున్నదిరా

దిష్టి తీసి హారతిచ్చి
ముద్దు మిటికలిరుసుకున్నదిరా ఆ ఆ
నీలాంటోడు ఉన్న చోటా
ఏ చీకు చింత ఉండదంటా

మనిషంటా ఒక్క సగం
మృగమంటా ఇంకో సగం
నరసన్నే చూపాడురా
మనలో ఉన్న గుణం

మంచి ఉంటే మంచిగుంటాం
రెచ్చగొడితే హెచ్చరిస్తాం
పడగెత్తే పాపపు మూకల
తోకలు కత్తిరిస్తాం

ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
తకదిన్నా దిన్నా దిన్నా
పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి
పండగ, ఆ ఆ

ధనా ధనా ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
దిక్కులదిరెట్టు తిరనాల్ల
జరగాలి జోరుగా

గంగం గణగణ… గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా… జంజం జనజనా
ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న



నువ్వే నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: శ్రీమణి
గానం: రితేష్ జి.రావు

మొదటిసారిగా మనసు పడి
వదలకుండ నీ వెంటపడి
మొదలయ్యింది నా గుండెల్లో
లవ్ మెలోడీ

ఓ పికాసో డావెన్సీ కలగలసీ
నీ శిల్పం కొలిచారా స్కెచ్చేసి
పిచ్చెక్కే మైకంలో నన్నే
నే మరచి మైమరిచి
నీ లోకంలో అడుగేస్తున్న
ఇక అన్నిటిని విడిచీ

నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే, ఏ

నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే, హే

మొదటిసారిగా మనసు పడి
వదలకుండ నీ వెంటపడి
మొదలయ్యింది నా గుండెల్లో
లవ్ మెలోడీ
పికాసో డావెన్సీ కలగలసి
నీ శిల్పం కొలిచారా స్కెచ్చేసి

నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే, ఏ

నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే, హే

ఓ ఫుల్ మూన్ రోజు నాకే
ఫోన్ కాల్ చేస్తోందే
తన వెన్నెల ఎక్కడ ఉందో
చెప్పమని అడిగిందే

కళ్ళముందె నువ్వున్నా
తనకి నే చెప్పనులే
కాలమంతా నీతోనే
కలలు కంటున్నాలే

నా మనసే మనసే మరి
నా మాట వినను అందే
తెలియని వరసే వరసే కలిసే
నన్నే కాదలివ్వమందే

షురువాయే దిల్ సే దిల్ సే, దిల్ సే
న్యూ రొమాన్స్ డాన్సే
ఇంతక ముందరెప్పుడు
ఇంత కొత్తగా లేదులే

నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే, ఏ

నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే, హేవే 




మోనాలిసా మోనాలిసా పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీ కృష్ణ, గీతామాధురి

కాళ్ళాగజ్జ కంకాళమ్మ
వేగుచుక్క వెలగ మొగ్గ
మొగ్గకాదు మోదుగ నీడ
నీడ కాదు నిమ్మల బావి
కాళ్ళాగజ్జ కంకాళమ్మ
వేగుచుక్క వెలగ మొగ్గ
మొగ్గకాదు మోదుగ నీడ
నీడ కాదు నిమ్మల బావి

మోనాలిసా మోనాలిసా
నడుమే నల్లపూస
చెవిలో చెప్పుకుందాం
నువ్వు నేను గుసగుస
హే మోనాలిసా మోనాలిసా
వయసే మిస మిస
ఇద్దరం పాడుకుందాం సరిగామపదనిస
కాదు కాదు అంటానా
కాదు కాదు అంటానా
రాను రాను అంటానా
ఈలా కొట్టి రమ్మంటే
గోడ దూకి వచ్చయినా
బొట్టు పెట్టి రమ్మంటే
పెట్టె సద్దుకొచ్చేయినా
నేనెట్టగుంటా తెరేబీనా
సరికొత్తగా మహా మత్తులో
పడిపోతిని కల్కత్తాలో కనులు చెదరగా
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి
మోనాలిసా మోనాలిసా
వయసే మిస మిస
ఇద్దరం పాడుకుందాం సరిగామపదనిస

సిగ్గు ముంచుకొస్తాందిరా
మీద మీదకొస్తుంటే
అగ్గి పుట్టుకొస్తదిరా ఆవురావురంటుంటే
సిగ్గు ఎగ్గూ ఎందుకు లేదు
పక్కన పెట్టేదాం
ఈ అగ్గి మాన్తా సంగతి ఏంటో
ఇపుడు తేల్చేద్దాం
నిన్ను ఇంకా ఆపేదెట్టా
నిన్ను ఇంకా ఆపేదెట్టా
నన్ను నేను లాగేదెట్టా
గిల్లి గిల్లి గలాటకి ఎక్కాఏకి రా మరి
రా మరి రా మరి రా…
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి

Palli Balakrishna Tuesday, May 23, 2023

Most Recent

Default