Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Meera Jasmine"
Vimanam (2023)



చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్
నటీనటులు: సముద్రఖని, అనసూయ, మీరా జాస్మిన్, రాహూల్ రామక్రిష్ణ 
దర్శకత్వం: శివప్రసాద్ యానాల
నిర్మాతలు: కిరణ్ కొర్రపాటి & జీ స్టూడియోస్
విడుదల తేది: 09.06.2023



Songs List:



రేలా రేలా పాట సాహిత్యం

 
చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్ 
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: మంగ్లీ 

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకుమించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా

రేలారేలా రేలారేలా
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

వేల వేల వెన్నెలలే
నవ్వులుగా మారి
పెదవులపైనే విరబూసాయేమో
చుట్టూ ఉన్నవాళ్ళే
నీ చుట్టాలు ఈడ
ఇంతకన్న స్వర్గం ఇంకేడా లేదో

ఇల్లే జూస్తే ఇరుకురో
అల్లుకున్న ప్రేమలు చెఱుకురో
తన హృదయం ఓ కోటరో
నువ్వే దానికి రారాజురో

రేలా రేలా రేలా రేలా
రెక్కల గుర్రం ఎక్కాలా
లెక్కే లేని ఆనందాన
సుక్కలు తెంపుకురావాలా

నువ్వు కన్న కలలే
నిజమౌతాయి చూడు
అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు
దశరథ మహారాజే నాన్నై పుట్టాడు
నువ్వు రాముడంత ఎదగర నేడు

చరిత్రలు ఎన్నడు చూడనీ
మమతల గూడే మీదిరో
సంపద అంటే ఏదో కాదురో
ఇంతకుమించి ఏది లేదురో

రేలా రేలా రేలా రేలా
నీదే నింగీ నేలా
నిత్యం పండగల్లె
బతుకు జన్మే ధన్యమయ్యేలా

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకుమించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా

రేలారేలా రేలారేలా
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా




సుమతే సుమతే పాట సాహిత్యం

 
చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్ 
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్

సుమతే సుమతే
నీ నడుములోని మడత చూస్తే
పాణమొనికే వనిత

నువ్ పూసే రంగులన్నీ జూస్తే
నేను పొంగిపొర్లుతా
మత్తెక్కుతాది జూస్తే
ఒల్లంత కల్లు ముంత

తైతక్కలాడుతుందే
నర నరము నాగులాగా

నీ సొత్తు మస్తుగుందే
షాపుల కొత్త చెప్పులెక్క
నీ ఎత్తు పొడవు జూస్తే
పుడుతది మునులకైన తిక్క

సుమతే సుమతే
నువ్వు ఓ లెదరు బూటు లెక్క
నాది హవాయి బతుకు తొక్కా
యాడ తేనే వెయ్యి నీకు
శెప్పు జర ఓ సుమతీ

కలరు జూడ మెరుస్తావు నువ్వు
కయ్యిమని ఎందుకరుస్తావు
రాంగు సైజు చెప్పులెక్క
కరవకే నా సుమతీ

ఎడమకి కుడికి
గింత తేడాలు తెలియకుండా
కుడతనే మట్టసంగ
పాదాల కొత్త జోడు

మట్టిలో కలువలాంటి
నీ మనసు గెలవమంటే
తెలియదే కిటుకు ఏమిటో
నాకు అమ్మ తోడు

ఏ సదువు సంధ్య లేదే
నాకే ఆస్థి పాస్తిలేదే
ఈ గరీబోని మొఖము జూసి
గనువ ధియ్యరాదే

నా కొట్టు సిన్నదైనా
ప్రేమ గట్టిదమ్మ సుమతి
సీ కొట్టకుండ నాపై
దయ సూపరాదే సుమతీ
సుమతే సుమతే

Palli Balakrishna Friday, May 26, 2023
Gorintaku (2008)


చిత్రం: గోరింటాకు (2008)
సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్
నటీనటులు: రాజశేఖర్, ఆర్తి అగర్వాల్, మీరాజాస్మిన్
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: యన్. వి.ప్రసాద్ , పరాస్ జైన్
విడుదల తేది: 2008

Palli Balakrishna Saturday, March 16, 2019
Aakasa Ramanna (2010)


చిత్రం: ఆకాశ రామన్న  (2010)
సంగీతం: చక్రి
నటీనటులు: అల్లరి నరేష్ , శివాజీ, రాజీవ్ కనకాల, మీరా జాస్మిన్, గౌరీ పండిట్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. అశోక్
నిర్మాత: మన్యం రమేష్
విడుదల తేది: 12.03.2010


Palli Balakrishna Friday, February 15, 2019
Alladista (2010)



చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
నటీనటులు: ఉదయ్ కిరణ్, మీరాజాస్మిన్, రంభ, రాయ్ లక్ష్మీ, రాఘవ లారెన్స్
దర్శకత్వం: బాలిశ్రీ రంగం
నిర్మాత: కె.రోహిత్
విడుదల తేది: 25.06.2010



Songs List:



పూవులలో పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: శ్రావ్యా

పూవులలో 



వీణలో పలికిన పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: జీన్స్ శ్రీనివాస్ 

వీణలో పలికిన 




కళ్యాణమే కానీ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: జీన్స్ శ్రీనివాస్ 

కళ్యాణమే కానీ 




సిల్ సిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: బెల్లీ రాజ్, పద్మా లయిత్

సిల్ సిల్లా



నీవుండె నా జత కోసం పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: బెల్లీ రాజ్, రోషిణి 

నీవుండె నా జత కోసం



స్టయిలు మార్చు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: నవీన్

స్టయిలు మార్చు

Palli Balakrishna Wednesday, February 13, 2019
Raraju (2006)

చిత్రం: రారాజు (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: గోపిచంద్, మీరా జాస్మిన్ , అంకిత
మాటలు ( డైలాగ్స్ ): చింతపల్లి రమణ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఉదయ్ శంకర్
నిర్మాత: జి.వి.జి.రాజు
సినిమాటోగ్రాఫీ: రామంత్ శెట్టి
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
బ్యానర్: యస్.యస్.పి.ఆర్ట్స్
విడుదల తేది: 20.10.2006



చిత్రం: రారాజు (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  సుద్దాల అశోక్ తేజ
గానం: టిప్పు , చిత్ర

బంగారు చిలక ముత్యాల గుళక
నేనేర ఓయ్. మామా
అందాల గిలక కుళుకులు చూసి
బందీవి అయిపోమా
ఇన్నాళ్లు కలలే ఈ రోజు ఎదురై ఊరేగు సమయాన
సన్నాయి వలన సరిగమ వింటూ సంతోష పడు మామా
కోయిలా రాయిలా నను పాడించు మురిపాన
గొంతులో మోగిన అనురాగాలు ఇవి నీవేన
ఆ నింగిలో చిరు మేఘాలు ఒడిలోన
రంగుల విల్లులా నను మార్చేది ఎవరే జాణ

బంగారు చిలకా...
బంగారు చిలక ముత్యాల గుళక
నేనేర ఓయ్. మామా
అందాల గిలక కుళుకులు చూసి
బందీవి అయిపోమా

చెలి నడుమే ఒక చెరుకు గడ
చెయి తగిలితే చాలు తీపి
అది ఒకటే నువు అడుగకురా
నను తరుముతు చేతులు చాపి
నువ్వులికి పడిపోకిల నకరలు మాని రా
అదురు బెదురు మరి లేదని
నను బలిమిని చేయకురా
గమ్మత్తుగుంది నన్నత్తుకోవే
అదని ఇదని అనక

బంగారు చిలకా...
బంగారు చిలక ముత్యాల గుళక
నేనేర ఓయ్. మామా
అందాల గిలక కుళుకులు చూసి
బందీవి అయిపోమా

తమరికిలా ఈ తమకిమిలా నను మురళిని చేసిన వేళ
పరికిని పై కను పడిన దిశ త్వరపడమను గోల
ఎగసి ఎగసి పడకు మగ సింగమా పగటేల ఇంత చనువా
బిడియ పడకు తెలుగందమా నువు పలికితె పాట సుమా
నీ మెచ్చుకోలు గోరెచ్చ గుంది పడుచు ఋతువు గనుకా

బంగారు చిలకా...
బంగారు చిలక ముత్యాల గుళక
నేనేర ఓయ్. మామా
అందాల గిలక కుళుకులు చూసి
బందీవి అయిపోమా


Palli Balakrishna Thursday, January 18, 2018
A Aa E Ee (2009)


చిత్రం: అ ఆ ఇ ఈ (2009)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్, యమ్.యమ్.శ్రీలేఖ
నటీనటులు: శ్రీకాంత్ , సదా, మీరా జాస్మిన్
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాతలు: బొద్దం అశోక్ యాదవ్
విడుదల తేది: 06.11.2009

పల్లవి:
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా
చీకటైతే చాలట చీర చాటు గోలట
రాజుకుంటే ఈడట దానిపేరె మూడట
ఊరుకోరాదట ఊసులాడాలట
ఊయలూపాలటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పట

చరణం: 1
మొట్టమొదట నుదుటిమీద చెమట
వెల్లువై నదిలా మారింది
చుట్టుకొలత చూడగానే చిలక
భగ్గుమని వయసే రగిలిందే
ఎగుడు దిగుడు వెతికే దారుల్లో
జడతో జగడం జరిగేవేళల్లో
కన్నె కనకాంబరం సోకు చీనాంబరం
అరె తిరగ మరగ నలగలంటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా

చరణం: 2
పట్టి మంచం కిర్రుమంటు గొడవ
యవ్వనం ఈలలు వేస్తుంటే
ఇంత మైకం ఇందులోన కలదా
నరనరం మెళికలు పడుతుంటే
ఒకటి ఒకటి కలిసే చప్పట్లో
అలుపు సొలుపు రాదే ఇప్పట్లో
నేనే గుడిగోపురం నీవే నా పావురం
నా ఎదపై నువ్వే వాలాలంటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
హా... ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా
చీకటైతే చాలట చీర చాటు గోలట
రాజుకుంటే ఈడట దానిపేరె మూడట
ఊరుకోరాదట ఊసులాడాలట
ఊయలూపాలటా హ హ హ హ హ హ

అచ్చట ముచ్చట హు హు హు ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట హు హు సంగతే హు హు హు

Palli Balakrishna Thursday, November 30, 2017
Yamagola Malli Modalayindi (2007)



చిత్రం: యమగోల మళ్ళీ మొదలైంది (2007)
సంగీతం: జీవన్ థామస్
నటీనటులు: శ్రీకాంత్ , వేణు, మీరా జాస్మిన్ , రీమా సేన్
దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి
నిర్మాతలు: అమర్ , రాజశేఖర్, సతీష్
విడుదల తేది: 23.08.2007



Songs List:



ఆడుకోడానికే పాట సాహిత్యం

 
చిత్రం: యమగోల మళ్ళీ మొదలైంది (2007)
సంగీతం: జీవన్ థామస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సురేందర్ సింగ్ 


ఆడుకోడానికే




జలకదిక లాజా పాట సాహిత్యం

 
చిత్రం: యమగోల మళ్ళీ మొదలైంది (2007)
సంగీతం: జీవన్ థామస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మనో 


జలకదిక లాజా




గుండెలో అబ్బబ్బా పాట సాహిత్యం

 
చిత్రం: యమగోల మళ్ళీ మొదలైంది (2007)
సంగీతం: జీవన్ థామస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ఉదిత్ నారాయణ్ , శ్రేయా ఘోషల్ 

గుండెలో అబ్బబ్బా





ఓ సుబ్బారావు ఓ అప్పారావు పాట సాహిత్యం

 
చిత్రం: యమగోల మళ్ళీ మొదలైంది (2007)
సంగీతం: జీవన్ థామస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మురళి 

ఓ సుబ్బారావు ఓ అప్పారావు 
ఓ వెంకట్రావు ఓ రంగారావు
ఓ సుబ్బారావు ఓ అప్పారావు 
ఓ వెంకట్రావు ఓ రంగారావు
ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే
మీరొచ్చారా ఐనా కానీ రెడీ రెడీ రెడీ రెడీ
అంగట్లో అన్ని ఉన్నాయ్ 
వాగిట్లో అందాలున్నాయ్
చీకట్లో చిందులు ఉన్నాయ్
ఏం కావాలి నీకు ఏమేం కావాలి
ఏం చెయ్యాలి నేను ఏమేం చెయ్యాలి


నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను
జోరు మీద ఉన్నాను జోడు కడతావా
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా
బంగారు కొండ మీద శృంగార తోటలోన
చిలకుంది తెమ్మంటావా గిలకుంది ఇమ్మంటావా
ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా
హారాలకే అగ్రహారాలు  రాసిస్తా 
అందాల గని ఉంది తవ్వి తీసుకో
నీకందాక పని ఉంటే నన్ను చూసుకో 


నా పరువం నీ కోసం  నా పరువం నీ కోసం
పల్లవి పాడుతున్నది  మెల్లగ ఆడుతున్నది
కోరిక పండగా నిండుగా 
నా పరువం నీ కోసం నా పరువం నీ కోసం
రాకరాక వచ్చారోయ్ మా ఇంటికి నా పడకింటికి 
చూడగానే నచ్చారోయ్ నా కంటికి నీ కలకంటికి
ఈ సమయం నా హృదయం 
ఈ సమయం నా హృదయం
ఇంతలోనే నాగులాగ ఊగుతున్నది చెలరేగుతుంది 
నా పరువం నీ కోసం నా పరువం నీ కోసం


పుట్టింటోళ్ళు తరిమేశారు 
కట్టుకున్నోడు వదిలేశాడు
అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు 
కట్టుకున్నోడు వదిలేశాడు
పట్టుమని పదారేళ్ళురా నా సామి 
కట్టుకుంటే మూడే ముళ్ళురా
అయ్యోపాపం పాపాయమ్మ
టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపాయమ్మ 
టింగురంగా బంగారమ్మ
అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి 
కట్టుకథలు చెప్పమాకులే
ఆఁ అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి 
కట్టుకథలు చెప్పమాకులే
చుట్టుకొలత ముప్పైఆరులే 
చెవిలోన పూలుగట్రా పెట్టమాకులే

పుట్టింటోళ్ళు తరిమేశారు 
అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేశాడు
టింగురంగా బంగారమ్మ


గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్ ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు




ఉప్పుకప్పురంబు పాట సాహిత్యం

 
చిత్రం: యమగోల మళ్ళీ మొదలైంది (2007)
సంగీతం: జీవన్ థామస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జాస్సి గిఫ్ట్ 

ఉప్పుకప్పురంబు 

Palli Balakrishna Tuesday, November 28, 2017

Most Recent

Default