Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Jyothika"
Jai Bhim (2021)



చిత్రం: జై భీమ్ (2021)
సంగీతం: సీన్ రోల్దన్
నటీనటులు: సూర్య, రవిష, విజయన్, ప్రకాష్ రాజ్ 
దర్శకత్వం: జ్ఞానవేల్
నిర్మాతలు: జ్యోతిక, సూర్య,
విడుదల తేది: 02.11.2021



Songs List:



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
చిత్రం: జై భీమ్ (2021)
సంగీతం: సీన్ రోల్దన్
సాహిత్యం: శరత్ సంతోష్
గానం: లలిత సుధ

మట్టిలో తేమ ఉందీ
రేయికో ఎన్నెలుందీ
నమ్మితే రేపు నీదీ
జీవితం సాగనుందీ

వెళ్ళే దారుల్లో… ఆకాశం తోడుందీ
హద్దే నీకొద్దూ… నీ నవ్వే వీడొద్దూ

మట్టిలో తేమ ఉందీ, ఈ ఈఈ
రేయికో వెన్నెలుందీ, ఈ ఈఈ

పట్టుదల నీ పడవై
దాటు పదా సాగరం
నేలతల్లి నేర్పెకదా
గుండెల్లోని ఓ నిబ్బరం

నిక్కమున్న బాటలోన
నీ పయనం నీకు జయం
ఊపిరున్న కాలమంత
ప్రేమేగా నీకు వరం

ఆశే లేనట్టీ… బ్రతుకుందా చెప్పమ్మా
నీ గుండెల్లోనే… బదులుందే చిన్నమ్మ
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ

మట్టిలో తేమ ఉందీ
రేయికో ఎన్నెలుందీ
నమ్మితే రేపు నీదీ
జీవితం సాగనుందీ

Palli Balakrishna Friday, November 26, 2021
Rytham (2000)




చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
నటీనటులు: అర్జున్ సార్జా, మీనా, జ్యోతిక, రమ్యకృష్ణ, రాజు సుందరం
దర్శకత్వం: వసంత్
నిర్మాత: వి నటరాజన్
విడుదల తేది: 15.09.2000



Songs List:



కదిలే నడిచే పాట సాహిత్యం

 
చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
గానం: ఉన్నిమీనన్

కదిలే నడిచే 





గాలే నా వాకిటికొచ్చె పాట సాహిత్యం

 
చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
గానం: ఉన్నికృష్ణన్, కవిత కృష్ణమూర్తి

గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా  లవ్వే అవునా
నీవూ నిన్నెక్కడ ఉన్నావ్ గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో ఉన్నావమ్మీ ఔనా

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే
ఎంకి పాట పాడూ
ఇలఉన్న వరకూ నెలవంక వరకూ
గుండెలోకి వీచు
ఇలఉన్న వరకూ నెలవంక వరకూ
గుండెలోకి వీచు 
గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా

ఆషాడమాసం వచ్చి... వానొస్తే నీవే దిక్కు
నీ ఓణీ గొడుగే పడతావా...
అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం
కన్నుల్లో క్షణమే నిలిపేవా...
నీ చిరు సిగ్గుల వడి తెలిసే
నేనప్పుడు మదిలో ఒదిగితే
నీ నెమ్మదిలో నా ఉనికే కనిపెడతావా...

పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి
పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి
భూమికి పైన మనిషున్న వరకూ కరగదు వలపు

గాలే నా వాకిటికొచ్చె  మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే ఔనా
గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా...

చిరకాలం చిప్పల్లోన
వన్నెలు చిలికే ముత్యం వలెనే
నా వయసే తొణికసలాడినదే...
తెరచాటు నీ పరువాల తెర తీసే శోధనలో
ఎదనిండా మదనం జరిగినదే...
నే నరవిచ్చిన పువ్వైతే నులి వెచ్చని తావైనావు
ఈ పడుచమ్మను పసిమొగ్గను చేస్తావా...

కిర్రు మంచమడిగే కుర్ర దూయలంటే
సరియా సఖియా
కిర్రు మంచమడిగే కుర్ర దూయలంటే
సరియా సఖియా...
చిన్న పిల్లలై మనం కుర్ర ఆటలాడితే
వయసా వరసా

గాలే నా వాకిటికొచ్చె మెల్లంగా
ఐతే మరి పేరేదన్నా లవ్వే అవునా...

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే
ఎంకి పాట పాడూ
ఇలఉన్న వరకూ నెలవంక వరకూ
గుండెలోకి వీచు
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే
ఎంకి పాట పాడూ....
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే
ఎంకి పాట పాడు




ఇచటే నేనిచటే పాట సాహిత్యం

 
చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
గానం: శంకర్ మహదేవన్ 


ఇచటే నేనిచటే




ప్రేమ ఇది నిజమేనా (జల జలమని) పాట సాహిత్యం

 
చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
గానం: సాధన సర్గం

ప్రేమ ఇది నిజమేనా



అయ్యో పాడు చిచ్చు పాట సాహిత్యం

 
చిత్రం: రిథమ్ (2000)
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్
సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి
గానం: ఉదిత్ నారాయణ్, వసుందరా  దాస్

అయ్యో పాడు చిచ్చు

Palli Balakrishna Friday, February 5, 2021
Donga (2019)








చిత్రం: దొంగ (2019)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిన్మయి శ్రీపద
నటీనటులు: కార్తీ, జ్యోతిక, నిఖిల విమల్
దర్శకత్వం: జీతు జోసెఫ్
నిర్మాణ సంస్థ: వియాకాం 18 మోషన్ పిక్చర్స్
విడుదల తేది: 20.12.2019

ఏనాడు పండుగే పండుగా
నీ తోడై నేనిలా ఉండగా
నీ పేరై పెదవులే పండగా
ఏ చింత చెంతకి రాదుగా

ఈ క్షణం నిజం వాస్తవం ఆహా....
పువ్వులో నన్ను తాకింది నీ ప్రేమ వైభవం 
నీ కౌగిళ్ల చలి కారగ మిన్నంటుతుంది సంబరం 
ఇదే మహావరం ఈ జన్మకే

ప్రేమ పూసింది అందాల బృందావనం
నీ గుండె గుడి చేరి మురిసింది పూజాసుమం
ఈ రాధా గుండెల్లో రాగాలు కృష్ణార్పణం
మౌన మంత్రాలు పాడింది ఆరాధానం

నిన్న మొన్నల్లో లేని సరదాలు
కానుకిచ్చావవు అంటే అదే చాలు
ఏ రేపు మాపుల్లో నిన్ను విడనంటూ
బాస చేసాయి ఎదలోని చిగురాశలు
బ్రతుకు నీకోసమే


Palli Balakrishna Saturday, January 16, 2021
Chandramukhi (2005)



చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: రజినీకాంత్, ప్రభు,  జ్యోతిక, నయనతార
దర్శకత్వం: పి.వాసు
నిర్మాతలు: పి.కరుణాకర్ రెడ్డి, గవర పార్థసారథి
విడుదల తేది: 14.04.2005



Songs List:



దేవుడ దేవుడా పాట సాహిత్యం

 
చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్. పి. బాలు

అరె అరె అరె అరె అరె...
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
ఓయ్ దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా...
రిపీటు...
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా...
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ...
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా

చరణం: 1
ఆరె ఆరే ఆరె ఆరే... అరెరే ఆరే అరెరే ఆరే
ఆలోచించు కొంచెం రైతుబిడ్డ కష్టం
అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం
వాడలోని మలినం శుభ్రం చేసేవారు
నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు
మాసిన జుట్టు పనీ పట్టె వాడంటూ లేకుంటే
తగ్గుతుందా తల బరువూ
నీళ్లలోనే నిలిచి ఉతికే వాడంటూ లేకుంటే
నిలుచునా మన పరువూ
ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు
దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్...
రిపీటు...
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ...
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...
ఆ... దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా

చరణం: 2
నీ గురించి ఎవరో అరె ఏమనుకుంటే ఏమి
ఈ చెవితోటి విన్నాగాని ఆ చెవిలోంచి వదిలేయ్
మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా
ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి
పూలబంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా
తేలుతుందోయ్ పైకి సోదరా
అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా
తేలిరారా పూలబంతిలా
మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా
పున్నమినాటి జాబిలి చల్లే పండు వెన్నెలనాపగలదా...
రిపీటు...
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే.... ఓ ఓ ఓ...
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా...
రిపీటు...
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా...
శభాషు....
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే... ఓ ఓ ఓ...
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే... ఓ ఓ ఓ...





కొంత కాలం కొంత కాలం పాట సాహిత్యం

 
చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: సుజాత

కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి
ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి
అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి

చరణం: 1
గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతకాలం
కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం
మదనుడికి పిలుపు మల్లె కాలం
మదిలోనె నిలుపు ఎల్లకాలం
చెలరేగు వలపు చెలి కాలం
కలనైన తెలుపు కలకాలం
తొలి గిలి కాలం కౌగిలికాలం మన కాలం ఇది... ఆ...
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి

చరణం: 2
కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాము కాలం
గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమకాలం
తమి తీరకుండు తడి కాలం
క్షణమాగనంది ఒడి కాలం
కడిగింది సిగ్గు తొలికాలం
మరిగింది మనసు మలి కాలం
మరి సిరికాలం మగసిరి కాలం మన కాలం పదా... ఆ...
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి
ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి
అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి




అందాల ఆకాశమంత పాట సాహిత్యం

 
చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: యస్.పి.బాలు 

అందాల ఆకాశమంత 





అన్నగారి మాట పాట సాహిత్యం

 
చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర
గానం: కార్తీక్, అనురాధ శ్రీరాం 

అన్నగారి మాట 



చిలకా పద పద పాట సాహిత్యం

 
చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: టిప్పు, రాజేశ్వరి, M.V. మాణిక్య వినయగం  , గంగ 

చిలకా పద పద 



రారా సరసకు రారా పాట సాహిత్యం

 
చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్‌
సాహిత్యం: భువనచంద్ర
గానం: నిత్యశ్రీ , మహదేవన్ 

రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా.. తోం తోం తోం

చరణం: 1
నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా
కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా
తననన ధీం త ధీం త ధీంత తన
వయసు జాలవోపలేదుర
మరులుగొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చ రావేరా రావేరా
సల సల సల రగిలిన పరువపు పొదయిది
తడిపొడి తడిపొడి తపనల స్వరమిది రా రా రా

చరణం: 2
ఏ బంధవో ఇది ఏ బంధవో
ఏ జన్మబంధాల సుమగంధవో
ఏ స్వప్నవో ఇది ఏ స్వప్నవో
నయనాల నడయాడు తొలి స్వప్నవో
విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు తనువును కనవా
మగువల మనసుల తెలిసి
నీ వలపును మరచుట సులువా
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
సరసకు పిలిచితి విరసము తగదిక
జిగిబిగి సొగసుల మొరవిని
మిలమిల మగసిరి మెరుపుల మెరయగా రా రా రా


Palli Balakrishna Sunday, August 20, 2017
Manmadha (2004)


చిత్రం: మన్మధ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వేటూరి
గానం:  యస్. పి. బి. చరణ్
నటీనటులు: శింబు , జ్యోతిక, సింధు తులాని, మందిరా బేడి
దర్శకత్వం: ఏ. జె. మురుగన్
నిర్మాత: కె.విజయ్ భాస్కర్ రెడ్డి
విడుదల తేది: 12.11.2004

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో
ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో
సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమా

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

పూల మనసులో గాలి ఎరుగదా
నిన్ను పరిచయం చేయాలా
మేఘమాలలో మెరుపు తీగవై
నీవు పలికితే ప్రణయాలా
శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత
ఒక చూపు చాలదా మనసు తోచిన జోలగా...
నిను తలచి వేచిన వేళ పదములా కదలదు కాలం
కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా
తండ్రి నీవేఅయి పాలించు
తల్లి నీవేఅయి లాలించు
తోడు నీడవై నను నడుపు
గుండెల్లో కొలువుండే దేవి
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా...

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

నీవు తప్ప నాకెవరు లేరులే
ప్రాణమివ్వనా నీకోసం
ఆశ లాంటి నీ శ్వాస తగిలితే
బతికి ఉండదా నా ప్రాణం
నీ మోము చూడక నా కనులు వాలవే
విరహ వేళలో పగలు చీకటై పోయనే
తనుమనః ప్రాణాలన్ని నీకు నేనర్పిస్తాలే
నీ కొరకు పుడితే చాలు మళ్ళీ మళ్ళీ
చెలియ నీ పేరు పక్కనిలా రాసినానులే నా పేరే
అది చెరిగిపోకుండా గొడుగువలే
నేనుంటే వానెంతలే…
నా చిట్టి ప్రేమా…

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో
ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో
సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగా కళ్ళల్లో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా


Palli Balakrishna Friday, July 28, 2017
Nuvvu Nenu Prema (2006)


చిత్రం: నువ్వు నేను ప్రేమ (2006)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచన: వేటూరి
గానం: శ్రేయాఘోషల్, నరేష్ అయ్యర్
నటీనటులు: సూర్య, జ్యోతిక, భూమిక
దర్శకత్వం: యన్.కృష్ణ
నిర్మాత: కె.ఇ. జ్ఞానవేల్ రాజా
విడుదల తేది: 08.09.2006

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే...
నే నీవే హృదయం అన్నదే

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే

రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
పూవైనా పుస్తున్నా ని పరువంగానే పుడతా
మధు మాసపు మాలల మంటలు రగిలించే ఉసురై...
నీవే నా మదిలో అడ నేనే... నే నటనై రాగా
నా నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం ఉందే హో
తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మీనం

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
నే నేనా అడిగా నన్ను నేనే...
నే నేనా అడిగా నన్ను నేనే
ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా

నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా
తుమ్మెద తేనెలు తేలే ని మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా
నీవు సంద్రం చేరి గల గల పారే నది తెలుసా

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే...
నే నీవే హృదయం అన్నదే

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే

రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు

Palli Balakrishna
Mass (2004)



చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగార్జున, జ్యోతిక, ఛార్మి
దర్శకత్వం: రాఘవ లారెన్స్
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 23.12.2004



Songs List:



మాస్ మమ మాస్ పాట సాహిత్యం

 
Song Detailsచిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: మనో , రవివర్మ

మాస్ మమ మాస్ వెయ్ మళ్ళా 
అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే మాస్ 
అన్న లుక్కిస్తే మాస్ మ మ మాస్ వెయ్యరా మావ 
అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్ 
అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అద్ది లెక్క 
అన్న కళ్ళేర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమి గుగ్గవుతదిరా మాస్ 
అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తారురా మాస్ 
మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే తానంటా 
మరిమాయలు చేసే ఎవడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా 
అన్నా ఒక్కసారి పాడన్నా 
హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగు పెడితే విజులు విజులురో
హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో 

చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో 
నీసాటి వారి కందరికి ప్రేమ పంచరా 
ఆప్రేమ కింకా ప్రాణమైనా ఫనముపెట్టరా 
ఫస్టెక్కో మిత్రుడిలా ఇస్తూ వస్తా 
నీకిలా దోస్తికట్టేస్తా పెద్ద మాస్ చేస్తే 
మాకష్టమిలా పోస్తూ పోతుంటే ఇక శాస్తి చేసేస్తదిరా మాస్
మంచిగా ఉంటే మంచిని పంచే మనస్సే మాసంటా 
అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా 
హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో 
హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో 

సరుకురో ఛలో మలకపేట మలుపుదాకా దుమ్ముదులపరో 
మట్టా చేపట్టుకొని పనినే చూపెట్టమని లొల్లేపెట్టేయ్యదురా మాస్ మాస్ మాస్ 
అతడు పొట్టే చేపట్టుకొని ఏదో పని పట్టుకొని కాలం నెట్టేస్తుందిరా మాస్ 
మంచిగా ఉంటే మంచిని పంచే మనసే మాసంటా 
అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా 
హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో హోయ్ 
వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలుపెడితే పిడత పగులురో 




వాలు కళ్ళ వయ్యారి పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: కార్తీక్

నా... బూరెలాంటి బుగ్గ చూడు 
కారు మబ్బులాంటి కురులు చూడు 
వారెవా! క్యా హెయిర్ స్టైల్ యార్ 
అన్న... సూపర్ అన్న కంటిన్యూ కంటిన్యూ 

హేయ్ హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి 
నా గుండెలోకి దూరి మనసులోకి జారి 
చంపినావే కావేరి 
హో...బూరెబుగ్గ బంగారి చేపకళ్ళ చిన్నారి 
బుంగమూతి ప్యారి నంగనాచి నారి
లవ్వు చెయ్ ఓ సారి 

హ్... నిన్ను చూసినాక ఏమైందో పోరి 
వింత వింతగుంటోంది ఏవిటో ఈ స్టోరి 
నువ్వు కన పడకుంటే తోచదే కుమారి 
నువ్వు వస్తే మనసంతా... స రి గ మ ప గ రి 

హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి 
నా గుండెలోకి దూరి మనసులోకి జారి 
చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి 

చరణం: 1 
నీ హృదయంలో నాకింత చోటిస్తే 
దేవతల్లే చూసుకుంట నీకు ప్రాణమైనా రాసి ఇస్తా 
అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే 
దీవెనల్లే మార్చుకుంట దాన్ని ప్రేమలాగ స్వీకరిస్తా 
నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే 
ఈ బంధం ఎప్పుడొ ఇలా పైవాడు వేసినాడులే 
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే
నీకు నేను ఇష్టమేనని 

హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి 
నా గుండెలోకి దూరి మనసులోకి జారి 
చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి 

వహ్ వ హొ వహ్ వ హొ 
కుర్రాడు మంచివాడుగా ఒప్పుకో 
వహ్ వ హొ వహ్ వ హొ 
ఆరడుగుల అందగాడు ఒప్పుకో 

చరణం: 2 
ఈ ముద్దుగుమ్మే నా వైఫ్‌గా వస్తే... 
బంతిపూల దారి వేస్తా లేతపాదమింక కందకుండా 
ఆ జాబిలమ్మే నా లైఫ్‌లో కొస్తే దిష్టి తీసి హారతిస్తా
ఏ పాడుకళ్ళు చూడకుండా 
నాలాంటి మంచివాడిని మీరంత చూసి ఉండరే 
ఆ మాటే మీరు ఈమెతో ఓసారి చెప్పి చూడరే 
ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే 
నువ్వు నాకు సొంతమేనని 

హో... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి 
నా గుండెలోకి దూరి మనసులోకి జారి 
చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి 



ఇందురూడు చందురూడు పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: రంజిత్, కల్పన

ఇందురూడు చందురూడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడు
అందగాడు అందగాడు మాటతోనే మత్తుమందు చల్లుతాడు 
నువ్వే నవ్వి చురకేసే పిల్లగాడు కమ్మగా చిటకా చేసి చుట్టూ తిప్పుకున్నాడు
మెల్లంగా మీసం దువ్వి మెలికేసే తుంటరోడు చల్లంగా మస్కా కొట్టి మనస్సే
గుంజుతున్నాడు వాలు చూసి వీలుచూసి ముగ్గులోకి దించినాడు కొలికేస్తే
వేలికేసె మాయదారి సచ్చినోడె

ఓ అమ్మో ఓరయ్యో లేలేత గుమ్మడిపండే నా సొగసు వెన్నెల్లే
కరిగించి పులుసల్లే మరిగించాడే ఈ వయస్సు
ఇంతందం ఎదురొచ్చి జివ్వంటూ లాగేస్తే ఆగేదెలా మొహమాటం
వదిలించి మోజంతా కాజేస్తా ఈవేళ
అబ్బ ఏమి చెప్పనమ్మ సుప్పనాతి సూపులోడె పట్టు చెంగు ఒంటి
నిండా కప్పుకుంటే ఊరుకోడె కందిరిగ నడుముకాడ తేనెకాటు వేసినాడె పట్టుపగలు
పిట్టసోకు కొల్లగొట్టి పోకిరోడె 

ఓయమ్మో చిలకమ్మో చెయ్యి అయినా వేయ్యకముందే గిలిగింతా
నీదుడుకే చూస్తుంటే సిగ్గేదో కమ్మిందమ్మా ఒళ్ళంతా
ఇన్నాళ్ళు ఊరించి ఈనాడే సిగ్గంటే రేగెదెలా ముద్దుల్లో ముంచెత్తి
నీదోద కుచ్చిల్లే లాగాలా
అయ్యోరామ ఇంతలోన ఎంతపని చేసినాడె అందులోని ఇందులోని
అంతులేని పెద్దరోడే కొంతకాలం ఆగమన్నా ఆగలేని కోడెగాడే కోడికూత వేళ లోపే
కొంప ఇట్టా ముంచినాడే 





కొట్టు కొట్టు కొట్టు పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: టిప్పు, ప్రసన్న

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు
రంగులోనె లైఫ్ ఉందిరా (2)

హెయ్... కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా 
కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు 
ఒంటినిండా సత్తు ఉందిరా 

హెయ్.. ఎర్ర రంగులోన చూడు - రబ్బా రబ్బా 
కుర్ర గుండె జోరు ఉంది - రబ్బారే 
పచ్చరండులోన చూడు - రబ్బా రబ్బా 
పడుచుకళ్ల గీర ఉంది - రబ్బారే 
రంగు ఏదైనగానీ ఊరు వేరైనగానీ 
రారో మనమంత ఒక్కటే... 

హోలి హోలి హోలి రంగుల రంగోలి 
హోలి హోలి హోలి రంగుల రంగోలి 
నింగినేల రంగే మారాలి 
హోలి హోలి హోలి రంగులోన తేలి చెమ్మకేళి జలకాలాడాలి 

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు 
రంగులోనె లైఫ్ ఉందిరా (2)

చరణం: 1 
హె... కోరమీసపు రోసగాడివే ఓరకంట నన్ను చూడవెందుకు 
కొంటె కోణంగి పిల్లవే కాస్తూరుకుంటె కొంపే కొల్లేరు చేస్తవె హాయ్ 
అన్ని ఊళ్ళకి అందగత్తెని చెంతకొచ్చి పలకరించవెందుకు 
అమ్మో సందిస్తె చాలులే అరగంటలోనె మెళ్లో జగడంటలేస్తవే... హేయ్
నవ్వే ఓరందగాడ నువ్వే ఆ సందెకాడ నాతో సరసాలు ఆడ రావె రావె 
అట్టా కయ్యాల భామ నీతో సయ్యాటలడ నీపై ఆశంటు ఒకటి ఉండాలె 
ఇంద్రధనస్సులోని ఉండే ఆ రంగులన్నీ నాలో ఉన్నాయి చూడరో... 

హోలి హోలి హోలి... 
హోలి హోలి హోలి రంగుల రంగోలి చిందులెయ్యి చిందె వెయ్యాలి 
హోలి హోలి హోలి రంగులోన తేలి చీకుచింతలన్నీ మరవాలి 

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు 
రంగులోనె లైఫ్ ఉందిరా (2)


ఓరె లచ్చన్నా రంగులన్నీ అయిపోయినాయ్ 
తొరగా తీసుకురండ్రా...

హోయ్... హోయ్... 
ఆయిరే హోలి ఆయిరే ఓరబ్బా హోలి 
రంగోకి వర్షా లాయిరే 
తా ధినక్ త ధినక్ త దినక్‌త 
తధిమ్ ధినకత్ ధినక్ త ధినక్‌త 
ధితాంగ్ ధితాంగ్ త... క్యా బాత్ హై 

చరణం: 2 
కాటుకెట్టిన కళ్లమాటున దాచుకున్న కన్నె ఊసులెందుకు 
నీలా నీలాల నింగిలో ఆ గాలి మేడలెన్నో కట్టేయ్యడానికే... హెయ్ 
పాలబుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసిపడేదెందుకో 
బంతి పూబంతి భావనీ ఓ పూల కట్టి బంతూలూగించటానికే... హెయ్ 
నన్నే పెళ్లాడువాడు తాళే కట్టేటిచోట ఎట్టా ఉంటాడో ఏమో నా జతగాడు 
నిన్నే మెచ్చేటివాడు బుగ్గే గిచ్చేటి తోడు రానే వస్తాడు చూడు ఓనాడు
పండే నోములన్నీ పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే... హోయ్ 

హోలి హోలి హోలి... 
హోలి హోలి హోలి రంగుల రంగోలి సంబరాల సరదా చెయ్యూలి 
హోలి హోలి హోలి రంగులోన తేలి సందడంతా మనదే కావాలి 

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు 
రంగులోనె లైఫ్ ఉందిరా
హెయ్.. కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా 
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు 
రంగులోనె లైఫ్ ఉందిరా
హెయ్.. కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా 




ల ల లాహిరే ల ల లాహిరే పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: విశ్వా
గానం: వేణు, సునీత సారధి

ల ల లాహిరే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే 
దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే 
ఛల్ ధగ ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే
సరదాగా ఓ సారే వడికొస్తే మంజూరే
గిలిగిస్తే సెన్సోరే విజిలేస్తే వన్స్మోరే అయ్యయ్యయ్యో
లిప్పు చూస్తే లాలి పాప్ హిప్పు చూస్తే బాబ్రే బాప్ షాక్ లిచ్చే షేప్ చూస్తే గుండెలే పేకప్

ల ల లాహిరే ల ల లాహిరే
హే ల ల లాహిరే ల ల లాహిరే 
దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే

చరణం: 1
సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంత
అడ్వాన్స్ 
అందాలన్ని ఆరేస్తూ చేయించకులే న్యూ డాన్స్
దిల్ కా చోర్  కార్ నే ప్యార్ ఎంచక్కా కుమారా
చూపిస్తే జోర్ నే తయార్ దరికే రారా త్వరగా రణధీర
ఫ్రంటు చూస్తే టెంప్టేషన్ బ్యాక్ చూస్తే సెన్సేషన్
సోకు అన్నా మాటకే ఇది కొత్త ఈక్వేషన్

చరణం: 2
హే రుకు రుకు రుకు రుకు రుక్సానా
హే కసి కసి కన్నుల కొరమీనా
నిన్నియాలా అల్లేయాలా మెత్తగా మురిపానా
ఒళ్ళోకొచ్చి వయ్యారాల వలనే విసిరెయ్నా
ఓ దిల్దార్ బేకరార్ సందించేయ్ నీ తీర్
నీ సరిరారు లేనే లేర్ చడిగా రావే దరికి మనసారా

యూ మియాలి టాల్మి ఆన్ డైమిక్రేజ్ ఆనందం
బాయ్ ఆవాన బి అన్ లవ్లీ ఇజ్కేబి ఆనందం

ల ల లాహిరే...
ల ల లాహిరే ల ల లాహిరే 
దిల్ తక తకమంటూ దరువేస్తుంటే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే 
ఛల్ ధగ ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే




నాతో వస్తావా నాతో వస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: మాస్ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: ఉదిత్ నారాయణ్, సుమంగళి

హొయ్ నాతో వస్తావా నాతో వస్తావా 
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా 
నీతో వస్తాలే నీతో వస్తాలే 
నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే 
నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా 
ఏడడుగులింక నను నడిపిస్తే నీతో వస్తాలే 
ఆకాశమైన అరచేతికిస్త మరి నాతో వస్తావా 

హొయ్... గోరి గోరి గోరి గోరి గోలుకొండ ప్యారీ 
రావె నా సంబరాల సుందరి 
హేయ్... చోరి చోరి చోరి చోరి చేయజారకో హరి
నీదే సోయగాల చోకిరి 

చరణం: 1 
మదిలో మెదిలే ప్రతి ఆశా నువ్వు 
ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు 
హృదయం ఎగిసే ప్రతి శ్వాసా నువ్వు 
నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు 
రేయి పగలు నా కంటిపాపలో నిండినావె నువ్వే 
అణువు అణువు నీ తీపి తపనతో తడిసిపోయే కలలే 

హేయ్... గింగిరాల బొంగరాల టింగురంగసాని 
రావే నా జింగిలాల జిగినీ 
హే... రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి 
మెళ్ళో నీ తాళిబొట్టు పడనీ 

హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా 
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా 

చరణం: 2 
అరెరే అరెరే తేనూరే పెదవి 
మెలికే పడని నను నీలో పొదివి 
పడితే నదిలా వరదయ్యే నడుము 
పరదా విడనీ నీదయ్యే క్షణము 
పరువమెందుకీ పరుగులాటవే పరుపు చేరు వరకూ 
పడుచు వయసులో అంచు పైటలే బరువులాయె నాకు 

హోయ్... చెంతకింక చేర చేర సిగ్గులెందుకోరి 
రావే నా బంతిపూల లాహిరి 
హోయ్... చెంగులోన దూరి దూరి గింగురెత్తిపో హరి కొంగే గొడుగెత్తుకుంది జాంగిరీ 

హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా 
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా 
నీతో వస్తాలే నీతో వస్తాలే 
నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే 


Palli Balakrishna Tuesday, July 25, 2017

Most Recent

Default