-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Jeevana Ragam"


చిత్రం: జీవనరాగం (1986)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: శోభన్ బాబు , జయసుధ, సుహాసిని
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాత: కొడాలి బోసు బాబు
విడుదల తేది: 1986

మా చెల్లి నవ్వు సిరిమల్లె పువ్వు
పలికించె నాలో రాగాల వీణ..
మా ఇంటి పంట చిన్నారి చెల్లి
మాకంటి పాప బంగారు తల్లి..

ఒక కొమ్మకు పూచిన పువ్వులం
అనురాగం మనదేలే
ఒక గూటిని వెలిగిన దివ్వెలం
మమకారం మనదేలే
చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము
ఓ చెల్లెమ్మా... నీతోటిదే లోకము

అన్నయ్యా... నీవేను నా ప్రాణము
ఓ అన్నయ్యా... నీతోటిదే లోకము

మా చెల్లి నవ్వు సిరిమల్లె పువ్వు
పలికించె నాలో రాగాల వీణ
మా అన్న చూపు మేఘాల మెరుపు
కురిపించె నాలో పన్నీటి వాన
ఇది కరగని చెరగని కలగా
ఎద నిలిచెనులే కలకాలం
చిరునవ్వుల వెన్నెల సిరిగా
చిగురించునులే చిరకాలం
ఈ బంధం సాగేను ఏనాటికీ
ఆ దైవం దీవించు ముమ్మాటికీ

మా ఇంటి పంట చిన్నారి చెల్లి
మాకంటి పాప బంగారు తల్లి
ఈ చోట ఉన్నా ఏచోట ఉన్నా
ఎదలోన నిన్నే కొలిచేను అన్నా
మమకారం మనకే సొంతం
విడరానిది ఈ అనుబంధం
ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ...


Palli Balakrishna Wednesday, November 22, 2017

Most Recent

Default