చిత్రం: వంశ వృక్షం (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All) నటీనటులు: అనిల్ కపూర్, జె.వి.సోమయాజులు , జ్యోతి, దర్శకత్వం: బాపు నిర్మాతలు: జి. హరిశ్చంద్రారెడ్డి, ఎ,రాఘవ రెడ్డి విడుదల తేది: 20.11.1980
Search Box
చిత్రం: నెలవంక (1983) సంగీతం: రమేష్ నాయుడు నటీనటులు: రాజేష్, కిరణ్, రాజ్యలక్ష్మి , గుమ్మడి , సోమయాజులు దర్శకత్వం: జంధ్యాల నిర్మాతలు: ఏ.ఎస్.ఆంజనేయులు,నరసింహారావు విడుదల తేది: 25.01.1983
Songs List:
Nelavanka (1983)
చిత్రం: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం: ఇళయరాజా నటీనటులు: విజయ్ చందర్, చంద్రమోహన్, జె. వి. సోమయాజులు, అంజలీ దేవి దర్శకత్వం: కె.వాసు నిర్మాతలు: గోగినేని ప్రసాద్, కె.బాబురావు విడుదల తేది: 1986
Songs List:
బాబా సాయి బాబా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్. పి. బాలు బాబా సాయి బాబా, బాబా సాయి బాబా నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా, బాబా సాయి బాబా నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు (2) నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడే కోవెల నీ దేహం శిధిలంగా అవుతుందా పిలిచినంతనే పలికే దైవం ముగై పోతాడా... బాబా సాయి బాబా, బాబా సాయి బాబా నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా, బాబా... సాయి బాబా దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా దిక్కులలోన ఎక్కడ వున్నా ముక్కలు చెక్కలు చేసుకురా దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా దిక్కులలోన ఎక్కడ వున్నా ముక్కలు చెక్కలు చేసుకురా సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా గ్రహములు గోళాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ రగిలే కాలాగ్ని ఎగిసే బడబాగ్ని దైవం ధర్మాన్ని దగ్ధం చేసేనీ నేనే ఆత్మైతే నీవే పరమాత్మా నీలో నన్ను ఐక్యం ఐపొనీ పోనీ...
దైవం మానవ రూపంలో పాట సాహిత్యం
చిత్రం: షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశిల దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో దీనుల హీనుల పాపుల పతితుల దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో త్రేతాయుగమున రాముడుగా ద్వాపర మందున కృష్ణుడుగా త్రేతాయుగమున రాముడుగా ద్వాపర మందున కృష్ణుడుగా కలియుగేషు బుద్ధుడు అల్లా కలియుగేషు బుద్ధుడు అల్లా కరుణా మూర్తులుగా దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై శాంతి స్థాపన చేయుటకై శాంతి స్థాపన చేయుటకై ధర్మం నిలుపుటకై దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో దీనుల హీనుల పాపుల పతితుల దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో దైవం మానవ రూపంలో అవతరించునీలోకంలో
హే... పాండురంగా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: కేె. జె. యేసుదాసు హే... పాండురంగా హే... పండరి నాథా శరణం శరణం శరణం సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేశాడు సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించె తాననాథ నాథుడై అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసికొనెను దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై జీవరాశులన్నిటికి సాయే శరణం, సాయే శరణం దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం, సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే
జై శ్రీ షిరిడీ నాథా పాట సాహిత్యం
చిత్రం: షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: వి. రామకృష్ణ జై శ్రీ షిరిడీ నాథా సాయి దేవా ప్రభో... శ్రీమన్మహా దేవ దేవేశ శిరిడీశ సాయిశ వాగీశ లోగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమాం పాహిమాం బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామిప్య సాయుజ్య సామ్రాజ్య సందాయకా వేదవేదాంగ సర్వార్ధ వాక్యార్ధ సంభావన దూర్య దేహియమాన ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి దేవా పాహిమాం పాహిమాం దీనాలి దీనార్తి రోగార్తి విచ్చేధనా భవ్య దివ్యఔషద ప్రభావ అచింత్య స్వరూపా ఆనంద సందాయక బహుజన్మ ప్రారబ్ద బాధా వినిర్ముక్త సాద్గుణ్య శ్రీ షిరిడి బాబా ప్రభో పాహిమాం పాహిమాం దేవాది దేవా సమస్తంబు కల్పింప పాలింప దూలింపగా పెక్కు దివ్యవతారంబు లంబొందు నీ పాద పంకేరు హాధ్యాన పారీర సుస్వాంతులై ఎప్పు భక్తాళి నిన్ బ్రోవవే దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాసా శ్రీ షిరిడి బాబా నమస్తే నమస్తే... నమః
మా పాపాలు తొలగించు పాట సాహిత్యం
చిత్రం: షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: కేె. జె. యేసుదాసు మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా మమ్ము కరుణించి నావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య మేము తరియించినామయ్యా మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా మమ్ము కరుణించి నావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య మేము తరియించినామయ్యా పసి పాప మనసున్న ప్రతి మనిషి లోను పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ము సాకావు మా సాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్ని ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా మమ్ము కరుణించి నావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య మేము తరియించినామయ్యా పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ వారి బాధల్ని మోశావయా ఏనాడూ పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో నువ్వు ఎనాటి దైవానివో ఈ ద్వారకామాయి నీవాసమాయే ధన్యులమైనామయా మాకు దైవమై వెలిశావయా మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా మమ్ము కరుణించి నావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య మేము తరియించినామయ్యా తరియించినామయ్యా మేము తరియించినామయ్యా తరియించినామయ్యా మేము తరియించినామయ్యా
నువు లేక అనాథలం పాట సాహిత్యం
చిత్రం: షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్. పి. బాలు సాయి బాబా... సాయి బాబా... సాయి నాథా... సాయి దేవా... సత్యం నిత్యం నీవే కావా నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నిరీక్షణం మేమోపలేము నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిశాము దినం దినం సాయి మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి శ్రీరాముడైనా శ్రీక్రిష్ణుడైనా ఏ దైవమైన ఏ ధర్మమైనా నీలోనే చూశాము సాయి రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా మా ఏసు నీవే నని మా ప్రభువు నీవే నని ప్రార్ధనలు చేశామయ నిన్నే అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని చేశాము సలామ్ సలామ్ నీకే గురునానకైనా గురు గోవిందైన గురు ద్వారమైనా నీ ద్వారకేనని నీ భక్తులైనాము సాయి రావా బాబా రావా రక్షా దక్షా నీవే కదా మా బాబా నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నిరీక్షణం మేమోపలేము నువు లేక అనాథలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా క్రిష్ణ సాయి క్రిష్ణ సాయి రామ సాయి క్రిష్ణ సాయి క్రిష్ణ సాయి రామ సాయి అల్లా సాయి మౌలా సాయి అల్లా సాయి మౌలా సాయి నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డీ సాయి ఓం నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డీ సాయి ఓం సాయి సాయి బాబా సాయి సాయి సాయి బాబా సాయి సాయి సాయి బాబా సాయి సాయి సాయి బాబా సాయి సాయి సాయి బాబా సాయి సాయి సాయి బాబా సాయి ఓం...
స్వామి సాయి నాధయ దివ్య మంగళం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల స్వామి సాయి నాధయ దివ్య మంగళం షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం స్వామి సాయి నాదాయ దివ్య మంగళం షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం మామకా భీష్టదాయ మహిత మంగళం మామకా భీష్టదాయ మహిత మంగళం లోకనాదాయ సాయి దివ్య మంగళం భక్త లోక సంరక్షకాయ నిత్య మంగళం లోకనాదాయ సాయి దివ్య మంగళం భక్త లోక సంరక్షకాయ నిత్య మంగళం నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం నాగలోక స్తుత్యాయ నవ్య మంగళం స్వామి సాయి నాదాయ దివ్య మంగళం షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం సత్య తత్వ బోధకాయ సాదువేషాయతే మంగలప్రదాయకాయ నిత్య మంగళం నిత్య మంగళం నిత్య మంగళం నిత్య మంగళం శ్రీ సమర్ధ సద్గురు సచ్చిదానంద సాయినాధ్ మహరాజ్ కి జై
Sri Shirdi Saibaba Mahathyam (1986)
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: జె.వి.సోమయాజులు, సబితా బమిడిపాటి, గిరీష్ దర్శకత్వం: కె.విశ్వనాథ్ నిర్మాత: భీమవరపు బుచ్చిరెడ్డి విడుదల తేది: 26.06.1981
Songs List:
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ చరణం: 1 శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్థగాత్రి శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్థగాత్రి సర్వార్థసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి సర్వార్థసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువనపాలిని కుంకుమరాగ శోభిని కుసుమబాణ సంశోభిని మౌనసుహాసిని గానవినోదిని భగవతీ పార్వతీ దేవీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ చరణం: 2 శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకలభోగ సౌభాగ్య లక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ చరణం: 3 ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరససాహిత్య స్వరససంగీత స్తనయుగళే సరససాహిత్య స్వరససంగీత స్తనయుగళే వరదే అక్షరరూపిణే శారదే దేవీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ చరణం: 4 వింధ్యాతటీ వాసినే యోగసంధ్యా సముద్భాసినే సింహాసనస్థాయినే దుష్టహరరంహక్రియాశాలినే విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే హే బ్రహ్మచారిణే దుష్కర్మవారిణే హే విలంబితకేశపాశినే మహిషమర్ధనశీల మహితగర్జనలోల భయజనర్తనకేళికే కాళికే దుర్గమాగమ దుర్గ పాహినే.. దుర్గే దేవి
అయిగిరి నందిని పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆది శంకరాచార్య గానం: యస్. పి.బాలు అయిగిరి నందిని
భామనే సత్య భామనే పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. జానకి భామనే సత్య భామనే
గోవుల్లు తెల్లన పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్. జానకి గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన చరణం: 1 తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..ఎందుకుండవ్ కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా.. ఏమో తెల్లావు కడుపుల్లో కర్రావులుండవాకర్రావు కడుపున ఎర్రావు పుట్టదా గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా.. ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవఘటన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన చరణం: 2 పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు.. పాపం అల్లన మోవికి తాకితే గేయాలు.. హా హా హ పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలుఅల్లన మోవికి తాకితే గేయాలు ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండెగొంతులో ఈ పాట నిండదా ఈ కడిమి పూసేనా.. ఆ కలిమి చూసేనా.. ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవఘటన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన
మరుగేలరా ఓ రాఘవా పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: త్యాగరాజ గానం: యస్. జానకి మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేలరా ఓ రాఘవా చరణం: 1 అన్ని నీవనుచు అంతరంగమునా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా నిన్నెగాని మదినీ ఎన్నజాలనురులా నిన్నెగాని మదీనెన్నజాలనురుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
నెమలికి నేర్పిన నడకలివీ పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. జానకి నెమలికి నేర్పిన నడకలివీ మురళికి అందని పలుకులివీ శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీలా నెమలికి నేర్పిన నడకలివీ మురళికి అందని పలుకులివీ శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీలా నెమలికి నేర్పిన నెమలికి నేర్పిన నడకలివీ కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు కలహంసలకిచ్చిన పదగతులూ ఇల కోయిల మెచ్చిన స్వరజతులూ ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు కలిసి మెలిసి కలలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన వల్ప శిల్ప మనిమేఖలను శకుంతలను నెమలికి నేర్పిన నడకలివీ చిరునవ్వులు అభినవ మల్లికలు సిరిమువ్వలు అభినయ గీతికలు చిరునవ్వులు అభినవ మల్లికలు సిరిమువ్వలు అభినయ గీతికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడె చూపుల్లో చంద్రికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడె చూపుల్లో చంద్రికలు కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవి వర్మ చిత్ర లేఖనా లేఖ సరస సౌందర్య రేఖను శశిరేఖను నెమలికి నేర్పిన నడకలివీ మురళికి అందని పలుకులివీ శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీలా నెమలికి నేర్పిన నడకలివీ
ఓం జాతవేదసే (శ్రీ దుర్గ సూక్తం) పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: గానం: యస్.పి.బాలు, యస్.జానకి ఓం జాతవేదసే (శ్రీ దుర్గ సూక్తం)
వ్రేపల్లియ ఎద పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి చరణం: 1 కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ తాండవమాడిన సరళి గుండెల మోగిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి చరణం: 2 అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరలా వినిపించి మరులే కొలిపించి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరలా వినిపించి మరులే కొలిపించి జీవనరాగమై బృందావనగీతమై జీవనరాగమై బృందావనగీతమై కన్నెల కన్నుల కలువల వెన్నలు దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి వేణుగానలోలుని మురిపించిన రవళి నటనలసరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి చరణం: 3 మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై సంగీత నాట్యాల సంగమసుఖవేణువై రాసలీలకే ఊపిరి పోసిన అందెలరవళి ఇదేనా ఇదేనా ఆ మురళి వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి
ఏ కులము నీదంటే పాట సాహిత్యం
చిత్రం: సప్తపది (1981) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.ఓయ్.బాలు, యస్. జానకి ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది చరణం: 1 ఏడు వర్ణాలు కలసి ఇంద్రధనసు అవుతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటాది ఏడు వర్ణాలు కలసి ఇంద్రధనసు అవుతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటాది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది చరణం: 2 ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే మాటలు.. ఇన్ని మాటలు ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
Saptapadi (1981)
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ నటీనటులు: జె. వి.సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్, రాజ్యాలక్ష్మి, తులసి దర్శకత్వం: కె.విశ్వనాథ్ నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు విడుదల తేది: 15.01.1980
Songs List:
బ్రోచే వారెవరురా పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: మైసూర్ వాసుదేవాచార్ గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం బ్రోచే వారెవరురా నిను వినా రఘువరా నను బ్రోచే వారెవరురా నిను వినా రఘువరా నీ చరణాంబుజములునే నీ చరణాంబుజములునే విడజాల కరుణాల వాల బ్రోచే వారెవరురా ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా నీ చరితము పొగడలేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమె నీ చరితము పొగడలేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమె ఆ సనిదపద నిసా నినిదదపమ పదమ గా మా పాదాని సనిదపమ నిదపమ గమపద మగరిస సమా గమపద మాపదని ససరిని నీనీసదా దదనిపాద మపదని సనిదప మగమనిదని పదమాపదని సమ గరిస రిసానిదప సానీదపమ గామపదని బ్రోచే వారెవరురా సీతాపతే నాపై నీ కభిమానము లేదా సీతాపతే నాపై నీ కభిమానము లేదా వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా భాసురముగ కరిరాజుని బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా భాసురముగ కరిరాజుని బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా భాసురముగ కరిరాజుని బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా నా పాతక మెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక స సనిదపద నిస నినిదదపమ పాదమ గా మా పాదాని సానీదపమ నీదాపమ గమపద మగరిస సమా గమపద మాపదని ససరిని నీనీసదా దదనిపాద మపదని సానిదప మగమనిదని పదమాపదని సమా గరిస రిసానిదప సానీదపమ గామపదని బ్రోచే వారెవరురా
దొరకునా ఇటువంటి సేవా పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం దొరకునా... దొరకునా... దొరకునా... దొరకునా ఇటువంటి సేవా దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవా రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై... నాలోన చలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే... ఆ... నాదాత్మకుడవై నాలోన చలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే... నిను కొల్చువేళ దేవాదిదేవా దేవాది దేవా... దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవా ఉచ్చ్వాస నిశ్వాసములు వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు నడలూ ఎదలోని సడులే మృదంగాలు ఉచ్చ్వాస నిశ్వాసములు వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు నడలూ ఎదలోని సడులే మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ మహానుభావా... మహానుభావా... దొరకునా... సేవా... నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవా దొరకునా ఇటువంటి సేవా
మానస సంచరరే పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం మానస సంచరరే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదసిఖి పింఛలంకృుత చికురె మదసిఖి పింఛలంకృుత చికురె మహనీయ కపొలజిత ముకురె మానస సంచరరే శ్రీ రమణీకుచ శ్రీ శ్రీ శ్రీ రమణీ శ్రీ రమణీకుచ దుర్గ విహారీ సేవకజన మందిరా మందారే పరమహాంశముఖ చంద్ర చకొరె పరి పూరిత .మురళీ వరధారె మానస సంచరరే
మాణిక్య వీణాం పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: మహాకవి కాళిదాస్ గానం: యస్. పి. బాలు మాణిక్య వీణాం ముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసామ్మ హేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్బుజే చంద్రకళా వతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణహస్తే నమస్తే నమస్తే జగదేక మాత:
ఓంకార నాదాను పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: మహాకవి కాళిదాస్ గానం: యస్. పి. బాలు, జానకి పల్లవి: ఓం ఓం ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము శంకర గళ నిగళము శ్రీహరి పద కమలము రాగ రత్న మాలికా తరళము శంకరాభరణము చరణం: శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము రసికుల కనురాగమై రస గంగలో తానమై పల్లవించు సామ వేద మత్రము శంకరాభరణము చరణం: అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము.... సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము త్యాగ రాజ హృదయమై రాగ రాజ నిలయమై ముక్తి నొసగు భక్తి యోగ మార్గము మృతియె లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము పాదాని శంకరాభరణము పమగరి, గమపదని శంకరాభరణము సరిసా, నిదప, నిసరి, దపమ, గరిగ, పమగ పమద పనిద సనిగరి శంకరాభరణము అహా దపా, దమా, మాపాదపా మాపాదపా దపా, దమా, మదపామగా మాదపామగా గమమదదనినిరి, మదదనినిరిరిగ నిరీరిగగమమద, సరిరిససనినిదదప శంకరాభరణము రీ ససస రిరిసస రిసస సని సరి సని సరి సనిరి సనిద ని ని ని ధ ధ ని ని ధధ ని ని ధాధానిని ధనిస ధనిస ధని ధగరిసనిధప ధ ధ ధ గరిగ మమగ గరిగ మమగ గరి గమప గ మపధ మధపమగరిసని సరిగా సరి గారి మగ పమ ధప మగ పమ ధప నిధ పమ ధపనిధ శని ధప నిధ సని రిస గ రి స గరిసనిధ రి స రిసనిధప స గరిసనిద రిసనిధప సనిధపమ రిసాని రిసనిదప నిధ సనిధపమప రిసనిదప సనిధపమ ధపమగరి గ మ ధ నిధని పధ మప రిసనిధపని దపమగరి రిసనిధప మగరిసని (శంకరాభరణము శంకరాభరణము)
పలుకే బంగారమాయెనా పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: బద్రాచల రామదాస్ గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం పలుకే బంగారమాయెనా
రాగం తానం పల్లవి పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు రాగం తానం పల్లవి రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి రాగం తానం పల్లవి నాధ బర్తులై వేదమూర్తులై నాధ బర్తులై వేదమూర్తులై రాగకీర్తులై త్రిమూర్తులై రాగం తానం పల్లవి కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణ లీలా తరంగిణీ భక్తి గీతాలు కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణ లీలా తరంగిణీ భక్తి గీతాలు సస్య కేదారాల స్వరస గాంధారాలు సస్య కేదారాల స్వరస గాంధారాలు సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు క్షీర సాగర శయన దేవ గాంధారిలో క్షీర సాగర శయన దేవ గాంధారిలో నీ పద కీర్తన సేయగా... పమపదని రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి రాగం తానం పల్లవి శ్రుతి లయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రుతి లయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీ చరణ మందార మధుపమ్మునై వ్రాలి శ్రీ చరణ మందార మధుపమ్మునై వ్రాలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి భరతాభినయ వేద... భరతాభినయ వేద వ్రత దీక్ష పూని కైలాస సదనా కాంభోజి రాగాన కైలాస సదనా కాంభోజి రాగాన నీ పద నర్తన సేయగా... ప ద ని రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి రాగం తానం పల్లవి
శంకరా నాధశారీర పరా పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు శంకరా నాధశారీర పరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా... ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమె గానమనీ మౌనవిచక్షణ ధ్యాన విలక్షణ రాగమె యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమె గానమనీ మౌనవిచక్షణ ధ్యాన విలక్షణ రాగమె యోగమని నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత ఖందరా నీల కంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవతరించరా విని తరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా... మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా నా గానలహరి నువు మునుగంగా ఆనంద వృష్టి నే తడవంగ శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా...
సామజ వరగమనా పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: త్యాగరాయ కీర్తన గానం: జానకి, యస్. పి. బాలు సామజ వరగమనా సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజ వరగమనా సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజ వరగమనా సామని గమజ సుధా సామని గమజ సుధామయగాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ సామని గమజ సుధామయగాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ సామజ వరగమనా సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజ వరగమనా ఆమని కోయిలా ఇలా నా జీవన వేణువులూదగా ఆమని కోయిలా ఇలా నా జీవన వేణువులూదగా మధుర లాలసల మధు పలాలనల మధుర లాలసల మధు పలాలనల పెదవిలోని మధువులాను వ్రతముపూని జతకు చేరగా నిసా దనీ మదా గమా సమమగ గదదమ మనినిద సనిదమ దనిసా దనిసా గదదమ మనినిద దససని గసనిద నిసగ నిసగ సమగమ గససని నిగసగ సనినిద దనినిద మదదని గమదని సనిదమగస సామజవరగమనా సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజ వరగమనా వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా మదిని కోరికలు మదన గీతికలు మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరులపాన్పు పరచి నిన్ను పలుకరించగా గమా గమదమగమా గమనిదమదా మదనిసదనీని నీని మదనీనినీని గమదా దదదదానీ మదనీని నీదమగసా సాసా సానీ సదా సగమద గమదని గమదని మదనిస మదనిస దనిసగమా ఆ ఆ ఆ
ఏ తీరుగా నను దయ జూచెదవో పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: బద్రాచల రామదాసు గానం: వాణీ జయరాం ఏ తీరుగా నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామ ఏ తీరుగా నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామ నాతరమా భావ సాగరమీదను నళినదలేక్షణ రామ నాతరమా భావ సాగరమీదను నళినదలేక్షణ రామ శ్రీ రఘు నంధన సీతారమణ శరత జనపోషక రామ కరుణాలయ భక్త వరద నిన్ను కన్నది కానుపు రామ క్రూరకర్మములు నేరక చేసితి నేరము లెంచకు రామ క్రూరకర్మములు నేరక చేసితి నేరము లెంచకు రామ దారిద్రము పరిహారము సేయవే ధైవ శిఖామణి రామ
సారిగరీ పాట సాహిత్యం
చిత్రం: శంకరాభరణం (1980) సంగీతం: కే. వి. మహదేవన్ సాహిత్యం: గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం సారిగరీ గపదాపా సరిగపదా పగరీ రిగపదసానీ దాపా గపద పదప గపద పదప గపదప రిగ పగపగ రిగ పగపగ రిగపగ సరిగ రిగప గపద పదరిసా రిగప గపద పదస దసగరీ ససరిరి గగపప రిరిగగ పపదద గగ పప దదసస పపదద ససరిరిసా రిసా రిసా రిసా గపద పగరి రిగప గరిస దసరి పదసా గపదారిగపా దసరి పదసా గపదారిగపా సానిద నీదప దాపగ పదప పదసరీగరి రిగపదాపదా సారీ గాపా దాపా




