-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Gandeevadhari Arjuna"



చిత్రం: గాండీవదారి అర్జున (2023)
సంగీతం: మిక్కీ జె మేయర్ 
నటీనటులు: వరుణ్ తేజ్ , సాక్షి విద్యా 
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు 
నిర్మాత: BVSN ప్రసాద్ 
విడుదల తేది: 25.08.2023



Songs List:



నీ జతై సాగింది పాట సాహిత్యం

 
చిత్రం: గాండీవ దారి ఆర్జున (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: రహ్మాన్
గానం: Elvya, నకుల్ అభయంకర్ 

నీ జతై సాగింది పాదమే
ఆపినా ఆగునా లోలోని వేగమే
ఆ ఆ హా ఆ ఆ
ఆ ఆ హా ఆ ఆ

నీ జతై సాగింది పాదమే
ఆపినా ఆగునా లోలోని వేగమే

వెలుగుల దారుల్లో
విరిసిన రంగుల్లో
ప్రతిక్షణం ఒక్కో వరం
అయినది ఈ వేళ

తరిమిన ఊహల్లో
తరగని ఊసుల్లో
పెదవుల పైన నవ్వై ఎదురొస్తుంటే
ఎంతో అందం కనిపిస్తుంటే ఏదో బంధం

చిరు చిరు ఆశ… మధురమే
ఎగిసిన స్వాస… మధురమే
ప్రతి ఒక బాస మధురమే
పైపైనా వాలుతుంటే
ఆ మంచు పూల వాన

మనసుల పాట… మధురమే
వలపుల బాట… మధురమే
కలిసిన చోట… మధురమే
రమ్మంటు పాడుతున్న
ఆ స్వాగతాలలోనా

ఎదుట నువ్వు ఉంటే
ఎదకు రెక్కలొచ్చే
ప్రపంచాన్ని దాటుతు
నింగి మీటుతు అలా

నీలి మబ్బుల్లో తేలే గువ్వల్లా
రివ్వు రివ్వంటూ ఎగిరెల్దాం పదా

కాలంతో పందెం వేసేద్దాం
కలలన్నీ నిజమే చేసేద్దాం
సరదాల అంతే చూసేద్దాం
సంతోషం మనమే అయిపోదాం

ఎన్నెన్నో ఆశలు పోగేద్దాం
ఓ కొత్త లోకం కట్టేద్దాం
ఆ కోటి చుక్కలు అష్టదిక్కులు
ఒక్కటై ఇలా చుట్టు చేరగా

చిరు చిరు ఆశ… మధురమే
ఎగిసిన స్వాస… మధురమే
ప్రతి ఒక బాస మధురమే
పైపైనా వాలుతుంటే
ఆ మంచు పూల వాన

మనసుల పాట… మధురమే
వలపుల బాట… మధురమే
కలిసిన చోట… మధురమే
రమ్మంటు పాడుతున్న
ఆ స్వాగతాలలోనా




అర్జునా అర్జునా పాట సాహిత్యం

 
చిత్రం: గాండీవదారి అర్జున (2023)
సంగీతం: మిక్కీ జె మేయర్ 
సాహిత్యం: రెహ్మాన్ 
గానం: హరికా నారాయణ్ 

అర్జునా అర్జునా నీ నీడే రక్షణా
గాండీవధారీ నీ సాయం కోరీ
పిలిచే ధరిత్రీ రా రా

అర్జునా అర్జునా నీ రాకే గర్జనా
అర్జునా అర్జునా... నీ నీడే రక్షణా

నీ చూపు ఓ అస్త్రమై
చీకట్లనే చీల్చేయగా, హా
నీ అడుగు ఓ వ్యూహమై
ఆకాశమే తాకేనుగా

నిలబడే నిప్పు కెరటం
కలబడే యుద్ధ శకటం
కణకణం కాంతిపుంజం
కదలికే మెరుపు వేగం
నరనరం ఉరికే రక్తం
జగతికే రక్ష కవచం



ముగిసిపోయే వెలుగు పాట సాహిత్యం

 
చిత్రం: గాండీవదారి అర్జున (2023)
సంగీతం: మిక్కీ జె మేయర్ 
సాహిత్యం: రెహ్మాన్ 
గానం: అఖిల్ చంద్ర 

ముగిసిపోయే వెలుగు

Palli Balakrishna Sunday, October 8, 2023

Most Recent

Default