Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Dasari Narayana Rao (As a Actor)"
Naa Mogudu Naake Sontham (1989)



చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 
నటీనటులు: మోహన్ బాబు, వాణీ విశ్వనాథ్, జయసుధ, దాసరి నారాయణరావు, రోహిణి, బేబి లక్ష్మీ ప్రసన్న, మాష్టర్ విష్ణు వర్ధన్ బాబు, మాష్టర్ మనోజ్ 
దర్శకత్వం: దాసరి నారాయణరావు 
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 14.06.1989



Songs List:



సరిలేదు ఈ షాపుకు పాట సాహిత్యం

 
చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి. బాలు 

సరిలేదు ఈ షాపుకు 



గాలీ ప్రేమ గాలీ...పాట సాహిత్యం

 
చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

గాలీ ప్రేమ గాలీ...



లేఖా ఇది ఒక లేఖ పాట సాహిత్యం

 
చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి. బాలు

లేఖా ఇది ఒక లేఖ 




బెజవాడ కొండెక్కి పాట సాహిత్యం

 
చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి. బాలు 

బెజవాడ కొండెక్కి 



మా ఊరి కొబ్బరి చెట్టుకు పాట సాహిత్యం

 
చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: 

మా ఊరి కొబ్బరి చెట్టుకు

Palli Balakrishna Saturday, August 20, 2022
Peddillu Chinnillu (1979)





చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
నటీనటులు: దాసరి నారాయణరావు, మురళీమోహన్, మోహన్ బాబు, ప్రభ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: ఎమ్.కె.మావుళ్లయ్య
విడుదల తేది: 11.05.1979



Songs List:



ఆరోగ్యమే మహా భాగ్యం పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: జానకి 

వన్, టూ - డూ డూ
త్రీ, ఫోర్ - లిటిల్ మోర్
ఫైవ్, సిక్సు - ఫిక్స్ ఫిక్స్
సెవెన్, ఎయిట్ - దట్స్ రైట్

ఆరోగ్యమే మహా భాగ్యం ఛఛఛ
అందరికీ అది సౌభాగ్యం ఛఛఛ
కాదంటే చఛఛ వద్దంటే చచచ 
వదిలేస్తే చ చచ
నో నో వదిలేస్తే నా దౌర్భాగ్యం
శత కోటి మన్మధాకార
జితచంద్ర సుందరాకారా
సిరిమల్లెకన్న సుకుమారా
కౌగింట చేర మనసార
యిటు రార యిట రారు

హో మిస్టర్ వెంకట్రామయ్య అటుకాదు ... యిటు
నీ యింటి పంచదార నినుచేర మనసార
పొరుగింటి పుల్లకూర రుచియా
కమాన్ ఛేంజ్ ది ఐటం

ఎత్తుదించు - ఎత్తుదించు
వన్.. ఛఛఛ టు ఛఛఛ త్రీ ఛఛఛ
ఫోర్-ఛఛఛ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్
సెవెన్ ఎయిట్
ఆ లాల లలలా

ఈదాలి చేపల్లె తమరు
తేలాలి పడవల్లె తమరు
చేతులూపుతూ - కాళ్ళు కొడుతూ
యిలాగే యిలాగే ఈదాలి తమరు

స్విమ్ లైక్ ఎ ఫిష్
ఫ్లోట్ లైక్ ఎ బోట్
కమాన్ ముందుకి ఆ ఆ

ఓ మిస్టర్ వెంకట్రామయ్య
ఆరోగ్యమే మహాభాగ్యం
అందరికీ అది సౌభాగ్యం

హెర్ ఈజ్ వెల్త్
వెల్త్ ఈజ్ లైఫ్
లైఫ్ తజ్ వైఫ్

వైఫ్......





ఒక అబ్బాయి ఒక అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

ఒక అబ్బాయి ఒక అమ్మాయి
ఉంటేనే ప్రేమకథా - ఒకటైతే సుఖాంతం
విడిపోతే విషాదాంతం - తొలిచూపులో చూపులో
రాపిడి పుడుతుంది - ముని మాపులో ఎదమాటలో అలజడి పెడుతుంది
నిద్దర పగపడుతుంది
కోరిక తెగబడుతుంది
యిద్దరు కలిసేదాకా హా .. హా
ఎండైన, వానైన పూలైన, ముల్లైన
అంతా ఒక లాగుంటుంది

|| ఒక అబ్బాయి||

ఏ తోటనో ఏ బాటనో -- కలయిక అవుతాయి
బులపాటము మొగమాటము
తికమక పెడతాయి
మనసులు తడి అవుతాయి
పెదవులు పొడి అవుతాయి
ఇద్దరి అవస్థచూసీ
ఈచేయి ఆచేయి ఈ ఒళ్ళు ఆ ఒళ్ళు
ఒకటై తీరుపు చెబుతాయి.

|| ఒక అబ్బాయి||




పచ్చబొట్టు పొడిపించు బావా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసం గోపాల కృష్ణ 
గానం: సుశీల 

ఏవే నిన్ను సూత్తంటే ఒక పాటొకటి
పాడించుకోవాలని పిత్తందే - పాడుతావా పాడు
ఊహు హు .. సిగ్గేస్తది
సిగ్గులేదూ - ఎగ్గూ లేదు పాడవేబాబు
పచ్చాబొట్టు పొడిపించు బావ .. ఓ బావ 
పావల పరికిచ్చి పొడిపించు బావ
ఇరుగు పొరుగు చూడకుండ
అత్తామావ కానకుండ - బావ
పొడిపించు బావ

సింహాచలం కొండొకటి కొండమీద గుడి ఒకటి
గుడిమీద బొమ్మొకటి -- కూకున్న బొమ్మొకటి
నుంచున్న బొమ్మొకటి - వంగున్న బొమ్మొకటి
పడుకున్న బొమ్మొకటి బొమ్మ పక్కన బొమ్మొకటి
నా చేతిమీద సోకుతీర పొడిపించు బావ

యమునా నది ఏటిగట్టు -- గట్టు మీద పొన్న చెట్టూ
అబ్బో సంపుతున్నావే మార్చు
యమునా నది ఏటిగట్టు -- గట్టుమీద పొన్నచెట్టు
చెట్టుమీద గోపాలుడు - చెట్టుకింద గోపికలు
జలకాలాడే గోపికలు మోగ్గల్లాంటి గోపికలు
సిగ్గుపడే గోపికలు - దణ్ణా లెట్టిన గోపికలు
నా దండమీద కందకుండ పొడిపించు బావ

ఏవే నిన్ను సూత్తంటే ఒక పాటొకటి
పాడించుకోవాలని పిత్తందే - పాడుతావా పాడు
ఊహు హు .. సిగ్గేస్తది
సిగ్గులేదూ - ఎగ్గూ లేదు పాడవేబాబు
పచ్చాబొట్టు పొడిపించు బావ .. ఓ బావ 
పావల పరికిచ్చి పొడిపించు బావ
ఇరుగు పొరుగు చూడకుండ
అత్తామావ కానకుండ - బావ
పొడిపించు బావ

సింహాచలం కొండొకటి -- కొండమీద గుడి ఒకటి
గుడిమీద బొమ్మొకటి -- కూకున్న బొమ్మొకటి
బొమ్మ పక్కన బొమ్మొకటి





పెట్టరా పెద్దిల్లు చిన్నిల్లు సోదరా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసం గోపాల కృష్ణ 
గానం: యస్.పి.బాలు

స్వర్గమనేది పైన ఎక్కడో లేదురా
ఎర్రోళ్లు తెలియక వెతుకుతున్నార్రా
అంతా యిక్కడే .. ఈ సేతుల్లోనే ఉందిరా సన్నాసి
పెట్టరా పెద్దిల్లు చిన్నిల్లు సోదరా
అప్పుడే ఎడా పెడా ఛాన్సురా
ఎత్తరా లోకాన్ని మీదికి
దించరా స్వర్గాన్ని కిందికి
కిందో ఇల్లు పైనో ఇల్లు
పై నుంచి కిందకి, కిందనుంచి పైకి
ఎక్కుతూ దిగుతూ హేపీగా వున్నాడు
ఏడుకొండలవాడు

నెత్తిమీద ఒకరు -- తొడమీద ఒకరు
పై నుంచి కిందకి కిందనుంచి పైకి
చూస్తూ నవ్వతూ హేపీగా వున్నాడు శంకరుడు
అటు ఇల్లు - యిటు ఇల్లు
ఎటుచూసిన ఇల్లాల్లే
యింటి నుంచి యింటికి
మారి మారి కోరి కోరి 
హేపీగా వున్నారు. శ్రీకృష్ణుడు
అందుకే మనం - మనవంటే మనవే

ఏక్ దో - వన్ టు- ఒకటి... రెండు
ఫిఫ్టీ ఫిఫ్టీ

ఒకే ఇలు ఒకే పెళ్లి అన్నాడు శ్రీరాముడు
కడకేమయ్యాడు అడవుల పాలయ్యాడు
ఒకే మాట ఒకే మనువు అన్నాడు హరిశ్చంద్రుడూ
ఈయనే వయ్యాడు ? ఆలిని అమ్మేశాడు
చివరికి కాటికే కాపరయ్యాడూ

అందుకే మనం మనవంటే మనవే
ఏక్..దో - వన్-టూ - ఒకటి.. రెండు
ఫిఫ్టీ ఫిఫ్టీ





సోమవారం సోగ్గాడ పాట సాహిత్యం

 
చిత్రం: చిన్నిల్లు పెద్దిల్లు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: L.R.ఈశ్వరి

సోంవారం సోగ్గాడా.
మంగళారం మొనగాడా
ఆరువారాలు అలసిపోయి
ఆదివారం కోరివచ్చావా.. ఓ రాత్రగాడా
అదివారం శెలవు రోజురా

బట్టలు కొట్టు మూశారు నగలు కొట్టు మూశారు
చైనాబజారు మూశారు మందులంగడి మూశారు
ఆదివారం కోరివచ్చావా - ఓ రాత్రగాడా
ఆదివారం శెలవు రోజురా

||సోంవారం||

ఒంటిదాన్ని అన్నాను .. ఇంటి నెంబరు అడిగావు
నను ఇంటిదాన్ని చేస్తావని...ఎంతో నీపై ఆశపడి
తాళిబొట్టూ చెయ్యమన్నా- మేళగాడ్ని ఉండమన్నా
నువ్వురాక నవ్వులాట అయ్యాక
ఆదివారం కోరివచ్చావా - ఓ రాత్రగాడా
ఆదివారం శెలవు రోజురా

||సోంవారం||

చలువ దుప్పటి వేశాను - జాజిపువ్వులు పరిచాను
ఆవుపాలు కాశాను - బాదంపప్పు కలిపాను
అయ్యవార్ని లగ్నమడిగి.. అన్నీ సిద్ధం చేసుకుంటే
పూలు వాడి పాలు ఆరిపోయాక
ఆదివారం కోరి వచ్చావా -- ఓ రాత్రగాడా
ఆదివారం శెలవు రోజురా

||సోంవారం||

Palli Balakrishna Friday, August 6, 2021
Bhola Shankarudu (1980)





చిత్రం: భోళా శంకరుడు (1980)
సంగీతం: చంద్రశేఖర్
నటీనటులు: దాసరి నారాయణరావు, సుజాత, మురళీమోహన్, ,సుమలత
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: కె.భానుప్రసాద్
విడుదల తేది: 01.01.1980

Palli Balakrishna Friday, July 30, 2021
Fools (2003)


చిత్రం: ఫూల్స్ (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం:
గానం:
నటీనటులు: దాసరి నారాయణరావు, కృష్ణ ఘట్టమనేని, శ్రీనాధ్ (రమణ), జయసుధ, గజాల, కృష్ణ కుమారి, చంద్రమోహన్, షకీల
దర్శకత్వం: జె.పుల్లారావు
నిర్మాత: రవీంద్ర బాబు
విడుదల తేది: 06.02.2003


Palli Balakrishna Wednesday, March 13, 2019
Erra Bus (2014)


చిత్రం: ఎర్రబస్సు
సంగీతం: చక్రి
నటీనటులు: దాసరి నారాయణరావు, మంచు విష్ణు, కేథరీన్ తెరిసా
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: దాసరి నారాయణరావు
విడుదల తేది: 14.11.2014


Palli Balakrishna Tuesday, February 19, 2019
Premaku Padi Sutralu (1995)

Palli Balakrishna Tuesday, January 15, 2019
Surigadu (1992)

చిత్రం: సూరిగాడు (1992)
సంగీతం: యస్.వాసు రావు
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి.బాలు
నటీనటులు: దాసరి నారాయణరావు, సురేష్ , యమున
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 1992

భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు
రామాయణం ఒక్కడు బైబిలేమొ ఒక్కడు
ఖురాన్ ఇంకొక్కడు రాసి పారేశారు
ఒక్కడైన ఎక్కడైనా రాశాడా పేదవాడి కథ ఏమిటో
ఎవ్వడైనా ఎప్పుడైనా చెప్పాడా తల్లిదండ్రి బ్రతుకేమిటో
చెప్పండి

భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు

నిన్ను నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడూ
పుట్టింది నాభిలోన కలువపువ్వులో
ఆ దేవుడ్ని పుట్టించిన కలువ పువ్వు
పుట్టిందే ముక్కు పగులు బురద గుంటలో
తమ పుట్టుకే చెప్పుకోని గుంట నక్కలు
పుడతారు మారుజన్మన పిచ్చి కుక్కలై
పుడతారు మారుజన్మన పిచ్చి కుక్కలై
పాలు తాగి పాము విషం కక్కితే
మందుతాగి నేను నిజం కక్కుతా

భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు

పాపపుణ్యమెరుగని తల్లిదండ్రులు
కంటారు బిడ్డల్ని గంపెడాశతో
తమ కడుపులు కట్టుకొని పిచ్చి తల్లులూ
మేపుతారు బిడ్డల్ని పిచ్చి ప్రేమతో
వదిగి వదిగి ఎదిగిపోయి ఎర్రి కొడుకులు
గుచ్చుతారు గుణపాలు కన్నకడుపులో
వదిగి వదిగి ఎదిగిపోయి ఎర్రి కొడుకులు
గుచ్చుతారు గుణపాలు కన్నకడుపులో
పాలు తాగి పాము విషం కక్కితే
మందుతాగి నేను నిజం కక్కుతా

భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు
రామాయణం ఒక్కడు బైబిలేమొ ఒక్కడు
ఖురాన్ ఇంకొక్కడు రాసి పారేశారు
ఒక్కడైన ఎక్కడైనా రాశాడా పేదవాడి కథ ఏమిటో
ఎవ్వడైనా ఎప్పుడైనా చెప్పాడా తల్లిదండ్రి బ్రతుకేమిటో

భారతాన్ని రాశాడు వ్యాదవ్యాసుడు
భాగవతం రాశాడు పోతనామాత్యుడు

Palli Balakrishna Monday, March 5, 2018

Most Recent

Default