Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chirantan Bhatt"
Ruler (2019)



చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
నటీనటులు: బాలకృష్ణ , వేదిక, చొనాల్ చౌహాన్
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాతలు: సి.కళ్యాణ్
విడుదల తేది: 20.12.2019



Songs List:



అడుగడుగో యాక్షన్ హీరో పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాయిచరణ్ భాస్కరుని

అడుగడుగో యాక్షన్ హీరో  
అరె దేకొయారో అడుగడుగు తనదేమ్ పేరో 
మరి తనదేమ్ ఊరో
అడుగులలో అది ఏమ్ ఫైరో 
ఛలో సెల్యూట్ చేయ్ రో

జై కొడుతూ సీటీ మారో సెల్ఫీ లే యారో
కింగ్ ఆఫ్ ది జంగిల్ లా యాంగ్రీ అవెంజర్ లా
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లా వచ్చాడు రా
చూపుల్లోనే వీడు క్లాసు 
మనసే బిసి సెంటర్ మాసు 
పక్కా వైట్ కాలర్ కార్పొరేటు లీడరు రా

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు 
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు

లోకాలే తిరిగినా ఏ ఎత్తుల్లోకి ఎదిగినా
తను పుట్టిన మట్టిని వదలడు ఈ నేలబాలుడు
ఏ రాజ్యలేలినా ఏ శిఖరాలే శాసించినా
జన్మిచ్చిన తల్లికి ఎప్పుడు ఓ చంటి పాపడు

ఒకమాటలో గుణవంతుడు 
తన బాటలో తలవంచడు
ప్రతి ఆటలో ప్రతి వేటలో
అప్పర్ హ్యాండ్ వీడిదే
సక్సెస్ సౌండ్ వీడిదే...

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు

అరెరే ఆ గ్లామరు అది హ్యాండ్సమ్నెస్ కె గ్రామరు
జర చూపించాడో టీజరు ఇక చూపు తిప్పరు
అమ్మాయి లెవ్వరు వీడు కంపెని ఇస్తే వదలరు
మరి తప్పదు కద ఈ డేంజరు మార్చాలి నంబరు

సరదాలకే సరదా వీడు 
సరదా అంటే అసలాగడు
సరసాలలో శృతి మించడు 
ఫన్ టైము క్రిష్ణుడు ఫుల్ టైము రాముడు

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు 
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు 
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు
మళ్లీ వస్తాడుమళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే  శృష్టిస్తాడు





పుడతాడు తాడుతాడు పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: సింహా, చాందిని విజయ్ కుమార్ షా

ఎర ఎర్ర ఎర ఎర్ర నా పెదవుల్ని ముద్దాడుకోరా
హ హ హా...
గిర గిర్ర గిర గిర్రా తిరిగేస్తుంటే నను చూడవేరా
హ హ హా...

హే సర సర సర్రా తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్రా నా నడుమే జీలకర్ర
కర్చీఫె యేస్కో జల్ది జల్దీగా

పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా

అల్లావుద్దీన్ కే నేను అందని దీపాన్ని
నీ కోసం వచ్చేసా లుక్కేసుకో
ఐజాక్ న్యూటన్కే దొరకని ఆపిల్ని
దర్జాగ దొరకేశ పట్టేసుకో

నువ్వు కెలికితే కెలికితే ఇట్టా
నా ఉడుకుని దుడుకుని చూపిస్తా
సరసపు సరకుల బుట్ట
నీ బరువుని సులువుగ మోసేస్తా

మిసమిస మెరుపుల పిట్ట
నీ తహ తహ తలుపులు మూసేస్తా
సొగసరి గడసరి చుట్ట
నీ సెగలను పొగలను ఊదేస్తా

సోదా చేస్కో గల్లా ముల్లీగా

పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా

ఛాంపెను బాటిల్లో సొంపుల్ని అందిస్తే
దిక్కుల్ని చూస్తావే ఎత్తేసుకో
డైరక్టు అందాన్ని వాటెయడం కన్నా
అర్జెంటు పనులేంటి ఆపేసుకో

నీ ఇక ఇక పక పక వల్ల
నే రక రకములు చూపిస్తా
ఎగరకు ఎగరకు పిల్లా
నా ఎదిగిన వయసును పంపిస్తా

నిగ నిగ నవరస గుల్లా
నిను కొరకను కొరకను మింగేస్తా
కిట కిట కిటుకులు అన్ని 
నే టక టక లాగేస్తా

రాస్కో పూస్కో ఉండకు ఖాళీగా...

ఎర ఎర్ర ఎర ఎర్ర నా పెదవుల్ని ముద్దాడుకోరా
గిర గిర్ర గిర గిర్రా తిరిగేస్తుంటే నను చూడవేరా

హే సర్ర సర సర్రా తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్రా నా నడుమే జీలకర్ర
కర్చీఫె యేస్కో రాస్కో పూస్కో
సోదాలన్నీ చేస్కో గల్లా ముల్లీగా

పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా




సంక్రాంతి పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: స్వరాగ్ కీర్తన్, రమ్యా బెహ్రా 

సంక్రాంతి 




యాల యాల పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అనురాగ్ కులకర్ణి , అనుషా మణి

యాల యాల 

Palli Balakrishna Sunday, January 12, 2020
Jai Simha (2017)



చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
నటీనటులు: బాలకృష్ణ , నయనతార, హరిప్రియ, నటాషా దోషి , జగపతిబాబు
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాత: సి.కళ్యాణ్
విడుదల తేది: 12.01.2017



Songs List:



అనగనగా అనగనగా పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: శ్రీమణి
గానం: విజయ్ యేసుదాస్

అనగనగా అనగనగా



ప్రియం జగమే పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రేవంత్ రమ్యా బెహ్రా

ప్రియం జగమే




అమ్మకుట్టి అమ్మకుట్టి పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జస్ప్రీత్ జీస్జ్, గీతా మాధురి

అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 
అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 
నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ 
నీకూ నాకూ ఊగింది జెండా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 
ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 
నూవ్ ప్రేమ దందా నేనేమొ రజినిగందా 
నిన్నూ నన్నూ ఆపేది ఉందా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 

చరణం: 1
అయ్యో చలిగా ఉందే .. కౌగిళ్ళా దుప్పటిలా కాపాడనా 
అయ్యో సెగలా ఉందే .. ఆరారా ముద్దులతో తడిపేయనా 
పద్దతిగ ఉండుటెలా తిమ్మిరినీ తట్టుకొనీ 
అందుకనే ఉండకలా చేతులనే కట్టుకునీ 
ఐతే అలాగైతే మీదా చెయ్యేసే చేసెయ్యి కరెంటునే సరఫరా 

అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 
నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ 
నీకూ నాకూ ఊగింది జెండా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 

చరణం: 2
బాబోయ్ భయమేస్తుందే 
ఉండొద్దు ఒంటరిగా దగ్గరకొచ్చేయ్ 
బాబోయ్ సిగ్గేస్తుందే 
కాసేపే ఉంటదిలే కళ్ళే మూసేయ్ 
ఎప్పుడిలా లేదు కదా ఇప్పుడిలా ఎందుకనీ 
ఎంతకనీ ఊంటదిలే వయసు తలే దించుకునీ 
ఔనా ఔనౌనా పదా ఈరోజే తీర్చేద్దాం వయస్సులో గరగరా 

అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 

నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ 
నీకూ నాకూ ఊగింది జెండా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా





ఏవేవో ఏవేవో పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రేయఘోషల్, రేవంత్

పల్లవి:
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
నిదురించే నీ కలలో రావలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఓ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

చరణం: 1
తూగే తూగే పాదం నీ వల్లే ఆగింది
నువ్వే వచ్చి చెయ్యందిస్తే పరుగే తీసిందే
ఆగే ఆగే ప్రాణం నీ వల్లే ఆడింది
తీర్చాలని నేననుకున్నా నీ ఋణమే తీరనిది
జీవితాన మల్లెల వాన ఇపుడే కురిసింది

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

కోరస్:
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

చరణం: 2
హో ఎవ్వరైనా చూపగలరా తమలో ప్రాణాన్ని
నే చూపిస్తా ఇదిగో నువ్వు అని
ఒక్కరైనా చూడగలరా తడిమే ఉప్పెనని
నా ఊపిరికే రూపం ఇస్తే అచ్చం నువ్వనని
అపురూపంగా దాచనా నువ్విచ్చిన బహుమతిని

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ (3)




జై సింహా థీమ్ పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: నోయల్ సేన్
గానం:  వివేక్ హరిహరన్,  నోయల్ సేన్, ఆదిత్య అయ్యంగార్

జై సింహా థీమ్

Palli Balakrishna Tuesday, December 26, 2017
Kanche (2015)





చిత్రం: కంచె (2015)
సంగీతం: చిరంతన్ భట్
నటీనటులు: వరుణ్ తేజ్ , ప్రాగ్యా జైస్వాల్
దర్శకత్వం: జాగర్లమూడి రాధా కృష్ణ (క్రిష్)
నిర్మాతలు: వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు
విడుదల తేది: 22.10.2015



Songs List:



ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అభయ్ జోధ్ పుర్కార్, శ్రేయ గోషల్

పల్లవి : 
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో 
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో 
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో
సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో 
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో 
ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో  
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో 
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో

చరణం: 1  
ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవకా
చిరాకు పడేట్టు పరారయ్యిందో సమయం కనబడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళిపోదా 
తనోటి ఉందని మనం ఎలాగ గమనించం గనక 
కలగంటున్నా మెలకువలో ఉన్నాం కదా మనదరికెవరు వస్తారు కదిలించగా 
ఉషస్సెలా ఉదయిస్తుందో నిశిధెలా ఎటు పోతుందో
నిదర ఎపుడు నిదరౌతుందో మొదలు ఎపుడు మొదలౌతుందో
ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో  
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో 
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో
పమగరిసారీ ససససారీ నిగాగారీ గదమదా
పమగరిసారీ ససససారీ నిగాగారీ గదమదా

చరణం: 2
పెదాల మీదుగా అదేమి గలగల పదాల మాదిరిగా 
సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగా
ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ భాష కదా
ఫలాన అర్థం అనేది తెలిపే నిఘంటువుండదుగా 
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా  వినబోతున్న సన్నాయి మేళాలుగా
ఓ సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో 
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో 
ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో 
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో





ఊరు యేరైంది పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: శంకర్ మహదేవన్ 

ఊరు యేరైంది



నిజమేనని నమ్మనీ పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: శ్రేయా గోషల్

నిజమేనని నమ్మనీ
అవునా అనే మనసునీ
మనకోసమే ఈ లోకం అనీ
నిజమేనని నమ్మనీ

కనుపాపలోనీ ఈ కలల కాంతీ
కరిగేది కానే కాదనీ
గత జన్మలన్నీ మరు జన్మలన్నీ
ఈ జన్మ గానే మారనీ
ఈ జంటలోనే  చూడనీ
నిజమేనని నమ్మనీ
నిజమేనని నమ్మనీ

కాలం అనేదే లేని చోటా
విలయాల పేరే వినని చోటా
మనం పెంచుదాం ఏకమై
ప్రేమగా ప్రేమనీ
నిజమేనని నమ్మనీ
నిజమేనని నమ్మనీ




భగ భాగమని పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: విజయ్ ప్రకాష్ 

భగ భాగమని 



రా ముందడుగేదడాద్దాం పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: విజయ్ ప్రకాష్ , కీర్తి సగతియ

రా ముందడుగేదడాద్దాం



లవ్ ఈజ్ వార్ పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: చిరంతన్  భట్

లవ్ ఈజ్ వార్ 

Palli Balakrishna Tuesday, August 1, 2017
Gautamiputra Satakarni (2017)



చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017)
సంగీతం: చిత్తరంజన్ భట్
నటీనటులు: బాలకృష్ణ, శ్రేయ చరణ్
దర్శకత్వం: జాగర్లమూడి క్రిష్
నిర్మాత: వై. రాజీవ్ రెడ్డి
విడుదల తేది: 12.01.2017



Songs List:



ఎకిమీడా... పాట సాహిత్యం

 
చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017)
సంగీతం: చిత్తరంజన్ భట్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్

ఎకిమీడా... ఎకిమీడా నా జత విడనని వరమిడవా
తగుదోడా నా కడ కొంగున ముడిపడవా
సుకుమారి నీ సొగసు సిరులు నను నిలువెల్లా పెనవేసుకుని 
మహారాజునని మరిపించే నీ మహత్తులోపడి బందీనయ్యానే ఎటౌతానే

హుందర హుందర హుందర హురదర (3)
హుందర హుందర హోయ్

హుందర హుందర హుందర హురదర (3)
హుందర హుందర హోయ్

కడవై ఉంటా నడువంపుల్లో కులికే నడకా నను కాసుకో గుట్టుగా
కోకా రైకా నువ్వనుకుంటా చెక్కెర తునకా చలికాసుకో వెచ్చగా
చెమట చలవ చిరు చినుకు చొరవ ఈ తళ తళ తళ తళ తరుణి తనువుకిది ఎండో వానో
హో ఎండో వానో ఎవరికెరుక ఏ వేళా పాలా ఎరుగమని 
ప్రతిరోజూన నీతో పాటే నడుస్తు గడిస్తే ఎన్నాళ్ళైతేనే ఎటైతేనే

హుందర హుందర హుందర హురదర (3)
హుందర హుందర హోయ్

హుందర హుందర హుందర హురదర (3)
హుందర హుందర హోయ్

ఎకిమీడే నీ జత విడనని వరమిడనే - వరమిడవా
సరిజోడై నీ కడ కొంగున ముడిపడనే

వీరి వీరి గుమ్మడంటు వీధి వాడా చుట్టుకుంటు
ఇంతలేసి కళ్ళతోటి వింతలెన్నో గిల్లుకుంటు
ఒళ్లోన మువ్వాల ఇయ్యాల సయ్యాటలో సుర్రో
గోటె కారు వంతెనుండే ఆడ ఈడు భగ్గుమంటే
మన్ను మిన్ను చూడనట్టు మేడబారు ఉంటావుంటే
మత్తెక్కి తూగాల మున్నూర్ల ముపొద్దులు సుర్రో

ఎకిమీడా...





హే గణ గణ గణ గణ పాట సాహిత్యం

 
చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017)
సంగీతం: చిత్తరంజన్ భట్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సింహా, ఆనంద భాస్కర్, వంశి

హే గణ గణ గణ గణ గుండెలలో జేగంటలు మోగెను
రక్కసి మూకలు ముక్కలు ముక్కలయేలా
హే గణ గణ గణ గణ కన్నులలో కార్చిచ్చులు రేగెను
చీక్కటి చీకటినెర్రగ రగిలించేలా

ఒర దాటున నీకత్తి పగవాడి పాలు విప్పి
సహనమ్మిక సరిపెట్టి గర్జించర ఎలుగెత్తి
ఎవ్వడురా ఎదటకి రారా అని అనగానే అవురవురా నువు ఆపదకే ఆపదవవుదువురా

వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా

వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా

నీ జబ్బ  చరిస్తే ఆ దెబ్బకి దెయ్యం జడిసి
తడి బొబ్బొకటేస్తే  దివి ఆకాశం అవిసి
జేజేలే జేకొడతారంతే

సింగం నువ్వై జూలిదిలిస్తే ఎంతమందైనా జింకల మందే
మీసం దువ్వే రోషం చుస్తే యముడికి ఎదురుగ నిలబడినట్టే
ఉసురుండదు ఉరకలు పెట్టందే

పిడుగల్లే నీ అడుగే పడితే పిడికెడు పిండే కొండ
నీపై దాడికి దిగితే మెడతల దండే దుండగులంతా
పరవాడిని పొలిమేరలు దాటేలా తరమకుండా
అలుపంటూ ఆగదు కదరా జరిగే  యుద్దకాంఢ
భారత జాతి భవితకు సాక్ష్యం ఇదుగోర మన జండా

వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా

వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా

తారార రారరా తారారా రారా రారా రా (3)

వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా

వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా
వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా




మృగ నయనా భయమేలనే పాట సాహిత్యం

 
చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017)
సంగీతం: చిత్తరంజన్ భట్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, శ్రేయ ఘోషల్

ధిరధిర ధీం ధీం ధీం తననన
ధిరధిర ధీం ధీం ధీం తననన
దేన దేన దేన  దేన దిందిరినా దిరనా

ధిరధిర ధీం ధీం ధీం తననన
ధిరధిర ధీం ధీం ధీం తననన
దేన దేన దేన  దేన దిందిరినా దిరనా

అధరమదోల అదిరినదేలా
అధరమదోల అదిరినదేలా
కనుకొలకుల ఆ తడితళుకేల
మృగ నయనా భయమేలనే
మృగ నయనా భయమేలనే
తెగ బిడియాల తెర కరిగేలా
తెగ బిడియాల తెర కరిగేలా
తొలి రసలీలా తొణికిన వేళా
తెలిపెద నా ప్రియ కామన
తెలిపెద నా ప్రియ కామన

ధిరధిర ధీం ధీం ధీం తననన
ధిరధిర ధీం ధీం ధీం తననన
దేన దేన దేన  దేన దిందిరినా దిరనా

ధిరధిర ధీం ధీం ధీం తననన
ధిరధిర ధీం ధీం ధీం తననన
దేన దేన దేన  దేన దిందిరినా దిరనా

కాముని గెలిచే పతనము చేయగా
సైన్యములేలా మన  జత చాలుగా
నీ సోయగాల సామ్రాజ్యం
నా సొంతమైన ఏకాంతం
ధివినే ఇలపై నిలిపింది చూడు లలనా

మృగ నయనా భయమేలనే (4)

నా నరనరమున ఈ వెచ్చదనం 
నా పౌరుషమా నీ పరిమళమా
నీ శిరసులోని సంకల్పం
నీ శ్వాసలోన ప్రతి స్వప్నం
నేనే అవనా నీ అడుగు అడుగులోన
తెలిపెద నా ప్రియ కామన
తెలిపెద నా ప్రియ కామన

అధరమదోల అదిరినదేలా
అధరమదోల అదిరినదేలా
కనుకొలకుల ఆ తడితళుకేల

మృగ నయనా భయమేలనే (4)




సాహో సార్వభౌమా పాట సాహిత్యం

 
చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017)
సంగీతం: చిత్తరంజన్ భట్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: విజయ ప్రకాష్, కీర్తి సాగతీయ

సాహో సాహో సార్వభౌమా (4)

కాలవాహిని శాలివాహన శకముగా ఘనకీర్తి పొందిన
సుప్రభాత సుజాతవహిని గౌతమీసుత శాతకర్ణి
భాహుపరా భాహుపరా (2)

కక్షల కాల రాతిరిలోన కాంతిగ రాజసూయాత్పరములే జరిపెరా
కత్తులలోన చిత్రంబైన శాంతికి తానే వేదస్వరముగా పలికెరా

సాహో సార్వభౌమా భాహుపరా

నీ కన్న పుణ్యంకన్న ఏదీమిన్న కాదనుకున్న 
జననికి జన్మభూమికి తగిన తనయుడివన్న మన్నన పొందరా
నీ కన్న పుణ్యంకన్న ఏదీమిన్న కాదనుకున్న 
జననికి జన్మభూమికి తగిన తనయుడివన్న మన్నన పొందరా

స్వర్గాన్నే సాధించే విజేత నువే
సాహో సార్వభౌమా సాహో
స్వప్నాన్నే సృష్టించే విధాత నువే
సాహో సార్వభౌమా

అమృత మందన సమయమందున
ప్రజ్వలించిన ప్రళయ భీఖరా
గరళమును గళమందు నిలిపిన
హారుడురా శుభకరుడురా
భాహుపరా భాహుపరా

పరపాలకుల పగపంకముతో కలుషమ్మైన ఇల నిన్ను పిలిచెరా 
పలకరా...

దావాణలము ఊరే దాడి చేసినా
దుండగీడుల తులువరా దొరా...
సాహో సార్వభౌమా భాహుపరా

దారుణమైన ధర్మప్రాణి ధారుణి పైన కాలూనింది
తక్షనమొచ్చి రక్షణనిచ్చు భిక్షగ అవతరించర దేవరా
దారుణమైన ధర్మప్రాణి ధారుణి పైన కాలూనింది
తక్షనమొచ్చి రక్షణనిచ్చు భిక్షగ అవతరించర దేవరా
దేవరా...




హే సింగముపై లంగించెను పాట సాహిత్యం

 
చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017)
సంగీతం: చిత్తరంజన్ భట్
సాహిత్యం: సాయి మాధవ్
గానం: విజయ ప్రకాష్

హే సింగముపై లంగించెను బాలుడు పేరు శాతకర్ణి
ధూమి కళ్లెముగ సవారి చేసెను పేరు శాతకర్ణి
ముసి ముసి నగవుల పసివాడా
సింగము ననచిన మొనగాడా
సింగము ననచిన మొనగాడా
శాతవాహనుల పరంపర పేరును నిలిపిన వారసుడా
పేరును నిలిపిన వారసుడా

అలా బాలుడా ? భానుడా ? అన్న చందాన 
శాతకర్ణి ఎదుగుతున్నాడు
అమర శాతవాహనుల ఆశలు 
ముక్కోటి దేవతల ఆశీస్సులు 
తల్లి గౌతమి బాలా శ్రీదేవి ఆశయాలు కలిసి 
దిన దిన ప్రవర్ధమానమవుతున్నాడు
గౌతమి మాత గోరుముద్దలే వీర సుద్దులాయే
వీర సుద్దులాయే
కత్తులు అమ్ములు శర శూలమ్ములు ఆట బొమ్మలాయే
ఆట బొమ్మలాయే
పదునెనిమిదేళ్ళ ప్రాయమందు పట్టాభిషిక్తుడాయే
పట్టాభిషిక్తుడాయే

జయహో శాతకర్ణి సార్వభౌమా జయహో
జయహో శాతకర్ణి సార్వభౌమా జయహో

అప్పుడే పట్టాభిషక్తుడైతే మరి పెల్లో
వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా
ఇష్ట సఖి విశిష్ట సఖి మనసిచ్చింది చూడు వాసిష్టి సఖి
ఇష్ట సఖి విశిష్ట సఖి మనసిచ్చింది చూడు వాసిష్టి సఖి
పాల నవ్వుల తల్లి మల్లే వెన్నెల వల్లి
మనువాడ వచ్చే వాసిష్టి సఖి
ఇంత చక్కని జంట పూర్వ పుణ్యాల పంట
ఇంకేడా కానరాదు మన కళ్ళకి 
చూపు తగలకుండా కష్టం కలగకుండా 
దిష్టి తీయరమ్మ ఆ జంటకి

ఇష్ట సఖి విశిష్ట సఖి మనసిచ్చింది చూడు వాసిష్టి సఖి

ఇంత దిష్టి తీశాక కష్టం ఎందుకుంటుంది మిత్రమా
లేదు లేదు ఇన్నేళ్ళకి ఇన్నాళ్ళకి
ఆ జంటకి కష్టం ఎదురయింది
అడుగడుగడుగో క్రూరుకు కపటుడు క్షహారాదరాసుడా
మాధాందుడు అధముడు దృష్ట నికృష్ట నెహాపాణ రాజురా 
సాటి రాజు బెదరంగ యువరాజులు దోచే దొంగ
బిడ్డల బతుకుల బెంగాటనతో యుద్ధమంటే బెదరంగ
వాహ్ ఎట్టెట్టా

చుట్టుపక్క రాకుమారుల్ని ఎత్తుకెళ్ళి నా మీద యుద్దనికొస్తే 
మీ బిడ్డల్ని చంపుతానని రాజుల్ని బెదిరిస్తున్నాడా నేహపాణుడు 
ఈ హెచ్చరిక శాతకర్ణుల వారిదాకా వెళ్లిందా?
అమ్మాశయం తీర్చంగ ఖండాలన్ని కలుపంగా 
జైత్ర యాత్రలో భాగంగా దూతను పంపెను ధర్మంగా
ఓ నెహాపాణా నీ కత్తిని మా దూతకిచ్చి శరణు వేడితే 
మాకు సామంతుడిగా బ్రతకానిస్తానన్నాడు శాతకర్ణి
అప్పుడు ఆ పాపి నెహాపాణుడు ఏమన్నాడు

నీ కన్నబిడ్డడు పులోమపాలుడ్ని పంపించమన్నాడు
పంపించమన్నాడు
కొమరుణ్ణి అర్పించి శరణు కోరమని కబురు పంపినాడు
కబురు పంపినాడు
శాతకర్ణి మహారాజందుకు సరేనని బదులంపినాడు
శాతకర్ణి మహారాజందుకు సరేనని బదులంపినాడు

ఆశ్చర్యం  ఆశ్చర్యం అజేయుడు అపరాజితుడు 
అవక్ర పరాక్రముడైన శాతకర్ణి మహారాజు 
కన్న బిడ్డను శత్రువుకు అప్పగించడానికి ఒప్పుకున్నాడా 
మేము నమ్మం 
కానీ నిజం
ఆ మహారాజు ఆంతర్యం ఏమిటో ఆ అంతర్యామికే తెలియాలి
అయ్యో మరి ఆ తల్లి వాసిష్టి దేవి ఏమౌనో కదా
అయ్యో భర్త మనసులో ఎమున్నదో  
బిడ్డకు ఏమికానున్నదో

Palli Balakrishna Thursday, July 27, 2017
Thoofan (2013)





చిత్రం: తూఫాన్ (2013)
సంగీతం: మీట్ బ్రోస్ అంజాన్, చిరంతన్ భట్ , ఆనంద్ రాజ్ ఆనంద్
బ్యాక్గ్రౌండ్ స్కోర్: అమర్ మోహిలే 
నటీనటులు: రాంచరణ్ తేజ్ , ప్రియాంకా చోప్రా, మహిగిల్, శ్రీహరి
దర్శకత్వం: అపూర్వ లఖియా
నిర్మాణం: రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్
విడుదల తేది: 06.09.2013



Songs List:



ముంబై కె హీరో... పాట సాహిత్యం

 
చిత్రం: తూఫాన్ (2013)
సంగీతం: చిరంతన్ భట్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: జస్జ్ ప్రీత్, రోషిని బాప్టిస్ట్, రామ్ చరణ్

తేజా నేనొచ్చాశాను
నిన్ను ఫినిష్ చేయటానికి
ఏదైనా చెప్పి చేయటం నా స్టైల్

రేయ్ నేను చచ్చే రకం కాదు చంపే రకం
గుర్తుంచుకో...

ముంబైలో నేనుంటా ముంబైకే తోడుంటా..
ముందెనక గస్తి కాస్తుంటా - ఒ..ఒ..ఒ..ఒ..

ఖాకి నా డ్రెస్సంట..ధం కి అడ్రెస్సంట..
డాషింగ్ కి నేనే బాసంటా  - ఒ..ఒ..ఒ.. ఒ..

పిస్తా ఎవడైనా ...వస్తాదెవడైనా..
పిస్తోలె తోలే తీస్తుంటా..


ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో..
మొదలే పెడితే ఒల్లె హల్లీం అవ్తుంది దేఖో..
కలిపి కొడితె జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో
మనమే ముంబై కె హీరో...

ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో..
మొదలే పెడితే ఒల్లె హల్లీం అవ్తుంది దేఖో..
కలిపి కొడితె జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో
మనమే ముంబై కె హీరో...

రేయ్ ఇది పోలీస్ స్టేషన్
నీ యబ్బ జాగీర్ కాదు
షేర్ ఖాన్ నేను చందాలు వసూల్ చేసే టైప్ కాదు
చమ్డలు వలిసే టైప్
తెల్లారేసరికి నీ దండాలు దాదాగిరిలు ఆపే
అలా అయితే ఫ్రెండవుతావు లేదా ఎండ్ అవుతావు

రూటేగాని మారిందంటె  లాటి తోటి పోటేస్తా
తేడా గాని వచ్చిందంటె  బేడిలేసి బాండేస్తా
చట్టం లాంటి చేతులు చాచి, చెడు తో చెడుగుడు ఆడేస్తా
చచ్చిన వాడి నోరె తెరిచి, పచ్చిగ నిజమె కక్కిస్తా
కుక్కల్ని ఏరెస్తా  మక్కల్ని ఇరిచెస్తా
లెక్కల్ని సరిచూసి పంపిస్తా...

పిస్తా ఎవడైనా...వస్తాదెవడైనా..
పిస్తోలై తోలె తీస్తుంటా..
అర్దమైందనుకుంట...

ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో..
మొదలే పెడితే ఒల్లె హల్లీం అవ్తుంది దేఖో..
కలిపి కొడితె జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో
మనమే ముంబై కె హీరో...

Hey cop in the khaki uniform
You turn me on, turn me on
Tu-tu-tu-tu-turn me on
I love the way you right the wrong
Oh my God, is that your gun
Can I hold it please

ఓరోరి సెక్సీ ఆఫిసర్
గురి పెట్టావంటె రివోల్వర్
గుండెల్లో జరిగె ఎన్కౌంటర్
కర్ కంప్లైంట్ మేర రిజిస్టర్
కంప్లైంట్ మేర రిజిస్టర్

అఊంగ బచఊంగ
ముంబై కె హీరొ!

Go when you want your hero, just dial 100,
నే వచ్చేసి రఫ్ఫాడిస్తా రక్షన్ కి రొఖ తెంచేస్తా
నకరాన్నె నవ్వించేస్త
పరువాన్నే పూయించేస్తా
ఖాఖి పె హూ 24*7, అడ్రెస్ always మేరి జాన్

పోలీస్ నె నేనంట
నా రూల్సే నావంట
లోకాన్నే పాలిష్ చేస్తుంటా

కాకి నా డ్రెస్సంట..ధం కి అడ్రెస్సంట..
డాషింగ్ కి నేనే బాసంటా  - ఒ..ఒ..ఒ.. ఒ..

పిస్తా ఎవడైనా...వస్తాదెవడైనా..
పిస్తోలై తోలె తీస్తుంటా..
అర్దమైందనుకుంట...

ఓవర్ కాన్ఫిడెన్స్  పెంచుకుంటె, పీకి చేతులొ పెడతా
అర్దమైందనుకుంట...

ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో..
మొదలే పెడితే ఒల్లె హల్లీం అవ్తుంది దేఖో..
కలిపి కొడితె జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో
మనమే ముంబై కె హీరో...

ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో..
మొదలే పెడితే ఒల్లె హల్లీం అవ్తుంది దేఖో..
కలిపి కొడితె జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో
మనమే ముంబై కె హీరో...



పింకీ తో పాట సాహిత్యం

 
చిత్రం: తూఫాన్ (2013)
సంగీతం: మీట్ బ్రోస్ అంజాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: మమత శర్మ 

పింకీ తో 



ప్రేమించా నీ పేరుని పాట సాహిత్యం

 
చిత్రం: తూఫాన్ (2013)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రీరాంచంద్ర, శాల్మలి ఖోల్లాడే

ప్రేమించా నీ పేరుని
ప్రేమించా నీ తీరుని
ప్రేమించానె నిన్నె చేరే నా దారినీ...
ప్రేమించా  నీ స్వాసనీ
ప్రేమించా  నీ స్పర్షని
ప్రేమించానె నీ పై ఉండె నా ద్యాసని...
ప్రేమించా  నీ చిలిపి కోప్పాన్ని
ప్రేమించా నీ చిన్ని లోపాన్ని
ప్రేమించా నువ్వున్న లోకాన్ని
ప్రేమిస్తు జీవించానే..

నా గాలి నిండా నీ పలుకులే
నా నేల నిండా నీ అడుగులే
నా నింగి నిండా నీ మెరుపులే
నా జగతి నిండా నీ గురుతులే
పొయింది చెలి దేహం నీ ముద్దులో
ఉండలేనంది చలి కాలం మనమద్యలో
ఆనంద బంధాలలో

ప్రేమించా అనుకోని పేచీని
ప్రేమించా ఆ పైన రాజిని
ప్రేమించా అటుపైన ఆ ప్రేమని
ప్రేమిస్తు జీవించానే...
ఐ జస్ట్ లవ్ నీ చూపిని
ఐ జస్ట్ లవ్ నిట్టూర్పుని
ప్రేమించానె  మనకై వేచే మునిమాపునీ
ఐ జస్ట్ లవ్ నీ ఊహని
ఐ జస్ట్ లవ్ నీ ఉనికిని

ప్రేమించానె నీల విరిసె ఉదయలని
ప్రేమించా ఈ మదుర బాదలని
ప్రేమించా ఈ మంచు మంటల్ని
ప్రేమించా స్వెచ్చా సంకెళ్ళని
ప్రేమిస్తు జీవించానే...

ప్రేమించా ఈ మదుర బాదలని
ప్రేమించా ఈ మంచు మంటల్ని
ప్రేమించా స్వెచ్చా సంకెళ్ళని
ప్రేమిస్తు జీవించానే...




వెచ్చనైన పాట సాహిత్యం

 
చిత్రం: తూఫాన్ (2013)
సంగీతం: మీట్ బ్రోస్ అంజాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్వేతా పండిట్

వెచ్చనైన 



షకీలా సెంటు పాట సాహిత్యం

 
చిత్రం: తూఫాన్ (2013)
సంగీతం: ఆనంద్ రాజ్ ఆనంద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయ ఘోషల్ 

షకీలా సెంటు

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default