Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Atluri Purnachandra Rao"
Mathru Devata (1969)

చిత్రం: మాతృదేవత (1969)
సంగీతం: కె.వి.మహాదేవన్
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి
దర్శకత్వం: సావిత్రి
నిర్మాత: అట్లూరి పుండరికాక్షయ్య
విడుదల తేది: 07.11.1969

చిత్రం: మాతృదేవత (1969)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా
నన్నెన్నడు మరువకురా కృష్ణా..

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా
నన్నెన్నడు మరువకురా కృష్ణా

ఈ అనురాగం ఈ అనుబంధం
మన ఇరువురి ఆనందం
ఈ అనురాగం ఈ అనుబంధం
మన ఇరువురి ఆనందం
కలకాలం మదినిండాలి కలలన్నీ పండాలి
కలకాలం మదినిండాలి కలలన్నీ పండాలి
మన కలలన్నీ పండాలి

మనసే కోవెలగా 
మమతలు మల్లెలుగా

ఎన్నో జన్మల పుణ్యముగా
నిన్నే తోడుగ పొందాను
ఎన్నో జన్మల పుణ్యముగా
నిన్నే తోడుగ పొందాను
ప్రతి రేయీ పున్నమిగా
బ్రతుకు తీయగా గడిపేము
ప్రతి రేయీ పున్నమిగా
బ్రతుకు తీయగా గడిపేము

మనసే కోవెలగా 
మమతలు మల్లెలుగా

నీ చూపులలో చూపులతో
నీ ఆశలలో ఆశలతో
నీ చూపులలో చూపులతో
నీ ఆశలలో ఆశలతో
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై
ఒకరికి ఒకరై బ్రతకాలి
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై
ఒకరికి ఒకరై బ్రతకాలి

మనసే కోవెలగా 
మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా
నన్నెన్నడు మరువకురా కృష్ణా
మనసే కోవెలగా 
మమతలు మల్లెలుగా





Palli Balakrishna Tuesday, March 2, 2021
Mugguru Monagallu (1983)


చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు  (1983)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: శోభన్ బాబు, రాధిక , లక్ష్మీ, మాస్టర్ అలీ
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
విడుదల తేది: 1983

పల్లవి:
అంతా ప్రేమమయం జగమంతా ప్రేమమయం
ఈ క్షణం వలపు వీక్షణం పరమతీక్షణం
మరల రానే రాదీసమయం
అంతా ప్రేమమయం జగమంతా ప్రేమమయం
ఈ క్షణం వలపు వీక్షణం పరమతీక్షణం
మరల రానే రాదీసమయం

చరణం: 1
ఈడు అన్నది పుట్టకపోతే తోడు అన్నది ఎందుకురా
మోడువారే ఈడుకు తోడు ఉందిలే నీ లాభమురా
కామమన్నది పురుషార్థం
మోక్షమన్నది పరమార్ధం
రక్తిలేక ముక్తి లేదు శక్తి లేక సృష్ఠిలేదు
కామిగాక మోక్షగామి ఏనాడు కాలేవురా

చరణం: 2
ఆడదన్నది పుట్టకపోతే అందమన్నది ఎక్కడరా
ఆత్మలోపాల అందం ఉంటే ఆడదన్నది ఎందుకురా
చీకటిల్లుర జీవితము
జ్ఞానమొకటే నీ దీపం
ఆశఉంటే అనుచుకోకు ఆయువుండి చచ్చిపోకు
తప్పునైన ఒప్పునైన ఆపబోతే అంతేనురా

అంతా ప్రేమమయం జగమంతా ప్రేమమయం
ఈ క్షణం వలపు వీక్షణం పరమతీక్షణం
మరల రానే రాదీసమయం

Palli Balakrishna Sunday, November 12, 2017
Mr & Mrs Sailaja Krishnamurthy (2004)


చిత్రం: Mr & Mrs శైలజా కృష్ణమూర్తి (2004)
సంగీతం: రోహిత్ రాజ్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: సుజాత
నటీనటులు: శివాజీ, లైలా
దర్శకత్వం: శివనాగేశ్వరరావు
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
విడుదల తేది: 22.10.2004

అమ్మై మనసంటె తీయ్యని ఆశలు మొసె పల్లకి
పైకెప్పుడు కనపడదు పై పై చుసె ఎ కళ్ళకి
కనిపించె అందలన్ని నా.. కొసమె
అనిపించె చిలిపి వయసులొ వెల కొరికలు పూలై పూయగ
తరత తరర తర తర రర
తరత తరర తర తర రర

పెదవులతొ పలికెదొకటి
ఎద పరిచి తెలిపెదొకటి
ఎవ్వరికి చెప్పని కొరికలుండవా
కొరికనెదొరికెదొకటి
కొరినచొ తీరెవొకటి
తీరనివి ఎపుదు కొరికలెకద
నా మనసె తెలిసి ఎవ్వరు నా వాడుగ
రావలని లొ లొ కొరిక కొరికె లెని జెవితం వ్రుధ

మన బాపు బొమ్మలవలనె
లొకాలను గీసినదెవరు
ఏటు చుసిన చక్కని చిత్రమె కద
జగమంతా ఒక ఆలయము
మనమంతా తన దివ్వెలము
రాయైన నమ్మితె వరము ఇవ్వద
మనమనుభెవించుట కొసం
అణువణువూ..న మనకొసం ఉన్నది దైవం
గుండె కనులతొ చూడగలిగితె

Palli Balakrishna Friday, September 15, 2017
Avunanna Kadanna (2005)



చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, సదా
దర్శకత్వం: తేజ
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
విడుదల తేది: 06.04.2005



Songs List:



ఔనన్నా కాదన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్. పి. పట్నాయక్

ఔనన్నా కాదన్నా నీతోనే నేనున్నా
ఔనన్నా కాదన్నా నీలోనే నేనున్నా
నీ చెలిమే ఓ కాలి వంతెనరా
నీ వినతే చిరుగాలై వస్తున్నా
నీ పిలుపే రోజంతా వింటున్నా
వేదనలో స్వప్నాలే కంటున్నా
ప్రేమైనా చావైనా...
నీ తోనే ఏమైనా...





గుడి గంటలా నవ్వుతావేల పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఎస్.పి.బి.చరణ్ , ఉష

గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే

గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదూ

నీ వైపల చూస్తుంటె ఆకలేయకుందీ
నీ చూపులొ బంధించె మంత్రమేమున్నదీ
నీ మాటలే వింటుంటె రోజు మారుతుందీ
నా తోడుగ నువ్వుంటె స్వర్గమె చిన్నదీ
మనసెందుకొ ఇలా మూగవోతోంది రాప
తెలియదు
మరుమల్లె పూవులా గుప్పుమంటోంది లోన
తెలియదు

గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదూ

నీ నీడలొ నేనున్న చూడమంటున్నదీ
ఈ హాయి పేరేదైనా కొత్తగా ఉన్నదీ
నా కంటినె కాదన్నా నిన్ను చూస్తున్నదీ
నేనెంతగ వద్దన్న ఇష్టమంటున్నదీ
మరి దీనినే కద లోకమంటుంది ప్రేమ
తెలియదూ
అరె దూరమంటూనే చేరువౌతుంది రామ
తెలియదూ

గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే

గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు ...




అనగనగనగా ఒక ఊర్లో పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కే. కే, ఉష

కానరాని దైవమా జలిలేని కాలమా 
ప్రేమించుకుంటే నేరమా...

అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట
ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో
లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో
ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో

ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా 
ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా

అయ్యో పాపం గోరింకా లోనే ఉందిగా
అయినా పాపం చిలకమ్మా చూడేలేదుగా
ఆశే నీరై కన్నీరై ఏరై పారినా 
ఆరాధించే గుండెల్లో ప్రేమే మారునా
పూత పూసినా పూజ చేసినా 
రాత మారునా దైవమా

అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట

ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా
ప్రాణం లేని నీడైనా దూరం కాదుగా
గాలికి పోయే గాలైన గదిలో దాగునా
అర్ధంకాదే ఏనాడూ మసలీ వేదన
ఏమి చేసినా ఎవ్వరాపినా ప్రేమ ఆగునా దైవమా


అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట
ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో
లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో
ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో

ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా 
ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా





నేల తల్లి గుండెలో... పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: శంకర్ మహదేవన్

నేల తల్లి గుండెలో...
ఎన్ని వేల పాటలో...
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా 
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
ఊరి జనం ఊగేలా నాగస్వరం ఊదాల
మద్దిల దరువెయ్యాలా తుళ్ళి పడేలా

పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా 
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా

ఈ పల్లె పదాలే నోరారా అనాలి
తప్పెట్లే పడాలి రాగానికి
జాబిళ్ళి వినాలి నేలకదే దిగాలి 
జజ్జినకడి జనారే తాళానికి
వానమ్మ చిందేసి ఆడాలిరా 
వెన్నెల్లో గోదారి వెల్లువయ్యేలా
కొండమ్మ కోనమ్మ మోగాలిరా 
ఈ గాలి ఈ నేల పల్లవయ్యేలా
తప్పెటలే మోగాల ఉప్పెనలే రేగాల 
పాట విని పల్లెమ్మ వెంట పడాల

పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా 
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా

ఊరంతా వినాలి అబ్బబ్బో అనాలి 
కానుకలే ఇవ్వాలి ఈ పాటకి
చిన్నారి చకోరి వాలు కళ్ళు వయ్యారి 
వెంట మరి పడాలి సయ్యాటకి
ఈ బుజ్జి భూగోళం ఊగాలిరా
పాపాయిలా పాట ఉయ్యాలలో
పైనున్న ఆకాశం వంగాలి రా
తాతయ్యలా ఈడు తైతక్కలో
మూల నున్న అమ్మమ్మ
మూడుకాళ్ళ ముసలమ్మ
పాట విని రోజంతా చిందులెయ్యాలా

పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా 
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా




మలినం కానిది ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉష

మలినం కానిది ప్రేమ మరణం లేనిది ప్రేమ
శాశ్వత మైనది ప్రేమ మనసే చిరునామా
గుండెల సందడి ప్రేమ ఆశల పందిరి ప్రేమ
ఓటమి లేనిది ప్రేమ జయమే ఎపుడైనా
గాయం చేస్తే భాదకు బదులు బంధం పుడుతుంది
దూరం చేస్తే బంధం ఇంకా బలపడి పోతుంది
ప్రేమను కోరే మనిసెపుడు ఒరిగే వీలుంది
మనసును మీటే ప్రేమెపుడు నిలిచే ఉంటుంది
ఔనన్నా కాదన్నా...
ప్రేమకోసం మళ్ళి మళ్ళి ప్రేమే పుడుతుంది




సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: చిత్ర , భాస్కర్, మల్లికార్జున్

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ 
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి
పెళ్ళి మాట చెప్పి కోయిలమ్మ ఆశలెన్నొ రేపెనమ్మా
కొత్త కాంతి తెచ్చెనమ్మా కంటి పాపకి
చిరు నవ్వుల వానలలో మరుమల్లెల వాకిలలో
మది ఊయల లూగే నమ్మా  ఊహాలలో

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ 
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి

ప్రేమ కలిపింది మనసిచ్చిన నెచ్చలితో
తోడు దొరికింది ఎద నోచిన నోములతో
దూరములు దూరమయ్యే ఊహల పల్లకిలో
మాటలిక పాటలయ్యే తియ్యని పల్లవిలో
మనసంతా సంతోషం
మనసంతా ఆనందం

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ 
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి

నేల మురిసింది శుభలేఖలు  అందుకొని
వాన కురిసింది ఇక చల్లగ ఉండమని
వేణువులు వేదమయ్యే నీ జత చేరమని
తారకలు తాళి తెచ్చే ఇక తోడుగ సాగమని
అందుకని ఔనన్నా
వదలనుగా కాదన్నా

సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ 
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి
పెళ్ళి మాట చెప్పి కోయిలమ్మ ఆశలెన్నొ రేపెనమ్మా
కొత్త కాంతి తెచ్చెనమ్మా కంటి పాపకి
చిరు నవ్వుల వానలలో మరుమల్లెల వాకిలలో
మది ఊయల లూగే నమ్మా  ఊహాలలో

పెళ్ళికల వచ్చెనమ్మా పిల్ల సిగ్గుకి
బుగ్గ చుక్క పెట్టారమ్మా ముద్దుగుమ్మకి





నడుమే ఉయ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: పార్థ

నడుమే  ఉయ్యాల నడకే  జంపాల
నడుమే  ఉయ్యాల నడకే  జంపాల
సరుకే ఊగేల తకదిమితలాల
వామ్మో ఎగాదిగి జిగేలని అందాల
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా

సరాసరి కుమారిపై కళ్ళు పడేలా
ఒ ఎకా ఎక్కి నసాడమే అంటుకునేలా
జుర్రుమనేలా జివ్వుమనేలా
సోకే  సునా పెడ పాన్ మసాలా
అంత ఇదేలా కింద పడేలా
బాల బరంపురం భంగిమలెలా

నడుమే  ఉయ్యాల నడకే  జంపాల
సరుకే ఊగేల తకదిమితలాల
వామ్మో ఎగాదిగి జిగేలని అందాల
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా

చెడమడ చిరాకుల చంపక మాలా
ఒ ఎడపెడ హడావిడ చంపకిలాగా
ఊరె వినేలా బోడి సవాలా
పోవె పిఠాపురం కంతి తపాలా
పోరి ఇవాలా నాతో మజాలా
రావె సికాకుళం సిల్కు రుమాలా

నడుమే  ఉయ్యాల నడకే  జంపాల
సరుకే ఊగేల తకదిమితలాల
వామ్మో ఎగాదిగి జిగేలని అందాల
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా

జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా





ప్రేమించానని చెప్పనా పాట సాహిత్యం

 
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: సందీప్ , ఉష

ప్రేమించానని చెప్పనా 
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా 
నాలో ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా

ప్రేమించానని చెప్పనా 
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా 
నాలో ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా

పైర గాలి నీలా తాకి పోయె వేళా
ప్రేమలో పులకింతలె అనుకోనా
నీలినింగి నీలా మారి పోయె వేళ
లోకమె ప్రియురాలని అనుకోనా
ఊహలోన తేలీ వేల ఊసులాడీ
శ్వాసలాగ మారీ గుండెలోన చేరీ
తీపి ఆశలే చెప్పనా

ప్రేమించానని చెప్పనా 
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా 
నాలో ఊసులు చెప్పనా

దూరమైన గాని భారమైన గాని
నీడల నిను వీడదె తొలి ప్రేమా
గాలివానె రాని గాయమైనా కాని
హాయిగ చిగురించద మన ప్రేమా
గుండె ఆగిపోనీ గొంతు ఆరిపోనీ
కాలమాగి పోనీ నేల చీలిపోనీ
ప్రేమ పోదనీ చెప్పనా

ప్రేమించానని చెప్పనా 
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా 
నాలో ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా


Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default