Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1956"
Ilavelpu (1956)



చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
నటీనటులు: నాగేశ్వరరావు, అంజలి దేవి 
దర్శకత్వం: డి.యోగానంద్ 
నిర్మాత: ఎల్. వి.ప్రసాద్
విడుదల తేది: 21.06.1956



Songs List:



నీవే భారత స్త్రీలపాలిటి పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం:  పి. లీల

నీవే భారత స్త్రీల పాలిట వెలుగుచూపె దీపమై నావే 
నాకీ తిలకమా ! పసుపు కుంకుమ శోభతో
విలసిల్లి మా ఇలవేల్పువైనానే
విలసిల్లి మా ఇలవేల్పువై నావే

విశ్వమానవ ప్రేమనీలో నిండెనే సెలయేరుగా
నిండెనే సెలయేరుగా
శాశ్వతముగా నీదు త్యాగము నిల్చునే ధృవతారగా
నిల్చునే ధృవ తారగా
ఈ జగానా నీకు నీవే సాటి తల్లీ ! కల్పవల్లి నీవె
నారీ తిలకమా ! పసుపు కుంకుమ శోభతో విలసిలి
మా ఇలవేల్పువై నావే
మా స్త్రీల పాలిట వెలుగుచూపే దీపమైనానే

మధురమైన నీదు కధలే మానసములో మెలగునమ్మా
మానసములో మెలగునమ్మా
విమల మౌనీ శీలమునకే వెయ్యి జ్యోతులనందు కొమ్మా
వెయ్యి జ్యోతుల నందుకొమ్మా
ఈ జగానా నీకు నీవే సాటి తల్లీ ! కల్పవల్లివినీ వె




నిఖిల భువనపాలం పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం:  పి. లీల

నిఖిల భువనపాలం నిత్య తేజో విశాలం
సకల సుగుణ శీలం సచ్చిదానంద రామం
జనగణ మంగళదాయక రామం - రఘుపతి రాఘవ రాజారామం
రోగవినాశకరం శ్రీరామం - భవ బంధములను బాపెడు రామం
భక్తలోక పరిపాలక రామం - శరణు! శరణు! శ్రీ సీతారామం 

ఏకో దేవః కేశవోవా - ఏకో రూపం నిత్య సత్య ప్రదీపం
వాతీతం రామ నామ స్వరూపం 
జనగణ మంగళదాయక రామం - రఘుపతి రాఘవ రాజారామం

సర్వధర్మముల సారమె రామం
సకల మతములకు సమతే రామం
శాంతిలోని విశ్రాంతియె రామం 
శరణు! శరణు! శ్రీ సీతారామం 

పంచ భూతైక రూపం పావనం రామనామం 
ఔషధాతీత తేజం అమృతం రామనామం 




నీమము విడి అజ్ఞానముచే పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం:  పి. లీల

నీమము విడి అజ్ఞానముచే పలుబాధలు పడనేల?
సోదరా! ప్రకృతి మాత లేదా?
భానుకిరణముల ప్రభావమే ఈ ప్రపంచమోయన్నా
వాటిలో ప్రాణ శక్తిమిన్న రోగముల ప్రారద్రోలునన్నా
దేహమున కెంతో మేలన్నా 

మన్నూ, నీరూ,గాలియుండగా భయమింకేలనన్నా
జగతికే ఆదిశక్తులన్నా _ అవే మన ప్రాణతుల్యమన్నా
వ్యాధులిక రావని నమ్మన్నా
దేహములకెంతో మేలన్నా 

మధురమైన ఫలజాతులనెపుడు మానక తినుమన్నా
మనకదే చాల ముఖ్యమన్నా వీటిలో ఓ జీవము కలదన్నా
రోగములు చేరవు నిజమన్నా దేహమున కెంతో మేలన్నా
ఆవిరిలోనె పంచభూతములు ఆమరియున్నవన్నా
ఆవిరికి శక్తి అమితమన్నా అదే మన చలనశక్తి యనా
వ్యాధులిక రానే రావన్నా
దేహమునకెంతో మేలన్నా 




ఏనాడు కనలేదు పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: అనిశెట్టి 
గానం: రఘురాం పాణిగ్రహి, పి. సుశీల 

ఏనాడు కవలేదు - ఈ వింత సుందరిని
నాలో ఆశలు రేపే - అందాల రాచిలుక
ననుచూచి తనలోన నవ్వుకొనునిదే మొ?
పిలచిన మాటాడక వెడలి పోవునదేమొ
ధర్మాలలో వలపు దాచి పలుకునదే మొ?
కసరి, విసుగుటలోనే కరుణచూపునదే వెంకి
చిలిపి చేష్టలు మాని నిశ్చలతకల్గి

సాకి: మనసు శాసించు కొనువాడె మానవుండు

చిలిపి చేష్టలు చూచి నిగ్గుపడునదే మొ?
నను పిలచి మనసార మాటలాడదరేమొ
అదే కోపమా? లేక ఆనంద పరవళమా?
కలికి | ప్రేమను చూపి కనికరించదేమొ ?

నేను ప్రేమైక మూర్తిని నిశ్చలుడను

అర్జునా ! నిన్ను తెలియరు అజ్ఞులెపుడు




చల్లనిరాజా ఓ చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం:  పి. లీల,  పి. సుశీల, రఘునాధ పాణిగ్రాహి  

పల్లవి: 
చల్లనిరాజా ఓ చందమామ 
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. 
నా చందమామ 

చరణం: 1
పరమేశుని జడలోన చామంతివి 
నీలిమేఘాల నానేటి పూబంతివి 
నిను సేవించగా నను దయచూడవా 
ఓ వెన్నెల వన్నెల నా చందమామ  

చరణం: 2:
నిను చూచిన మనసెంతో వికసించుగా 
తొలి కోరికలెన్నో చిగురించుగా 
ఆశలూరించునే చెలి కనిపించునే 
చిరునవ్వుల వెన్నెల కురిపించులే 

చరణం: 3
నను చూడవు పిలచిన మాట్లాడవు 
చిన్నదానను వదలను ప్రియురాలను  
నిన్నే కోరానురా నన్నే కరుణించరా 
ఈ వెన్నెల కన్నెతో విహరించరా 




స్వర్గమన్న వేరే కలదా పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: అనిశెట్టి 
గానం: పి. లీల 

స్వర్గమన్న వేరే కలదా శాంతి వెలయు గృహమే కావా
సేవకన్న ధర్మము కలదా - ధర్మమన్న ఆదియే కాదా! 

జగతిలోని జీవుల కెల్ల - సుగతి జూపె ప్రకృతి మాట
బలమునిచ్చి నిలుపును నిన్నే- బ్రతుకుబాట నడుపునుతా నే

వీడిపోదు వెలుగును నీడ మీరలేదు చావును జీవి
లోకరీతి తెలిసినవారే - శోకమందు కుములుట మేలా 

జీవితమే గురువౌనయ్యా ! - జగతి మనకు బడియేనయ్యా !
దీక్షబూని చదవాలమ్మా ! - యింటి పేరు నిలపాలమ్మా

దేవ దేవ నీ పదములనే - నిలిపినాము మామదిలో నే
దయామయా వేడెదమయ్యా - కరుణజూపి కావగదయ్యా! 



ఓ సింగాలరి పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం:  జిక్కి (పి.జి. కృష్ణవేణి)

ఓ... చింగ్లారీ - చింగ్లారీయా
చింగ్లారీ యీ ఓ చింగ్లారీ - చింగ్లారీ యీ ఓ చింగ్లారీ
ఆహహహ

కోరస్: - ఆ హు - ఆహు - ఆహు - ఆహు
అంతా: చింగ్లారి యీ ఓ చింగ్లారి 
రాణి: ఝనక ఝనకచం కోరస్: భంచక బంచా
రాణి: ఝనక ఝనకచం కోరస్: - భంచక బంచా
కోరస్: ఓ...ఇంచు బోడియా - పోసెయ్య - పోసెయ్య
ఆ.. ఔసుంకాడియ్యా-ఔసుంకాడియ్యా- ఔసుంకాడియ్యా
ఠాణి: ఝనక, ఝనకచం కోరస్: భంచక బంచా
రాణి: ఝనక, ఝనకచం కోరస్: - భంచక బంచా
అంతా: చింగ్లారి యీ ఓ చింగ్లారి - చింగ్లారి యీ ఓ చింగ్లారీ
కోరస్: ఎల్లా ఎల్లా ఏహో ఎల్లా ఎల్లా ఏహో - ఆహహహ
కోరస్: హ హు హ
హు
హుహ - హ
-
కోరస్:
చింగారి యీ ఓ చింగారీ
కోరస్: ఎలా ఎలా ఏవ - ఎలా ఎలా ఏహో
ఎల్లా ఎల్లా ఏవ - ఎల్లా ఎల్లా ఏహో
హమ్
ఝల్లా - ఝల్ ఝల్లా - హమ్ ఝల్ల - ఝల్ ఝలా
వయ్యాని టింబాగొ-పోఏకిసా ఆనుటవుంగాగా పోఏకిపాకాయ్.

కోరస్: వయ్యాని టింబాగొ పో ఏకిఫా - అనుట వుంగాగా ఏకిపా
సో ఏకినా - ఏకిపా - ఏకిపా

కోరస్:
హమ్ ఝల్ల - ఝల్ ఝల్లా - హమ్ ఝల్ల - ఝల్ ఝ

ఎల్లా ఎల్లా ఏహో - ఎల్లా ఎల్లా ఏహో
ఎల్లా ఎల్లా ఏహో - ఎల్లా ఎల్లా ఏహో



అన్నా అన్నా విన్నావా పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం:  జిక్కి (పి.జి. కృష్ణవేణి)

అన్నా అన్నా విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
చిన్నీ కృష్ణుడు వచ్చాడు
నా వన్నెల చెలికాడొచ్చాడు   

కాళియ మడుగున దూకినవాడు 
ఆపద తొలిగి వచ్చాడు
చల్లని చూపుల చూస్తాడు 
కన్నుల పండుగ చేస్తాడు 

గోకుల మందున గోవిందునితో 
గోపికనై విహరిస్తాను
ముద్దుల మూర్తిని కంటాను 
మోహన మురళిని వింటాను 

బృందావనిలో నందకిశోరుని 
చెంతను నాట్యం చేస్తాను
యమునా తీర విహారములో 
హాయిగ పరవశమవుతాను





చల్లని పున్నమి వెన్నెలలో నే పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం:  సుసర్ల దక్షిణా మూర్తి, పి. సుశీల 

చల్లని పున్నమి వెన్నెలలోనే దహించే వేడి యెందుకో
తెలియదుగా తెలియదుగా - కీలక మేదో - తెలియదుగా 

అల్లరి చిల్లరి, చేతలతోనే - అందరి కళ్లూ మూయలేవని
తెలిసినదా తెలిసినదా . చేసిన తప్పు తెలిసినదా
నాటకమంతా బూటకమైతే - జాతక మే మన కెదురు తిరిగితే
నాదేనా తప్పు - అసలీ వాదెందుకు చెప్పు?
ఎవరిది తప్పని వాద మెందుకు - జరిగిన దానికి జగడ మెందుకు?
సరైన దారిని పోవాలి నలుగురి మెప్పు పొందాలి.
ఉన్నది ఇద్దరి కొకటే మార్గం
అదే ప్రేమ మార్గం మన కదే రాజమార్గం
ఉన్నది ఇద్దరి కొకటే మార్గం
అదే ప్రేమ మార్గం, మన - కదే రాజమార్గం
మన తీయని కలలన్నీ నిజమై
సాగును మన ప్రేమ - హాయిగా
మన తీయని కలలన్నీ నిజమై
సాగును మన ప్రేమ హాయిగా
సాగును మన పేమ
సాగును మన ప్రేమ
చల్లని పున్నమి వెన్నెలలోనే - కలసినలు మనసు వీడిపోశనీ
తెలిసెనుగా, తెలిసెనుగా కీలక మంతా తెలిసెను గా




పలికిన బంగారు మాయవటే పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం: పి. సుశీల 

పలికిన బంగార మాయనటే?
పలుకుచు నామది పరవళ మొందగ
తొలి పలుకునకే వలపుజనించగ-మని పలుకునకే మమతలు రేగగ 
తీయని స్వరముల హాయి గొలుపుచును
మదిలో మెరిసే మధుర భావము
రాగములో అనురాగము చూపుచు
పాడిన సేనను ? పలవి నీనోట

కనులార నిను చూచి మనసు వీపయినుంచి
అలరుచు మరి మరి ఆనందముతో
పిలవి, పిలచి నే అలసి పోయితిని
అలంకను విడవేల ? చెలియను కరుణించి


తే. గీ.

తండ్రికన్న మిన్న లీ ధరణి లేరు
గాన, పితృ వాక్య పాలన బూని నేను
వనములకు పోవుటే ధర్మమనుచు పలికె
జనని కౌసల్యతో రామచంద్రుడంత





గంప గయ్యాళి పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం 

గంప గయ్యాళి అదె గంప గయ్యాళి
సిగ్గమాలి హద్దుమీరి తిరిగే దెవతో
అదియే గంప గయ్యాళి - ఆదే గంప గయ్యాళీ

పొద్దెక్కిన...పొద్దెక్కిన ఎద్దువలె నిద్రలేశకా
డజని వేసి కాఫీ తాగి ఆయితిగాకా
చెంబూ కంచం కడగబోతే చేతులురాకా
తెగ రంకె వేసి అదర గొట్టు లంకిణి ఎవతో
అదే గంప గయ్యాళి - అదే గంప గయ్యాళి
మగడి గొంతు పట్టుకుని డబ్బుగుంజుతూ
నదురు బెదురు లేక జేబు కాళీ జేయుచూ
కూతురు కాపురము నార్పి కులుకుతు వుంటూ
మంచీ మట్టూ మరియాద రూపుమాపే దెవతో
అదియే గంప గయ్యాళి - ఆదే గంప గయ్యాళి
నోరు కొలది మాటాడే దురహంకారీ
అది లోకానికే రోసేసిని మాయలమా రీ
జగడానికి కాలుదువ్వు సాహసకారీ
మన తెలుగు తల్లి పేరు చెరుప పుట్టిన దేవతో
ఆదియే గంప గయ్యాళి - అదే గంప గయ్యాలి.

గణపతి: 
బ్రహ్మ వాణిని నాలుక పై ధరించె
హరియురమ్మున లక్ష్మీని అరువు కొనియె
శివుడు గంగను తలమీద జేర్చుకొనియె
ఓ దివ్య సుందరీ ! ఓ దేవకన్యా ! ఓ మేనకా ! రంఖా ! 
ముడుపు కట్టి వెంకన్నకు మొక్కనా
తాయెత్తులో పొదిగి కట్టనా - వన్నెలాడి చిగురుబోడి
వగలమారి వయ్యారి - సాంబ్రాణి ధూపమేసి పట్టనా
తాయెత్తులో పొదిగి కట్టనా

శేషమ్మ:
కన్ను మిన్ను గనక కారు కూతలు కూసి
ఓసి ఎంత చౌక చేసినావె ? ఆ! య్ !
గుంటలోన పెట్టి గంట వాయించెద నోరుకట్టి పెట్టి ఊరుకోను
శేషమ్మ: అలంకారీ - ఏం అమ్మా
శేషమ్మ:— రాయిట్లా - వస్తున్నా
శేషమ్మ: గుంటలోన పెట్టి గంట వాయించెద నోరుకట్టి పెట్టి ఊరుకొను
గణపతి: చెంప కొట్టిన పాల్గారు చిన్నదాని
ఆకటా ! ఈ రీతి దండింప నౌనటమ్మ

బడుగు పిచ్చుక పైరామ బాణమేల ?
కరుణ జూపింపవమ్మ ఓ కన్నతల్లీ ! ఓ కన్నతల్లీ
ఎందుకె కోపం నీకెందుకె కోపం ?
నన్ను కొట్టవే దాన్ని వదిలి పెట్టవే
అమ్మా నన్ను కొట్టవే దాన్ని వదలి పెట్టవే

సన్యాసి:
సత్యంబు తెలిసిందిగా నాలో నాకు సత్యంబు తెలిసిందిగా
బ్రహ్మరాక్షసి వంటి పెళ్లాన్ని గట్టుక
పదిమందిలో నేను పల్చనైపోయాక

శేషమ్మ: కన్యను యిచ్చీ కట్నం యిచ్చిందిందు కా
సుందరమ్మ : బుద్ధి గిద్ధి ఏమైనా నీకుందా ?
నీతి జాతి ఏమయినా కుందా ?
నాలు గేళ్లుగా మూలనున్న దీయింటిలో
నాలు గేళ్లు గా మూల నున్న దీయింటిలో - నీ యింటిలో
అహ దీనికి నేనే దిక్కు కానిచో
మొగుడెవ డొస్తాడే - దీనికి - మొగుడెవడో తెలిసింది.

కూతురు: అయ్యో ! అమ్మ
కాంత: విన్నావా ! యీ గొడవ - పైన బోయెనే ప్ర్రాణం
పడవెక్కిందే పరువు
ఆత్తకొడుకు అడిగేనే - నీ అన్న కొడుకు అడిగేనే
రంగారావు అడిగేనే - రామారావు అడిగేనే
నాగేశ్వర్రావడిగే నే - ఎం ఏ అడిగా బి. ఏ. అడిగె
యాక్టరడిగె - డాక్టర్లడిగే ఇచ్చావా - సచ్చావా
ఎంతచేశావే- తల్లీ

చింత కొమ్మను నమ్మి కట్టుకున్నానే
మునగ కొమ్మై విరిగి మోస పోయానే
చిల్లి బోటని తెలియ కెక్కా నే
శివ శివా నట్టేట మునిగా నే
నన్ను గన్నతల్లి నారాత యిటురాసెనే - నాకర్మయిటు కాలెనే

గణపతి :
భయముమాని కట్టుకో కొరడా - బావా
భయము మాని పట్టుకో కొరడా
తండ్రీ! యిక జాలము సేయక
మీ సంగల పురుషుడుగా
రోసంతో నడవాలీ

బుద్ధిలేని ఆడవాళ్ల - హద్దులో వుంచాలి.
భయము మాని పట్టుకో కొరడా కొరడా

Palli Balakrishna Saturday, July 2, 2022
Uma Sundari (1956)


చిత్రం: ఉమా సుందరి (1956)
సంగీతం: జి. అశ్వద్ధామ
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం (All)
నటీనటులు: యన్. టి. రామరావు, పసుపులేటి కన్నాంబ, శ్రీరంజని జూనియర్, నాగయ్య, సురభి బాలసరస్వతి
దర్శకత్వం: పి. పుల్లయ్య
నిర్మాత: యం. సోమసుందరం
విడుదల తేది: 20.07.1956



Songs List:



మాయా సంసారం తమ్ముడు పాట సాహిత్యం

 
చిత్రం: ఉమా సుందరి (1956)
సంగీతం: జి. అశ్వద్ధామ
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం
గానం: పిఠాపురం

పల్లవి:
మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు

చరణం : 1
ముఖము అద్దము ఉందీ మొగమాటమెందుకు
సుఖదుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు
ముఖము అద్దము ఉందీ మొగమాటమెందుకు
సుఖదుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు

సకల సమ్మోహన సంసారమందున
సకల సమ్మోహన సంసారమందున
సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్నా
సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్నా

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు

చరణం: 2
కోరి తెచ్చుకున్న భారమంతే గానీ
దారా పుత్రులు నిను దరి జేర్చుతారా
కోరి తెచ్చుకున్న భారమంతే గానీ
దారా పుత్రులు నిను దరి జేర్చుతారా

తేరి చూసి నిజము తెలుసుకో తమ్ముడు
తేరి చూసి నిజము తెలుసుకో తమ్ముడు
సారము సత్యం సర్వం పరమాత్మ

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు

చరణం: 3
వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది
వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది
పోయేటప్పుడు కొని పోయేదేముంది
పోయేటప్పుడు కొని పోయేదేముంది

అద్దె కొంప లోకమంతేరా తమ్ముడు
అద్దె కొంప లోకమంతేరా తమ్ముడు
వద్దు పొమ్మనగానే వదిలేసి పోవాలి

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు





నమ్మకురా ఇల్లాలు పిల్లలు పాట సాహిత్యం

 
చిత్రం: ఉమా సుందరి (1956)
సంగీతం: జి. అశ్వద్ధామ
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం
గానం: ఘంటసాల, పిఠాపురం

నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా
తోలుబొమ్మలురా జీవా
నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా
తోలుబొమ్మలురా జీవా

సమ్మతించి నను నమ్మిన వారికి సాయుజ్యమురా జీవా 
శివ సాన్విజ్యమురా జీవా
సమ్మతించి నను నమ్మిన వారికి సాయుజ్యమురా జీవా 
శివ సాన్విజ్యమురా జీవా 

ఘోర దురిత సంసార జలదిలో జ్ఞానమే చేయూత
ఆజ్ఞానమే ఎదురీత
జీవా జ్ఞానమే చేయూత ఆజ్ఞానమే ఎదురీత
ఘోర దురిత సంసార జలదిలో జ్ఞానమే చేయూత
ఆజ్ఞానమే ఎదురీత
జీవా జ్ఞానమే చేయూత ఆజ్ఞానమే ఎదురీత

మోహమెందుకీ జీవము పై ఇది తోలు తిత్తిరా జీవా ఉత్త గాలి తిత్తిరా జీవా
మోహమెందుకీ జీవము పై ఇది తోలు తిత్తిరా జీవా ఉత్త గాలి తిత్తిరా జీవా

నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా
తోలుబొమ్మలురా జీవా

Palli Balakrishna Sunday, June 27, 2021
Chiranjeevulu (1956)


చిత్రం: చిరంజీవులు (1956)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: మల్లాది రామకృష్ణ శాస్త్రి
గానం:
నటీనటులు: యన్.టి.రామారావు, జమున
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: డి.ఎల్.నారాయణ
విడుదల తేది: 25.06.1956

కళ్ళలో నువ్వే నువ్వే
నా కలలో నువ్వే నువ్వే
మనసులో నువ్వే నువ్వే
ప్రతి మాటలో నువ్వే నువ్వే
ఎదుట పడిన ప్రతి వారిలోన నిను చూసానా
నీవు తప్ప జనులెవరు లేరా ఈ లోకానా
తేల్చవా నువ్వే

నిన్నంత నిదుర లేదు నీ వల్ల
అంత లేనిపోని నిండలా
హేయ్ నన్నింక వదలంటు పంతాల
లేనే లేనె చుట్టు పక్కలా
రేయంతా ఊహల్లో నీవు లేవా నిజం వొప్పుకో
చీకట్లో ఏమి చూసావో నన్నేనా గుర్తు చేసుకో
జ్యోతుల్లా మారిన చూపుల్లో
నీ రూపు సాక్ష్యం గా చూపనా
నీలాల నీ కంటి పాపల్లో
బంధించుకున్నావా నన్నిలా చెలిమి సంకెలా

క్షేమంగా ఉంది కదా నా మనసు
నాకు మాత్రం యేమి తెలుసు
నీకు కాక యెవరికెరుక దాని ఊసు
కంట చూడలేదె అసలు
యేనాడో నా చేజారి వెళ్ళిందే నిన్ను చేరగా
యే గలిలో తేలుతుందో నా దాకా చేరలేదుగా
గుమ్మల్ని దాటెది ఎప్పుడూ
యేమైందో అంతేగా ఇప్పుడూ
ఆచూకి తెలిసినప్పుడూ
నీ కప్పగిస్తానే అమ్మడూ నన్ను నమ్మవే


******   ******   ******


చిత్రం: చిరంజీవులు (1956)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: మల్లాది రామకృష్ణ శాస్త్రి
గానం: పి.లీల

తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు ….
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా

తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా

కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
తరుణులందరు నది చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
దైవరాయ నిదురలేరా
నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా
వెన్న తిందువుగాని రారా

తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా







Palli Balakrishna Tuesday, March 19, 2019
Charana Daasi (1956)


చిత్రం: చరణదాసి (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:
గానం:
నటీనటులు: యన్.టి.ఆర్, ఎ. యన్.ఆర్, అంజలీ దేవి,  సావిత్రి
దర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావు
నిర్మాత: ఎ. శంకర్ రెడ్డి
విడుదల తేది: 20.12.1956



Palli Balakrishna Sunday, March 3, 2019
Tenali Ramakrishna (1956)



చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
నటీనటులు: యన్.టి.ఆర్ , ఏ. యన్.ఆర్, జమున
దర్శకత్వం: బి.యస్.రంగా
నిర్మాత: బి.యస్.రంగా
విడుదల తేది: 12.01.1956



Songs List:



చేసేది ఏమిటొ చేసెయ్యి పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: గంటసాల

చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగ ఈ కోటలో
చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగ ఈ కోటలో
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ నీ మాట దక్కించుకో బాబయా
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ నీ మాట దక్కించుకో బాబయా


నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ
కొమ్మ కొమ్మ విరగ బూసి వేలాదిగా
నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ
కొమ్మ కొమ్మ విరగ బూసి వేలాదిగా
ఇక కాయాలి బంగారు కాయలు భోచెయ్యాలి మీ పిల్ల కాయలు
కాయాలి బంగారు కాయలు భోచెయ్యాలి మీ పిల్ల కాయలు

రహ దారి వెంట మొక్క నాటి పెంచరా
కలవాడు లేనివాడు నిన్ను తలచురా
రహ దారి వెంట మొక్క నాటి పెంచరా
కలవాడు లేనివాడు నిన్ను తలచురా
భువిని తరతరలు నీ పేరు నిలుచురా
పని చేయువాడె ఫలములారగింతురా





చందన చర్చిత పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.సుశీల

పల్లవి:
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే
ఆ ఆ ఆ ఆ ఆ అ
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత సాలి
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే

చరణం: 1
కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధు సూధన వదన సరోజం
ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధు సూధన వదన సరోజం
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే

చరణం: 2
ఇష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం
సథ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామ
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి




తెనాలి రామకృష్ణ (పద్యం ) పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల, మాధవపెద్ది సత్యం 

తెనాలి రామకృష్ణ  (పద్యం )




తీరని నా కోరికలె పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: భానుమతి

పల్లవి:
తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

చరణం: 1
తరుణలలో నా సరి జాణ
సరసుల నీకు సరి లేరు నెరజాణ
తరుణలలో నా సరి జాణ
సరసుల నీకు సరి లేరు నెరజాణ
ఆటలపాటలలో వినోదాల వేడుకలో
ఆటలపాటలలో వినోదాల వేడుకలో
వాటముగా నిన్ను లాలింతురా దొర
వాటముగా నిన్ను లాలింతురా దొర

తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

చరణం: 2
వన్నెల మేడ వెన్నెల నీడ 
వాడని మల్లియల వాడలలో హాయిగా
వన్నెల మేడ వెన్నెల నీడ 
వాడని మల్లియల వాడలలో హాయిగా
వింతలు చేయుదురా విలాసాల తేలుదురా
వింతలు చేయుదురా విలాసాల తేలుదురా
చూతుమురా స్వర్గవైభోగమే ఇలా
చూతుమురా స్వర్గవైభోగమే ఇలా

తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు




జగములా దయనేలే జనని పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.లీలా

పల్లవి:
జగములా దయనేలే జనని 
జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని

చరణం: 1
మరుని గెలిచినవానికి మరులు
మరుని గెలిచినవానికి మరులు
మరిపే సుందరవదనా
ఆపదలందున ఆదరించవే లలితా శైలసుధా ఆ ఆ లలితా శైలసుధా

జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని




ఈ కాంతలు (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల 

ఈ కాంతలు (పద్యం)




తరుణ శశాంక (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: A.P కోమల, ఘంటసాల 

తరుణ శశాంక  (పద్యం)




ఇచ్చకాలు నీకు (డైలాగ్స్ తో) పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.లీల, మాధవపెద్ది సత్యం 

ఇచ్చకాలు నీకు (డైలాగ్స్ తో)




ఝుణ్ ఝుణ్ కంకణములూగ పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: రావు బాలసరస్వతి 

ఝుణ్ ఝుణ్  కంకణములూగ
ఘల్ ఘల్ కింకిణులు మ్రోగ
కోరిక లేడర కూడేనురా 

రూపున కెరయైనదానా జాణా నెరజాణా
నెనకురు తగుదానా!
నే రూపున కేరయైనదానా జాణా నెరజాణా
కూరిమి మీరా నీతో కులికే
వరమూ లభించెను బ్రతుకే ఫలించెన
వలపులవల రాజా నన్నేలరా

కనుసన్నల మెలగేనురారా
పరువము మనదేరా
రాధా మనోహర
వెన్నెల వేళ విరులాలీలా
వెన్నెల వేళ విరులాలీలా
విరిసి సుఖింతుము పరవశింతము
సొంపుగ సంపంగి జంపాలలోన 





కన్నులు నిండె పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: భానుమతి

పల్లవి:
ఈ వాలు కన్నులు ఈ వన్నె చిన్నెలు
మారాజ రాజుకు నీరాజనములు
కన్నులు నిండె కన్నెలమిన్న మన్ననలీరా రాజా
కన్నులు నిండె కన్నెలమిన్న మన్ననలీరా రాజా

చరణం: 1
కుషీమీర కొనరా కోరి చేరినారా
ఈ సొగసొంతా నీసొమ్మేరా ఫాదుషా
కుషీమీర కొనరా కోరి చేరినారా
ఈ సొగసొంతా నీసొమ్మేరా ఫాదుషా
కుషీమీర కొనరా

చరణం: 2
కోయిల కూన కులికే జాణ 
పలికించేరా పాటలలో
కోయిల కూన కులికే జాణ 
పలికించేరా పాటలలో
సరసాల వేళ విరజాజి పానుపున కొలువుచేయించి లాలించుదాన
సరిచెయ్యాలా నేనే నాకు సాటిరా
కుషీమీర కొనరా కోరి చేరినారా
ఈ సొగసొంతా నీసొమ్మేరా ఫాదుషా
కుషీమీర కొనరా



జగముల దయనేలే (పార్ట్ - 2) పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.లీల 

జగముల దయనేలే  (పార్ట్ - 2)



నీవెగా రార నీవెగా పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: భానుమతి

పల్లవి:
నీవెగా రార నీవెగా
నీవెగా రార నీవెగా
నయ విజయశాలి కృష్ణరాయ నీకు సరి నీవెగా
నీవెగా రార నీవెగా
నయ విజయశాలి కృష్ణరాయ నీకు సరి నీవెగా
నీవెగా రార నీవెగా

చరణం: 1
విరిసి నెరితావి కొలతే విరితాన
విరిసి నెరితావి కొలతే విరితాన
పరువు మురిపాల వరుని వెతకాలి
పరువు మురిపాల వరుని వెతకాలి
కళల నెరజాణ సరసాల చెలికాన
కళల నెరజాణ సరసాల చెలికాన
మేలు వాని కోరితే చాలు తిరుగాడి
మేలు వాని కోరితే చాలు తిరుగాడి
మోహాలు మించగా మదిని గల ఆశ ఫలించగ
మోహాలు మించగా మదిని గల ఆశ ఫలించగ
నేటికి ఇటు సరసజాణ నటనవేదినెరుగని శరణు చేరి 
మనసు తీర మురిసిన సురువు పలుకులకు వలపులకు నెర దొరవని విన్నారా 
కనుల నినుగన్నారా మనసుగొని వున్నారా ఏలుకోర

నీవెగా రార నీవెగా
నయ విజయశాలి కృష్ణరాయ నీకు సరి నీవెగా
నీవెగా రార నీవెగా




హరేరాం గండుపిల్లి మేనుమరచి పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల, చిత్తూరు వి.నాగయ్య 

హరేరాం గండుపిల్లి మేనుమరచి 





ఆకతాయి పిల్లమూక పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: రామకోటి 

ఆకతాయి పిల్లమూక
అందాల చిలకా
నాకేసి చూస్తారు నవ్వుతారే
అయ్యయ్యో నాకేసి చూస్తారు
నవ్వుతారే  "ఆకతాయి"
చలా మడత కట్టుకునీ
తలపాగా చుట్టుకుని
వీపున మూటేసుకుని
వీధియెంట పోతుంటే

కనుముక్కు తీరులోన
పనివాడి తనములోన
కనరారు నాసాటి
అందాల చిలకా
గూనొకటి దాపురించి
పరువు తీసెనే
నలుగురిలో నా బతుకు
నవ్వుల పాల్చేసెనే 




తెనాలి రామకృష్ణ డైలాగ్స్ పార్ట్ - 1 పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల, అక్కినేని నాగేశ్వరరావు , యన్.టి.రామారావు, జమున 

తెనాలి రామకృష్ణ  డైలాగ్స్ పార్ట్ - 1 



తెనాలి రామకృష్ణ డైలాగ్స్ పార్ట్ - 2 పాట సాహిత్యం

 
చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల, అక్కినేని నాగేశ్వరరావు , యన్.టి.రామారావు, మాదవపెద్ది సత్యం, వంగర వెంకట సుబ్బయ్య , ముక్కుమాల  

తెనాలి రామకృష్ణ  డైలాగ్స్ పార్ట్ - 2


Palli Balakrishna Sunday, August 13, 2017
Bhale Ramudu (1956)



చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: వి.ఎల్.నరసు
విడుదల తేది: 06.04.1956



Songs List:



ఎందున్నావో మాధవా పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: జిక్కి , కె.రాణి 

ఎందున్నావో మాధవా - ఎందున్నావో మాధవా
నందకుమారా కేశవా
బృందావనికిటు రావా దేవా బృందావనికిటు రావా దేవా
ఎందున్నావో మాధవా
కనుగొనలేదా రాధారాణి నిను విడనాడి మనగలనా
వనమాలి యింతజాగేలరా - యింతజాగేలరారా
నీవెనువెంటనే పున్నావుకాదా
అనుపమ ప్రేమా రాజ్యమిదేగా
అనుపమ ప్రేమా రాజ్యమిదేగా

విలాసముగా అలంకృతులై
విహారముసేయగ కాళిందికిపోదామే-గోవిందుని చూదామే
సుధామధుర మనోహరమే అదే మురళీ విన్నారా
వినోదింప ప్రమోదింప ముకుందుని చేరగ పోదామే
పనితనమందే మిసిమిమీగడలు మింగుటకాదయ్యా కృష్ణయ్యా
ముందుకు రావయ్యా-వసంతములాడగ రావయ్యా

నీ ఆటలు సాగవులేవయ్యా-ఇటువసంతకేళికి రావయ్యా
ఇటు వసంతకేళికి రావయ్యా
గోపికలారా ఆగండి-బ్రతిమాలెద నన్నిక విడువండి

మురిపములేలా సరసకురారా
మోహనమురళీ గోపాల-నవమోహన మురళీ గోపాలా

రేపల్లెవాడలో గోపాలకృష్ణుడే
మాపాలి దేవుడే గోపివిలోలుడే
నవ మోహన మురళీ గోపాల
రేపల్లెవాడలో గోపాలకృష్ణుడే
మాపాలి దేవుడే గోపివిలోలుడే
మిలమిల మెరసే చూపు వలపుల వర్షించునే

నిద్దుర లేచి ముద్దరచూచి నన్ను తలచుకో నాయుడుబావ
నాడెమైన పచ్చబొట్టు పొడిపించుకోవా-ఏంపొడవమన్నా నా
ఓబేడడబ్బులిస్తేచాలు బేరమాడుతావ- ఇంకా బేరమాడుతావా
బావ బేరమాడుతావా మావోయ్



నాడేమైనా పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: జిక్కి

నాడేమైనా



గోపాల దేవా పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: పి.బి.శ్రీనివాస్, పి.లీల 

హరే మురారే - హే చక్రధారే-యిటు సేయమేలా
తల్లి తండ్రి గురుదైవమునీవని-నమ్మినవారికే నరకబాధలా"
కృష్ణా యిదేనా నీలీలా
గోపాల దేవా - కాపాడరావా
గోపాల దేవా - కాపాడరావా
ఏపాపమెరుగని పసిపాపలయ్యా
ఏపాపమెరుగని పసిపొపలయ్యా-మొరాలింపరావయ్యా

కృష్ణహరే శ్రీకృష్ణహరే-కృష్ణహరే శ్రీకృష్ణహరే (3)

కృష్ణహరే శ్రీకృష్ణహరే-కృష్ణహరే శ్రీకృష్ణహరే 

ఓ! ఓ!
హరేకృష్ణ గోవిందా శౌరీ ముకుందా
కరుణాలవాలా కాంచనచేలా
కృష్ణహరే - జై కృష్ణహరే
కృష్ణహరే - జై కృష్ణహరే
హరిఓం
హరేకృష్ణ గోవిందా శౌరీముకుందా
కరుణాలవాలా కాంచనచేలా
పాలముంచినా కృష్ణ నీటముంచినా భారము నీదే
పాలముంచినా కృష్ణ నీటముంచినా భారము నీదే
పాలింపవయ్యా బాలకృష్ణయ్యా
మొరాలింపవయ్యా బాలకృష్ణయ్యా

కనరాని కష్టాలుఎదురాయెనే-కనరాని కష్టాలు యెదురాయెనే
కాపాడరారా గోపాల కృష్ణా-కాపాడరారా గోపాలకృష్ణా
మురళీధరా హరేమోహనకృష్ణా-హరేమోహనకృష్ణా
అనుదినము నిన్నే పూజింతురా-కృష్ణాపూజింతురా
మనసార నిన్నే ధ్యానింతురా- మనసార నిన్నే ధ్యానింతురా
కనికారమింతైన కనవేమిరా-కనికారమింతైన కనవేమిరా
కాపాడరారా గోపాలకృష్ణా
కాపాడరారా గోపాలకృష్ణా మురళీధరా హరేమోహనకృష్ణా
మొరవినదేవా కరుణింపరావా-ముఠళీధరా హరేమోహనకృష్ణా
హరేమోహనకృష్ణా - హరేమోహనకృష్ణా
హరేమోహనకృష్ణా - హరేమోహనకృష్ణా




ఓహొ మేఘమాల.. పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: ఘంటసాల, పి.లీల

ఓహొ మేఘమాల..ఆ.. నీలాల మేఘమాల 
ఓహొ మేఘమాల నీలాల మేఘమాల 
చల్లగ రావేలా.. మెల్లగ రావేలా 
వినీలా మేఘమాలా వినీలా మేఘమాలా
నిదురపొయే రామచిలుకా నిదురపోయే రామచిలుకా 
బెదిరిపోతుందీ.. కల చెదిరిపోతుంది 

ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయి 
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ 
ఏ? నిదురపోయే రామచిలుకా నిదురపోయే రామచిలుకా 
బెదిరిపోతుందీ.. కల చెదిరిపోతుందీ

ఓహొ ఓ.... ఓహొ.. ఓ 

ఆశలన్నీ తారకలుగా హారమొనరించీ
ఆశలన్నీ తారకలుగా హారమొనరించీ
అలంకారమొనరించీ
మాయ చేసి మనసుదోచి 
మాయ చేసి మనసుదోచి పారిపోతావా దొంగా



మురళీధర పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: పి.లీల

మురళీధర




ఓహొ మేఘమాల -II పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: పి.లీల

ఓహొ మేఘమాల..ఆ.. నీలాల మేఘమాల -II




భారత వీరా పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: పి.లీల

భారత వీరా



కలమాయమయేనా పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: పి.లీల

కలమాయమయేనా - తలవ్రాత యిదేనా
వలపించుట మురిపించుట మరపించుటకేనా- కలమాయమయేనా
అనురాగసుధాధార వర్షింపవేరా అలరింపననేర
అనురాగసుధాధార వర్తింపగవేరా ఆకరింపగనేరా
కొనసాగిన ఆశాలత కృశియించుట కేనా-కలమాయమయేనా
మనసార ప్రేమించుట విలపించుటకేనా తలవంచుటకేనా
వినువీధుల విహరించుట యిల కూలుటయే నా-కలమాయమయేనా.
మునుజేసిన నాపూజల ఫలితాలుయివేనా-కలమాయమయేనా
తలవ్రాతయిదేనా - వలపించుట-మురిపించుట
మరిపించుటకేనా-కలమాయమయేనా



భయమేలా ఓమనసా పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: పి.బి.శ్రీనివాస్

భయమేలా ఓమనసా భగవంతునిలీలా
భయమేలా ఓమనసా భగవంతునిలీలా-ఇ వంతా పరమాత్ముని లీలా
పైసాకేమీ పరవాలేదు. డబ్బంటే మనకిబ్బందిలేదు.
ఓ..
ఉన్నపాటున కురిపిస్తాను గలగలగలగలగలాగలా
ఏమిటి?
కాసులు - రూకలు
ఉన్నపాటున కురిపిస్తాను-తాతగారి సొమ్ము మనతాతగారి సొమ్ము
తాతగారిసొమ్ముందని నాతోకోతలు కోస్తావేం మామా కోతలు కోస్తావేం
చేతికిచ్చిమాట్లాడవోయి - చేతికిచ్చి మాట్లాడవోయి
నీతోవస్తా - నినుమురిపిస్తా అప్పనమామా
బంగరుబొమ్మా!
అప్పన మామా!
బొమ్మా
మామా




బంగారు బొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: పి.బి.శ్రీనివాస్, జిక్కి 

బంగారు బొమ్మా 



ఇంటింటను దీపావళి పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: పి.లీల

సాకీ :
నా బ్రతుకింతేనా-ఈ బ్రతుకింతేనా_నా బ్రతుకింకేనా

సాంగ్: నా జీవితమంతా తీరనికన్నీరేనా
ఇంటింటను దీపావళి మా యింటికి లేదా అభాగ్యమురాదా
కనిపెంచిన మాతండ్రి కనుపించకపోయే
కనికారమింతలేక తనదారినిపోయె సోదరి ననువిడిపోయె
మనసారవలచి వలపించిన ప్రియుండిటులాయె
మనోహరుడిటులాయె



ఏమిటో ఇది ఏమిటో పాట సాహిత్యం

 
చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: ఘంటసాల, పి.లీల

ఏమిటో ఇది ఏమిటో 

Palli Balakrishna Thursday, August 3, 2017

Most Recent

Default