Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Search results for Shivaratri Song
Shivaratri Song 2020 Lyrics - Mangli, Charan Arjun

Shivaratri Song (2020) Lyrics in Telugu and English – జగమంతా నీదే కదరా జంగమా

SONG DETAILS
Song : Shivaratri Song 2020 (జగమంతా నీదే కదరా జంగమా)
Category : Devotional
Deity : Lord Shiva
Music & Lyrics : Charan Arjun
Singer : Mangli
Director : Damu Reddy
Release Date : February 18, 2020
Language : Telugu

Shivaratri Song 2020 Lyrics in Telugu and English

'Shivaratri Song 2020' (Jagamantha Needhe Kadara Jangama) is a powerful, energetic Telugu Lord Shiva devotional track released on the occasion of Maha Shivaratri. Powerfully rendered by Mangli, with divine music and philosophical lyrics penned by Charan Arjun, directed by Damu Reddy.

SONG INFORMATION
Song : Shivaratri Song 2020 (Jagamantha Needhe Kadara Jangama)
Category : Devotional
Deity : Lord Shiva
Singer : Mangli
Music & Lyrics : Charan Arjun
Release Year : 2020

Shivaratri Song 2020 Lyrics in Telugu

జగమంతా నీదే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా అర్థమవని ఆధిభిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాగు పాము నీ మెడలోన హారమా నరులనెపుడు గాచే చెడు సంహారమా తలన గంగ ఉన్నా తీరని దాహమా డోలె పట్టి తిరగడము నీకు అవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా అర్థమవని ఆధిభిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా నీదే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో ఆ స్మశాన సంచారం కుభేరునికే వరములు కుమ్మరించి అష్టసిద్ద నిధులు నువ్వేమో భిక్షాటన అసలేంటి ఈ మర్మం విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే నీ మాట దాటి చిన చీమ కూడ కాటెయ్యదుగా ఓ పరమేశ ఓ చిటికేసి తీర్చేయ్యరాద మా అందరి హరిగోస నిలకడ ఎటు లేని నిత్య ప్రయాణమా నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా అర్థమవని ఆధిభిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర నటరాజ స్వరూపమా పంచభూతములన్నీ నీ వశమా చావు పుట్టుకలనే మించినది నీ మహిమ కైలాసం వీడవా కాస్తైనా చూడు జనం గొడవ అనుమానం తీర్చవా నువ్ మనిషా దేవుడివా నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా నీకు మాత్రం సిత్రంగా ఒళ్ళంతా బూడిదేలా ఒక యేడు కాదు రెండేళ్లు కాదు ప్రతి యేడు ఇంతే మా ప్రేమా నిను సుట్టవోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేళ ఒక్క పొద్దు జాగారాలకు ధీటుగా సక్కదిద్దు మా బతుకులనే తేటగా కోటి పేర్లు నీకున్నా అలవాటుగా శంకరయ్య అంటే పలుకు ప్రేమగా జగమంతా నీదే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా నాగు పాము నీ మెడలోన హారమా నరులనెపుడు గాచే చెడు సంహారమా అర్థమవని ఆధిభిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా తలన గంగ ఉన్నా తీరని దాహమా డోలె పట్టి తిరగడం నీకు అవసరమా ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర

Shivaratri Song 2020 Lyrics in English (Transliteration)

Jagamanthaa needhe kadharaa Jangamaa Janamandharu poojinche Shivalingamaa Ardhamavani aadhibhikshu avathaaramaa Aacharinchi thelipe jeevitha saaramaa Naagu paamu nee meda lona haaramaa Narulanepudu gaache chedu samhaaramaa Thalana ganga unnaa theerani dhaahamaa Dole patti thiragadamu neeku avasaramaa Nindu nalupu roopamaa nijaalento choopumaa Janthu charma dhehamaa anthuleni sandhehamaa Ardhamavani aadhibhikshu avathaaramaa Aacharinchi thelipe jeevitha saaramaa Jagamanthaa needhe kadharaa Jangamaa Janamandharu poojinche Shivalingamaa Om Harom Hara Om Harom Hara Paarvathi sagabhaagamai Gananaadhudi punaadhi puttukavai Velige neekendhuko aa smashana sanchaaram Kubherunike varamulu kummarinchi ashtasiddha nidhulu Nuvvemo bhikshaatana asalenti ee marmam Vishwamantha nee bhaktha janame vaalla yedhalannee nee nivaasame Ayinaa neeku illu ledhata enthati haasyame Nee maata dhaati china cheema kooda kaateyyadhugaa oo Paramesha Oo chitikesi theercheyyaraadha maa andhari harigosa Nilakada yetu leni nithya prayaanamaa Ninnu koliche bhakthula nindu praanamaa Ardhamavani aadhibhikshu avathaaramaa Aacharinchi thelipe jeevitha saaramaa Om Harom Hara Om Harom Hara Nataraaja swaroopamaa panchabhoothamulannee nee vashamaa Chaavu puttukanalane minchinadhi nee mahima Kailaasam veedavaa kaasthainaa choodu janam godava Anumaanam theerchavaa nuv manishaa devudivaa Nee inti manishi aa Paarvathammaku bangaaraale niluvellaa Neeku maathram sithramgaa ollanthaa boodidhelaa Oka yedu kaadhu rendellu kaadhu prathi yedu inthe maa premaa Ninu suttavole yenthanukunnaa ye guttu vippavelaa Okka poddhu jaagaaraalaku dheetugaa Sakkadhiddu maa bathukulane thetagaa Koti perlu neekunnaa alavaatugaa Shankarayya ante paluku preamagaa Jagamanthaa needhe kadharaa Jangamaa Janamandharu poojinche Shivalingamaa Naagu paamu nee meda lona haaramaa Narulanepudu gaache chedu samhaaramaa Ardhamavani aadhibhikshu avathaaramaa Aacharinchi thelipe jeevitha saaramaa Thalana ganga unnaa theerani dhaahamaa Dole patti thiragadam neeku avasaramaa Om Harom Hara Om Harom Hara

Palli Balakrishna Saturday, May 29, 2021




పాట: శివరాత్రి పాట (2019)
సంగీతం: బాజి
రచన: మాట్ల తిరుపతి
గానం: మంగ్లి
దర్శకత్వం: దాము రెడ్డి
విడుదల తేది: 2019


శివరాత్రి పాట (2019) సాహిత్యం

 
పాట: శివరాత్రి పాట (2019)
సంగీతం: బాజి
రచన: మాట్ల తిరుపతి
గానం: మంగ్లి

పల్లవి:
ఎండి కొండాలు ఏలేటోడా 
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా 
జగాలనుగాసే జంగముడా

కంఠాన గరళాన్ని దాసినోడా
కంటి చూపుతో సృష్టిని నడిపే టొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రాహ్మండాలు నిండినోడా

నాగభరణుడా నందివాహనుడా
కేదారినాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వరా

||ఎండి కొండాలు ఏలేటోడా||

చరణం: 1
పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలారాలు పంచేరే 
కోరస్: పలారాలు పంచేరే 

గండా దీపాలు ఘనముగా వెలిగించేరే
గండాలు బాపమని పబ్బాతులు పట్టేరే
కోరస్: పబ్బాతులు పట్టేరే

లింగనా రూపాయి..తంబాన కోడేను
కట్టినా వారికి సుట్టానీవే
తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు
మొక్కినా వారికీ  దిక్కు నీవేలే

వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే 
కోరస్: పలికేటి దేవుడావే

కోరితే కోడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే

||ఎండి కొండాలు ఏలేటోడా||

చరణం: 2
నీ యాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే
నరులకు అందని నీ లీలలు చిత్రాలులే
కోరస్: లీలలు చిత్రాలులే

కొప్పులో గంగామ్మ పక్కన పార్వతమ్మ
ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే
కోరస్: ముక్కంటిశ్వరుడావే

నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడ కరుణాలాదేవుడ
కరునించామని నిన్నూ వెడుకుంటామే

త్రీలోక పూజ్యూడా త్రిశూల ధారుడా
పంచభూతాలకు అధిపతివి నీవూరా
కోరస్: అధిపతివి నీవూరా

శరణని కొలిచినా వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా
దేవనా దేవుళ్లు మెచ్చినోడా
ఒగ్గూ జెగ్గుల పూజలు అందివొడా
ఆనంత జీవా కోటిని ఏలినోడా నీవు
అత్మాలింగనివిరా మాయలోడా

కోటి లింగాల దర్శనమిచ్చేటోడా 
కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా
నటరాజు నాట్యాలు ఆడెటోడా
నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా

నాగభరనుడా నంది వాహనుడా
కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా
భీమా శంకరా ఓం కారేశ్వరా 
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర

||ఎండి కొండాలు ఏలేటోడా||

Palli Balakrishna Friday, May 28, 2021




పాట: శివరాత్రి పాట (2021)
సంగీతం: మదీన్ ఎస్ కె
సాహిత్యం: గోరేటి వెంకన్న
గానం: మంగ్లీ జయశ్రీ
దర్శకత్వం: దాము రెడ్డి
నిర్మాణం: నూతనపాటి రామకృష్ణ
విడుదల తేది: 07.03.2021


శివరాత్రి పాట సాహిత్యం

 
పాట: శివరాత్రి పాట (2021)
సంగీతం: మదీన్ ఎస్ కె
సాహిత్యం: గోరేటి వెంకన్న
గానం: మంగ్లీ జయశ్రీ

హరహర మహాదేవ శంకరా
హరహర మహాదేవ శంకరా

ఓ ఓ... సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా
అండము నీవే పిండము నీవే
ఓ ఓ...ఆత్మవు నీవే పరమాత్మవు నీవే

అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో... పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే

సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా

ఓ  ఓ...గిరీ సుర సుతా గౌరీ సఖీయై నీ తోడుండా
శంఖ జోలె శంఖు పుర్రె నీకు పూదండ
రంగు లేని నాగమణిమెడలోన వెలుగుచుండ
ఏమీ లేని భైరాగోలే యాచించుచుండ
వెన్నెలనే తలపై కొలువై చిందులాడ
ఎందుకురా బూడిద నీ నొసట
గిరిజనమే నీకు బంధువులైరిరా
సిరులున్నా మురువవు సిత్రమురా
కలిమి లేమి కష్టము సుఖము
ఓ ఓ... నీతూకములో అంతా ఒకటే

అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళపు సంద్రము నీవే
ఒహో...ఉండీ లేనట్టుండే ఉనికివి నీవే
ప్రళయ విలయ తాళాలకు కర్తవు నీవే

సాధు జంగమా ఆది దేవుడా
హరహర మహాదేవ శంకరా

ఓ ఓ...బిలువమాల సుగంధాల పూసిన పూల పల్లకి నేల
తలపించేను కమనీయంగా శివుడా నీ లీల
సద్గురు వేదం శంభుని నాదం...
అందాల ఈ సుందర ధామం
నింగీ నేలకు నిచ్చెనలు వేసే పావన పీఠము

ఈ దినమే గానం ప్రణవ నాదముగా
ఢమరుకమే ధిమిధిమి మోగెనురా
భువి నుంచి గంగ దివికే పొంగెనురా
నటరాజై శివుడే ఆడెనురా
నమః శివాయ సిద్ధనమాయ
ఓ ఓ...సిద్దనమాయ అభిశుద్ధ నమాయ

పంచాక్షరీ జపమంత్రమే పరమశివాయ
కైవల్యం కైలాసం నమః శివాయ
ఒహో అద్వైతం శివతత్వం సదాశివాయ
పూర్ణం పరిపూర్ణం గురుపూర్ణనమాయ

సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా

అండము నీవే పిండము నీవే
ఓ ఓ...ఆత్మవు నీవే పరమాత్మవు నీవే
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో...పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే

సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
హరహర మహాదేవ శంకరా

Palli Balakrishna Thursday, May 27, 2021

Most Recent

Default