చిత్రం: మంచి రోజులొచ్చాయి (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ దర్శకత్వం: మారుతి నిర్మాత: V Celluloid & SKN విడుదల తేది: 04.11.2021
Songs List:
సో సో గా ఉన్న (ఒకటే ఒకటేలే) పాట సాహిత్యం
చిత్రం: మంచి రోజులొచ్చాయి (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: సిద్ శ్రీరాం సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకుపోవే నా కళ్ళే ఎందరిలోన ఎంతదూరమున్న నీ చూపు నన్ను అల్లేనా చిన్ని బేబీ… ముద్దు బేబీ లవ్ యూ బేబీ… నువ్ నా బేబీ ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే తనువులు రెండైనా… ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే ఊహలు ఒకటే… దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యము ఒకటే సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే నీపేరు రాసి నా కళ్ళల్లోనే అచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనా ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే, వీడిపోను నిన్నే చిన్ని బేబీ… ముద్దు బేబీ లవ్ యూ బేబీ… నువ్ నా బేబీ ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే, (ఒకటేలే) తనువులు రెండైనా… ఊపిరి ఒకటేలే, (ఒకటేలే) ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే, ఓ ఓ ఊహలు ఒకటే… దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యము ఒకటే ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే
ఎక్కేసింది పాట సాహిత్యం
త్వరలో...
మంచి రోజులొచ్చాయి పాట సాహిత్యం
చిత్రం: మంచి రోజులొచ్చాయి (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: హరిచరణ్, శ్రావని చీకటిలో ఉన్నా… దారే లేకున్నా నీకే నువ్వు తోడై ఉండి… లే త్వరగా బలమే లేకున్నా… బాధే అవుతున్నా ఆశే నీలో నింపుకోరా ఊపిరిగా కన్నుల్లో నీటి చుక్కే ఉన్నా గాని నవ్వేసి చూడు రెయిన్బో రంగుల్లని నెలవంకా లాగ చిక్కిపోయినా గాని వెన్నెల పంచు పున్నమిలా మంచి రోజులొచ్చాయి ఓ మంచి రోజులొచ్చాయీ మంచి రోజులొచ్చాయి అందరికీ మంచి రోజులొచ్చాయీ హో, నింగి నేలకే దూరం ఎంత దూకేస్తే ధైర్యంగా ఓ చినుకంతా నమ్మకమే నీకుంటే విత్తనమంతా చిగురించవా చెట్టంతా మండే ఎండకేం వెనుకడుగెందుకు పెరిగే నీడలా పదా ముందుకు ఈరోజే మళ్ళీ పుట్టి వేకువలా మంచి రోజులొచ్చాయి, వచ్చాయి ఓ మంచి రోజులొచ్చాయీ, ఈ ఈ, వచ్చాయి మంచి రోజులొచ్చాయి అందరికీ మంచి రోజులొచ్చాయీ, ఈ ఈ, వచ్చాయి
కనబడని దైవం (Female Version) పాట సాహిత్యం
చిత్రం: మంచి రోజులొచ్చాయి (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: సాహితి నా చిన్ని పాదం… నీ గుండెపైన ఆటాడుతుంటే… నువ్ మోసావు నాన్న నీలోని ప్రాణం… నాలోన దాచి నిన్నే నాలో చూసావు… ఓ నాన్న నీ వల్లే ప్రేమంటే తెలిసింది… ఓ నాన్న నీ వెంటే సంతోషం… కలిసిందిలే నాన్న నీ చేతుల్లో ఉంటె… భయమేది ఓ నాన్న ఒంటరిగా నేనున్నా… నా దైర్యం నువ్వేగా నా నీడలా నా వెనుకే ఉంటునే నడిపావులే నా ముందు దారుల్నే నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అల్లావు ఓ నాన్న ఆరారో ఆరారిరాయే ఆరారో ఆరారో ఆరారిరాయే ఆరారో ఆరారిరాయో అరరాహి అరరాహి అరరాహి రాయే అరరాహి అరరాహి అరరాహి రాయే కనిపించే దైవం నువ్వైనావు కనిపించి ప్రతిరోజు పూజించినావు నా కళ్ళ ముందు… నువ్వుంటే చాలు నిన్నే చూస్తూ… బతికేస్తా ఓ నాన్న
కనబడని దైవం (Male Version) పాట సాహిత్యం
చిత్రం: మంచి రోజులొచ్చాయి (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: ధనుంజయ్ నువ్వంటూ లేక… నే లేనే అమ్మ నీ రక్తమే పంచి… ఇచ్చావే జన్మ నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే తొలిముద్ద నువ్వై నా కడుపు నింపావే మనసంతా పూసేటి… ఓ హాయి నువ్వమ్మ కన్నీరే తుడిచేటి… ఆ చేయి నీదమ్మ పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మా నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మా నా నిదురకే నువ్వూయలయ్యావు నాకోసమే కలలెన్నో కన్నావు ఓ కంచెలా నా కాపలున్నావు నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు ఆరారో ఆరారిరాయే ఆరారో ఆరారో ఆరారిరాయే ఆరారో ఆరారిరాయో అరరాహి అరరాహి అరరాహి రాయే అరరాహి అరరాహి అరరాహి రాయే ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ నా కళ్ళల్లోనా… వెలుగుల్ని నింపి చీకట్లో ఈరోజు… మిగిలావే అమ్మ నను కన్న తల్లి నా ఆయువిచ్చి నిన్నే నిన్నే బ్రతికించుకుంటానే
Manchi Rojulochaie (2021)
Palli Balakrishna
Tuesday, November 2, 2021
