Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Yuvaratna (2002)



చిత్రం: యువరత్న (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నందమూరి తారకరత్న, జివిదా శర్మ
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణ రావు
నిర్మాత: నందమూరి రామకృష్ణ
విడుదల తేది: 29.11.2002

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో
సీతారామయ్యగారి మనవరాలురో
బెల్లంతో కలుపుకుంటే మరమరాలురో
నో అంటే ఎస్సనిలే  పొమ్మంటే రమ్మనిలే
ఛీ అంటు కసురుకుంటే  టోటల్ గ ఓకేరో

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో
సీతారామయ్యగారి మనవరాలురో
బెల్లంతో కలుపుకుంటే మరమరాలురో
నో అంటే ఎస్సనిలే  పొమ్మంటే రమ్మనిలే
ఛీ అంటు కసురుకుంటే  టోటల్ గ ఓకేరో

చరణం: 1
ఉత్తరాన్ని చించిందంటే నీపై చిత్తశుద్ధి ఉన్నట్టే
గిఫ్టు తిప్పి పంపిందంటే నిన్ను గాడుగిఫ్టు అనుకున్నట్టే
బండబూతు తిట్టిందంటే నీపై బండెడంత ప్రేమున్నట్టే
చెప్పు చేత పట్టిందంటే నీ చెప్పు చేతల్లొ ఉంటుందన్నట్టే
కస్సంటే కిస్సనిరో  బుస్సంటే కస్సనిరో
ఆడాళ్ళ మాటలకు అర్థాలు రివర్సురో

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో

చరణం: 2
పైట కాస్త సర్దిందంటే నిన్ను సైటు కొట్టమన్నట్టే
వెనక తిరిగి చూసిందంటే నీ పై ముందు చూపులున్నట్టే
పళ్ళు కాస్త కొరికిందంటే నీకు పచ్చ జండ చూపినట్టే
అన్నతోటి చెప్పిందంటే నిన్ను అల్లుడిగ ఇంట్లోకి రమ్మన్నట్టే
తప్పంటే తప్పదనిరో  ఉ ఊ అంటే ఉన్నదనిరో
ఆడాళ్ళ మాటలకు కొత్త డిక్షనరి కావాల్రో

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో
సీతారామయ్యగారి మనవరాలురో
బెల్లంతో కలుపుకుంటే మరమరాలురో
నో అంటే ఎస్సనిలే  పొమ్మంటే రమ్మనిలే
ఛీ అంటు కసురుకుంటే  టోటల్ గ ఓకేరో


********   *********   *********


చిత్రం: యువరత్న (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సాధనా సర్గం , కళ్యాణి మాలిక్

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో
వలపుల పాటలు పాడవా..
వలపుల తెలుగుల తొలి పిలుపులలో
చెలిమికి నా మది చూపవా...

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో
వలపుల పాటలు పాడవా..
వలపుల తెలుగుల తొలి పిలుపులలో
చెలిమికి నా మది చూపవా...

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...

చరణం: 1
ఏతోటలో ఏ కొమ్మకో తారల్లె విరిసిన పువ్వా...
నాలో కోరిక వినవా తన సిగలో జాబిలి కావా
వేసంగిలో వెన్నెల్లలో గువ్వల్లె మెరిసిన పువ్వా...
నాలా నువ్వై పోవా తన ఒడిలో పాపవు కావా
పసి పసి మనసుల మొరలను వినవా
మధురిమ మంత్రం వేయవా
మా పరుగుల ఉరుకుల ప్రేమల త్రోవ
పరిమళ భరితం చేయవా

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...

చరణం: 2
ముత్యానికే ముస్తాబులా తెల్లంగ పూచిన పువ్వా
నాతో ఏకం కావా తన పదముల పూజకు రావా
గోదారికే పైటంచులా స్వచ్చంగ విచ్చిన పువ్వా
నాలో సిగ్గులు కనవా నా తేనెలు తనకందీవా
ఇటు అటు తెలియని వయసుల గొడవా
ఇదియని నువ్వే తేల్చవా
మా ఇరువురి నడుమన వారధి కావా
ఈ ఒక సాయం చేయవా

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...


********   *********   *********


చిత్రం: యువరత్న (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: షాన్

నీది 98480...  నాది 98490...
నెంబరు మాత్రం బంపరు గుంది ఇంతకి నీదేం పేరో
నీది 98480... నాది 98490...
స్ట్రక్చరు మొత్తం సూపరు గుంది ఈ ఊరో పొరుగూరో
మనకిక లేదు టుమారో  కనుకే దుమ్ము దుమారో
చూడరు బారో గీరో  కొడదాం జిన్నో బీరో
రోము నగరమే తగలడుతున్నా ఫిడేలు మీటెను నీరో
పాపం పుణ్యం పక్కన పెట్టి సుఖపడి పోదాం యారో

నీది 98481... నాది 98491...
వన్ను వన్ను ఒకటే ఐతే ఉన్నది ఎంతో ఫన్నూ
నీది 98481... నాది 98491...
వెన్ను వెన్ను కలిసాయంటే మైకం కలుగును టన్నూ
నాకో మారుతి జెన్ను ఉందోయ్ ఇంతకు మున్ను
మొన్నే చూశా నిన్ను  నీకై అమ్మేశాను
కోతి నుంచి మనిషొచ్హాడంటూ చెప్పెనురా డార్విన్నూ
కోతి పనులనే చెయ్యకపోతే తోచదు దారి తెన్నూ

నీది 98482... నాది 98492...
ఆఖరి అంకెలు టూలే ఐతే ఇంకా ఎందుకు లేటూ
నీది 98482... నాది 98492...
నోకియ సెల్లును చేతిలో ఉంటే సఖియా మనకేం లోటు
నాకో మెసేజ్ కొట్టు  చీకటి మూర్తం పెట్టు
కొంచెం భయమే పుట్టు బోలెడు సుఖమే గిట్టు
మొబైల్ ఫోను కనిపెట్టిన వాడికి రోజు సలాము కొట్టు
ఫోను బిల్లు కట్టాల్సిన రోజు నాకే గుడ్ బై కొట్టు

నీది 98483...  నాది 98493...
ఈ త్రీ ఆ త్రీ రెండు కలిపెను నీకు నాకు మైత్రీ
నీది 98483...  నాది 98493...
మైత్రే కలిసిన గుర్తుగ మనము గడిపేద్దాం ఓ రాత్రి
నేనే మన్మధ శాస్త్రి  ఇస్తా ముద్దు భజంత్రి
ఇస్తే ఒంపుల పత్రి చేస్తా ఇంపుగ ఇస్త్రి
ఆట పాటలు అయిపోయాయి టాటానోయ్ అభినేత్రి
అదిగో అదిగో వచ్చేస్తోంది నావైపే ఇంకో స్త్రీ

Most Recent

Default