చిత్రం: భలే రాముడు (1956)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర
గానం: ఘంటసాల, పి.లీల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గిరిజ
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: వి.ఎల్.నరసు
విడుదల తేది: 06.04.1956
ఓహొ మేఘమాల..ఆ.. నీలాల మేఘమాల
ఓహొ మేఘమాల నీలాల మేఘమాల
చల్లగ రావేలా.. మెల్లగ రావేలా
వినీలా మేఘమాలా వినీలా మేఘమాలా
నిదురపొయే రామచిలుకా నిదురపోయే రామచిలుకా
బెదిరిపోతుందీ.. కల చెదిరిపోతుంది
ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
ప్రేమ సీమలలో చరించే బాటసారీ ఆగవోయి
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ
ఏ? నిదురపోయే రామచిలుకా నిదురపోయే రామచిలుకా
బెదిరిపోతుందీ.. కల చెదిరిపోతుందీ
ఓహొ ఓ.... ఓహొ.. ఓ
ఆశలన్నీ తారకలుగా హారమొనరించీ
ఆశలన్నీ తారకలుగా హారమొనరించీ
అలంకారమొనరించీ
మాయ చేసి మనసుదోచి
మాయ చేసి మనసుదోచి పారిపోతావా దొంగా