చిత్రం: అన్వేషణ (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి బాలు, యస్. జానకి
నటీనటులు: కార్తిక్, భానుప్రియ
దర్శకత్వం: వంశీ
నిర్మాత: కామినేని ప్రసాద్
విడుదల తేది: 22.05.1985
స నిసరిసని...ఆ హా హా
స నిసమగమరి...ఆఆఆ ఆఆఆఆ
పదస నిసరి సని...ఆ హా హా
స నిసమగమరి...ఆఆఆ ఆఆఆఆ
పద ససని నిని రిస గగ గరి మమ మగ ప
స ని ద ప మ గ రి స ని
చరణం: 1
కీరవాణీ చిలకలా కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు విరి తేనెను చల్లగా
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురస వాణి
కీరవాణీ చిలకలా కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా
గరిగ సమగ పని సరిగ రిగస నిగ
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో ఛైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే
కలలిక కలువక స్వరముల గతియిక గమకము తెలియకనే
కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా
ఇల రాలిన పువ్వులు ఎద జల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ
కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా
చరణం: 2
నీ కన్నుల నీలమై నీ నవ్వుల వెన్నెలై
సంపెంగల గాలినై తారాడనా నీడనై
నీ పవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే...
పడుచుల మనసుల కుంజర సుఖముల పలుకులు తెలియకనే
కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు... విరి తేనెను చల్లగా
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురస వాణి
కీరవాణీ చిలకలా కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా
********* ******** *********
చిత్రం: అన్వేషణ (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి బాలు, యస్. జానకి
ఏకాంత వేళ ఏకాంత సేవ
ఏకాంత వేళ ... కౌగిట్లో
ఈ కాంత సేవ ... ముచ్చట్లో
పడుచమ్మ దక్కే ... దుప్పట్లో
దిండల్లె ఉండు ... నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై
ఏకాంత వేళ ... కౌగిట్లో
ఈ కాంత సేవ ... ముచ్చట్లో
ఏకాంత వేళా.........
చరణం: 1
ముద్దు సాగిన ... ముచ్చట్లో
పొద్దు వాలదు ... ఇప్పట్లో
ముద్దు సాగిన ... ముచ్చట్లో
పొద్దు వాలదు ... ఇప్పట్లో
కమ్ముకున్న ... ఈ కౌగిట్లో
కాటుకంటి ... నా చెక్కిట్లో
నన్ను దాచుకో ... నా ఒంట్లో
పడకు ఎప్పుడూ ... ఏకంట్లో
నన్ను దాచుకో ... నా ఒంట్లో
పడకు ఎప్పుడూ ... ఏకంట్లో
ఆ... చప్పట్లు ఈ... తిప్పట్లు
నా... గుప్పెట్లోనే
ఏకాంత వేళ ... కౌగిట్లో
ఈ కాంత సేవ ... ముచ్చట్లో
పడుచమ్మ దక్కే ... దుప్పట్లో
దిండల్లె ఉండు ... నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై
ఏకాంత వేళ ... కౌగిట్లో
ఈ కాంత సేవ ... ముచ్చట్లో
ఏకాంత వేళా.........
చరణం: 2
గుబులు చూపుల ... గుప్పిట్లో
ఎవరు చూడని ... చీకట్లో
గుబులు చూపుల ... గుప్పిట్లో
ఎవరు చూడని ... చీకట్లో
చిక్కబోములే ... ఏకంట్లో
ఎదలు కలుపుకో ... సందిట్లో
దేవుడొచ్చిన ... సందట్లో
ఎదురులేదులే ... ఇప్పట్లో
దేవుడొచ్చిన ... సందట్లో
ఎదురులేదులే ... ఇప్పట్లో
ఆ... చీకట్లో రా... కౌగిట్లో
మ్మ్... నిద్దట్లో
ఏకాంత వేళ ... కౌగిట్లో
ఈ కాంత సేవ ... ముచ్చట్లో
పడుచమ్మ దక్కే ... దుప్పట్లో
దిండల్లె ఉండు ... నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై
ఏకాంత వేళ ... కౌగిట్లో
ఈ కాంత సేవ ... ముచ్చట్లో
ఏకాంత వేళా.........