చిత్రం: ఆరాధన (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: చిరంజీవి , సుహాసిని, రాధిక
దర్శకత్వం: భారతీరాజ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 27.03.1987
ఆ గొఱ్ఱెపిల్ల నీకే దొరికితే నువేంచేస్తావ్
మనమయితేనా దెబ్బకి తెగనరికి
ఏటపలవ్ వండుకొని తినము
అఁ ... అహ్... హా... హా... హా... హా... ఆహ్...
ఆఁ ... అదే జెన్నిఫర్ అయితే
టీచర్
అది... నేనే అయితే
అరే ఏమైందీ...
అరే ఏమైందీ...
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ...
తన మనిషిని వెతుకుతు ఇక్కడికొచ్చి వాలిందీ
కలగాని - కలఏదో
కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దుర లేపిందీ అ...
అరే ఏమైందీ ...
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ ...
అది ఏమైందీ...?
చరణం: 1
నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది
నేలపొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలునేను చూడలేను పూజలేవి చేయలేను
నేలపైన కాళ్ళులేవు నింగివైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కాన రాణి గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో... ఓ... ఓ...ఓ...
లలలల లా... లలలల లా...
లలలల లా... లలలల లా...
లలలల లా... లల లల లల లల లల లలలా
చరణం: 2
బీడులోన వానచినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతుతానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడిరాత దేవుడేమి రాశాడో
చేతనైతే మార్చిచూడు వీడుమారిపోతాడు
మనిషౌతాడు... ఉ... ఉ...ఉ
అరే ఏమైందీ...
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ...
తనమనిషిని వెతుకుతు ఇక్కడికొచ్చి వాలిందీ...
కలగాని - కలఏదో
కళ్ళెదుటే నిలిచిందీ
అదినీలో మమతను నిద్దుర లేపింది
అరే ఏమైందీ...
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ...
అది ఏమైందీ...?