Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jayam Manadera (2000)




చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: వెంకటేష్, సౌందర్య, భానుప్రియ
దర్శకత్వం: ఎన్. శంకర్
నిర్మాత: డి. సురేష్ బాబు
విడుదల తేది: 07.10.2000



Songs List:



డోంట్ మిస్ సోదరా... పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

డోంట్ మిస్ సోదరా...
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్
డోంట్ మిస్ సోదరా
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్

ఏ ఆనందం డోంట్ మిస్
నీ అనుబంధం డోంట్ మిస్
ఏ అవకాశం డోంట్ మిస్
ఈ ప్రతి నిమిషం డోంట్ మిస్
విలువైన చిన్ని నవ్వులే
నేడు రేపు ప్లీజ్ డోంట్ మిస్
నా మాటే ఏ నాడు డోంట్ మిస్

డోంట్ మిస్ సోదరా
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్

చిన్న నాడు ఎల్కేజీ చదివే నాడు
మాస్టారి తిట్లు ప్లీజ్ డోంట్ మిస్
పెద్ద నాడు నను పీజీ గెలిచే నాడు
లేడీ చివాట్లు ప్లీజ్ డోంట్ మిస్
పోపు డబ్బాలోనా అమ్మ దాచుకున్న
చిల్లరంతా డోంట్ మిస్
అర్ధ రాత్రి లోన స్టార్ మూవీ లోన అందమంతా డోంట్ మిస్

ఆకతాయిలాగా ఆడిపాడుతున్నా
ఆ పైన విజయాలు సాధించు మార్గాన్ని
ప్లీజ్ డోంట్ మిస్

డోంట్ మిస్సోదరా
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్

ఫాస్ట్ ఫుడ్ తింటూనే ఉన్నాగాని
మన పప్పు నెయ్యి ప్లీజ్ డోంట్ మిస్
ఫాస్ట్ బీటు వింటూనే ఉన్నాగాని
మన జోల పాట ప్లీజ్ డోంట్ మిస్

హే జీన్సు ఉన్నాగాని సూటు ఉన్నాగాని
పంచెకట్టు డోంట్ మిస్
ఏసీ ఉన్నాగాని పల్లె సీమల్లోని
పైరగాలి డోంట్ మిస్
డాట్ కం చదువు డాలర్లు చేయు పొదుపు
ఏమైనా ఏదైనా నువ్ మాత్రం దేశాన్ని
ప్లీజ్ డోంట్ మిస్

డోంట్ మిస్సోదరా
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్

ఏ ఆనందం డోంట్ మిస్
నీ అనుబంధం డోంట్ మిస్
ఏ అవకాశం డోంట్ మిస్
ఈ ప్రతి నిమిషం డోంట్ మిస్
విలువైన చిన్ని నవ్వులే
నేడు రేపు ప్లీజ్ డోంట్ మిస్
నా మాటే ఏనాడు డోంట్ మిస్





మెరిసేటి జాబిలి నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కుమార్ సాను, స్వర్ణలత

మెరిసేటి జాబిలి నువ్వే
కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్  నను లవ్ లో దించేశావ్

మనసైన వాడివి నువ్వే 
ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే
ఓ మై ఓ మై లవ్  నను మైమరపించేశావ్
ఓ మై ఓ మై లవ్  టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది ? 
ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

మెరిసేటి జాబిలి నువ్వే
కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్

అల్లుకో బంధమా 
ఒంటరి అల్లరి తీరేలా జతకానా జవరాలా
ఆదుకో ప్రణయమా 
తుంటరి ఈడుని ఈ వేళ 
ఓదార్చనా ప్రియురాలా

నా ఆశలన్ని నీ కోసమంటూ నీ దారి చూడని
నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడనీ
మసక చీకట్లలో నా మనసు అందించనీ
ఓ మై ఓ మై లవ్  టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది?
ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది  ప్రేమందుకోమంది

మనసైన వాడివి నువ్వే 
ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే
ఓ మై ఓ మై లవ్, నను మైమరపించేశావ్

కలిసిరా అందమా 
చుక్కల వీధిన విహరిద్దాం
స్వర్గాలను చూసొద్దాం
కరగవే సందేహమా 
చక్కగ దొరికెను అవకాశం 
సరదాగా తిరిగొద్దాం

నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ
నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటని
వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ

ఓ మై ఓ మై లవ్  టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది? 
ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది  ప్రేమందుకోమంది

మెరిసేటి జాబిలి నువ్వే
కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్  నను లవ్ లో దించేశావ్
ఓ మై ఓ మై లవ్  టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది? 
ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది  ప్రేమందుకోమంది




హ్యాపీగా జోలీగా పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: సోను నిగమ్, గోపికా పూర్ణిమ

హ్యాపీగా జోలీగా




హిందూస్తాన్ లో పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, జస్పిందర్ నరుల

హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా
రాజస్థాన్ లో ఒంటెలకంటే హైటే నువ్వేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా
నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా
ముద్దు పేటెటందుకు మూడు రాత్రులు చాలునా
కాలం కలిసొస్తే దేవుడు దిగివస్తే
కిర్రుమనని ఒక మంచం అడగాలే

హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా
రాజస్థాన్ లో ఒంటెలకంటే హైటే నువ్వేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా

హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా

ఒంపుల అవి పదనుగ ఎదిగిన
మనసుని కోసిన మెత్తని రంపాలు
చూపుల అవి హృదయపు లోతున
కవితలు రాసిన కాముని బలపాలు
వల వేస్తున్న - వలదన్నాన
గుండె వీడియో లోన నీ నిండు బొమ్మ నిలిపేయినా
నీ అంద జేరింది పండు భామిని

కాలం కలిసొస్తే దేవుడు దిగివస్తే
మడత పడని ఒక బెడ్ షీట్ అడగాలే

హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా
రాజస్థాన్ లో ఒంటెలకంటే హైటే నువ్వేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా

మాటల అవి సూటిగా సాగిన
పైటను తాకినా తియ్యని తూటాలు
నవ్వుల అవి చల్లని యవ్వన
చెల్లలు చిలికిన అల్లరి కవ్వాలు
పెను వేస్తున్న - వెను తీస్తాను
సోకు నోటుబుక్ లోన
ఐ లైక్ యూ అంటూ రాస్తున్న
నా పొందు కోరింది మందాగామిని
కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే
నలిగిపోని మరు మల్లెలు అడగాలే

హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా
రాజస్థాన్ లో ఒంటెలకంటే హైటే నువ్వేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా

నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా
ముద్దు పీటటందుకు మూడు రాత్రులు చాలునా
కాలం కలిసొస్తే దేవుడు దిగివస్తే
కిర్రుమనని ఒక మంచం అడగాలే




పెళ్లికి బాజా మోగింది పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, కవితా కృష్ణమూర్తి

పెళ్లికి బాజా మోగింది 
కుమారి శ్రీమతి కానుంది (2)
పట్టుపంచెకి పైట కొంగుకి
ముడి పెట్టె గడియే ముందున్నది
పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చే 
మెల్లోన మాలవేసేయ్
అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై
ఇల్లాలి పదవీ ఇచ్చయ్

పెళ్లికి బాజా మోగింది
కుమారి శ్రీమతి కానుంది

తాబుంలం తేగా తాపలే తూగా 
రావయ్య రావయ్య రావయ్య బావయ్య
వడ్డానం లాగ వాటేస్తా బాగా 
దావమ్మ దావమ్మ దావమ్మ దానిమ్మ
కొక గల్లలో శుభలేఖలు రాసేస్తా
ఈడు గుమ్మలో ఏడడుగులు నడిపిస్తా
వయ్యారం వరకట్నంలా ఇస్తా నీ వెంటే వస్తా
మేనాలో కాలు పెట్టెసై హామ్ హాయ్ 
నా మనసు డోలు కొట్టై దినుకు దీనదీనతా
మిడిదింట్లో కూత వేసేసై హాయ్ హాయ్ 
నా వయసు మోత మోసేయ్

ఓయ్ పెళ్లికి బాజా మోగింది
కుమారి శ్రీమతి కానుంది

అబ్బబ్బో హాయి అచ్చోచ్చే రేయి
ఆయి ఆరెయి ఆరెయి అందాలే
అందిస్తా చేయి ఆడిస్తానోయి
తోడేయి తోడేయి తోడేయి నా ఈడే
పంటి ఘాటుల్లో నీ పంటే పండిస్తా
గోటి గుర్తుల్లో నా ఓటె నీకెస్తా
హేయ్ సొయగమే వండే వార్చే వంట శోభనమేనంటా
నా కాలికి మెట్టెలు పెట్టేసేయ్ 
వచ్చే నా ఇంటిపేరు మార్చేయ్
నా వంటికి జోలలు కొట్టేసేయ్ 
విచ్చేయ్ నన్నింటివాన్ని చేసేయ్

పెళ్లికి బాజా మోగింది
కుమారి శ్రీమతి కానుంది (2)
పట్టుపంచెకి పైట కొంగుకి 
ముడి పెట్టె గడియే ముందున్నది
పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చే 
మెల్లోన మాలవేసేయ్
అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై 
ఇల్లాలి పదవీ ఇచ్చయ్

పెళ్లికి బాజా మోగింది
కుమారి శ్రీమతి కానుంది




ఓ చూపుకే పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, అనురాధ శ్రీరామ్

ఓ చూపుకే




చిన్ని చిన్ని ఆశలన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కలేకూరి ప్రసాద్
గానం: వందేమాతరం శ్రీనివాస్

చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
ఊరు వాడ కలిసి జాతరయ్యి వచ్చెనే
తోడు నీడ కలిసి మహదేవుడయ్యెనే
ఆనందము ఆకాశము
సందడై సంద్రమై ఉప్పొంగెనే

చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే

నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు
నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు
చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ
పండగై ఉంటాడు ఆడంగ పాడంగ
కలగలిసి ఉండాలి దండుగా
కడదాక ఉంటాను అండగా
సాగరా చాటరా జయం మనదేరా

చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
పంటలతో నేల తల్లి పొంగెనే
సంపదతో పల్లెలన్నీ నిండెనే
సాగరా చాటరా జయం మనదేరా


Most Recent

Default