Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Meghasandesam (1982)




చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ
దర్శకత్వం & నిర్మాత: దాసరి నారాయణరావు
విడుదల తేది: 24.09.1982



Songs List:



ఆకాశ దేశాన ఆషాఢ మాసాన పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: కె.జేసుదాసు

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి  మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం  మేఘసందేశం 

వానకారు కోయిలపై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలపై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి  మేఘమా

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిథిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో





ఆకులో ఆకునై పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
గానం: పి.సుశీల

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా




ముందు తెలిసెనా ప్రభూ పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
గానం: పి. సుశీల

మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త
ముందు తెలిసెనా ప్రభూ

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందార కుంద సుమదళములు పరువనా
సుందర మందార కుంద సుమదళములు పరువనా
దారి పొడుగునా తడిచిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త
ముందు తెలిసెనా ప్రభూ

బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బందింపలేను హృదయము సంకెల చేసి

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త
ముందు తెలిసెనా ప్రభూ




నవరస సుమ మాలికా పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: కె.జె. యేసుదాసు

నవరస సుమ మాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరస సుమ మాలికా
సని సరి గరి సరి మపని పనిస గరి
గరి సనిద దని తపమ గరి నిసగ
నవరస  సుమ మాలికా
సగమ గమప గమ గప మగసగ సని
పనిసగ సగమ గమప నిని పమప
త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య
తెలుగింటిలోన వెలిగించిన..
తెలుగింటిలోన వెలిగించినా నాద సుధామయ రసదీపిక
నవరస సుమ మలికా

అందాలు అలలైన మందాకిని
మందార మకరంద రసవాహిని
ఆమె చరణాలు అరుణ కిరణాలు
ఆమె నయనాలు నీల గగనాలు
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు
ఆ చిరునవ్వు లేత నెలవంక
ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమో ఇలవంక

నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా

శృంగార రసరాజ కల్లోలిని
కార్తీక పూర్ణేందు కలహారిని
ఆమె అధరాలు ప్రణయ మధురాలు
ఆమె చలనాలు శిల్ప గమనాలు
ఆ దర్శనాలు నా జన్మకు మిగిలిన సుందర సుఖ తరుణాలు
ఆ కనుచూపు నాకు కడదాక
ఆ కనుచూపు నాకు కడదాక పిలుపైనా లేని ప్రియలేఖ

నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరస సుమా మాలికా
నవరస సుమా మాలికా




నిన్నటిదాకా శిలనైనా పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతు ఉన్నా
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని
సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని

మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాస శిఖరాగ్ర శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతు ఉన్నా

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా

నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని

పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు 
చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతు ఉన్నా...

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా




పాడనా వాణి కళ్యాణిగా పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: బాలమురళి కృష్ణ

ఆ... ఆ... ఆ... ఆ... ఆ
గమదని సని పమ నిరిగమ రిగ నిరిస
మమగ గదప దపమ గనిద నిదప మదని
సని గరి సనిద పసని దపమ
నిసని దపమ నిసని గమదని సని పర్మరిగ

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకు శర్వాణిగా నా భాషకు గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచగ మధురవాణి సుఖవాణిగా... ఆ... ఆ
పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా

తనువణువణువున్ను తంబుర నాదము నవనాడుల శృతి చేయగా...ఆ...ఆ
గరిస్స నిదని మద నిదా నిదపద గమ సని దపమ
ఎద మృదంగమై తాళ లయగతులు ఘమకములకు జతకూడగా
అక్షర దీపారాధనలో స్వర లక్షణ హారతులీయగా
అక్షర దీపారాధనలో స్వర లక్షణ హారతులీయగా
తరంతరము నిరంతరము గానాభిషేకమొనరించి తరించగా
పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా

స్వర ముఖరిత నిర్ఝరులు లహరులై దేవి పాదములు కడుగగా
లయ విచలిత గగనములు మేఘమై తానములే చేయించగా
సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై
సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై
తరంతరము నిరంతరము గీతాభిషేకమొనరించి తరించిగా

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకు శర్వాణిగా నా భాషకు గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచగ మధురవాణి సుఖవాణిగా...ఆ...ఆ





ప్రియే చారుశీలే పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: జయదేవుడు
గానం: కె. జేసుదాసు, పి. సుశీల

ప్రియే చారుశీలే




రాధికా... కృష్ణా.. పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: జయదేవుడు
గానం: కె. జేసుదాసు, పి. సుశీల

రాధికా... కృష్ణా..
తవ విరహే...కేశవా..
స్థన విని హితమపి హార ముదారం
స్థన విని హితమపి హార ముదారం
సా మనుతే కృశ తనురివ భారం
సరసమ సృనమపి మలయజ పంకం
సరసమ సృనమపి మలయజ పంకం
రాధికా కృష్ణా రధికా
తవ విరహే కేశవా
రాధికా కృష్ణా రధికా

శ్వసిత పవన మనుపమ పరిణాహం
శ్వసిత పవన మనుపమ పరిణాహం
మదన దహన మిప వహతి సదాహం
దిశి దిశి కిరతి సజల కణజాలం
దిశి దిశి కిరతి సజల కణజాలం
నయన నళిన మివ విగలిత నాళం
నయన నళిన మివ విగలిత నాళం
రాధికా కృష్ణా రధికా

తవ విరహే కేశవా కేశవా
రాధికా కృష్ణా రధికా
తవ విరహే కేశవా 
రాధికా కృష్ణా రధికా

నయన విశయ మపి కిసలయ తల్పం
నయన విశయ మపి కిసలయ తల్పం
కలయతి విహిత హుతాశన కల్పం
కలయతి విహిత హుతాశన కల్పం
త్యజతి న పాణితలేన కపోలం
త్యజతి న పాణితలేన కపోలం
బాల శశిన మిప సాయం అలోలం
బాల శశిన మిప సాయం అలోలం

రాధికా కృష్ణా రధికా
తవ విరహే కేశవా 
రాధికా కృష్ణా రధికా

హరిరితి హరిరితి జపతి సకామం
హరిరితి హరిరితి జపతి సకామం
విరహ విహిత మరణేన నికామం
హరీ.. హరీ.. హరీ..
హరిరితి హరిరితి జపతి సకామం
విరహ విహిత మరణేన నికామం
శ్రీ జయదేవ భణితమితి కీతం
శ్రీ జయదేవ భణితమితి కీతం
సుఖయతు కేశవా పదము పునీతం

రాధికా కృష్ణా రధికా
తవ విరహే కేశవా 
రాధికా కృష్ణా రధికా




శీత వేళ రానీయకు పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
గానం: కె. జేసుదాసు, పి. సుశీల

శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు
ఎదలోపల కూలతారు ఏనాటికి పోనీయకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు

ఉగ్రమైన వేసంగి వాక్కులు
ఆగ్రహించి పైబడినా అదరిపోవకు అదరిపోవకు
ఉగ్రమైన వేసంగి వాక్కులు
ఆగ్రహించి పైబడినా అదరిపోవకు అదరిపోవకు
ఉక్కుమ్మడిగా వర్ష మేఘం
వెక్కి వెక్కి రోధించినా లెక్కచేయకు లెక్కచేయకు

శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు

ఛైత్రంలో పొగరెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కైపెక్కే తియ్యని కలలు
ఛైత్రంలో పొగరెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కైపెక్కే తియ్యని కలలు
మనసారా తీర్చుకో మనుజడ పండించుకో
లోకానికి పొలిమేరలు నీ లోకం నిలుపుకో

శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు

ఉదయాన మగత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయ్యే వేళ
ముసలితనపు అడగుల సడి ముంగిట వినబడెనా
ముసలితనపు అడగుల సడి ముంగిట వినబడెనా
వీటలేడని చెప్పించు వీలుకాదని పంపించు
వీలుకాదని పంపించు

శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు
ఎదలోపల కూలతారు ఏనాటికి పోనీయకు
శీత వేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటియ్యకు చోటియ్యకు




సిగలో అవి విరులో పాట సాహిత్యం

 
చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
గానం: కె. జేసుదాసు, పి. సుశీల

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో

ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
మదిలోన గదిలోన
మదిలోన గదిలోన మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు నీ కనుల ఆ పిలుపులు

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో

జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి
చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి
మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులు మధువుకై మొదలు తుమ్మెదలు

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో

Most Recent

Default