Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Snehithulu (1998)



చిత్రం: స్నేహితులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు:  నవీన్ వడ్డే , రాశి, సాక్షి శివానంద్
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: బద్వేలు శ్రీనివాస రెడ్డి
విడుదల తేది: 1998

పల్లవి:
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా

ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా
జాకీచాన్ అయిపోయాను ఎవ్వరు ఎదురైనా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
ఒట్టేస్తాను ఒళ్ళో నేను ఇంకా డౌటేనా
వచ్చేశాను నీతో నేను నువ్వెటు రమ్మన్నా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
అయితే అంత దూరమా ఇపుడే జంట చేరుమా
అరెరే అంబ ఆత్రమా అపుడే కొంటె బేరమా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా

చరణం: 1
వెన్నా జున్ను తిన్నప్రాయం అందించావంటే
సున్నితంగా చూసుకుంటా నా ప్రాణం కంటే
నిన్న మొన్న లేని భారం గుర్తొచ్చిందంటే
నిన్నే మెచ్చి ఈ వయ్యారం నీ సొమ్మైనట్టే
నాకోసం పుట్టావే నయగారమా
గుట్టే కనిపెట్టలేన తీరవా
మదిలో ప్రేమ మధుమాసమైయ్యి పువ్వంటి యవ్వనమ
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా

ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా
వచ్చేస్తాను నీతో నేను నువ్వెటు రమ్మన్నా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా

చరణం: 2
ఇంటా బయటా వెంటాడే నీ వాటం చూస్తుంటే
కంచె తెంచే కాలం అట్టె దూరం లేనట్టే
ఊరించే నీ అందాన్నట్టా ఉరేగిస్తుంటే
ఊరు వాడ ఏరై పొంగే ప్రళయం ఉన్నట్టే
కాగే తాపం ఆగేదాక యాతన
కాలక్షేపం సాగే దారే లేదన
కౌగిళ్ళ సీమ చెయ్యాలి భామ తొందరగ జతపడుమా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా

ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా
వచ్చేస్తాను నీతో నేను నువ్వెటు రమ్మన్నా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
అయితే అంత దూరమా ఇపుడే జంట చేరుమా
అరెరే అంబ ఆత్రమా అపుడే కొంటె బేరమా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా
రూరా రూరా రూరా రూరా రూరా రూరా


********  ********  ********


చిత్రం: స్నేహితులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జె. యేసుదాసు

పల్లవి:
ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం... ఇదేం శాపం...
నీ ఆశలను గాలి పాలు చేసే నలు దిశలు

ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం... ఇదేం శాపం...

చరణం: 1
మూడుముళ్లనే మురిపాలు
మూడునాల్లకే మట్టిపాలు
ఏడు అడుగుల పయణాలు
నీకు చూపినవి నరకాలు
ఏమి నేరమని ఈమె నోములను
కాల రాచినవి కష్టాలు
ఓ... బ్రహ్మయ్యా...
ఆడ జన్మ పొంది చూడయ్య

ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం... ఇదేం శాపం...

చరణం: 2
ఆదరించు మనసేదైన
ఆత్మబంధువే ఔతుంది
రక్తబంధమే లేకున్నా
మానవత్వమే చాలంది
మనిషిలోని ఆ మంచితనమే
ఈ నేల తల్లిని నిలిపింది
ఓ... చిట్టి తల్లీ... నేడు నీకిదే పునఃజన్మ

ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు
అన్ని కల్లలై ఇచ్చాయి కనీళ్లు
అయ్యో పాపం... ఇదేం శాపం...
నీ ఆశలను గాలి పాలు చేసే నలు దిశలు

Most Recent

Default