Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bunny (2005)





చిత్రం: బన్ని (2005) 
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు: అల్లు అర్జున్, గౌరి ముంజల్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: యమ్.సత్యన్నారాయణ రెడ్డి
విడుదల తేది: 06.04.2005



Songs List:



మారో మారో గోలిమారో పాట సాహిత్యం

 
చిత్రం: బన్ని (2005) 
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు

హే రఫ్ఫాడే వయసు మాది లుక్కేస్తే ఫైరురో 
చిందేసే మనసు మాది చింతే లేదురో
రఫ్ఫాడే వయసు మాది లుక్కేస్తే ఫైరురో 
చిందేసే మనసు మాది చింతే లేదురో
హేయ్ లేటెస్టూ స్టైలు మాదిరో లైఫ్ స్టయిలే వేరురో
సింపుల్ గా సెంటర్ అడగరో ఓ ఓ
దమ్ము రిథిమ్ రెండు కలిపి రఫ్ ఆడించేయ్ రో
మారో మారో గోలిమారో
అరె యారో యారో సునియారో
హేయ్ మారో మారో గోలిమారో
రేపుందో లేదో తెలియదురో

హేయ్ భూమే గుండ్రం అన్నాడొకడు 
అన్నోళ్లంతా పిచ్చోడంటూ అన్నారపుడు 
వేమన పద్యం చెప్పిన నాడు 
విన్నోళ్లంతా వెర్రోడంటూ చూశారపుడు
హేయ్ అవమానం పక్కనెట్టరో అవకాశం పట్టరో 
అవరోదం దాటుకెల్లరో ఓ ఓ
లోకం ప్రపంచం అలాగేనంటూ తలలే ఊపునురో
మారో మారో గోలిమారో 
అరె యారో యారో సునియారో 
హేయ్ మారో మారో గోలిమారో 
రేపుందో లేదో తెలియదురో

హే బలముండాలి తెలివుండాలి 
రెంటికి తోడు అంతో ఇంతో దిక్కుండాలి
హే బాదుండాలి హాయుండాలి 
బాదల్లోనూ హాయిగ నవ్వే దమ్ముండాలి
హో ఏదున్నా బయట పెట్టరో దాచేది లేదురో 
కొంతైనా పంచి పెట్టరో ఓ ఓ 
లోకం ప్రపంచం గులమే అంటూ వెంటే వచ్చునురో
మారో మారో గోలిమారో 
అరె యారో యారో సునియారో
మారో మారో గోలిమారో 
రేపుందో లేదో తెలియదురో



జాబిలమ్మవో పాట సాహిత్యం

 
చిత్రం: బన్ని (2005) 
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సాగర్ , మాలతి

జాబిలమ్మవో జాజి కొమ్మవో 
గాజుబొమ్మవో  ఓ మైనా ఐ లవ్యు
పచ్చబొట్టువో పుట్టుమచ్చవో తేనెపట్టువో 
ఐ డోంట్ నో వాట్ టు డు
ఇంటిముందు రంగవల్లివో ఓ చెలీ 
పెరటిలోన తులసిమొక్కవో
మందిరాన భక్తి పాటవో ఓ ప్రియ 
పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహామై 
ప్రాణమై  నిలిచి నావుగా

జాబిలమ్మవో జాజి కొమ్మవో 
గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు

ఓ నీ పెదాలపైన నా పెదాలతోన
నీ పెదాలపైన నా పెదాలతోన 
ఆ పదాలు నీకు రాసి చూపనా
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి 
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి  
ఆ జగాలలోని ప్రేమ పంచనా
బొట్టుమీద ఒట్టు పెట్టనా కాటుకళ్ళే కావలుండనా
గుండెమీద ఒట్టు పెట్టనా  పడగలోన గూడు కట్టనా
జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా

జాబిలమ్మవో జాజి కొమ్మవో 
గాజుబొమ్మవో  ఓ మైనా ఐ లవ్యు

ఓ నీ మనస్సు లోకి నా మనస్సు చేరి 
నీ మనస్సు లోకి నా మనస్సు చేరి  
ఆ తపస్సు చేసి ప్రేమ పొందగా
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి 
ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా
ముత్యమంత ముద్దు పెట్టనా 
ముడుముళ్ల బంధమేయనా
వెన్నెలంత ముద్దుపెట్టనా ఏడు జన్మలేకమవ్వనా
రేయికే రాజునై పగటికే బంటునై రాణికే రాజ్యమివ్వనా

జాబిలమ్మవో జాజి కొమ్మవో 
గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు



వా వా వారెవా పాట సాహిత్యం

 
చిత్రం: బన్ని (2005) 
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: విశ్వా
గానం: కార్తిక్, సుమంగళి

హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా
హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా
నీ సోకునంత కట్టడి చెయన
సోకు కట్టడిస్తె ముట్టడి చెయన
హే తాకుతుంటె తిమ్మిరి జానా
నిన్నే ముని మాపు మురిపాన ముద్దుగ వాటెయ్ నా

హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా
హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా
వా వా వారెవా వా వా వారెవా

చరణం: 1
హే సిరిమువ్వ కాలికిపెట్టి తెల్ల తెల్లాని కోకని కట్టి
హే సిరిమువ్వ కాలికిపెట్టి తెల్లాని కోకని కట్టి
చెంగుమంటు నడిచొస్తె పిల్లే వారెవా
హే సూదంటి చూపులతోటి అరె ధీటైన మగసిరి తోటి
హే సూదంటి చూపులతోటి ధీటైన మగసిరి తోటి
హుందాగ నడిచొస్తే థ్రిల్లే వారెవా
హే జారుమల్లంటి నీ సోకునే చూసి నీవైపె నాకళ్ళు కట్టి పారేశా
హే పంబరేపేటి నీలో టెంపరే చూసి 
నీ తెగువే నచ్చాక మనసుకు తెరతీసా

హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా
హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా

చరణం: 2
హే నాజూకు నడుమే పట్టి కన్నె అందాలు కొలతలు కట్టి
హే నాజూకు నడుమే పట్టి అందాలు కొలతలు కట్టి
మురిపెంగ ముద్దులు ఇస్తా నీకే వారెవా
హే ఏడేడు రంగులు తోటి వాన విల్లేదొ నింగిన కట్టి 
హే ఏడేడు రంగులు తోటి విల్లేదొ నింగిన కట్టి
చివరంటు తోడేవుంటా నీతో వారెవా
హే సిగ్గు దొంతరులు చెప్పె కొత్త సంగతులు
నీలోన మెరిసేటి నవ్వుల చిరుజల్లు
కోర సరసాలు కొంటె కొత్త పరవళ్ళు 
పరదాల సరదాలు ముదిరే మురిపాలు

హే వా వా వారెవా పంబరేపే గుమ్మె వారెవా
హే వా వా వారెవా దుమ్మురేపే దమ్మే వారెవా




హే మైలు మైలు మైలు పాట సాహిత్యం

 
చిత్రం: బన్ని (2005) 
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: దేవీ శ్రీ ప్రసాద్ 

హే మైలు మైలు మైలు
మైలు మైలు మైలు ఇది పదారేళ్ల ఫైలు
కస్సుమని అందాలన్నీ పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు
క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ లు
చేప కళ్ళ పాపా చైనా వాలు దాటిందిరో
కుర్రవాళ్ళ గుండెల్లోన గులాబీలు నాటిందిరో
జీన్స్ లో వచ్చిన జాబిలమ్మరో
ఏ హార్టీ వెల్కమ్ టు యు మాలక్ష్మి
అరె వాట్ ఏ ఫ్రీడమ్ అంటూ ఫాలో మీ
హే ఆగే పీచే నీచే దేఖోనా
నీ ఒంపులు అన్ని లేజర్ లుక్కుల లూటీ చేసేయ్ నా

హయ్యో హయ్యో మైలు మైలు మైలు ఇది పదారేళ్ల ఫైలు
కస్సుమని అందాలన్నీ పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు
క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ లు

హే లంగరేయకే నీ లంగా ఓణీతో 
ఏటవాలు నడుము నీది ఎంతో డేంజరే
మంట పెట్టకే చిరు నవ్వుల పెట్రోల్ తో
పడుచు వాళ్ళ గుండెలన్ని దూది పింజలే
గొంతు వింటే చాలే చిన్నబోద నైటింగేలే
నడక చూశారంటే చాలే స్ట్రీట్ మొత్తం గోలే గోలే
ఓరయ్యో బ్రహ్మయ్య నీకు వందనం
జానా బెత్తుల సోకుల ఖజానా
అరె దాచేస్తావు ఎందుకు ఓ మైనా
ఊరించకే నన్నే సమోసా నా మోనలిసా
నీ గుండెల్లోకిచ్చే నా వీసా

హే మైలు మైలు మైలు ఆఁ ఆఁ ఆఁ
పదారేళ్ల ఫైలు ఆఁ ఆఁ ఆఁ
మైలు మైలు మైలు ఇది పదారేళ్ల ఫైలు
కస్సుమని అందాలన్నీ పేజీలు

హే నంగ నాచివే నకరాల నారివే
నారింజ పండు లాంటి సోకు నాకు ఇవ్వవే
బుసలు కొట్టకే నీ బుంగ మూతితో
అరె బుజ్జి గుండె నాది అసలే పగిలిపోవునే 
చందనాలే ఒళ్లే హత్తుకుంటే మెత్తగ ఉందే 
ఎందుకంటే నీలో ఉన్న అందాలన్నీ పువ్వుల దిండే
అందమే నువ్వని అందమేనే 
హే కాలేజీ కే ఊపిరి ఇచ్చావే ఆఁ ఆఁ ఆఁ
అరె డే లో పున్నమి వెన్నెల తెచ్చావే
హే రోడ్డే రోజా పువ్వై నవ్విందే 
నీ పాదం తాకి మట్టే మంచై చల్లగ తాకిందే

హే మైలు మైలు మైలు ఇది పదారేళ్ల ఫైలు
కస్సుమని అందాలన్నీ పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు
క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ హాయ్ లు



కనపడ లేదా గోదారి తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: బన్ని (2005) 
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్.పి.బాలు, కోరస్

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష
కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష 
 
గుండె నిండ పాలున్న బిడ్డలకందించలేని తల్లి బ్రతుకుదేనికని
బీళ్ళు నింపె నీళ్ళున్న సముద్రాన పడిపోయె శాపం తనకెందుకనీ
బరువై దయకరువై తనువెలియై ఇక బలియై
బరువై దయకరువై తనువెలియై ఇక బలియై 
ఉప్పుసాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక
వెక్కివెక్కి పడుతున్నది వృధాగ కనుమూయలేక 
వెక్కివెక్కి పడుతున్నది వృధాగ కనుమూయలేక
ఆ అలల అలజడి ఓఓ... 
ఆ తడిఆరని కంటితడి ఓఓ... 
ఆ అలల అలజడి ఆ తడిఆరని కంటితడి 
కనబడలేదా వినబడటంలేదా 

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత 
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష 

శిలా పలక లేసి మీరు ఎలా మరచిపోయారని
బాసరలో సరస్వతీ పీఠమెక్కి అడిగినది
ధుర్మదాంధులారా తెలుగు బిడ్డలకీ కర్మేందని
ధర్మపురిలో నారసింహ నాధం చేస్తున్నది
ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక
కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది
బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలను చరించి
భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది
పాపి కొండల గుండె ధారై ప్రవహించినది
ధవళేశ్వర కాటన్ మహాశైలి తలచినది
సిగ్గుపడండని కుటిల నాయకులని తిట్టినది
గుండె పగిలి నర్సాపూర్ సముద్రాన దూకినది 

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత 
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష



బన్ని బన్ని... పాట సాహిత్యం

 
చిత్రం: బన్ని (2005) 
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: మురళి, శ్రీలేఖ పార్థసారథి

హోయ్ బన్ని బన్ని... బన్ని బన్ని హోయ్
బన్ని బన్ని బన్ని బన్ని నిన్ను చుస్తే జారుతుంది చున్నీ
అన్నీ కాదు అందుకోర కొన్ని
అన్నీ కాదు అందుకోర కొన్ని
అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని
అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని
బన్ని బన్ని చిన్ని చిన్ని
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో కొన్ని
ఎత్తుకెళ్తా పతకమే బన్ని 
ఎత్తుకెళ్తా పతకమే బన్ని 
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ 
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ 
బన్ని బన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని

బన్ని బన్ని బన్ని బన్ని నిన్ను చుస్తే జారుతుంది చున్నీ
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో కొన్ని

హా... ఈడులోన దాగుంది గూడుపుఠాణీ
కోరస్: గూడుపుఠాణీ గూడుపుఠాణీ
హా పట్టులోన దొరికింది  బన్ని బఠానీ
కోరస్: బన్ని బఠానీ బన్ని బఠానీ
హే ఒంటి గంట కొట్టాక ఒంపుల్లో జారి
కోరస్: ఒంపుల్లో జారి ఒంపుల్లో జారి
అరె జంట నువ్వు కట్టాక జంపో జిలానీ
కోరస్: జంపో జిలానీ జంపో జిలానీ
వదిలిపెట్టను గాని అందాన్ని
విడిచి పెట్టకు వాణ్ణి పరువాణ్ణి
హేయ్ వద్దొద్దు ముందుంది బాతాఖానీ
చీకట్లో చెయ్యాలా సిగ్గుల్ని ఖుని
వినరా బన్ని... ఏంటే చిన్నీ...

బన్ని బన్ని బన్ని బన్ని 
నిన్ను చుస్తే జారుతుంది చున్ని
అన్నీ కాదు అందుకోర కొన్ని
అన్నీ కాదు అందుకోర కొన్ని
అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని
అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని

హా... పగలు రేయి పట్టాలి సరసాల గిర్నీ
కోరస్: సరసాల గిర్నీ సరసాల గిర్నీ
హేయ్ పడుతుంటే నువ్వనాలి హోని వార్ని
కోరస్: హోని వార్ని హోని వార్ని
పానుపెక్కి చెయ్యాలి జల్సాల జర్నీ
కోరస్: జల్సాల జర్నీ జల్సాల జర్నీ
హే చేస్తుంటే ముయ్యలి నోర్ని డోర్ని
కోరస్: నోర్ని డోర్ని నోర్ని డోర్ని
హే చాటులోకి పోనీ గొంపోని
సందు చూసి కానీ సుఖాన్ని
హే ఇయ్యాల ఆపాలి కూసే కోడ్ని
కోసేలా చూడాలి మంచాల కోళ్లన్నీ
బన్ని బన్ని హేయ్ చిన్ని చిన్ని చిన్ని

హేయ్ బన్ని బన్ని బన్ని బన్ని 
నిన్ను చుస్తే జారుతుంది చున్నీ
అన్నీ కాదు అందుకోర కొన్ని
అన్నీ కాదు అందుకోర కొన్ని
అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని
అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని

హెయ్ చిన్ని చిన్ని చిన్ని చిన్ని 
చెంప మీద ముద్దులతో కొన్ని
ఎత్తుకెళ్తా పతకమే బన్ని
ఎత్తుకెళ్తా పతకమే బన్ని
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ
బన్ని బన్ని చిన్ని చిన్ని

Most Recent

Default