Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Dharma Kshetram (1992)

చిత్రం: ధర్మక్షేత్రం (1992)
సంగీతం: ఇళయరాజా
నాటినటులు: బాలకృష్ణ, దివ్యభారతి
దర్శకత్వం: ఏ. కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.సి. రెడ్డి
విడుదల తేది: 14.02.1992

Songs List:

ఎన్నో రాత్రులొస్తాయి గానీ పాట సాహిత్యం

చిత్రం: ధర్మక్షేత్రం (1992)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ

ఎన్ని మోహాలు మోసీ
ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో
మంచం ఒకరితో అలిగిన మౌనం
వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా సాయం
వయసునే అడిగినా

ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ

గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక

ఓఓఓఓఓ.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఒహో.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ

చెలి నడుమే అందం పాట సాహిత్యం

చిత్రం: ధర్మక్షేత్రం (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ
ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో

నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ
ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ

చూసేనే నా వైపు ఏ చుక్కా చూడని షేపు
పూ పొదరిళ్లల్లో పోపు నే పెట్టెయ్యనా
మత్తెక్కించే చూపు నా మతిపోగొట్టే ఊపు 
సెక్సీ సినిమా స్కోపు నే చుట్టేయనా
సైడు తగిలే నా కోడె ఈడు రగిలే
గాలి తగిలే నా కన్నే మత్తు చెదిరే
హోయ్ నీ దివ్య భారాలు దిద్దుకుంటా నా నవ్య తీరాలు చేరేదాకా తీరేదాకా

చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ
ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో

నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ
ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ

శృంగారంలో ఈనే మధు మందారంలో తేనే వాలెపొద్దుల్లోనె నీ కందించనా
పులకించే పూరేకు నే పూజించే నీ సోకు కొట్టేస్తున్న షాక్ నే చుంబించనా
పట్టపగలే వెన్నెల్లో తారలెగిరే
అరెరరెరరె ముట్టడిస్తే నీ కన్నే బొట్టుకరిగే
హే ఓ బాలగోపాల ఒప్పుకుంటా
వయ్యారి గంధాలు అంటేదాకా ఆరేదాకా

చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ
ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో

నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం లౌలీ
ప్రియా రతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పొద సంబంధం లౌమీ

ముద్దుతో శృంగార పాట సాహిత్యం

చిత్రం: ధర్మక్షేత్రం (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి

ముద్దుతో శృంగార బీటుకొట్టగానే చీరలో మూరకో చిటపట
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏవిటో అలసట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కు మంటు
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏవిటో అలసటా
ముద్దుతో శృంగార బీటుకొట్టగానే చీరలో మూరకో చిటపట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కు మంటు
ముద్దుతో శృంగార బీటుకొట్టగానే చీరలో మూరకో చిటపట

ముత్యాల వాన మూగదైనా ముద్దింట రేగెనుకాలం
రత్నాల వాన రాతిరైనా తల్లోన దాగెను దీపం
ఎక్కడో ఏమిటో ఏదో తొక్కిడే సాగింది నాలో
ఉందిలే ఊపులో ఎంతో పాదమే జారితే నాతో
ఆషాడ మాసమో అందాల మోసమో
అబ్బాయికోసమో మబ్బుబిళ్ళ జారిపోయె

ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏవిటో అలసటా
ముద్దుతో శృంగార బీటుకొట్టగానే చీరలో మూరకో చిటపట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కు మంటు
ముద్దుతో శృంగార బీటుకొట్టగానే చీరలో మూరకో చిటపట
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏమిటో అలసటా

హే లజుకు లజుకు లజుకా లజు లజు లజు లజుకా
హే లజుకు లజుకు లజుకా లజు లజు లజు లజుకా
హే లజు లజు లజు లజుకా
హే లజు లజు లజు లజుకా
లజుకా - లజు లజుకా
లజు లజు లజు లజుకా...

ఆకాశ గంగ అందుకున్న తీరేది కాదంట తాపం
పాతాళ గంగ తోడుకున్న వడ్డంటునా నా ప్రాయం
ఉక్కిరై బిక్కిరై నాలో కొక్కొరో అన్నాది ప్రాణం
ఒంపులే సొంపులై నాలో తుంపరై పోయాయి పాపం
ఆ తుంగభద్రలా ఈ వంశధారలా పెన్నేటి పొంగులా తుళ్ళిపడ్డదమ్మ ఒళ్ళు

ముద్దుతో శృంగార బీటుకొట్టగానే చీరలో మూరకో చిటపట
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏవిటో అలసట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కు మంటు
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏవిటో అలసట
ముద్దుతో శృంగార బీటుకొట్టగానే చీరలో మూరకో చిటపటా

అరె ఇంకా జంకా పాట సాహిత్యం

చిత్రం: ధర్మక్షేత్రం (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, యస్. జానకి

అరె ఇంకా జంకా 
అరే ఇంక జంక జింక పెంకితనంగా

అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా

అరే ఇంక జంక జింక పెంకితనంగా

అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

బంగారం పిచ్చుకా భాగోతం
పెంచకా నా భాగం పంచియ్యంగా
శృంగారం చిచ్చుగా గారం
చూపించక బండారం బైటెయ్యంగా
బాగుందా బొత్తిగా బలవంతం
పెట్టగా బులపాటం చెలరేగంగా
పంతాల పచ్చిగా పొలిమేరేతెంచగా
పొంగుల్లో పొలమారంగా
మరేంచేస్తానే చెంగువల చిందెయ్యంగా
ఇదే సందంటూ చేతబడి చాల్లే ఇంకా
మరీ స్వాతంత్ర్యం గా మహా
బాహాటంగా అలా జెండాలా ఎగరెయ్యంగా

అరెరరెరరె ఇంక
అరే ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా

అరే ఇంక జంక జింక పెంకితనంగా

అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

ఏకాంతం సాక్షిగా ఏమాత్రం
దాచకా ఇస్తాగా నిక్షేపంగా
ఆసాంతం వెచ్చగా ఆశంతా
తీర్చగా వస్తాగా ప్రత్యేకంగా
ఆమాత్రం ఓర్చగా ఉండొద్దా
ఓపికా ఆపొద్దే నిష్టూరంగా
చెప్పిందే చెప్పకా వింటుందా
దప్పికా చంపొద్దే చాదస్తంగా
చమత్కారాలు కారాల విడ్డూరంగా
అలా వారాలూ వర్జాలూ ఒద్దే ఇంక
మరీ అంగా ఉంగా అనీ గారాబంగా
మొరాయిస్తావే మోహనరంగా

అరెరరెరరె ఇంక

ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
అరే ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా

అరే ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

పెళ్ళికి ముందు ఒక్కసారి పాట సాహిత్యం

చిత్రం: ధర్మక్షేత్రం (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి

పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే
పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే
రేపిచ్చే ఆ పిచ్చేదో చూపించేద్దు ఇవ్వాలే
కైపిచ్చే ఆ కిక్కేదో ఎక్కించేద్దు ఇవ్వాలే
కౌగిల్లో కాకెంగుల్లో కానీమరి హేయ్

పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి
పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి

ఆజన్మం బ్రహ్మచారి బొమ్మ మాదిరి ఔనందాం లేదా ఇంకా ఆకలి
ప్రారంభం ఎట్టా అని తేలని మరి ఆపైన తీరుస్తానే తిమ్మిరి
తెలిసున్న తీరి తెలపాలి దారి
తొలిసిగ్గు జారి నడపాలి స్టోరీ
పొమ్మంటే పోతుందా మాటల్తో దింపంగా
అంచేతే ఆలోచిస్తా ఉన్నా తగుదిగుదిగు తగుదిగుదిగు తగుదిగుదిగు

పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి
పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి
కిస్సిచ్చి కిర్రెక్కించి కవ్విస్తానే ఇవ్వాలే
కష్టించి కోరిందిచ్చి కరిగిస్తాలే ఇవ్వాలే
వయ్యారం వడ్డెక్కిస్తా సరాసరి

హేయ్ పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే
పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే

ఏమైనా ఇబ్బందొస్తే తిట్టకే మరి నాకైన కొత్తే కాదా కిరికిరి
చిత్రంగావున్నా ముందే నీకు నా వర్రి చూద్దాంలే ఏమౌతుందో తదుపరి
తలుపేసినాకా వెలుగెందు కింకా
కనుచీకటైతే తెలిసేది ఎట్టా
వేడెక్కే వేళ్ళంటే కైపెక్కే కళ్లెగా
వన్ టు త్రి అంటూ దూకే ఇంకా 
తకదిగు  తకదిగు తకదిగు తకదిగు తకదిగు తకదిగు తోం

పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే
పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి
రేపిచ్చే ఆ పిచ్చేదో చూపించేద్దు ఇవ్వాలే
కష్టించి కోరిందిచ్చి కరిగిస్తాలే ఇవ్వాలే
కౌగిల్లో కాకెంగుల్లో కానీమరి హేయ్

పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించావా ప్యారి తేరే
పెళ్ళికి ముందు ఒక్కసారి చూపించనా మేరి ప్యారి

కొరమీను కోమలం పాట సాహిత్యం

చిత్రం: ధర్మక్షేత్రం (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర

కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య
కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య
తడిసోకు దప్పడం తళుకెంతో నిబ్బరం
అదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం కసిగా కొసలే కొరికేస్తా

కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య
కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య

బుడమేటి ఈతల్లో పడిలేచే సోకుల్లో చిలిపి జలగవి ఒక చిన్న బుడగవి
నీ ఎండ మావుల్లో నా గుండె బావుల్లో బొచ్చె పరిగెవి ఒక పిచ్చి నురగవి
నిన్నే సాదిస్తా నా సత్తాలు చూపిస్తా సైరా నా సందెపుడకా
నిన్నే కవ్విస్తా నా కౌగిట్లో కట్టేస్తా రావే నా రంభ చిలకా
వడ్డీ బురద కన్నే వాగే వరద
నాకే సరదా పిల్లా నోరే దురదా
పెట్టేవంటే పోజు దులిపేస్తా నీ బూజు హో...

కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య తస్సాదియ్యా
దోబూచి దొబ్బుడాయి పోపోచి బొమ్మిడాయి గిలిగుంటే గిల్లి చూడు
ముడితీస్తే మోపురం బిడియాల గోపురం
సుడి చుస్తే సుందరం తొడగొట్టే తొందరం పగలే వగలే దులిపేస్తా...

కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య
కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య

నీలాటి రేవుల్లో నీలాటి చేపల్లో సొగసు తడిసేలే నా పొగరు విడిసెలే
కళ్ళెట్టి చూస్తుంటే గాళాలే వేస్తుంటే పులస దొరుకునా మన వరస కుదురునా
తోకే జాడించే చెలి కోకిట్టా పారేస్తే ఆరేస్తా తడి తునకా
నన్నే ఓడించే పగబట్టించి వేధిస్తే చూపిస్తా కసి నడకా
నేనే గడుసు నాకు నువ్వే అలుసు
నీకేం తెలుసు కలవని కంట్లో నలుసు
అరె ఎక్కిస్తా నా వడ్డు ఎవడొస్తాడో అడ్డు హే...

దోబూచి దొబ్బుడాయి పోపోచి బొమ్మిడాయి గిలిగుంటే గిల్లి చూడు
అరె కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య
తడిసోకు దప్పడం తళుకెంతో నిబ్బరం
అదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం కసిగా కొసలే కొరికేస్తా
కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య
కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య
కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య

Most Recent

Default